నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకురావడం లేదు.. వర్షాలు లేక సంక్షోభం వస్తే సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు.. ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేదు.. మంత్రులు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.. శ్రీశైలం నుంచి అటు తెలంగాణ, ఇటు ఏపీ ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.. ఇలానే కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు పడిపోతుంది.. అప్పుడు రాయలసీమకు నీళ్లు ఇవ్వలేరు: వైఎస్ జగన్
#YCP #YSJagan #APRains #CMChandrababu
డీఎస్సీలో అక్రమాలపై సవాల్ విసిరితే ఇప్పటి వరకు స్పందించలేదు.. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది.. తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా సీఎం చంద్రబాబు స్పందించడంలేదు.. జూన్ నుంచి ఇప్పటి వరకు 52 శాతం లోటు వర్షపాతం ఉంది.. కరువు దారుణంగా ఉన్నా చంద్రబాబు కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారు.. 688 మండలాలకు గాను 628 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది.. కోస్తాలోనూ కరువు ప్రభావం ఎక్కువగా ఉంది.. కరువును గుర్తించేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు: వైఎస్ జగన్
#AP #YCP #CMChandrababu #DSC2025
సూర్యాపేట జిల్లా దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంపై స్పందించిన క్షతగాత్రుడు.. టీ బ్రేక్ తీసుకొని తిరిగి బస్సు ప్రారంభమైన గంట లోపే ప్రమాదం జరిగింది.. వెనక సీట్లో కూర్చున్న నా భార్య చనిపోయింది.. ముందు సీట్లో కూర్చున్న వారు చనిపోయారు.. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగింది.. ప్రమాదం జరిగిన తర్వాత పెద్దపెద్ద ఇనుప రాడ్లు బస్సు ప్రయాణికులపై పడ్డాయి: క్షతగాత్రుడు
#RoadAccident #Kodada #Suryapet #BusAccident
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై శ్రీనివాసరావు తీరు వివాదాస్పదం.. ప్రేమ వ్యవహారంలో అవంచకు చెందిన మహేందర్ అనే వ్యక్తిపై ఫిర్యాదు.. విచారణ పేరుతో పిలిచి మహేందర్‌ను చితకబాదిన ఎస్సై శ్రీనివాసరావు.. దాహం అంటే మూత్రం పోశారని మహేందర్ ఆరోపణ.. ఎస్సై శ్రీనివాసరావుపై డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు.. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధితుడి డిమాండ్
#Thimmajipet #ThimmajipetSI #Nagarkurnool
ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్.. బకాయిలు చెల్లించని మిల్లర్లపై ఉక్కుపాదం.. మహబూబాబాద్ జిల్లాలో రూ.98 కోట్ల మేర బకాయిలు.. గడువు లోగా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారులు.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్ పర్సన్ అరెస్ట్.. మహాదేవ ఇండస్ట్రీలో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ అధికారులు.. 2022-23 రబీ, యాసంగిలో ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వని మిల్లు.. 2024లో కూడా ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడంతో తనిఖీలు.. తనిఖీల్లో ధాన్యం లేదని గుర్తించి కేసు నమోదు చేసిన అధికారులు
#Telangana #RiceMills #TSGovt
హైదరాబాద్: కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక.. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు నివేదిక పంపిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. నివేదికను ఏఐసీసీకి సమర్పించనున్న మీనాక్షి నటరాజన్.. అధిష్ఠానం చేతిలోకి కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్.. ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సంకేతాలు.. చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అభిప్రాయాలు తీసుకోనున్న అధిష్ఠానం.. ఇప్పటికే 20 మందికి పైగా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్
#KondaSurekha #AICC #PCC #RevanthReddy
ఏ క్షణంలోనైనా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. 5 రాష్ట్రాల అసెంబ్లీ, వచ్చే లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో 51మంది కొత్తవారికి అవకాశం.. కేబినెట్లో యువత, కొత్తవారికి ప్రాధాన్యత ఇచ్చే యోచనలో బీజేపీ.. ఎన్డీఏలో ఇటీవల చేరిన మిత్రపక్షాలకు కూడా కేబినెట్లో అవకాశం దక్కే ఛాన్స్.. తెలుగు రాష్ట్రాల నుంచి తెరపైకి పలువురు నాయకుల పేర్లు.. తెలంగాణ నుంచి మహిళా కోటాలో ఎంపీ డీకే అరుణకు ఛాన్స్?.. ఓబీసీ కోటాలో డా. లక్ష్మణ్ కు చోటు దక్కే అవకాశం
#UnionCabinet #CabinetReshuffle #BJP #NDA
కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలని సీఎం ఆదేశం
#RevanthReddy#Suryapet#Kodada#RoadAccident
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచి వున్న భక్తులు.. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,285 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించిన 32,334 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు
#TTD #Tirumala #Tirupati
ఏలూరు: పోలవరం దగ్గర గోదావరికి పెరిగిన ఉధృతి.. ఎగువ కాపర్ డ్యామ్ వద్ద 30.30 మీటర్లకు చేరిన గోదావరి ప్రవాహం.. స్పిల్‌వే దగ్గర 30.20 మీటర్లకు చేరిన గోదావరి నీటి మట్టం.. స్పిల్‌వే లోని 48 గేట్లు ఎత్తి 4.10 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
#Eluru#Polavaram#Godavari
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో రోడ్డు ప్రమాదం.. దొరకుంట శివారులో కంటైనర్‌ను ఢీకొన్న ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు.. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీని ఢీకొన్న ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు.. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం
#Suryapet #Kodada #RoadAccident
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చిన్నారులకు అస్వస్థత. కంగుంది ఎస్టీ కాలనీలో ఎర్ర ఆముదం కాయలు తిన్న ఐదుగురు చిన్నారులు. ఆముదం కాయలు తినడంతో చిన్నారులకు అస్వస్థత. చందన, లోకియ,నాగవేణి, అజయ్, కిరణ్‌లకు అస్వస్థత. వెంటనే 108 అంబులెన్స్‌లో కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలింపు. చికిత్స అనంతరం ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు.
#BreakingNews #TeluguNews #APNews #AndhraPradesh
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికలో కీలక విషయాలు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించండి. చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించండి. ఈ ఇద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. -క్రమశిక్షణ కమిటీ
#BreakingNews#TeluguNews#TelanganaNews #KondaSurekha #Congress