From heritage to high-quality passenger experience, Indian Railways is undergoing a remarkable transformation.
Today, Prime Minister Narendra Modi inaugurates 75 redeveloped Amrit Bharat Railway Stations across 20 States under the Amrit Bharat Station Scheme, one of the world’s largest station redevelopment programmes. Built at a cost of about ₹1,570 crore, these stations seamlessly blend modern amenities with local culture and architectural heritage, truly embodying the spirit of “Virasat Bhi, Vikas Bhi.”
With better accessibility, improved passenger facilities, multimodal integration and future-ready infrastructure, these stations are not just transit points, they are gateways to growth, tourism and regional development.
A new India is being built, one station at a time. 🇮🇳
#AmritStation
#75अमृत_स्टेशन
ప్రధాని @narendramodi గారి నేతృత్వంలో 'అమృత్ భారత్' పథకం కింద మంగళగిరి, రాయనపాడు, కంభం రైల్వే స్టేషన్లు సరికొత్త హంగులతో పునరాభివృద్ధి చెందాయి. అత్యాధునిక వసతులు మరియు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ స్టేషన్లను ప్రధాని మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు.
#AmritBharatStations #BJP4Andhra
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను బిజెపి నాయకుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
#JanataVaradhi
సామాన్యులపై అధిక వడ్డీ భారం లేకుండా, గ్యారెంటీల పేరుతో బ్యాంకుల ఒత్తిడి పడకుండా మోదీ ప్రభుత్వమే బ్యాంకర్లకు గ్యారెంటీ ఇచ్చి పేదలకు రుణాలను అందిస్తోంది.
#BJP4Andhra#MUDRA#PMEGP#KisanCreditCard
ఐదు దశాబ్దాలుగా నిలిచిపోయిన లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుతూ, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకువస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి భారతీయుడికి దక్కాల్సిన ఈ సమాన ఓటు హక్కును, న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని స్వార్థంతో అడ్డుకుంటోంది.
#DelimitationBill
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పార్టీ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను బిజెపి నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారి నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
#JanataVaradhi
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించిన బిజెపి నాయకులు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
#JanataVaaradhi
ప్రపంచంలోనే అతిపెద్దదైన 10 కోచ్ల హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ గారు నేడు హర్యానాలో ప్రారంభించారు. పర్యావరణానికి మేలు చేసే జీరో కార్బన్ ఎమిషన్ సాంకేతికతతో, భవిష్యత్ ఇంధన అవసరాలకు చెక్ పెడుతూ మోదీ ప్రభుత్వం సాధించిన మరో అద్భుత ఘనత ఇది.
* డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి
#AmritBharatStations #75AmritStation #ViksitBharat #IndianRailways
వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వహించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ప్రాజెక్ట్ పూర్తయితే మనకు కలిగే ప్రయోజనాలు:
🔸 7.2 లక్షల కొత్త ఎకరాలకు సాగునీరు
🔸 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
🔸 రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలకు నీటి సరఫరా
🔸 విశాఖ జిల్లాలోని పరిశ్రమలకు నిరంతర నీటి వసతి
పోలవరం ప్రాజెక్టు.. మోదీ గారు రాష్ట్రానికి ఇచ్చిన వరం.
- పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, బిజెపి మీడియా ప్యానలిస్ట్
#polavarammodivaram
ఆంధ్రప్రదేశ్ రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా బిజెపి నేతల బృందం పోలవరం ప్రాజెక్టు సందర్శనను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రధాని @narendramodi గారు అందిస్తున్న ప్రత్యేక అండదండలు, నిరంతర సహకారంతోనే పోలవరం కల సాకారమవబోతోంది.
#PolvaramModiVaram
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా నేడు 75 అమృత్ స్టేషన్ల ప్రారంభం.
🔸 దౌలత్పూర్ చౌక్ -కర్తోలి పంజాబ్ కొత్త రైల్వే లైన్ ప్రారంభోత్సవం
🔸 కర్తోలి పంజాబ్ -అంబాలా ఎక్స్ప్రెస్
🔸 అమృత్సర్ (ఛేహర్టా) -వారణాసి ఎక్స్ప్రెస్
🔸 ఆంధ్రప్రదేశ్లో మూడు నూతనంగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లు
#AmritBharatStations
మెరుగైన మౌలిక వసతులు, సులభమైన రాకపోకలు, విస్తృతమైన ప్రయాణికుల సౌకర్యాలతో రాయనపాడు ఆధునిక అమృత్ స్టేషన్గా రూపుదిద్దుకుంది.
ఈ అభివృద్ధికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
#AmritStation #75AmritStation
నవభారత ప్రగతికి నిదర్శనంగా నిలిచిన ప్రధాని @narendramodi గారి అచంచల సంకల్పంతో మన దేశం సరికొత్త చరిత్రను లిఖించింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కుతుంది.
#HydrogenTrain#PMModi#GreenEnergy#MakeInIndia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు సేవలకు నేడు శ్రీకారం.
హర్యానాలోని జింద్–సోనీపట్ మార్గంలో ప్రారంభం కానున్న ఈ రైలు స్వచ్ఛమైన, హరిత, ఆధునిక రవాణాకు నాంది.
సుస్థిర అభివృద్ధి దిశగా, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి మరో ముందడుగు.
#AmritBharatStations #75AmritStation #ViksitBharat #IndianRailways
అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, విశాలమైన వెయిటింగ్ ఏరియాలు, పరిశుభ్రమైన వాతావరణంతో మంగళగిరి అమృత్ స్టేషన్ ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది.
ఈ అభివృద్ధికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి కృతజ్ఞతలు.
#AmritStation #75AmritStation