@SarkhelDeb52576 Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611810301, our team at MEDCHAL Circle, NIZAMPET-MCL Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s
@journalistakash@KTRBRS@KTRoffice@revanth_anumula@TelanganaCMO@TelanganaCS@BJP4Telangana Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611810262, our team at HYDERABAD SOUTH Circle, SEETHARAM PET Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s
⚡విద్యుత్ నూతన కనెక్షన్లకు పారదర్శకమైన, ఏకరీతి ఛార్జీలు – TGSPDCLలో మరో కీలక సంస్కరణ!
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆకాంక్ష మేరకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, ప్రణాళిక & ఇంధన శాఖల మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి మార్గదర్శకత్వంలో, గౌరవ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, TGSPDCL వినియోగదారులకు మరింత పారదర్శకమైన, సరళమైన విద్యుత్ కనెక్షన్ సేవలను అందించేందుకు LT USLC మరియు HT USLC (Uniform Service Line Charges) విధానాన్ని అమలు చేస్తోంది.
ఈ నూతన విధానం ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఇతర కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ల కోసం ముందుగానే ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీలు నిర్ణయించబడ్డాయి.
గతంలో విద్యుత్ సరఫరా మూలం, లైన్ పొడవు, సైట్ పరిస్థితులను బట్టి ఒక్కో కనెక్షన్‌కు విడివిడిగా అంచనాలు రూపొందించే విధానం ఉండేది. ఇప్పుడు నిర్దేశించిన పరిధిలో వినియోగదారులు తమ కనెక్షన్‌కు వర్తించే ఛార్జీలను దరఖాస్తు చేసుకునే ముందే తెలుసుకునే అవకాశం కల్పించబడింది.
━━━━━━━━━━━━━━━━━━
⚡1. LT UNIFORM SERVICE LINE CHARGES (LT USLC)
━━━━━━━━━━━━━━━━━━
📌 TGERC Regulation No. 01 of 2026 ప్రకారం
LT నూతన విద్యుత్ కనెక్షన్లు మరియు అదనపు లోడ్లకు సంబంధించి కేటగిరీ, మంజూరైన లోడ్ ఆధారంగా ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీలు నిర్ణయించబడ్డాయి.
A. కేటగిరీల వారీగా సర్వీస్ లైన్ ఛార్జీలు
🏠 *LT-I – గృహ వినియోగం (Domestic)*
(ఇళ్లు మరియు అపార్ట్మెంట్లు)
* 1 kW వరకు: ₹500
* 1 kW పైన 5 kW వరకు: ₹500 + ప్రతి kWకు ₹600
* 5 kW పైన 20 kW వరకు: ₹2,900 + ప్రతి kWకు ₹1,500
* 20 kW పైన: ప్రతి kWకు ₹10,000
🏪 *LT-II – వాణిజ్య వినియోగం (Commercial)*
(LT-VI వీధి దీపాలు & PWS, LT-VII జనరల్ కేటగిరీలు కూడా ఇందులో భాగం)
* 1 kW వరకు: ₹1,000
* 1 kW పైన 5 kW వరకు: ₹1,000 + ప్రతి kWకు ₹1,200
* 5 kW పైన 20 kW వరకు: ₹5,800 + ప్రతి kWకు ₹2,000
* 20 kW పైన: ప్రతి kWకు ₹10,000
🏭 *LT-III – పరిశ్రమలు (Industries)*
* 20 kW వరకు: ప్రతి kWకు ₹4,000
* 20 kW పైన: ప్రతి kWకు ₹10,000
🚘 *LT-IX – ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు (EV Charging Stations)*
* 1 kW వరకు: ₹1,000
* 1 kW పైన 20 kW వరకు: ₹1,000 + ప్రతి kWకు ₹1,200
* 20 kW పైన: ప్రతి kWకు ₹8,000
🏭 *LT-IV – కుటీర పరిశ్రమలు (Cottage Industries)*
* అన్ని లోడ్లకు ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీ: ప్రతి kWకు ₹1,000
🌾 *LT-V – వ్యవసాయ కనెక్షన్లు (Agriculture / Farm Sets)*
* ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీ: ప్రతి kWకు ₹1,000
* రైతుల నుంచి ORC (Overhead Revenue Contribution) వసూలు చేయబడదు.
B. LT కనెక్షన్లకు వర్తించే ఇతర ఛార్జీలు
సర్వీస్ లైన్ ఛార్జీలతో పాటు కింది ఛార్జీలు కూడా వర్తిస్తాయి.
1. డెవలప్మెంట్ ఛార్జీలు (Development Charges):
* ప్రతి kWకు ₹1,200.
* 20 kW వరకు మాత్రమే వర్తిస్తాయి.
2. సెక్యూరిటీ డిపాజిట్ (Security Deposit):
* గృహ వినియోగం: ప్రతి kWకు ₹200
* వాణిజ్య, వీధి దీపాలు & జనరల్ కేటగిరీలు: ప్రతి kWకు ₹800
* పరిశ్రమలు: ప్రతి HPకు ₹500
* వ్యవసాయం: ప్రతి HPకు ₹60
3. దరఖాస్తు రుసుము (Application Fee):
* గృహ మరియు వ్యవసాయ కనెక్షన్లు: ₹25
* ఇతర కేటగిరీలు: ₹50
4. లోడ్ మార్పిడి:
* 1 HP = 0.746 kW
C. LT కనెక్షన్లకు ఛార్జీల ఉదాహరణలు (Worked Examples)
వినియోగదారులకు మొత్తం ఎంత చెల్లించాల్సి వస్తుందో తెలియజేసే ఉదాహరణలు:
🏠 *ఉదాహరణ 1: గృహ కనెక్షన్ – 1 kW*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹500
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹1,200
* సెక్యూరిటీ డిపాజిట్: ₹200
* దరఖాస్తు రుసుము: ₹25
*మొత్తం చెల్లించవలసినది: ₹1,925*
🏪 *ఉదాహరణ 2: వాణిజ్య కనెక్షన్ – 1 kW*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹1,000
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹1,200
* సెక్యూరిటీ డిపాజిట్: ₹800
* దరఖాస్తు రుసుము: ₹50
*మొత్తం చెల్లించవలసినది: ₹3,050*
🌾 *ఉదాహరణ 3: వ్యవసాయ కనెక్షన్ – 5 HP*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹4,000
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹4,800
* సెక్యూరిటీ డిపాజిట్: ₹300
* దరఖాస్తు రుసుము: ₹25
*మొత్తం చెల్లించవలసినది: ₹9,125*
🏭 *ఉదాహరణ 4: పారిశ్రామిక కనెక్షన్ – 10 kW*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹40,000
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹12,000
* సెక్యూరిటీ డిపాజిట్: ₹6,500
* దరఖాస్తు రుసుము: ₹50
*మొత్తం చెల్లించవలసినది: ₹58,550*
D. LT USLC అమలుకు ముఖ్యమైన నిబంధనలు
✅ విద్యుదీకరించబడిన నెట్వర్క్ నుంచి 1 కి.మీ. పరిధిలోని ఓవర్‌హెడ్ లైన్లపై ఇచ్చే నూతన కనెక్షన్లు మరియు అదనపు లోడ్లకు ఈ విధానం వర్తిస్తుంది.
✅ అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్‌లు మరియు బహుళ అంతస్తుల భవనాల విషయంలో అన్ని కనెక్షన్ల కలిపిన కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా ఛార్జీలు వర్తిస్తాయి.
✅ ప్రతి kWకు ₹1,200 డెవలప్మెంట్ ఛార్జీలు 20 kW వరకు మాత్రమే వర్తిస్తాయి.
✅ వ్యవసాయ వినియోగదారుల నుంచి ORC వసూలు చేయబడదు.
ఈ విధానం పరిధిలోకి రాని అంశాలు:
❌ LT-VIII తాత్కాలిక విద్యుత్ సరఫరా (Temporary Supply).
❌ లేఅవుట్ల విద్యుదీకరణ (Electrification of Layouts).
━━━━━━━━━━━━━━━━━━
⚡2. HT UNIFORM SERVICE LINE CHARGES (HT USLC)
━━━━━━━━━━━━━━━━━━
📌 TGERC Regulation No. 07 of 2026 ప్రకారం
11 kV HT నూతన విద్యుత్ కనెక్షన్లు మరియు అదనపు లోడ్లకు సంబంధించి ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీలను TGSPDCL అమలు చేస్తోంది.
A. HT కనెక్షన్లకు ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీ
<PRIVATE_PERSON> ₹4,078 / kVA
అంటే మంజూరైన కాంట్రాక్టెడ్ డిమాండ్‌లో ప్రతి kVAకు ₹4,078 చొప్పున సర్వీస్ లైన్ ఛార్జీ వర్తిస్తుంది.
ఈ ఛార్జీ కింది పరిస్థితులకు వర్తిస్తుంది:
* 11 kV ఓవర్‌హెడ్ లైన్లు.
* కామన్ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా.
* ఇప్పటికే విద్యుదీకరించబడిన 11 kV నెట్వర్క్ నుంచి సరఫరా.
గతంలో విద్యుత్ సరఫరా మూలం, సర్వీస్ లైన్ పొడవు ఆధారంగా ఒక్కో కనెక్షన్‌కు వేర్వేరుగా అంచనాలు రూపొందించేవారు. నూతన విధానం ద్వారా ఆ విధానానికి బదులుగా ఏకరీతి ఛార్జీలను ప్రవేశపెట్టారు.
B. HT కనెక్షన్లకు దరఖాస్తు సమయంలో చెల్లించవలసిన మొత్తం
11 kV HT కనెక్షన్లకు కింది ఛార్జీలు వర్తిస్తాయి:
1. సర్వీస్ లైన్ ఛార్జీలు:
* ప్రతి kVAకు ₹4,078.
2. డెవలప్మెంట్ ఛార్జీలు:
* ప్రతి kVAకు ₹1,200.
3. సెక్యూరిటీ డిపాజిట్:
* 11 kV పరిశ్రమలకు: ప్రతి kVAకు ₹1,500 (Three Shifts).
* 11 kVలోని ఇతర అన్ని కేటగిరీలకు: ప్రతి kVAకు ₹1,000.
4. దరఖాస్తు రుసుము:
* ఒకసారి మాత్రమే ₹100.
*ఇతర HT కేటగిరీలకు మొత్తం:*
₹4,078 + ₹1,200 + ₹1,000 = ₹6,278 / kVA
దీనికి అదనంగా ఒకసారి ₹100 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
*11 kV పరిశ్రమలకు మొత్తం:*
₹4,078 + ₹1,200 + ₹1,500 = ₹6,778 / kVA
దీనికి అదనంగా ఒకసారి ₹100 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
C. HT కనెక్షన్లకు ఛార్జీల ఉదాహరణలు (Worked Examples)
కింది ఉదాహరణలు పరిశ్రమలు మినహా ఇతర 11 kV HT కేటగిరీలకు వర్తిస్తాయి.
🔹 *ఉదాహరణ 1: 100 kVA కనెక్షన్*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹4,07,800
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹1,20,000
* సెక్యూరిటీ డిపాజిట్: ₹1,00,000
* దరఖాస్తు రుసుము: ₹100
*మొత్తం: ₹6,27,900*
🔹 *ఉదాహరణ 2: 250 kVA కనెక్షన్*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹10,19,500
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹3,00,000
* సెక్యూరిటీ డిపాజిట్: ₹2,50,000
* దరఖాస్తు రుసుము: ₹100
*మొత్తం: ₹15,69,600*
🔹 *ఉదాహరణ 3: 500 kVA కనెక్షన్*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹20,39,000
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹6,00,000
* సెక్యూరిటీ డిపాజిట్: ₹5,00,000
* దరఖాస్తు రుసుము: ₹100
*మొత్తం: ₹31,39,100*
🔹 *ఉదాహరణ 4: 1,000 kVA కనెక్షన్*
* సర్వీస్ లైన్ ఛార్జీలు: ₹40,78,000
* డెవలప్మెంట్ ఛార్జీలు: ₹12,00,000
* సెక్యూరిటీ డిపాజిట్: ₹10,00,000
* దరఖాస్తు రుసుము: ₹100
*మొత్తం: ₹62,78,100*
📌 ముఖ్య గమనిక: పై ఉదాహరణలు పరిశ్రమలు మినహా మిగిలిన అన్ని 11 kV HT కేటగిరీలకు వర్తిస్తాయి. పరిశ్రమల విషయంలో సెక్యూరిటీ డిపాజిట్ ప్రతి kVAకు ₹1,500 (Three Shifts) చొప్పున వర్తిస్తుంది.
D. HT USLC పరిధిలోకి వచ్చే కనెక్షన్లు
1️⃣ 11 kV HT కేటగిరీలలో నూతన విద్యుత్ కనెక్షన్లు లేదా అదనపు లోడ్లు.
2️⃣ ఇప్పటికే ఉన్న 11 kV నెట్వర్క్ నుంచి కామన్ ఫీడర్ ద్వారా ఓవర్‌హెడ్ లైన్ మీదుగా సరఫరా పొందే కనెక్షన్లు.
3️⃣ ప్రస్తుతం విద్యుదీకరించబడిన 11 kV నెట్వర్క్ నుంచి 1 కి.మీ. రూట్ పొడవు పరిధిలో ఉండే కనెక్షన్లు.
E. HT USLC పరిధిలోకి రాని కనెక్షన్లు
❌ డెడికేటెడ్ ఫీడర్లు (Dedicated Feeders).
❌ 1 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఫీడర్ విస్తరణలు (Feeder Extensions).
❌ 33 kV కనెక్షన్లు.
❌ అండర్‌గ్రౌండ్ కేబుల్ విస్తరణలు (Underground Cable Extensions).
━━━━━━━━━━━━━━━━━━
⚡3. విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియలో సరళీకరణ – గతంలో & ప్రస్తుతం
━━━━━━━━━━━━━━━━━━
గతంలో అమలులో ఉన్న విధానం:
దరఖాస్తు → స్థల పరిశీలన → ఒక్కో కనెక్షన్‌కు విడివిడిగా అంచనా తయారీ → అంచనా ప్రకారం ఛార్జీల చెల్లింపు.
ప్రస్తుతం అమలు చేస్తున్న నూతన విధానం:
దరఖాస్తు → మంజూరైన లోడ్ (kW/kVA) ఆధారంగా నిర్దేశించిన ఛార్జీల చెల్లింపు → లైన్ విస్తరణ → విద్యుత్ సరఫరా విడుదల.
ఈ విధానం ద్వారా అర్హత కలిగిన కనెక్షన్లకు ఛార్జీల విషయంలో ముందస్తు స్పష్టత లభించడంతో పాటు, విద్యుత్ కనెక్షన్ ప్రక్రియ మరింత సరళతరం అవుతుంది.
━━━━━━━━━━━━━━━━━━
⚡ 4. LT USLC & HT USLC ద్వారా వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు
━━━━━━━━━━━━━━━━━━
✅ విద్యుత్ కనెక్షన్లకు ఏకరీతి మరియు పారదర్శకమైన సర్వీస్ లైన్ ఛార్జీలు.
✅ అర్హత కలిగిన కనెక్షన్లకు ఇకపై ఒక్కో కేసుకు విడివిడిగా సర్వీస్ లైన్ అంచనాల అవసరం ఉండదు.
✅ దరఖాస్తు చేసుకునే ముందే ఎంత మొత్తం చెల్లించాలో తెలుసుకునే అవకాశం.
✅ విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియలో సరళీకరణ.
✅ వినియోగదారులకు ఖర్చుల విషయంలో ముందస్తు అవగాహన, ఆర్థిక ప్రణాళికకు అవకాశం.
✅ వ్యవసాయ వినియోగదారులకు ORC మినహాయింపు.
✅ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు ప్రత్యేకంగా నిర్దేశించిన ఛార్జీల ద్వారా స్వచ్ఛమైన ఇంధన వినియోగానికి ప్రోత్సాహం.
✅ HT వినియోగదారులకు కాంట్రాక్టెడ్ డిమాండ్ (kVA) ఆధారంగా ఏకరీతి ఛార్జీలు.
✅ విద్యుత్ కనెక్షన్ల మంజూరు మరియు సరఫరా విడుదల ప్రక్రియలో మరింత వేగం, పారదర్శకతకు అవకాశం.
━━━━━━━━━━━━━━━━━━
⚡సమాన ఛార్జీలు – పారదర్శక విధానం – సరళమైన విద్యుత్ కనెక్షన్లు!
━━━━━━━━━━━━━━━━━━
రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ మరియు ఇతర రంగాల విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో TGSPDCL చేపడుతున్న ఈ LT USLC మరియు HT USLC అమలు మరో కీలక ముందడుగు.
విద్యుత్ వినియోగదారులకు ముందస్తు సమాచారంతో కూడిన సేవలు అందించడం, ఛార్జీల విధానంలో పారదర్శకత తీసుకురావడం, విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను సరళీకరించడం మరియు సులభతరమైన సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశ్యం.
TGSPDCL – పారదర్శకమైన, నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సేవలే మా లక్ష్యం!
📍 మరిన్ని వివరాల కోసం సమీపంలోని TGSPDCL వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించండి.
📧 Consumer Service: [email protected]
📧 Industry Helpdesk: [email protected]
🌐 https://t.co/ZpxpujjKd7
#TGSPDCL #LTUSLC #HTUSLC #UniformServiceLineCharges #TransparentElectricityServices #ConsumerFriendlyServices #TelanganaRising #PowerForProgress
@Syed_Rahmath_ Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611810249, our team at HYDERABAD SOUTH Circle, CHANDULAL BARADARI Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s
@Amreen716@se_op_rjnr Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611810181, our team at RAJENDRA NAGAR Circle, BALAPUR Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s
@NusratUlHasani@revanth_anumula@TelanganaCMO Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611810154, our team at CYBERCITY Circle, GACHIBOWLI Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s
@osman_ali187 Dear Consumer,
Your grievance has been noted; please share your USC No. & Contact No. in DM in order to enable our team to attend the issue.
https://t.co/zYo4PGbRBs
@osman_ali187 Dear Consumer,
Your grievance has been noted; please share your USC No. & Contact No. in DM in order to enable our team to attend the issue.
https://t.co/zYo4PGbRBs
@NusratUlHasani@revanth_anumula@TelanganaCMO Dear Consumer,
Your grievance has been noted; please share your USC No. & Contact No. in DM in order to enable our team to attend the issue.
https://t.co/zYo4PGbRBs
(OR)
Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/8vuTFLogbV
@Narendr77805181 Dear Consumer,
Your grievance has been noted; please share your USC No. & Contact No. in DM in order to enable our team to attend the issue.
https://t.co/zYo4PGbRBs
(OR)
Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/8vuTFLogbV
⚡*కొత్తపేట సబ్‌స్టేషన్‌లో PTR-1 సామర్థ్యం 12.5 ఎంవీఏ నుంచి 16 ఎంవీఏకు పెంపు! సుమారు 15,845 వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా!* ⚡
తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి & ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి ఆకాంక్షల మేరకు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, ఐఏఎస్ గారి మార్గదర్శకత్వంలో, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గారి ఆదేశాలతో నెట్వర్క్ విస్తరణ పనులను టీజీఎస్పీడీసీఎల్ ఇంజనీర్లు ప్రాధాన్యతగా చేపడుతున్నారు. 💡
ఇందులో భాగంగా, సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని *33/11 కేవీ కొత్తపేట సబ్‌స్టేషన్‌లో PTR-1 సామర్థ్యాన్ని 12.5 ఎంవీఏ నుంచి 16 ఎంవీఏకు పెంచి, **21.11.2026 సాయంత్రం 4:45 గంటలకు* విజయవంతంగా ఛార్జ్ చేశారు. ✅
ఈ కార్యక్రమంలో ఎస్ఈ/ఆపరేషన్/సరూర్‌నగర్ శ్రీ ఎన్. లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, డీఈ/టెక్/సరూర్‌నగర్ శ్రీ రాజారాం రెడ్డి గారు, డీఈ/టీఆర్ఈ & ప్రొటెక్షన్/ఆర్ఆర్ జోన్ శ్రీ ఆర్. హైమానంద్ గారు, డీఈ/నిర్మాణం శ్రీ తిరుపతయ్య గారు, డీఈ/లైన్స్ శ్రీ కైలాష్ గారు, ఏడీఈ/ఆపరేషన్ శ్రీ విజయ్ భాస్కర్ గారు, ఏఈ/ప్రొటెక్షన్ శ్రీ రవికుమార్ గారు, ఏఈ/లైన్స్ శ్రీ పూర్ణచందు గారు, ఏఈ/ఆపరేషన్ శ్రీమతి ఎన్. ప్రీతి గారు మరియు లైన్స్, ప్రొటెక్షన్, ఆపరేషన్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. 👏
🏘️ *ప్రయోజనం పొందే ప్రాంతాలు:* శారదానగర్, వి.వి. నగర్, క్రాంతినగర్, సరూర్‌నగర్, పోచమ్మబాగ్, చెరుకుతోట కాలనీ, సాయినగర్, కృష్ణానగర్, కమలానగర్, కొండారం నగర్, హుడా కాలనీ, చౌడి, బాపూనగర్, సరస్వతినగర్, ఉదయనగర్, సిండికేట్ బ్యాంక్ కాలనీ, త్యాగరాయ నగర్, అంబేద్కర్‌నగర్.
🔹 సామర్థ్యం పెరగడంతో *విద్యుత్ సరఫరా మరింత విశ్వసనీయంగా* మారుతుంది.
🔹 ఓవర్‌లోడ్ సమస్యలు తగ్గి, *నాణ్యమైన విద్యుత్* అందుతుంది.
ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. 💪
📞 టోల్ ఫ్రీ: *1912* | WhatsApp: *87124 41912*
🌐 https://t.co/ZpxpujjKd7
#TGSPDCL #TelanganaRising #Kothapet #Saroornagar #PTR #CapacityEnhancement #ReliablePower #StrongerGrid #PowerForAll
@cmdtgspdcl@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu
ELECRAMA 2027 Roadshow Held Grandly in Hyderabad
Industries Should Prioritise Advanced Technology, Innovation and Quality Manufacturing in the Power Sector
Performance, Reliability, Interoperability and Cost Effectiveness are Crucial in the Power Distribution System: TGSPDCL CMD & TGREDCO Vice Chairman and Managing Director Sri Jitesh V. Patil, IAS
Hyderabad, November 21: The prestigious ELECRAMA 2027 Roadshow was held grandly in Hyderabad on Friday, with the objective of promoting advanced technologies, innovation, quality manufacturing of electrical equipment and strengthening coordination among stakeholders in the Indian power sector.
Organised by the Indian Electrical and Electronics Manufacturers' Association (IEEMA) on Friday evening at Novotel, Hyderabad International Convention Centre (HICC), the programme was attended by TGSPDCL Chairman and Managing Director and TGREDCO Vice Chairman and Managing Director Sri Jitesh V. Patil, IAS, and TGNPDCL CMD Sri Varun Reddy as Chief Guests. They formally inaugurated the programme by lighting the ceremonial lamp.
Addressing the gathering, Sri Jitesh V. Patil stated that Telangana is progressing rapidly across all sectors under the leadership of Hon'ble Chief Minister Sri A. Revanth Reddy and Hon'ble Deputy Chief Minister and Energy Minister Sri Mallu Bhatti Vikramarka. He emphasised that reliable and uninterrupted power supply is essential for the state's economic growth.
Indian Power Sector – An Example to the World
The CMD observed that despite rapidly increasing electricity demand, India has been successfully managing its power system to meet growing requirements. At a time when several countries are facing challenges relating to grid stability and power interruptions, India has demonstrated its ability to efficiently manage enormous electricity demand.
He appreciated the significant contribution of electrical equipment manufacturers, technical experts and the engineering sector in achieving this progress and urged Indian manufacturers to further strengthen their technological capabilities to compete in international markets.
### Rising Power Demand in Telangana – An Indicator of Growth
Sri Jitesh V. Patil stated that electricity demand in Telangana is increasing significantly due to rapid industrial, commercial and urban development.
He revealed that Telangana recorded a peak electricity demand of *20,018 MW in October this year*. He stressed the need to further strengthen power generation, transmission and distribution infrastructure to meet future requirements.
He noted that the power sector would play a vital role in positioning Telangana as a key contributor to India's economic growth. He also invited ELECRAMA to participate in the upcoming Telangana Global Summit.
### Net-Zero Target by 2047 – Focus on Green Energy
He stated that Telangana is moving forward with a planned approach to achieve the Net-Zero target by 2047 through its Clean and Green Energy Policy.
He emphasised the need to promote renewable energy sources such as solar and wind power while adopting advanced technologies to ensure grid stability.
With the growth of data centres, electric vehicles, e-mobility and industrial expansion, electricity demand is expected to increase further. He urged manufacturers to focus on Battery Energy Storage Systems (BESS), smart grid technologies and advanced electrical equipment to address future requirements.
New Opportunities for Innovation in Battery Technology
The CMD observed that solar power has transformed India's energy landscape and that battery technology has the potential to bring another major technological revolution.
Along with existing lithium-based LFP batteries, sodium- and zinc-based battery technologies offer promising opportunities for the future.
He encouraged manufacturers to undertake research and develop indigenous battery technologies suited to India's available mineral resources. He also highlighted the potential of advanced technologies such as Perovskite and Silicon Tandem Solar Cells to improve solar power generation efficiency.
PRICE – Four Key Parameters in DISCOM Procurement
Explaining the procurement priorities of Distribution Companies (DISCOMs), the CMD stated that electrical equipment is evaluated based on four important parameters, in addition to price:
- P – Performance: Equipment must function efficiently in accordance with prescribed standards.
- R – Reliability: Quality and reliability must be maintained over the long term, beyond the warranty period.
- I – Interoperability: New equipment must integrate seamlessly with the existing power network.
- C – Cost Effectiveness: Both procurement and maintenance costs must be economical without compromising quality.
He emphasised that these four parameters are crucial in electrical equipment procurement and reiterated that quality will always remain a priority and the procurement process will be completely transparent.
Manufacturers Should Explore Opportunities Beyond DISCOMs
Sri Jitesh V. Patil advised electrical equipment manufacturers not to depend solely on government and DISCOM procurement but also to explore the wider consumer market.
He observed that the number of prosumers, who both consume and generate electricity, is expected to increase in the future. Rooftop solar generation, battery storage, power conversion and smart energy management systems will become increasingly important.
He explained that common electricity requirements in gated communities, apartments and commercial complexes, including clubhouses, Sewage Treatment Plants (STPs), water treatment plants and street lighting, could be efficiently managed through solar power and battery storage systems.
He encouraged manufacturers to directly communicate the benefits of their products to consumers and make use of emerging market opportunities.
Innovations in Small Equipment are Equally Important for Grid Reliability
The CMD emphasised that innovation in the power sector is not limited to large equipment and advanced technologies. Even small improvements in electrical components can significantly enhance power supply quality and reliability.
He stated that TGSPDCL is giving importance to both overhead lines and underground cabling projects. He also highlighted the importance of introducing modern technologies in smaller electrical equipment such as HG fuses, circuit breakers and AB switches to minimise accidents and improve network reliability.
He urged manufacturers to focus on research and innovation in these areas.
Proposal to Establish an Electrical Museum in Hyderabad
Sri Jitesh V. Patil proposed establishing a dedicated Electrical Museum at the Power Training Institute in Hyderabad to showcase modern electrical equipment and emerging technologies.
He encouraged various manufacturers to contribute models of their latest electrical equipment to the proposed museum. This would provide students, young engineers and technical professionals an opportunity to gain first-hand knowledge of technological advancements and innovations in the power sector.
He also suggested exploring a non-financial Memorandum of Understanding (MoU) with ELECRAMA for establishing the Electrical Museum in Hyderabad.
Inspiring Indian Youth to Achieve Global Recognition Through Innovation
Sharing his personal educational and professional journey, Sri Jitesh V. Patil spoke about his agricultural family background, his achievement in entering IIT through the Mathematics Olympiad and JEE, and his completion of Mechanical Engineering. He also shared his subsequent experience in the oilfield sector before joining the Civil Services.
He highlighted the crucial role played by ITI students, technical professionals and field staff in operating and maintaining the power distribution network. He emphasised the need to provide them with advanced technical training and opportunities for skill development.
Referring to Dr. Homi J. Bhabha, who returned to India and laid the foundation for the country's nuclear research programme, he said that such contributions serve as an inspiration to everyone. He called upon individuals to contribute not only to their personal success but also to the development of the nation and future generations.
He observed that even a small manufacturing company could grow into a globally recognised enterprise through quality, innovation and determination, and that young people from remote villages could also achieve international recognition.
Industry Cooperation is Key to Telangana's Power Sector Growth
Sri Jitesh V. Patil stated that ELECRAMA 2027 would serve as an important international platform to showcase India's technological capabilities, manufacturing progress and innovations in the electrical sector.
He expressed confidence that the Hyderabad Roadshow would further strengthen coordination among power distribution companies, manufacturers and technical experts.
He reiterated that TGSPDCL is committed to working closely with industries to promote quality equipment, advanced technologies and indigenous innovations in line with the future requirements of Telangana's power sector.
@TelanganaCMO@Bhatti_Mallu@IPRTelangana@cmdtgspdcl
TGSPDCL పరిధిలోని 21 ఆపరేషన్ సర్కిళ్ల పనితీరుపై సీఎండీ విస్తృత సమీక్ష
రానున్న వేసవి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ
రెవెన్యూ వసూళ్లు, నెట్వర్క్ మ్యాపింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత
పెండింగ్ పనుల సత్వర పూర్తికి గడువులు విధింపు.. వినియోగదారుల సేవల్లో జాప్యాన్ని సహించేది లేదు: సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్
హైదరాబాద్, నవంబర్ 21 (శనివారం): TGSPDCL పరిధిలోని 21 ఆపరేషన్ సర్కిళ్ల పనితీరు, విద్యుత్ బిల్లుల వసూళ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్ పంపిణీ నెట్వర్క్ పటిష్టత, వినియోగదారుల సేవలు, గత సమీక్షల్లో ఇచ్చిన ఆదేశాల అమలుపై సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ శనివారం కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విస్తృత సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటీ & మాస్టర్ ప్లాన్) శ్రీ వట్టికొండ శివాజీ, డైరెక్టర్ (ఆపరేషన్స్, P&M&M, IPC & RAC, ఎనర్జీ ఆడిట్ & DPE) డాక్టర్ ఎన్. నరసింహులు, డైరెక్టర్ (కమర్షియల్) శ్రీ చిలుకమారి చక్రపాణి, డైరెక్టర్ (ఫైనాన్స్, రెవెన్యూ, HRD, IR, లీగల్, మెడికల్ & అసెస్మెంట్స్) శ్రీ పి. కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీఫ్ ఇంజినీర్లు, సీజీఎంలు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, జనరల్ మేనేజర్లు, డివిజనల్, సబ్‌డివిజనల్ స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
వేసవి, వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధత
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, రానున్న వేసవి, తదుపరి వర్షాకాలంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్, భారీ వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహణ, మౌలిక సదుపాయాల పనులను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో, అనంతరం వర్షాకాలంలో పనుల నిర్వహణ మరింత సవాలుగా మారే అవకాశం ఉన్నందున జనవరి నెలాఖరులోగా కీలక పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో స్థానికంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎండీ సూచించారు. పవర్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన బ్యాటరీ నిల్వ సామర్థ్యం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, అంచనా వ్యయం, అనుమతులు, పెట్టుబడుల వివరాలతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను డిసెంబర్ 2026 నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
బిల్లుల వసూళ్ల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ
వరుసగా విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారులను సిబ్బంది నేరుగా సంప్రదించి, వారి సర్వీసులను తనిఖీ చేయాలని సీఎండీ ఆదేశించారు. బిల్లులు చెల్లించకపోవడానికి గల కారణాలను తెలుసుకుని, పెండింగ్ బకాయిల వివరాలను వారికి వివరించి, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వినియోగదారుల సహకారంతో బకాయిల వసూళ్లను పెంచేందుకు కృషి చేయాలని, ఈ ప్రక్రియలో భాగంగా ఇతర పెండింగ్ సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయి పర్యటనలు – పనితీరుపై ప్రత్యక్ష సమీక్ష: సౌత్, సెంట్రల్, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలోని అన్ని సబ్డివిజన్లలో వచ్చే వారం నుంచి సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ బిల్లుల వసూళ్లు, విద్యుత్ నష్టాలు, పెండింగ్ పనులు, సర్వీస్ మ్యాపింగ్, విద్యుత్ సరఫరా సమస్యలు, సిబ్బంది పనితీరును నేరుగా సమీక్షించనున్నారు. పనితీరు ఆధారంగా సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేయడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నారు.
సర్వీస్–DTR మ్యాపింగ్, GIS నెట్వర్క్ విశ్లేషణ
విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకత, కచ్చితమైన డేటా నిర్వహణ కోసం ప్రతి విద్యుత్ సర్వీసును సంబంధిత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (DTR), ప్రతి DTRను సంబంధిత ఫీడర్‌తో అనుసంధానించే మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎండీ ఆదేశించారు.
SAPలో నమోదైన వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు సరిపోలేలా చూడాలని, DTRల మార్పులు, స్ట్రక్చర్ కోడ్ వ్యత్యాసాలు, ఇతర సాంకేతిక లోపాలను గుర్తించి సరిదిద్దాలని సూచించారు. మ్యాపింగ్‌లో నిర్లక్ష్యం లేదా తప్పులు గుర్తించిన సందర్భాల్లో బాధ్యత నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.ఫీడర్–DTR మ్యాపింగ్‌కు డిసెంబర్ నెలాఖరు గడువు
విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కచ్చితమైన ఎనర్జీ అకౌంటింగ్, నెట్వర్క్ నిర్వహణ కోసం ఫీడర్–DTR మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎండీ ఆదేశించారు. ప్రతి DTRను సంబంధిత ఫీడర్‌తో అనుసంధానించే మ్యాపింగ్ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల పురోగతి, కాంట్రాక్టర్లపై జవాబుదారీతనం
పెండింగ్ సబ్‌స్టేషన్ పనులు, మాస్టర్ ప్లాన్ పనులు, T&D బడ్జెట్ పనులు, టెండర్లు, వర్క్ ఆర్డర్ల జారీ, వివిధ రకాల మెటీరియల్ కొనుగోళ్లపై సీఎండీ సమగ్రంగా సమీక్షించారు.
టెండర్ ప్రక్రియ పూర్తవడం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు వాస్తవంగా ప్రారంభమై వేగంగా కొనసాగాలని సీఎండీ స్పష్టం చేశారు.
పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని, నిరంతరం జాప్యం చేసే కాంట్రాక్టర్లపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్లను గుర్తించి, మెటీరియల్ లభ్యత, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ మార్చి 2027 నాటికి పూర్తిచేసేలా ప్రత్యేక వర్క్ ఆర్డర్ క్లోజర్ ప్రోగ్రామ్ (WOCP) అమలు చేయాలని సూచించారు.
SCADA విస్తరణ, సబ్స్టేషన్ల ఆధునీకరణ
సబ్స్టేషన్ల నిర్వహణ ప్రమాణాలను మెరుగుపరిచి, పరిశుభ్రత, భద్రత, ఆధునిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎండీ ఆదేశించారు. సబ్‌స్టేషన్ యార్డుల్లో అవసరమైన మెటల్ స్ప్రెడింగ్, పరికరాల పెయింటింగ్, అనవసర సామగ్రి తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
SCADA రెండో దశలో చేపట్టిన 151 సబ్స్టేషన్లలో 121 పూర్తయ్యాయని, మిగిలిన 30 సబ్స్టేషన్ల పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో SCADA అమలు, AMR అనుసంధానం,ఆటోమేటెడ్ సబ్స్టేషన్ల ప్రణాళికపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. SCADA పురోగతి, పూర్తయిన పనులు, పెండింగ్ పనులు, వాటి గడువులను తెలియజేసే ప్రత్యేక డ్యాష్‌బోర్డును వారం రోజుల్లో సిద్ధం చేయాలని తెలిపారు.
ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేయనున్న DTRల విషయంలో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని సంయుక్త తనిఖీలు నిర్వహించాలని, ట్రాన్స్ఫార్మర్లకు తగిన గాలి ప్రసరణ, భద్రత, అగ్నిప్రమాద నివారణ, నిర్వహణ సౌకర్యాలు ఉండేలా ఆధునిక రక్షణ ఏర్పాట్లు రూపొందించాలని సూచించారు.
సోలార్ నెట్ మీటర్లు, వినియోగదారుల సేవలకు ప్రాధాన్యత
రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు నెట్ మీటర్లను సకాలంలో అమర్చడం TGSPDCL బాధ్యత అని సీఎండీ స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, అందుబాటులో ఉన్న నెట్ మీటర్లను పూర్తిస్థాయిలో వినియోగించాలని, క్షేత్రస్థాయి అధికారులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
కొత్త విద్యుత్ సర్వీసుల దరఖాస్తులను నిర్దేశించిన సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (SLA) గడువులోగా పరిష్కరించాలని, ఎక్స్టెన్షన్ అవసరం లేని సర్వీసులను ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు చేయాలని సూచించారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, అధికారులు స్వయంగా చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
బిల్లింగ్ పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ
IR విధానంలోనే బిల్లింగ్ తప్పనిసరి: ప్రతి విద్యుత్ సర్వీసుకు IR విధానంలోనే బిల్లింగ్ నిర్వహించాలని సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. నాన్-IR విధానంలో బిల్లింగ్ చేయడాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ఈ విషయంలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నూతన విద్యుత్ సర్వీసులు, వ్యవసాయ కనెక్షన్ల త్వరితగతిన విడుదల
కొత్త విద్యుత్ సర్వీసుల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్దేశిత గడువులోగా విడుదల చేయాలని సీఎండీ ఆదేశించారు. ఇప్పటికే DTRలు డ్రా చేసిన వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సంబంధించిన కనెక్షన్ల పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, మెటీరియల్ అందుబాటులో ఉన్నప్పటికీ పనులు పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి
ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, ఇరిగేషన్, ఈ-వాటర్ వర్క్స్ తదితర సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ప్రత్యేకంగా సమీక్షించాలని సీఎండీ సూచించారు. అకౌంట్స్ అధికారులు సంబంధిత బకాయిల వివరాలను పరిశీలించి, ఆయా శాఖల అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.
పగటిపూట వీధి దీపాలు వెలగకుండా చర్యలు
పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతున్న సమస్యపై సీఎండీ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో సమన్వయం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణకు ఆటోమేటిక్ మానిటరింగ్ వ్యవస్థల ఏర్పాటు సహా ఆధునిక సాంకేతిక పరిష్కారాలను పరిశీలించాలని ఆదేశించారు. తద్వారా విద్యుత్ వృథాను అరికట్టి, ఇంధన పొదుపును ప్రోత్సహించాలని తెలిపారు.
భూగర్భ జలాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన
గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల లభ్యతను గుర్తించేందుకు గ్రౌండ్‌వాటర్ డిటెక్టర్ పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఎండీ తెలిపారు. ఈ పరికరాల ద్వారా బోర్వెల్లలో భూగర్భ జలాల స్థాయిని అంచనా వేసి, రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని నిర్ణయించుకోవడంతో పాటు, నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు సంబంధిత సూపరింటెండింగ్ ఇంజినీర్లు (SEలు) ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వ్యవసాయ విద్యుత్ వినియోగం విషయంలో భూగర్భ జలాల లభ్యత, బోర్వెల్ నీటి సామర్థ్యంపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎండీ సూచించారు. నీరు, విద్యుత్‌ను బాధ్యతాయుతంగా వినియోగించేలా వ్యవసాయ డిమాండ్ నిర్వహణ కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు.
ప్రతి అధికారి తన పరిధిలోని విద్యుత్ సర్వీసులు, DTRలు, ఫీడర్లు, సబ్స్టేషన్లు, పెండింగ్ పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించాలని సీఎండీ ఆదేశించారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, రానున్న వేసవి విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సంస్థ ఆదాయాన్ని పెంపొందించడం, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని సర్కిళ్ల అధికారులు సమన్వయంతో, క్రమశిక్షణతో, పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలని శ్రీ జితేష్ వి. పాటిల్ దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, వేసవి గరిష్ట డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సంస్థ ఆదాయాన్ని పెంపొందించడం, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని సర్కిళ్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీ జితేష్ వి. పాటిల్ దిశానిర్దేశం చేశారు.
పురోగతి సాధించిన సర్కిళ్లకు అభినందనలు
గత సమీక్షతో పోలిస్తే పలు డివిజన్లు, సెక్షన్లు, సబ్డివిజన్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనుల పురోగతి సాధించడంపై సీఎండీ సంతృప్తి వ్యక్తం చేసి సంబంధిత అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాలు కూడా పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
@TelanganaCMO@Bhatti_Mallu@IPRTelangana@cmdtgspdcl
@SyedKareem4a1 Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611809811, our team at HYDERABAD CENTRAL Circle, KACHIGUDA Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s
@saiscorsese Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611809707, our team at SAROORNAGAR Circle, VANASTHALIPURAM Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s
@sameertaware5 Dear Consumer,
Your grievance has been noted; please share your USC No. & Contact No. in DM in order to enable our team to attend the issue.
https://t.co/zYo4PGbRBs
@fatimas1219 Dear Consumer,
Your grievance has been noted with reference no:- TK2611809690, our team at SECUNDERABAD Circle, OLD BOWENPALLY Section, will attend the issue shortly and Please also connect with us through our WhatsApp chatbot using the link below:https://t.co/lkayHjbR1s