"నేను సీఏం కావాలంటే ఎవరు ఆపగలరు?" - పవన్ కళ్యాణ్
సీఎం అవ్వాలి అంటే అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి. లేదా కుమారస్వామిలాగా డిసైడింగ్ పొజిషన్ లో అయినా ఉండాలి. అవి రెండూ నువ్వు ప్రస్తుతానికి కాలేవు. కాబట్టి నువ్వు సీఎం అవ్వకుండా ఎవరో ఆపనక్కరలేదు. నువ్వే ఆగిపోతావ్.
పవన్ జగన్ ని విమర్శించడం వల్ల తనకే నష్టం చేసుకుంటున్నాడు. ఒంటరిగా గెలిచే పరిస్థితిలో లేడు. ఓట్లు చీల్చి లేదా జోడించి కింగ్ మేకర్ అవ్వగలడుగాని, కింగ్ అవ్వడు. బాబుతో జతకడితే ఆత్మహత్య. జగన్ కు తోడు అయితే,గౌరవం మిగులుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్క చెప్పేవాళ్ళు లేకపోతే..
పెద్దాయన కోరికలో న్యాయం ఉంది. పవన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలపట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, చంద్రబాబు తుగ్లక్ పాలన అంతం చెయ్యడం కోసం జగన్ తో చెయ్యి కలపాలి. జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలి. పవన్ కళ్యాణ్ లోక్ సభకి వెళ్లి జాతీయరాజకీయాల్లో తన సత్తా చాటాలి.
https://t.co/icKXwz7PcN
మొన్నటివరకు ఊ అంటే చింతమనేని మీద విరుచుకుపడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యూహాత్మక మౌనాన్ని ఎందుకు పాటిస్తున్నాడు? అన్నది దళితుల్ని అనా లేక తెలుగుదేశంతో కొత్తగా చిగురిస్తున్న ప్రేమకు అడ్డం అనా?
పనిచేస్తూ ప్రతి ఐదురోజులకు ఒక సానిటరీ వర్కర్ భారతదేశంలో చనిపోతాడు. వాళ్ళ పరిస్థితికి కారణమైన వ్యవస్థ పాపాలన్నీ ఇలా ప్రధానమంత్రి కడిగేసుకుంటున్నాడు. సో...వాట్!?!
పాపం...రామకృష్ణ గారు, మధు గారు అంటే నాకు చాలా గౌరవం. పొత్తు గురించి, సీట్ల సర్దుబాటు గురించి చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమ వీళ్లకు.