సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే వస్తువులు, సంక్షేమ పథకాల పై విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సరఫరా చేసే దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, ఇతర వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ ద్వారా విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలి అధికారులు ఆదేశించాను.
సంక్షేమ పథకాలు సరఫరాదారుల కోసం కాదు, లబ్ధిదారుల కోసం అన్న విషయం గుర్తుంచుకోవాలని అధికారులకు సూచించాను. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశాను.
సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని సూచించాను.
విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశాను.
#StudentWelfare
#WelfareHostels
#PolicyImplementation
#PrajaPalana
#PrajaPrabhutvam
#Telangana
#SCWelfare
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి గారు అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
✅అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ముఖ్యమంత్రి గారు ఆదివారం ఆకస్మిక సందర్శించి పరిశీలించారు. బుద్ధనగర్‌లో వరద నీటి డ్రెయిన్ సిస్టమ్‌ను పరిశీలించి అక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు.
✅బాల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించిన ముఖ్యమంత్రి గారు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
✅ఆ కాలనీకి పక్కనే గంగూబాయి బస్తీకుంటను సందర్శించి ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేశారు.
✅ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు సందర్భాల్లో వరద నీరు నిలిచిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
✅అమీర్ పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి గారు వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రి గారికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి గారు బాలుడికి ధైర్యం చెప్పారు.
✅ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకోవలసిన చర్యలపై @Comm_HYDRAA, @CommissionrGHMC, సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. #HyderabadRains #Hydraa #GHMC #ReliefOperations #CMCityVisit
బల్కంపేట ప్రాంతంలోని…
బుద్ధనగర్, గంగుబాయి బస్తీ,
మైత్రీవనం ప్రాంతాల్లో …
ఆకస్మికంగా పర్యటించాను.
భారీ వర్షాల సమయంలో…
కాలనీల్లోని ప్రాంతాల్లో…
సాధ్యమైనంత త్వరగా
నీటి ప్రవాహం జరిగి,
ముంపు తలెత్తకుండా…
తీసుకుంటున్న చర్యలను …
డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించాను.
భారీ వర్షాల సమయంలో…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
అనుసరించాల్సిన
కార్యచరణ పై అధికారులకు
పలు సూచనలు చేశాను.
బస్తీ వాసులతో మాట్లాడి…
సాధకబాధకాలు నేరుగా
అడిగి తెలుసుకున్నాను.
#PrajaPalana #TelanganaPrajaPrabhutwam
@Krishank_BRS BRS must know a lot about scams and protection from them since most of you are still roaming free. Must share your knowledge and experience on back door deals on how get bail after committing scams.
Speaking on the HCU land issue, Congress leader @DrCRohinReddy says "KTR has lost his mental status...the 400 acres of land was never a university land"
#ReporterDiary | @Journo_Abdul