అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న నిర్వహించనున్న యోగాంధ్ర–2026 ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్రీ జి. వీర పాండియన్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు మంగళవారం పరిశీలించారు.
వెస్ట్రన్ బైపాస్‌లోని దొండపాడు వద్ద వేదిక, పార్కింగ్, తాగునీరు, టాయిలెట్స్ తదితర ఏర్పాట్లను సమీక్షించారు.సుమారు 25 వేల మంది పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు తదితరులు పాల్గొన్నారు.
#Yogandhra2026 #InternationalYogaDay #YogaForHealthyAging #Gunturcollector #Gunturupdates
జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్ శాఖ, ఎన్సీసీ తదితర విభాగాల్లో నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను వారికి అందించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ బాధ్యతలను అంకితభావంతో, నిబద్ధతతో నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
#AppointmentOrders #GunturUpdates #Gunturcollector
జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారిని దివ్యాంగ క్రీడాకారుడు శ్రీ కంటా ఈశ్వరావు గారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పారా సిట్టింగ్ వాలీబాల్ క్రీడలో తన ప్రస్థానం గురించి కలెక్టర్ గారికి వివరించారు. నేషనల్ పారా సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి ఆంధ్రప్రదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు.
#ParaSports #SportsAchievement #GunturCollector #GunturUpdates
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని తెలిపారు.
జూన్ 13న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
#InternationalYogaDay #YogaForLife #UndavalliCaves #YogaAwareness #Gunturcollector
పి.జి.ఆర్.ఎస్‌కు వచ్చిన దివ్యాంగుల పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు వారి వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించారు. “మీరు ఎక్కడ ఉంటే… మేము అక్కడకే వస్తాం” అంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
#PGRS #ResponsiveGovernance #PublicService #Gunturcollector #Gunturupdates
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. సాయి ప్రసాద్ గారు సోమవారం పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెవెన్యూ క్లినిక్‌ను సందర్శించి, వివిధ కౌంటర్లలో అర్జీల స్వీకరణ, సమస్యల పరిష్కార విధానాన్ని పరిశీలించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తరచుగా వచ్చే రెవెన్యూ సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించారు.
#PGRS #ResponsiveGovernance #PublicService #Gunturcollector #GunturUpdates
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12న అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న “రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం" కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో రహదారులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. అలాగే వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలను ప్రతిబింబించే ప్రదర్శన శాలలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
#CMProgram #Amaravati #GunturCollector #GunturUpdates #Development
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న యోగా కార్యక్రమాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు ఆదివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సోమవారం ఉదయం 6 గంటలకు ఉండవల్లి గుహల వద్ద నిర్వహించే యోగా కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, యోగా అభ్యాసకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ గారు కోరారు.
అలాగే జూన్ 13న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద నిర్వహించే యోగా కార్యక్రమానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
#YogaAndhra2026 #UndavalliCaves #YogaEveryDay #Gunturcollector #Gunturupdates
సీఐఐ (CII), యంగ్ ఇండియన్స్ (Yi) ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, యువత అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాల్లో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
అదే రోజు తెనాలి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన కె. శ్రీరమణి గారు జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
#CII #YoungIndians #YouthDevelopment #TenaliRDO #Gunturcollector
జిల్లా ఎగుమతుల ప్రణాళికను పక్కాగా రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎగుమతుల పెరుగుదలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఎంఎస్ఎంఈల డిజిటలైజేషన్, ఈ-కామర్స్ అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన లబ్ధిదారులకు రూ.83 లక్షల ప్రోత్సాహకాలను కమిటీ ఆమోదించింది.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నూతనంగా ఎన్నికైన గుంటూరు జిల్లా, నగర శాఖల కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారిని, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ కె. మయూర్ అశోక్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
#ExportPromotion #IndustrialDevelopment #EVIncentives #Gunturcollector #Gunturupdates
As part of the celebrations leading up to International Yoga Day 2026, Yoga Awareness and Participation Programs will be conducted across various locations from June 7 to June 20, 2026. Special yoga sessions will be organized at iconic heritage and spiritual landmarks, including Undavalli Caves and Sri Lakshmi Narasimha Swamy Temple, Mangalagiri.
🌿 Be a part of this statewide movement towards a healthier and happier Andhra Pradesh.
🔗 Registrations are now open:
https://t.co/69O2IIauqb
#Yogandhra2026 #InternationalYogaDay #YogaActivities #Gunturcollector #Gunturupdates
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న గుంటూరు వెస్ట్రన్ బైపాస్‌లో రాష్ట్ర స్థాయి "యోగాంధ్ర 2026" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సుమారు 25 వేల మంది పాల్గొనే ఈ మహా యోగ కార్యక్రమానికి అవసరమైన వేదిక, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
యోగ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు తెలిపారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
#Yogandhra2026 #InternationalYogaDay #YogaForHealthyAging #Gunturcollector #Gunturupdates
ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు తెలిపారు. ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అలాగే, యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుంచి 20 వరకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అమరావతిలో జరగనున్నాయని తెలిపారు.
#PeopleFirst #InternationalYogaDay #PublicService #OneMonthOneConstituencyFourVisits #Gunturcollector
🌿 ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026
పచ్చదనమే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ గారు పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పేరేచర్ల నగర వనంలో మొక్కల నాటకం, సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హిత జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించి, భావి తరాలకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించవచ్చని జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు.
"పది మొక్కలు నాటుదాం... పచ్చని గుంటూరును నిర్మిద్దాం!"
#WorldEnvironmentDay2026 #Plant10Trees #BeatPlasticPollution #Gunturcollector #Gunturupdates
రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు” కార్యక్రమం శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడులో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు తెలిపారు.
పెదనందిపాడు ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సంబంధిత మండల అధికారులు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
#PrathipaduConstituency #PublicGrievances #OneMonthOneConstituency #Gunturcollector #Gunturupdates
గుంటూరు జిల్లా సర్వే శాఖ సహాయ సంచాలకులుగా (ఏ.డి) శ్రీ సజ్జ వెంకటేశ్వరావు గారు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లాలో సర్వే ఇన్స్పెక్టర్గా సేవలందిస్తూ పదోన్నతిపై గుంటూరుకు నియమితులయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సర్వే, రీ-సర్వే కార్యక్రమాలను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని కలెక్టర్ గారు సూచించారు.
#SurveyDepartment #LandSurvey #Gunturcollector #Gunturupdates
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు ప్రాక్టికల్ కెరీర్ కౌన్సిలింగ్ అందించి, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కల్పించడంతో పాటు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు అధికారులను ఆదేశించారు. అలాగే రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతుల నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ అంశాలను త్వరగా పూర్తి చేస్తూ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
#GunturCollector #StudentEmpowerment #CareerCounselling #JEE #Gunturupdates