మాట్రిమోని యాప్స్‌లో జరిగే మోసాలపై జాగ్రత్త. మీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేస్తారు. మొదట తియ్యగా మాట్లాడి..ఆపై అత్యవసరమంటూ డబ్బులు అడుగుతారు. పెట్టుబడుల పేరిట మోసగిస్తారు. అపరిచితులతో స్నేహం చేసేముందు ఆలోచించండి.
#TelanganaPolice#MatrimonialScams
🚨 సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రకటన
యాజమానులను గుర్తించలేని 354 Abandoned/Unclaimed వాహనాల బహిరంగ వేలంకు నోటిఫికేషన్.
వాహనాలపై హక్కు కలిగిన వారు తేదీ 2 జూలై నుంచి 6 నెలలలోపు సంబంధిత ఆధారాలతో క్లెయిమ్ చేసుకోవాలి.
గడువు అనంతరం నిబంధనల ప్రకారం వేలం ఉంటుంది.
https://t.co/W7b7HizT3M
🚨 డయల్-100 కాల్‌కు స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన కల్హేర్ పోలీసులు.
నైట్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, పోలీస్ కానిస్టేబుల్ తుకారాం - ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని సకాలంలో రక్షించి, కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కల్హేర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితుల రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
డి.పి.ఓ లో నిర్వహించిన జిల్లా స్థాయి స్టేక్‌హోల్డర్స్ కన్వర్జెన్స్ మీటింగ్‌లో బాధితులకు త్వరితగతిన న్యాయం, కౌన్సెలింగ్, వైద్య, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించడంపై చర్చించారు.
🚔 సంగారెడ్డి జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 7 మందికి 4 రోజుల జైలు, ₹1,000 జరిమాన.
"మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు. ఒక్క క్షణం అజాగ్రత్త జీవితకాలం విషాదంగా మారవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి."
– జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
సంగారెడ్డి జిల్లా పోలీస్ డ్యూటీ మీట్–2026
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం, శాస్త్రీయ దర్యాప్తు, సాక్ష్యాధారాలు కీలకం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో కంప్యూటర్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాల ట్రాకింగ్, విభాగాల్లో పోటీలు.
🚨 SangareddyPolice Alert
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 01 జులై 2026 - 31 జులై 2026 వరకు పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 30 & 30(ఎ) అమలులో ఉంటుంది.
పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదు.
జిల్లా ఎస్పీ
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.
కొండాపూర్ పీఎస్‌లో నమోదైన హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2,200 జరిమాన.
బలమైన సాక్ష్యాధారాలు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌తో నేరాన్ని రుజువు చేసి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులకు ఎస్పీ అభినందనలు.
Attended the 52nd PRAGATI meeting chaired by Hon'ble Prime Minister Shri Narendra Modi ji today, alongside Telangana Chief Secretary Shri K. Ramakrishna Rao and senior officials from across the state and Centre.
Apart from several infrastructure projects , the PM focused on cyber crimes and digital arrest frauds.His direction was clear that Central agencies, State Governments, law enforcement, banks, and digital platforms must operate as one coordinated force against cyber-enabled crime.
Key directions from today's meeting are :
- Strengthening prevention, reporting, and investigation mechanisms for cybercrime
-Accelerating complaint resolution and ensuring prompt support to victims
-Implementing e-Zero FIR and Zero FIR for faster registration of cyber complaints
-Launching sustained public awareness campaigns to protect citizens from digital arrest scams.
Telangana Police is way ahead of other states in the battle against cyber crime. It is ready to lead this effort on the ground. If you or anyone you know receives a suspicious call threatening "digital arrest" do not panic, do not pay. Recognise that it is a cyber fraudster
Report immediately on Cybercrime Helpline 1930.
#CyberSafety #DigitalArrest #TelanganaPolice
🚫💊 డ్రగ్ రహిత సంగారెడ్డి నిర్మాణమే లక్ష్యం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు భారీ యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ..
పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి.
వార్షిక తనిఖీలలో భాగంగా డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్. జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయం, జోగిపేట సర్కిల్ కార్యాలయం, పుల్కల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు.
"విధి నిర్వహణలో నిబద్ధత, పనిపట్ల అంకితభావం, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సమర్థవంతంగా పనిచేయాలి" అని సూచించారు.
🚨 సంగారెడ్డి జిల్లాలో వార్షిక తనిఖీలు
డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్. (జోన్–VII, జోగులాంబ, ఇన్చార్జ్ జోన్–VI, చార్మినార్) సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్, హత్నూర పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు.
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్. (మల్టీ జోన్–VII, జోగులాంబ & ఇన్చార్జ్ జోన్–VI, చార్మినార్) సందర్శించారు.
జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ
కార్యాలయ ఆవరణలో మొక్క నాటడం
📚 పోలీసు సిబ్బంది, వారి పిల్లల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రారంభం
కంగ్టీ పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
✅ స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారక్, రికార్డుల పరిశీలన
✅ పెండింగ్ కేసుల సమీక్ష, నాణ్యమైన దర్యాప్తుపై ఆదేశాలు
✅ రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ రవాణా నివారణకు చెక్‌పోస్టుల నిర్వహణ చేపట్టాలి.
• NEET పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
• పరీక్ష కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్
తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
🧘♂️ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పరేడ్ గ్రౌండ్లో యోగా కార్యక్రమాలు
ఒత్తిడిని దూరం చేసి భావోద్వేగాలను నియంత్రిస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చే దివ్యౌషధం యోగా. రోజూ యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెంపొందుతాయి జిల్లా ఎస్పీ.
జాతీయ లోక్-అదాలత్‌కు సంగారెడ్డి జిల్లాలో అపూర్వ స్పందన
3,050 కేసుల్లో రాజీ
600 IPC కేసుల పరిష్కారం
1,318 e-Petty & 1,132 DD కేసుల పరిష్కారం
సైబర్ నేరలలో ₹1.70 కోట్ల రీఫండ్‌కు కోర్టు అనుమతి
లోక్-అదాలత్ విజయవంతానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు.