రాష్ట్ర ప్రజలందరికి ఈ శుభ కృత్ నామ సంవత్సరం లో అంతా మంచే జరగాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని కోరుకోంటూ, తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.
#HappyUgadi
తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారి భాస్కర్, చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు కందగట్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. (4/4)
#TeamLRamana
తప్పకుండా పార్లమెంటులో తమ గళం విప్పుతామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారిని కలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో
అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాధం, (3/4)
తమ ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. చేనేత ఉత్పత్తులపై జీరో జిఎస్టి విధించడానికి పార్లమెంటులో మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత వినతిపత్రం ఇచ్చి కోరగా స్పందించిన కేశవ రావు, నామా నాగేశ్వరరావు (2/4)
చేనేతపై జీరో జిఎస్టి చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ గారి నాయకత్వంలో అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె. కేశవరావు మరియు నామా నాగేశ్వరరావు గారిని కలిసారు. చేనేత ఉత్పత్తుల పై జిఎస్టి విధిస్తే చేనేత కళాకారులు (1/4)
నిరుద్యోగులకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీపి కబురు...
అసెంబ్లీ వేదికగా భారీ ఎత్తున 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
ఈ సందర్భంగా తెలంగాణ యువత ఆకాంక్ష ను నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@TelanganaCMO
స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో పురోగమిస్తూ బంగారు తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#InternationalWomensDay2022
ఆ పరమ శివుడి అనుగ్రహముతో అందరి జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్న వేళ ప్రజలందరూ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకొంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి
శుభాకాంక్షలు.
#Mahashivratri
పల్స్ పోలియో , ఫిబ్రవరి27,2022
మీ పిల్లలు బంగారు భవిష్యత్తు కు ప్రతిసారి రెండు పోలియో చుక్కలు వెయిద్దాం..పోలియో రహిత సమాజం కొరకు మన వంతు బాధ్యత నెరవేరుద్దాం.
0-5 సం. ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇప్పించండి.
#PulsePolio
జనహృదయ నేత..
తెలంగాణ రాష్ట్ర ప్రదాత..
బంగారు తెలంగాణ నిర్మాత..
మన టీఆర్ఎస్ పార్టీ అధినేత....
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKCR
అందరికీ నమస్కారం
ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన గౌరవ శ్రీ ఎల్. రమణ గారు 27/01/2022 గురువారం రోజున మధ్యాహ్నం 12.30 గంటలకు శాసన మండలి కౌన్సిల్ హాల్, హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.