Prime9 News is a new age 24 Hours Telugu news channel provides unbiased and comprehensive news and entertainment programs in Telugu states and for India.
ముఖ్యమంత్రి చంద్రబాబు నర్సాపురం పర్యటనలో భాగంగా తుపానుకు దెబ్బతిన్న కొబ్బరి తోటను పరిశీలించారు. మార్గమధ్యలో తోటను గమనించిన ఆయన కాన్వాయ్ ఆపి కారు దిగి రైతుతో మాట్లాడారు. పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు..| Prime9News
అర్నబ్ తుపాను అనంతరం పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. 24 గంటల్లో 35 సెంటీమీటర్లు నీటిమట్టం పెరిగింది. పట్టిసీమ ఎత్తిపోతలు పునఃప్రారంభం కాగా, ప్రస్తుతం 10 మోటార్లతో నీటిని తరలిస్తున్నారు. దీంతో కృష్ణా డెల్టా రైతులకు ఊరట లభించనుంది..| Prime9News
మెదక్ జిల్లా కౌడిపల్లిలో పట్టపగలే ఇంట్లో చోరీకి యత్నించిన దొంగను స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి తాళం, బీరువా పగలగొడుతుండగా గమనించిన బుమయ్య కుమారుడు గోపాల్ కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. - Prime9 News
#Medak#Kowdipally#TelanganaNews
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మణికొండ, మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ సహా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. - Prime9 News
#HyderabadRains#HeavyRain#hyderabadtraffic