సిద్దిపేట చిన్నకోడూరులో రైతుల మహా పాదయాత్ర లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు...
వేలాది మంది రైతులతో కలసి నడిచిన హరీష్ రావు గారు...
ఈ సందర్బంగా మాట్లాడుతూ
ఇది చిన్న కోడూరు మండల పాదయాత్ర మాత్రమే.... వేరే మండలం వాళ్ళు ఎవరు ఈ పాదయాత్రలో పాల్గొనలేదు.
అనంతగిర, రంగనాయక సాగర్ రెండు రిజర్వాయర్లు చిన్న కోడూరు మండలంలో ఉండడంతో ఈ ప్రాంత రైతులు పాదయాత్ర పెట్టుకుంటాము వచ్చి మాట్లాడి పొమ్మని నన్ను ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు
కరవు నుంచి కాపాడుకునేందుకు రంగనాయక సాగర్ నింపాలని చిన్న కోడూరు రైతులందరు స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
15 కిలో మీటర్ల పాదయాత్ర సాయంత్రం వరకు పడుతుందేమో అనుకుంటే.... రైతు బిడ్డలు కనుక ఉదయం 8 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 3 గంటల వరకు పాదయాత్ర ముగించేశారు.
ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సిందే...
ఈ యాత్ర బిఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు అచ్చంగా చిన్న కోడూరు మండల పాదయాత్ర.
ఇప్పటికైన రేవంత్ రెడ్డి కళ్ళు తెరవకపోతే.... రేపు అన్ని మండలాలు కూడ ఇలానే బయలుదేరుతారు , రైతుల కోపంలో మాడి మసైపోవడం ఖాయం.
నిజంగా చెప్పాలంటే ఈ కరవు కాలం తెచ్చిన కరవుకాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవు , రేవంత్ రెడ్డి తెచ్చిన కరవు.
ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఈరోజు కాళేశ్వరం కట్క వత్తడం లేదు.
కేసీఆర్ ను తిడితే రేవంత్ రెడ్డి మనస్సు ఆనంద పడుతుందేమో.... కానీ రైతుల మనస్సు ఉసూరుమంటున్నాయి, గుండెలు ఆగిపోతున్నాయి, అందుకే తిట్టుడు ఆపు కట్క వత్తి మోటర్లలల్లో నీళ్ళు పొయించు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డిని నీళ్లను వడిసి పట్టవయ్య అంటే, నీళ్లను క్రిందకు విడిసిపెడుతుండు, ఆంధ్రయాన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటర్లు ఆన్ చేసి నీళ్లను వడిసి పట్టుకుంటున్నాడు.
మన ముఖ్యమంత్రి మన నీళ్ళు ఎత్తకుండా , క్రిందకు విడిసిపెట్టేటోడు మనోడు అయితడ, దయచేసి రైతులు ఆలోచన చేసుకోవాలి, 70 TMC ల నీళ్ళను మోటర్లు ఆన్ చెయ్యకుండా ఆంధ్రా ప్రాంతానికి విడిసిపెట్టిండు, 70 TMC నీళ్ళను ఎత్తిపోస్తే రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండేది.
ఈరోజు రంగనాయక సాగర్ చూస్తే మొత్తం చిన్నబోయింది , గుండ్లు రాళ్లు, తాడిచెట్లన్ని మళ్ళీ కనిపిస్తున్నాయి , ఒకప్పుడు రంగనాయక సాగర్ నిండుగా ఉండేదిఈరోజు చిన్నబోయింది.
రేవంత్ రెడ్డిని ఈ మీటింగ్ నుంచి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము , వెంటనే కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్యాలి రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్ , కొండ పోచమ్మ సాగర్ కు నీళ్లు నింపాలి.
ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు,
ఇది చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్ర!
ఇప్పటికైనా కళ్లు తెరువు రేవంత్!
లేకుంటే యావత్ తెలంగాణ రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ రెడ్డి!
ఇది కాలం తెచ్చిన కరువు కాదు,
కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ తెచ్చిన కరువు!
ఆనాడు కాళేశ్వరంతో రంగనాయక సాగర్ నింపుకుని ఎండాకాలంలో కూడా పొలాల్లోకి నీళ్లు తెచ్చుకున్నాం.
నేడు రేవంత్ రెడ్డి పగతో, ప్రతీకారంతో కాళేశ్వరం కటక ఒత్తుతలేడు!
కేసీఆర్‌ను తిట్టితే నీళ్లు రావు,
కటక ఒత్తితేనే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
సాగునీటి కోసం కదంతొక్కిన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు.
అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని లిఫ్ట్ చేసి అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులలో నీళ్ళు నింపి రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న పాదయాత్ర
మధ్యాహ్నం పాదయాత్రలో రైతులతో కలిసి పాల్గొననున్న మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
Live: కాళేశ్వరం జలాల కోసం అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
https://t.co/zwl0kr20eN
కాళేశ్వరం జలాల కోసం కదంతొక్కిన రైతన్నలు✊🏻
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని లిఫ్ట్ చేసి, ప్రాజెక్టులలో నీళ్లు నింపి రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish ఆధ్వర్యంలో అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర చేసిన అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు.
పాదయాత్రకు వేలాది మందిగా తరలివచ్చి రిజర్వాయర్లకు నీళ్లు నింపాలని డిమాండ్.
రైతులకు నీళ్లివ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది.
ఖమ్మం జిల్లాలో ఈరోజు మంత్రులు ప్రారంభించిన సీతారామ మోటార్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే.
కేసీఆర్ గారు పెట్టిన మోటార్లకు కాంగ్రెస్ ప్రభుత్వం స్విచ్ వేయడానికి మాత్రమే వెళ్తున్నది.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
కాంగ్రెస్ చెప్పుకునేది ప్రజాపాలన.. కానీ చేసేది చీకటి పాలన.
బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, ఎగుమతి వివరాలు అన్నీ వెబ్సైట్లో ఉండేవి.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ వివరాలను తీసేశారు.
నాణ్యమైన బొగ్గును ప్రైవేట్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ.. నాసిరకం బొగ్గు మనకు ఇస్తున్నారు.
దానివల్ల థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతోంది.
మనల్ని చీకట్లో నెడుతూ.. మన బొగ్గు పక్క రాష్ట్రాలకు పోవడం ఏంటి?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
నీళ్లు, బొగ్గుపై దృష్టి పెట్టాలని
ముళ్ల కట్టెతో నిద్ర లేపినా.. రేవంత్ సర్కార్‌కు సోయి లేదు!
ఇవ్వాళ బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగింది.
ఇప్పటికైనా రాజకీయాలు బంద్ పెట్టి..
రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
ప్రజా పాలనని చెప్పుకుంటూ.. రహస్య దోపిడీ పాలన చేస్తున్న రేవంత్!
జీవోలను దాచిపెట్టి.. విచ్చలవిడిగా దోచుకుంటున్నది కాంగ్రెస్ సర్కార్!
కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుండి 19,064 జీవోలు ఇస్తే..
పబ్లిక్ డొమైన్ లో పెట్టింది కేవలం 3,290 జీవోలు మాత్రమే!
15,74 జీవోలను ఈ ప్రభుత్వం దాచిపెట్టింది.
8 వారాల్లో అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కోర్టు ఆదేశించి, మొట్టికాయలు వేసినా కనీసం చీమ కుట్టినట్టయినా లేదు.
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @DrErrolla
నాడు బీఆర్ఎస్ హయాంలో వేగంగా పురోగమిస్తున్న నగరాలలో ఒకటిగా ఉన్న హైదరాబాద్..
నేడు రేవంత్ పాలనలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడే పరిస్థితికి మారింది.
దాదాపు 15-20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన కాగ్నిజెంట్ సంస్థ,
తమ SEZలను హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి తరలిస్తోంది.
ఆదిభట్లలో, నానక్‌రామ్‌గూడలో SEZలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ గతంలో MOUలు చేసుకుంది.
మరి అలాంటి సంస్థ ఇప్పుడు విశాఖపట్నానికి ఎందుకు తరలివెళ్తోంది?
- ఎమ్మెల్సీ @sravandasoju
❌కాళేశ్వరం ప్రాజెక్టుపై రోజూ రాజకీయం చేస్తూ కాలక్షేపం చేయడం సరిపోయింది కానీ.. ఎండిపోతున్న పొలాలకి నీళ్లివ్వాలనే ధ్యాస రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది!
❌ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పక్కనపెట్టి కేవలం బురదజల్లే రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే, ఇవాళ బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లాలో వరి నారు బతికించుకోవడానికి రైతు అప్పు చేసి ₹3,000 పెట్టి ట్యాంకర్ నీళ్లు కొనే దుస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఉంది..
❌ప్రాజెక్టులు ఉన్నా ఫలితం లేదు.. ప్రస్తుత పాలకులకి రాజకీయం తప్ప రైతుల కష్టం పట్టదు!
అన్నదాతల కడుపు కొట్టి మీ కుర్చీలాటలు ఎన్నాళ్లు సాగుతాయి? @TelanganaCMO@revanth_anumula@UttamINC
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుంది రేవంత్ ప్రభుత్వం తీరు.
@revanth_anumula కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ అని హెల్త్ కార్డుల విషయంలో మరోసారి నిరూపితమైంది.
హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు, ఈరోజు నుంచే ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పిన మాటలు జూటా అని తేలిపోయింది.
పథకం అమలుకు మార్గదర్శకాల విడుదల లేదు, నెట్ వర్క్ ఆసుపత్రులతో సంతృప్తికరమైన ఒప్పందం లేదు.
పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు, పథకం అమలు చేయకుండానే రెండు నెలలుగా ఉద్యోగులు జీతం, పెన్షన్ల నుంచి 1.5శాతం కోత విధించిన సర్కారు..పథకం అమలులో మాత్రం చేతులెత్తేసింది.
అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఇచ్చిన హామి 30 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు.
ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో అన్ని రకాల జబ్బులకు, అన్ని ఆసుపత్రల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తాం అన్న మాట నిలబెట్టుకోవడానికి ఇంకెంత సమయం కావాలి?
ముందు జూన్ 2 నుంచి హెల్త్ స్కీం అమలు చేస్తాం అన్నరు, తర్వాత జులై 15 నుంచి అన్నరు. అతీ లేదు గతీ లేదు.
డేట్లు, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప ఇచ్చిన హామిని మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, అభివృద్దిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్రను గుర్తించిన కేసీఆర్ గారు, రెండుసార్లు పీఆర్సీ, 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి గౌరవించారు.
పెన్షనర్ల వయస్సు పెరుగుతున్నా కొద్దీ వారి అవసరాలు తీరేలా పెన్షన్ పెంచారు.
ఒక్క రూపాయి తీసుకోకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు వెల్ నెస్ సెంటర్లు, ఇతర ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన వైద్య సేవలుందించారు.
1శాతం బేసిక్ పేతో మరింత పటిష్టంగా ఉద్యోగుల హెల్త్ స్కీం రూపొందించేందుకు గాను బి ఆర్ ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లపై ఏమాత్రం కనికరం లేకుండా 1.5శాతం కోత విధిస్తున్నది.
30 నెలలు గడిచింది పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, 6డీఏల జాడే లేదు. సీపీఎస్ రద్దు ఊసే ఎత్తడం లేదు.
మరోవైపు పెన్షన్ బకాయిల అందక మానసిక వ్యథతో రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు. మలి వయస్సులో పోరాటం చేయాల్సిన దుస్థితి కల్పించావు.
ఆసుపత్రులకు నిధులు చెెల్లించకుండా పోలీసులకు భద్రత పథకాన్ని అటకెక్కించావు.
జర్నలిస్టుల హెల్త్ కార్డులను గాలికి వదిలేసి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రశ్నార్థకం చేసావు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువున్నాయని విద్యా కమిషన్ తో చెప్పించావు,
మొన్న రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నావు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత పగబట్టినట్లు వ్యవహరిస్తున్నావు రేవంత్ రెడ్డి?
ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో లేదంటే వారి పక్షాన బి ఆర్ ఎస్ పోరాటానికి సిద్ధం అవుతుందని హెచ్చరిస్తున్నాం
హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని, పథకం అమలు చేయకుండా కోత విధించిన డబ్బులను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@Bhatti_Mallu@TelanganaCMO@TelanganaCS
బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే @VPR_BRS గారిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి గారు నిర్ణయించుకుంటే... ఆయనను పోలీసులు నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం.
తమది 'ప్రజా ప్రభుత్వం' అని చెప్పుకుంటూ ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
హిట్లర్ స్పూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న @revanth_anumula కి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులపై అణిచివేత చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.
@TelanganaCMO@TelanganaDGP
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.
ప్రజా జీవితంలో ఆయన తనదైన ముద్ర వేసి, కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమైనది.
ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
గౌరవ @TelanganaDGP గారు,
దయచేసి దీన్ని పూర్తిగా చదవండి….
ఏ మాత్రం ప్రొఫెషనలిజం ‘మన’పోలీసు డిపార్ట్మెంట్ లో ఇంకా మిగిలి ఉన్నా మీరు వెంటనే సుమోటోగా సీయం రేవంత్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చెయ్యాలి. పరిస్థితి చేయి దాటక ముందే నివారించండి.
చట్టంలో (BNSS and BNS) ఎక్కడా సీయం గారికి మినహాయింపు లేదు. ఆయనను అరెస్టు చేస్తే కేవలం అసెంబ్లీ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలి. ఇది రాజకీయ కక్ష తో చేస్తున్న ఆరోపణ కానే కాదు.
ఒక్క సారి కూల్ గా ఆలోచించండి:
“రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు బాగా పండుతాయి” అని ఏకంగా సీయం గారే సలహా ఇచ్చారని ఎవరైనా అగంతకుడు, పంట పొలంలో నిద్రిస్తున్న అమాయక రైతులను చంపి షాబాద్ రాజ్ కుమార్ లాగా వీడియోలు చేస్తే రైతుల పరిస్థితి ఏమిటి?
సీయం రేవంత్ గారే చెప్పారని
మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారిపై ఎవరైనా ఆగంతకులు మిగతా అగ్ర నాయకులపై దాడి చేస్తే..?
సీయం గారే “బెల్టు తో కొట్టమన్నారని” భర్తలు బెల్టు షాపుల్లో తాగి వచ్చి భార్యా పిల్లలను బెల్టు లతో కొడితే??? కింది ఉద్యోగులు పై అధికారులను బెల్టు లతో కొడితే పరిస్థితి ఏంటి???
మైనం పల్లి హన్మంత్ రావు గారు గతంలో బీఆర్ఎస్ అగ్రనాయకుల మీద పెట్రోల్ పోసి తాను కూడా షాబాద్ రాజ్ కుమార్ లాగా పోసుకుంటా అని బహిరంగంగా గజ్వేల్ లో కార్యకర్తలను ప్రేరేపించాడు. కనీసం ఆయన మీద కేసు కూడా రిజిస్టరు చేయకుండా పీపీ ఒపీనియన్ తీసుకొని ఇది సివిల్ కేసు అని చెప్పారు నాటి సిద్దిపేట పోలీసు కమీషనర్! దీన్ని ప్రజలు మరచిపోరు.
సంగారెడ్డి లో శౌర్య పతక విజేత ఇన్స్పెక్టర్ శివకుమార్ యాదవ్ అంతు చూస్తా అన్న టీపీసీసీ జగ్గారెడ్డి గారికి కనీసం నోటీసులు అయినా ఇచ్చారా?
పోస్టింగ్‌లు ఈ రోజు ఉంటయి రేపు పోతాయి, కానీ పోలీసు వ్యవస్థ, దాని ప్రతిష్ట గురించి ప్రజల జీవించే హక్కు (Art 21) గురించి ఆలోచించండి. మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. రాజ్యాంగం 311 అధికరణం మిమ్మల్ని కాపాడుతుంది.
అందుకే …
దయచేసి BNS Section 45 మళ్లీ మళ్లీ చదవండి. లీగల్ ఒపీనియన్ తీసుకోండి. సీయం గారికి నోటీసులు ఇవ్వండి. ఆయన వివరణ తో సంతృప్తి చెందకపోతే కేసు నమోదు చేయండి. మెడికల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. దర్యాప్తు చేయండి.
నేరం జరుగుతున్నపుడు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే.
ఈ రక్తపు భాష ఆగకపోతే రాష్ట్రంలో రక్తపాతం జరిగే ప్రమాదముంది. వేలాది మంది అమాయకులు బలైతారు. చరిత్ర పుటలు మరోసారి తిరగేయండి. అప్పుడే మీకు అర్థం అవుతుంది.
జై హింద్ 🇮🇳🫡
@BRSHarish@revanth_anumula@KTRBRS@TelanganaCOPs@TelanganaCMO
#TelanganaSinking