అందువల్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.
@TelanganaCMO@TelanganaCS
శుక్రవారం ఐ.డి.ఓ సి సమావేశ మందిరంలో శ్రీ నిధి జోనల్ మేనేజర్ టి.వి.రవి కుమార్ ఆధ్వర్యంలో ఎ.పి.యం., గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో ఏర్పాటు చేసిన శ్రీనిధి సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు,వడ్డీ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వం తక్కువ వడ్డీ తో శ్రీనిధి పథకం ద్వారా రుణాలను అందజేస్తుందని
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ)ను అత్యంత ప్రామాణికంగా,నాణ్యతా ప్రమాణాలతో రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
@TelanganaCMO@TelanganaCS
శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై జనగణన సంచాలకులు భారతి హొలికేరి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జనగణన సంచాలకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రత్యేక జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌లో జనాభా, సామాజిక,ఆర్థిక,పరిపాలనా,మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తామని చెప్పారు.
అనంతరం కలెక్టర్ ఆయిల్ పామ్ మొక్కను నాటి నీరు పోసి,రైతు భానుకు శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ వంటి అధిక ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
@TelanganaCMO@TelanganaCS
శుక్రవారం గోపాల్పేట మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన రైతు భాను జిల్లా ఉద్యాన శాఖ సహకారంతో తన పొలంలో ఆయిల్‌పామ్ మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రైతు పొలంలో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు.
ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు.తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,అనంతరం వైద్యుల సూచనల మేరకు అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలను రెండేళ్ల వరకు కొనసాగించాలని సూచించారు.
@TelanganaCMO@TelanganaCS
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం ఐడీఓసీలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించడం ద్వారా శిశువు రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు
వేడుకలకు వేదిక ఏర్పాట్లు సహా హాజరయ్యే ప్రజాప్రతినిధులు,అధికారులు,ప్రజలకు అవసరమైన సౌకర్యాలు పకడ్బందీగా కల్పించాలన్నారు.పోలీసు గౌరవ వందనంతో పాటు,బందోబస్తు కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.
@TelanganaCMO@TelanganaCS
గురువారం జిల్లా కలెక్టర్ ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి,అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలన్నారు.ప్రజాప్రతినిధులు,ప్రముఖులకు,అధికారులకు,ఆహ్వానితులందరికీ ఆహ్వానాలు,అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ,ఉద్యానవన శాఖ అధికారులతో ఎల్లినో ప్రభావం పై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించి, పంటల మార్పిడిని విజయవంతం చేయాలని
జిల్లా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
సంబంధిత అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఫైలు సమర్పించాలని ఆదేశించారు.అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
@TelanganaCMO@TelanganaCS
పోల్కేపాడు గ్రామ సర్పంచ్ వినతి మేరకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం గ్రామంలోని పాఠశాలను సందర్శించి,ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు,తరగతి గదుల పరిస్థితిని పరిశీలించారు.పాఠశాలలో అదనపు గదుల అవసరాన్ని గుర్తించిన కలెక్టర్ అదనపు తరగతి గదుల నిర్మాణానికి అంగీకరిస్తూ
ఈ సందర్భంగా ఆసుపత్రికి పరీక్షల కోసం వచ్చిన ఓ గర్భిణితో కలెక్టర్ మాట్లాడి,ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,పరీక్షలు,మందుల పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
@TelanganaCMO@TelanganaCS
గురువారం గోపాలపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.లేబర్ రూమ్‌లో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేసి,గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
జిల్లాలోని ప్రతి గర్భిణికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి,రక్తహీనత (అనీమియా) సమస్య ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.