క్షణకాల నిర్లక్ష్యం రహదారిపై ప్రాణాలను బలితీసుకుంటుంటే, ఆలోచనలేని అలసత్వం సైబర్ నేరాల రూపంలో జీవితకాల కష్టార్జితాన్ని హరిస్తోంది.
ప్రమాదాలు, అన్యాయాలు జరిగినప్పుడు ఫోన్లలో చిత్రీకరించే నిర్లిప్తతను వీడి, ఆపదలో ఉన్న తోటి మనిషిని కాపాడే పౌర స్పృహ, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో మేల్కొనాలి.
బడి-ఇల్లు ఇచ్చే సంయుక్త మార్గదర్శనంతో స్వీయ క్రమశిక్షణ, అప్ర���త్తత అలవరచుకున్నప్పుడే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.
@eenadulivenews
#RoadSafety #CyberSafety #CitizenResponsibility #SafetyFirst #HyderabadPolice
➡️సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర స���పీ సజ్జనర్
✳️కేబీఆర్ పార్కు పరిసరాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి ట్రాఫిక్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
✳️రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ ��ార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ ట్రాఫిక్ ను పరిశీలించారు.
✳️అనంతరం మధ్యాహ్నం వేళల్లో కూడా మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
✳️ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అన్నారు. బుధవారం నుంచి వన్‌వే విధానాన్ని అమలులోకి తెచ్చామని, మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి రాకపోకలు పూర్తిగా సాఫీగా సాగుతున్నాయని ���యన పేర్కొన్నారు.
✳️వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్ప���్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు.
✳️జీహెచ్ఎంసీ, నిర్మాణ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఆహారంలో కల్తీ అనేది కేవలం మోసం మాత్రమే కాదు.. ప్రజారోగ్యంపై జరుగుతున్న తీవ్రమైన దాడి!
రోజూ వాడే నెయ్యిలో హానికర కెమికల్స్ కలవడం వల్ల గుండె, కిడ్నీ సమస్యలు వచ్చి నిండు ప్రాణాలు బలవుతున్నాయి.
ఇలాంటి ముఠాల ఆటకట్టించేందుకు మా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ H-FAST, ఫుడ్ సేఫ్టీ విభాగాలు రంగంలోకి దిగాయి.
నగరంలోని 130 కేంద్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఏకంగా 36 టన్నుల కల్తీ నెయ్యి, పామాయిల్, ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నాం.
ప్యూర్ నెయ్యి లేబుళ్లతో మార్కెట్లోకి విషాన్ని పంపుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లూజ్ నెయ్యి కొనకండి.. FSSAI ముద్ర ఉన్నవే వాడండి. కల్తీ సమాచారాన్ని 8712661212 లేదా 112 కు తెలియజేసి ఆరోగ్యకరమైన హైదరాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కండి.
@hydcitypolice@CPHydCity@SajjanarOffice@TelanganaCOPs
పేట్లబురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా���ు.
మాతృభూమి స్వాతంత్య్ర సాధన కోసం సర్వస్వం ధారపోసిన సమరయోధులను, దేశ రక్షణకై ప్రాణాలర్పించిన అమరవీరుల మహోన్నత త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించాను.
అనంతరం, విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావం కనబరిచిన 72 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి మనస్ఫూర్తిగా అభినందించాను.
#IndependenceDay #15August #HyderabadCityPolice #SafeHyderabad
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
స్వతంత్ర భారతావని కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల, అమరవీరుల నిస్వార్థ త్యాగాలను స్మరిస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తిని, దేశ సమ��్రతను పరిరక్షించేందుకు పునరంకితమవుదాం.
హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రతి పౌరుడి భద్రతే పరమావధిగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం నిరంతరం అంకితభావంతో పనిచేస్తోంది.
నేరరహిత, సురక్షిత నగర నిర్మాణంలో నగర పౌరులందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#IndependenceDay #HyderabadCityPolice #SafeCity #JaiHind
లగ్జరీ బిల్డప్‌లు చూసి నమ్మి మోసపోవద్దు!
గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లలో అద్దెకు దిగి.. ఖరీదైన కార్లు, ఫర్నిచ��్, బ్రాండెడ్ దుస్తుల ఆడంబరంతో తాము కోటీశ్వరులమని నమ్మిస్తూ, లగ్జరీ బిల్డప్ ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్న వారి పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
బాహ్య సౌందర్యాన్ని, విలాసవంతమైన జీవనశైలిని చూసి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వీఐపీలు, రాజకీయ ప్రముఖులతో ఉన్న ఫొటోలు, సోషల్ మీడియా ఆర్భాటాలను చూపిస్తూ తమకు బాగా ఇన్ఫ్లూయెన్స్ ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తారు.
అతి వినయం ధూర్త లక్షణం అన్నట్లుగా.. మొదట అందరితో ఎంతో ఆప్యాయంగా కలిసిపోతూ నమ్మకం కుదుర్చుకుంటారు.
ఆ తర్వాత అనతికాలంలోనే ఖరీదైన కార్లు, ఫర్నిచర్, లగ్జరీ చీరలు, చిట్టీలు, రియల్ ఎస్టేట్ సీక్రెట్ షేర్లు, గ్యారంటీ రిటర్న్స్ పేరుతో డబ్బు���ు వసూలు చేసి పలాయనం చిత్తగిస్తారు.
ఇలాంటి మోసగాళ్ల మైండ్ గేమ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం. అద్దెకు ఇచ్చే భవన యజమానులు కేవలం భారీ అద్దెల ఆశతో కాకుండా, ఖచ్చితంగా ఆధార్, పాన్ తదితర గుర్తింపు వివరాలు సేకరించి టెనెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.
ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు, ల��ఖితపూర్వక ఒప్పందాలు లేకుండా కేవలం నమ్మకంతో ఎవరి వద్ద పెట్టుబడులు పెట్టకూడదు.
రెసిడెంట్ వేల్పేర్ అసోసియేషన్లు కూడా కొత్తగా వచ్చే అనుమానితులపై నిఘా ఉంచాలి. కాలనీల్లో కొత్తగా పరిచయమైన వారి దగ్గర మీ బ్యాంక్ వివరాలు, ఆర్థిక రహస్యాలను అసలే చర్చించవద్దు.
ఇలాంటి లగ్జరీ బిల్డప్‌లు చూసి మోసపోయిన బాధితులు భయపడకుండా, ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
మ��� కమ్యూనిటీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే లేదా ఆర్థిక మోసం జరిగిందని గ్రహిస్తే వెంటనే డయల్ 112 కి సమాచారం ఇవ్వండి.
ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ఆహార భద్రత-నాణ్యతల ప్రాధికార సంస్థ (@fssaiindia) కీలక నిర్ణయం తీసుకుంది.
పాన్ మసాలా ప్యాకింగ్‌లో ప్��ాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై పూర్తి నిషేధం విధిస్తూ ప్యాకేజింగ్ నిబంధనల్లో సవరణలు చేసింది.
ఇకపై పాన్ మసాలాలను కేవలం ప్లాస్టిక్ రహిత పేపర్, పేపర్ బోర్డ్, సెల్యులోజ్ లేదా టిన్, గాజు సీసాలలో మాత్రమే విక్రయించాలి.
ఈ నిర్ణయం వల్ల ప్లాస్టిక్ పౌచ్‌లలో నిల్వ ఉండటం ద్వారా జరిగే రసాయన చర్యలు, మైక్రో ప్లాస్టిక్స్ ప్రమాదం తగ్గి ప్రజారోగ్యానికి రక్షణ లభిస్��ుంది. అలాగే రోడ్లు, డ్రెయిన్లను ముంచెత్తే రీసైకిల్ కాని కోట్ల ప్లాస్టిక్ సాచెట్ల వ్యర్థాలకు అడ్డుకట్ట పడి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఈ న���తన మార్గదర్శకాలను తయారీదారులు, వ్యాపారులు కచ్చితంగా పాటించాలి. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
#FSSAI #PublicHealth #EnvironmentProtection #PlasticFree
TRAFFIC ADVISORY: One-Way Traffic System Around KBR Park w.e.f. August 18, 2026
To ease congestion and ensure smoother traffic movement during the ongoing H-CITI Project, @HYDTP is implementing a One-Way Traffic System around KBR Park from 18.08.2026.
After conducting two successful pilot trials, necessary modifications have been made for a seamless transition.
Key Guidelines for Commuters & Visitors:
🔹 Follow Signages & Lanes: Stick to designated lanes and follow directional signs/field instructions.
🔹 Navigation: Navigation apps (Google Maps) have been updated to assist your routes.
🔹 Emergency Access: Always give way to ambulances and emergency vehicles.
🔹 NO Wrong-Side Driving: Strictly avoid driving against traffic flow—even during off-peak hours.
🔹 Responsible Parking: Park only in designated zones; avoid illegal parking on bends/bottlenecks.
The @HYDTP will continuously monitor traffic 24x7 via CCTV, drones, and ground staff. We request the cooperation of all citizens and KBR Park walkers for a safer, hassle-free commute.
For genuine updates, trust only official @HYDTP handles.
#HyderabadTraffic #TrafficAdvisory #KBRPark #HCITI #SafeHyderabad
శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ ఆధ్యాత్మిక ప్రతిరూపం అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం.
ఆ జగజ్జనని దివ్య సన్నిధిని నేడు దర్శించుకుని.. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నాను.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన, శోభాయమానమైన ఘటం ఊరేగింపును ప్రారంభించాను.
ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగస్వామిని కావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.
@hydcitypolice@CPHydCity@SajjanarOffice
#HyderabadBonalu #AkkannaMadannaBonalu #GhattamProcession
Over the last 19 months, senior citizens within the Hyderabad Police Commissionerate jurisdiction have lost a staggering ₹102 Crore across 403 cases to cybercriminals.
Scammers are increasingly targeting our elderly through trading frauds, digital arrest scams, OTP frauds, and investment traps, exploiting their trust and isolation.
I strongly urge our senior citizens to remain vigilant and not panic when receiving calls from unknown persons claiming to be police or government officials.
Please remember: there is no legal procedure called Digital Arrest in India, and no law enforcement agency will ever demand money or conduct interrogations over phone or video calls.
I also appeal to families to stay connected with elderly parents and keep an eye on unusual financial transactions or sudden changes in their digital activity.
If you or your loved ones encounter any cyber fraud, report it immediately by calling 1930 or visiting https://t.co/bdJLRXbJD3. Reporting during the 'golden hour' helps us freeze fraudulent accounts quickly and recover your hard-earned money.
Stay alert, stay safe!
త్యాగానికి సజీవ రూపం... అమ్మ!
సృష్టికి మూలం అమ్మ... నవమాసాలు తన గర్భంలో మోసి ఊపిరి పోయడమే కాదు, తన ఆకలిని, నిద్రను, ఆరోగ్యాన్ని, చివరికి తన సర్వస్వాన్ని త్యాగం చేసి బిడ్డల భవిష్యత్తు కోసం కరిగిపోయే అమృతమూర్తి అమ్మ!
పుట్టుకలోనే కాదు... తన శారీరక రూపాన్ని, అవయవాలనూ ధారపోసి మరో ప్రాణానికి మరుజన్మ ప్రసాదిస్తున్న ప్రత్యక్ష దైవం అమ్మ!
ఇటీవల వెలువడిన అధ్యయనాల ప్రకారం... మనదేశంలో అవయవ దాతల్లో 80 శాతానికి పైగా అమ్మలే ఉండటం వారి అనంతమైన ప్రేమకు, నిస్వార్థ త్యాగానికి సజీవ నిదర్శనం.
అవయవ వైఫల్య బాధితుల్లో స్త్రీ, పురుషులు సమాన సంఖ్యలో ఉన్నప్పటికీ... ప్రాణాలు నిలబెట్టే అవయవదానం దగ్గరకు వచ్చేసర��కి మన అమ్మలే ముందంజలో ఉన్నారు.
కానీ విచారకరమైన విషయమేమిటంటే... తమకు అనారోగ్యం వచ్చి అవయవ మార్పిడి అవసరమైనప్పుడు మాత్రం మహిళలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ సామాజిక అసమానతపై సమాజంగా మనమందరం తీవ్రంగా ఆలోచించాలి.
రాబోయే 2040 నాటికి దేశంలో ఏటా దాదాపు 4.63 లక్షల మందికి అవయవ మార్పిడి అవసరమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో ‘జీవన్ దాన్’ ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నా... బ్రెయిన్ డెడ్ దానాలపై ప్రజల్లో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు ఇంకా పూర్తిగా తొలగిపోవాల్సి ఉంది.
జన్మనిచ్చి��� అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం... కానీ ఆమె చూపిన త్యాగనిరతిని స్ఫూర్తిగా తీసుకుని, అవయవ దానానికి ముందుకు రావడమే మనం ఆమె ప్రేమకు ఇచ్చే నిజమైన గౌరవం!
అపోహలు వీడదాం... అవయవ దానంతో మరొకరి జీవితంలో వెలుగులు నింపుదాం!
ఒకరి ప్రాణాన్ని నిలబెట్టే ఈ పవిత్రమైన మహోద్యమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదాం!
#OrganDonation #MotherLove #MothersSacrifice #Jeevandan #SaveLives #OrganDonor
ఆషాఢ బోనాలను పురస్కరించుకుని కోరిన కోరికల��� తీర్చే కల్పవల్లిగా, నగర ప్రజలను సదా చల్లగా కాపాడే జగజ్జనని లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాను.
అనంతరం ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను పరిశీలించాను.
@hydcitypolice
@CPHydCity
#LalDarwazaBonalu #Bonalu2026
అమ్మాయి���ూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!
"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది.
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా "1st August Special - 50% OFF", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు.
ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు ₹499, సినిమా డేట్‌కు ₹1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి ₹1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు ₹1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి ₹4,499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
ఏఐతో స���ష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు.
ఆన్లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.
ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ��ిభాగం దృష్టిసారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట���ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది.
కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గానీ, కలవడం కానీ చేయవద్దు, ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 క�� కాల్ చేయండి లేదా https://t.co/bdJLRXbJD3 పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
#SafeDigitalLife! #CyberCrimeAwareness #StaySafe #SafetyFirst #ParentalGuidance
In a major operation to protect public health, our H-FAST, in joint coordination with GHMC Food Safety officials, raided 13 spice processing and trading units across the city and seized 25 tonnes of toxic, chemical-adulterated spices.
3 cases have been registered and 3 key accused—Rahul Bhati (Katedan), Vishal Panwar (Begum Bazar), and Dulichand Kachhawar (Begum Bazar)—have been arrested.
Adulteration of food using hazardous chemicals poses grave health risks, including severe gastrointestinal ailments, organ damage, and long-term carcinogenic effects.
We have #ZeroTolerance for those who jeopardize public health for profit. Strict enforcement drives will continue across the city.
@HFastHCP@CPHydCity@hydcitypolice@SajjanarOffice@GHMCOnline@TelanganaCOPs
#HyderabadPolice #FoodSafety #HFAST #GHMC #SafeFood #Hyderabad
హైదరాబాద్ వాసులారా అప్రమత్తం!
నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాల��� కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి.
ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ��్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు.
వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి.
@HYDTP @hydcitypolice
@CPHydCity @TelanganaCOPs
#HYDTPweCareForU #HyderabadRains #TrafficAdvisory #SafeTravels
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల బందోబస్తు చర్యల్లో భాగంగా మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ‘క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవస్థ పనితీరును అధికార��లను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్, తదితరులు పాల్గొన్నారు.
#Bonalu2026 #SecunderabadBonalu #UjjainiMahankali #HyderabadCityPolice #AISurveillance #SafeBonalu #FestivalSecurity
మహాశక్తి స్వరూపిణి, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని నేడు కుటుంబసమేతంగా దర్శించుకుని పట్టువస్త్రాలు, బోనం సమర్పించుకున్నాను.
శతాబ్దాల చారిత్రక వైభవానికి, సంస్కృతీ సంప్రదాయాలకు, నగరవాసుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతిరూపంగా అలరారుతున్న ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ భక్తిభావాల సమాహారం.
మన హైదరాబాద్ నగరం సుభిక్షంగా, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నాను.
లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రక్షణ, సురక్షిత దర్శనమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చ���శాం.
దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఉత్సవాలు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయి. భక్తులందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ, అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాం.
#UjjainiBonalu2026 #SecunderabadBonalu
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్
బోనాల ఉత్సవాల్లో తొలిసారిగా ఏఐ సాంకేతికతతో క్రౌడ్ మేనేజ్మెంట్
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేప��్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ... భాగ్యనగరంలో ఆషాఢ బోనాల పండుగకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగియగా, ప్రస్తుతం శ్రీ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్, నిఘా వ్యవస్థను మహంకాళి ఆ��యం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే 'ఫేషియల్ రికగ్నిషన్' సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. దీనివల్ల పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను తక్షణమే గుర్తించి అప్రమత్తమయ్యే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
అలాగే ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్మెంట్ ద్వారా కచ్చితంగా లెక్కిస్తామని పేర్కొన్నారు. ఆలయం లోపల వివిధ విభాగాలు, క్యూలైన్లలో భక్తుల రద్దీ సాంద్రతను 'థ్రెషోల్డ్ మ్యాపింగ్' ద్వారా నిరంతరం విశ్లేషిస్తూ, పరిమితికి మించి రద్దీ పెరిగితే ముందస్తు చర్య��� ద్వారా తొక్కిసలాటలు జరగకుండా నివారిస్తామని స్పష్టం చేశారు.
బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని, జాతర విజయవంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్ర��మతి రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, ట్రాఫిక్-1 డీసీపీ శ్రీ అవినాశ్ కుమార్, ఐపీఎస్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.