వార్షిక తనిఖీలలో భాగంగా మల్టీ జోన్–II ఐజి షానవాజ్ ఖాసిం, ఐపీఎస్. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం, కమ్యూనిటీ పోలీసింగ్, సీసీ కెమెరాల విస్తరణ, సైబర్ నేరాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కల్హేర్ PS పరిధిలోని బాచేపల్లి సమీపంలో NH-161పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ పరిశీలించారు.
ప్రమాదంలో 3 మంది మృతి, ఒకరికి గాయాలు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు
అధిక వేగం ప్రాణాంతకం జిల్లా ఎస్పీ.
జిల్లా స్థాయి డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలకు నిర్వహించిన జోనల్ పోలీసు డ్యూటీ మీట్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రారంభించారు.
🚦 సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల గుర్తింపు, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు, ఆటో స్టాండ్ల ఏర్పాటు, శాశ్వత పరిష్కార చర్యలు
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించి జైలు సూపరింటెండెంట్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఖైదీల కదలికలపై నిరంతర నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సందర్శకుల కట్టుదిట్టమైన తనిఖీలు, జైలు భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, బిడిఎల్ భానూర్ పోలీస్ స్టేషన్, పఠాన్‌చెరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు, సిబ్బందిని అభినందించారు.
🚨 మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు!
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
📌 గత 14 రోజుల్లో 14 మందికి 2 - 6 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా.
🚫 మద్యం సేవించి వాహనం నడపడం మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం.
#RoadSafety#SafeDriving#TelanganaPolice
🚨 సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక శిక్షణతో మరింత బలోపేతం!
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌కు GRM, MRM, సమన్వయ & సహయోగ్ పోర్టల్స్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ.
సైబర్ బాధితులకు త్వరితగతిన సహాయం అందించాలి" అని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్.
#CyberSafety
🚨 జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో సుమారు 200–270 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సైబర్ నేరాలు, మహిళలు & చిన్నారుల భద్రత, సోషల్ మీడియా భద్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, ట్రాఫిక్ నిబంధనలు, టీ-సేఫ్ యాప్, భరోసా సేవలపై అవగాహన కల్పించారు.
📱 షీ టీమ్ వాట్సాప్: 8712656772
🚨 ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు వేగంగా పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలి.
🚔 రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
నెలవారీ నేర సమీక్షా సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
💻 వృత్తి నైపుణ్యాల పెంపుకు కంప్యూటర్ పై ప్రత్యేక శిక్షణ
సంగారెడ్డి జిల్లా పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మూడో రోజు జిల్లా ఎస్పీ Paritosh Pankaj, IPS పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిబ్బంది శిక్షణను సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు
వృత్తి నైపుణ్యాల పెంపు కోసం జిల్లా పోలీసు సిబ్బందికి MS Office పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ తెలిపారు.
180 మంది సిబ్బందికి 3 బ్యాచ్‌లుగా, వోక్సెన్ యూనివర్సిటీలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల ద్వారా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు
జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు అనుమతితో, వివిధ పిఎస్ పరిధిలో స్వాధీనం చేసిన 1485.75 కిలోల ఎండు గంజాయి, 5 కిలోల ఆల్ప్రాజోలంను పాశమైలారం మెడీకేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ద్వారా పర్యావరణ నిబంధనలు పాటిస్తూ దహనం చేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
సంగారెడ్డి జిల్లా సీసీఎస్ & గుమ్మడిదల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 106 కేసుల్లో నిందితుడైన అలవాటు హౌస్ బ్రేకింగ్ దొంగ అరెస్ట్.
✅ 22.5 తులాల బంగారు ఆభరణాలు ✅ 60 తులాల వెండి ఆభరణాలు ✅ ₹25,000 నగదు స్వాధీనం, నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
మాట్రిమోని యాప్స్‌లో జరిగే మోసాలపై జాగ్రత్త. మీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేస్తారు. మొదట తియ్యగా మాట్లాడి..ఆపై అత్యవసరమంటూ డబ్బులు అడుగుతారు. పెట్టుబడుల పేరిట మోసగిస్తారు. అపరిచితులతో స్నేహం చేసేముందు ఆలోచించండి.
#TelanganaPolice#MatrimonialScams