ఇద్దరిమధ్య మంచి సంబంధం వారిద్దరి మధ్య ఎన్ని అనుమానాలున్నాయి అనే దానిమీద ఆధారపడదు .ఎంత అవగాహన వుంది , ఒకరిమీద మరొకరికి ఎంత నమ్మకం వుంది అన్నదానిపై ఆధారపడివుంటుంది అని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹🌺పరుచూరి గోపాలకృష్ణ
సంశయానికి , స్పష్టతకు మధ్య ఆత్మప్రభోధం అనేది ఉంటుంది .మనిషి చెప్పినమాటకు , మనసు చెప్పిన మాటకు తేడా తెలుసుకుని ముందడుగు వెయ్యడమే విజ్ఞానుల లక్షణమని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹🌺🙏🏻పరుచూరి గోపాలకృష్ణ
ఎంత విషమస్థితిలోనైనా ���త్మవిశ్వాసం చెదరనివ్వ కూడదు ,పెదవులపై చిరునవ్వుమాయమైపోనివ్వగూడదు ,నిజాయితీనే మన ఆయుధం చేసుకుంటే , విజయం మన గుమ్మం ముందుకొస్తుంది అని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
గుండమ్మకథ ,పాండవ వనవాసం ,నర్తనశాల , శ్రీకృష్ణ తులాభారం వంటి అద్భుతమైన చిత్రాలను మనకందించిన దిగ్దర్శకులు కమలాకర కామేశ్వర రావు గారి జయంతి��ేడు 🌹మళ్ళీ పుట్టండి మహానుభావా , శిరస్సు వంచి మీకు జయంతి వందనాలు 🙏🏻పరుచూరి
గోపాలకృష్ణ
జీవితం ఒక ప్రవాహం లాటిది .ఎప్పుడు , ఎక్కడ ఏ మలుపుతిరుగుతుందో మనకు తెలియదు .ఒక మలుపులో మంచి జరగవచ్చు , ఇంకో మలుపులో చెడు జరగవచ్చు .తెలివితేటలతో , చెడుని మంచిగా , ఓటమిని గెలుపుగా మార్చుకోగలగడమే విజ్ఞుల లక్షణమని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
మనిషిని నమ్మడం చాలా మంచిది .కానీ గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదం .అందుకే పెద్దలు తొందరపడి నమ్మవద్దు ,తొందరపడి ఎవరినీ ఏమీ అనవద్దు అంటారు .కనుక నిదానం ప్రధానమని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺పరుచూరి గోపాలకృష్ణ
ఏ రోజు మంచిది అనుకుంటాం .దైవం అనుకూలించిన ప్రతిరోజూ పండుగే 🌺మంచి జరిగిన ��ోజు గంతులువెయ్యకూడదు.చెడ్డఫలితం వచ్చిన రోజు దిగులుతో మంచమెక్కకూడదు .దాన్ని గుణపాఠంగా నేర్చుకొని ముందడుగు వెయ్యడమే విజ్ఞుల లక్షణమని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
జ్ఞానం బుద్ధిని కాపాడుతుంది .విజ్ఞానం జీవితాన్ని కాపాడుతుంది .అజ్ఞానం సర��వాన్ని పోగొడుతుంది .అందుకే అనుక్షణం అప్రమత్తులై , జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుంటూ అడుగు ముందుకు వెయ్యాలని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹🌺పరుచూరి గోపాలకృష్ణ
భూమి కావాలా , ఇల్లు కావాలా , ఐశ్వర్యం కావాలా ఏం కావాలి అని దైవం అడిగినప్పుడు ఆరోగ్యం , మనసుకి శాంత��� కావాలని కోరుకోవాలి .అవి రెండూ లేకుండా ఎన్ని వున్నా ఏమీ లేనట్లేనని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
శ్రమ చేస్తున్నప్పుడు, ముందు శరీరం అలిసిపోతుంది .ఆ తరువాత మనసుకూడా అలసిపోతుంది .ఇక నా వల్ల కాదు అంటుంది .కానీ ��వరైతే శ్రమకు ఓర్చి అనుకున్నది సాధిస్తారో వారే కార్యశూరులని , కారణ జన్ములని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
నువ్వు అప్పుడేంటొ మాకు తెలుసులే అని కొందరు ఎగతాళి చేస్తారు. దానికి సిగ్గుపడకూడదు.చిరునవ్వుతో అంగీకరించాలి .మనం సాధించిన దానికి వారు అసూయపడుతున్నారని అర్ధం చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
నేడు అక్కినేని నాగేశ్వర రావు గారి జయంతి 🌹బాలరాజు గా ప్రారంభించి మనం దాకా ఎన్ని విజయవంతమైన చిత్రాలో 🌺 నేను చిన్న వయసులో చూసిన సినీ కథానాయకుడాయన🌺వారితో వున్న అనుబంధం జీవితంలో మరువలేనిది 🌹వందనాలు మహానుభావా 🙏🏻పరుచూరి గోపాలకృష్ణ
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎ��ురు చూసి మోసపోకుమా , నిజం మరచి నిద్రపోకుమా అన్నారు శ్రీ శ్రీ 👍ఆ మాటను వేదవాక్కుగా భావించి , మన కర్తవ్యం మనం నిర్వహించుకుంటూ పోవడమే బుద్ధి మంతుల లక్షణమని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹పరుచూరి గోపాలకృష్ణ
గెలవాలని ఉందా ?అపజయం రాకూడదు అని ఉందా ?ఓటమికి, గెలుపుకి కార���ం ఆత్మవిశ్వాసం 🌹ఏపని ఐనా సాదిస్తానన్న నమ్మకంతో చేస్తే ఓటమి అనేది మన గుమ్మం దగ్గరకే కాదు , మన వీధిలోకి కూడా రాదని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
మౌనం దైవం ఇచ్చిన వరం .మాట్లాడగలంకదా అని నోటికి వచ్చినది మాట్లాడుకుంటూ పొతే చిక్కుల్లోపడే ప్రమాదంవుంది .అలా అని మాట్లాడవలసినప్పుడు మాట్లాడకుండా ఉండడం కూడా ప్రమాదమే.అందుకని ఎప్పుడు మాట్లాడాలి , ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
నేడు సీతారామయ్యగారి మనుమరాలు మీనా జన్మదినం 🌹అక్కినేని నాగేశ్వర రావు గారితో కలిసి నటించే భాగ్యం పొంది తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొంది .సెట్లో మౌనం , చిరునవ్వు తనకు వరాలు 🌺జన్మదిన శుభాకాంక్షలు మీనా ✋శతమానం భవతు ✋పరుచూరి గోపాలకృష్ణ
నేడు నవరసాలను అద్భుతంగా పోషించగల నటీమణి రమ్యకృష్ణ గారి పుట్టినరోజు 🌺బాహుబలి చిత్రంలో తన నటనను ప్రేక్షకులెన్నటికీ మరువలేరు 🌹��న్మదిన శుభాకాంక్షలు 🌺🌹శతమానం భవతు ✋పరుచూరి గోపాలకృష్ణ