నెల్లూరు జిల్లాలో రూ.147.79 కోట్ల భారీ భూ తనఖా మోసం ఆరోపణలు
మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
తన పేరు, ఫొటోలు, వేలిముద్రలు దుర్వినియోగం చేసి నకిలీ జీపీఏతో భూములు తనఖా పెట్టారని బాధితుడి ఫిర్యాదు
విశాఖ జిల్లా పరవాడ మండలంలోని భూములపై ఇండియన్ బ్యాంక్‌లో రుణాలు పొందారని ఆరోపణ
బ్యాంక్ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్
#Nellore #Podalakuru #TV5News
మాచర్లలో ఎకో సిస్టమ్ లిమిటెడ్ (ESL) స్కీమ్ పేరుతో ఘరానా మోసం
అధిక లాభాల ఆశ చూపి సుమారు రూ.10 కోట్లు దోచుకున్నారని బాధితుల ఆవేదన
రూ.18 వేలు యాప్‌లో పెడితే రోజుకు రూ.500, రూ.1.30 లక్షలు పెడితే రోజుకు రూ.2,500 వస్తాయని ప్రచారం
మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల మండలాల్లో వెయ్యి మందికి పైగా బాధితులు
దసరా నుంచి పనిచేయని నకిలీ యాప్
బాధితులు ఫిర్యాదు చేస్తే విచారిస్తామన్న మాచర్ల పోలీసులు
#Macherla #Palnadu #TV5News
అప్డేట్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఉద్రిక్తత
వేధింపులకు గురైన పీజేటీఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సేన మహిళా అధ్యక్షురాలు కవిత ధర్నా
ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు కదిలేది లేదంటూ అర్ధరాత్రి దాటే వరకు బైఠాయింపు
ఇవాళ్టి నుంచి ప్రాథమిక ఎఫ్ఐఆర్గా పరిగణిస్తామని డీసీపీ హామీ ఇచ్చారని కవిత వెల్లడి
పదహారు రోజుల క్రితమే ఫిర్యాదు ఇచ్చినా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్న
#Rajendranagar #PJTAU #TV5News
https://t.co/FBXTvhZbV1
కవిత నివాసంపై డ్రోన్ కలకలం.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నివాసంపై మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
డ్రోన్ ఎగురవేయడంపై కవిత కార్యాలయ సిబ్బంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
#Kavitha #BanjaraHills #TV5News
"లక్ష ఇంకుడు గుంతలు చేసి ఉంటే.." - కిషోర్ రెడ్డి
తొమ్మిది నెలల ముందే వార్త తెలిసినా ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ నేత ప్రశ్నించారు.
గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చర్యలు తీసుకోవాల్సిందే అనేది ఆయన మాట.
#TV5News#HyderabadWaterCrisis#BigNews
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించాలి.. సుప్రీంకోర్టులో బలంగా వాదించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీతో వివాదం ఉన్న అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 18 తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుండటంతో న్యాయ నిపుణులతో చర్చించారు. డిండి, అచ్చంపేట పనులు వేగవంతం చేయాలని సూచించారు.
#KrishnaWaters #RevanthReddy #TV5News
"2026కి 585 మిలియన్ గ్యాలన్ల డిమాండ్ అవుతుంది" - డా. చరణ్ కౌశిక్ యాదవ్
మొత్తం లోటు 245 మిలియన్ గ్యాలన్లు పర్ డే అని ఆయన వాదన.
గోదావరి ఫేజ్ 2, 3 పనులు ముందే జరిగి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని ఆయన అభిప్రాయం.
#TV5News#HyderabadWaterCrisis#BigNews
పవన్ కళ్యాణ్‌తో విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ భేటీ
విజయవాడ మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కుటుంబ సభ్యులతో కలిసి కలిశారు. మేయర్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి పవన్‌తో భేటీ అయ్యారు.
పవన్ కళ్యాణ్‌కు రాధాకృష్ణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
#PawanKalyan #VangaveetiRadha #TV5News
"రేపటి అవసరాల కోసం జలాశయాల్లో నీటిని సమకూర్చలేదు" - బొల్లం మల్లయ్య యాదవ్
ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు.
రాబోయే రోజులు అత్యంత కష్టమైనవని శాస్త్రవేత్తలు, అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.
#TV5News#HyderabadWaterCrisis#BigNews
"రోజుకు 130 కోట్ల లీటర్లు మూసీలో కలుస్తున్నాయి" - డా. చరణ్ కౌశిక్ యాదవ్
హైదరాబాద్‌లో రోజుకు 260 కోట్ల లీటర్ల నీటి వినియోగం ఉందని ఆయన వాదన.
వృథా చేస్తే రూ.20 వేల జరిమానా, రెండోసారి కనెక్షన్ కట్ అని ప్రభుత్వం హెచ్చరించింది.
#TV5News#HyderabadWaterCrisis#BigNews
"రాజకీయ విమర్శలు కాదు.. జలమండలి డేటానే చెప్తోంది" - మూర్తి
సింగూరు, మంజీరా జలాశయాల్లో నిల్వ పది శాతం లోపుకు పడిపోయే పరిస్థితి ఉందని ఆయన వివరించారు.
డిసెంబర్ నాటికి శేరిలింగంపల్లిలో ఎనభై శాతం నీటి లోటు ఏర్పడవచ్చని చెప్పారు.
#TV5News#HyderabadWaterCrisis#BigNews
అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. కుటుంబానికి కేటీఆర్ ఫోన్లో భరోసా
నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురానికి చెందిన శ్రీజ (23) అమెరికాలోని బోస్టన్‌లో చదువుకుంటోంది. ఈ నెల 2న వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదని, ఆమె ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని బీచ్ వద్ద చూపిస్తోందని స్నేహితులు తల్లిదండ్రులకు తెలిపారు.
శ్రీజ తల్లిదండ్రులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అక్కడి సెనెటర్లతో మాట్లాడి త్వరగా స్పందించేలా చేస్తానని హామీ ఇచ్చారు.
#Nalgonda #KTR #TV5News
గురుకులంలో అర్ధరాత్రి బాలికల జడలు కత్తిరింపు.. సత్తెనపల్లి రామకృష్ణాపురంలో ఘటన
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల జడలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న 10 మంది బాలికల జడలు కత్తిరించి ఎత్తుకెళ్లారు.
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
#Sattenapalli #Palnadu #TV5News
ధర్మపురిలో వైభవంగా గోదావరి మహా హారతి
కార్తీక మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నదీ తీరాన మహా హారతి వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోదావరి మాతకు హారతి ఇచ్చారు.
పెద్ద సంఖ్యలో భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు.
#Dharmapuri#Godavari#TV5News
జగన్‌ను నమ్ముకుంటే భవిష్యత్తు లేదంటూ నేతల వలసలు.. ఉత్తరాంధ్రలో వైసీపీ
TV5 Top Story: Analyst DV Srinivas says YSRCP leaders are leaving the party and it has won few seats in north Andhra districts.
"ఏడు జిల్లాల్లో వాష్ అవుట్ అయిపోయింది" - డి.వి. శ్రీనివాస్
#TV5News#YSRCP #TopStory
లక్ష్యం 2029.. స్థానిక సంస్థల విజేతలకు బీజేపీ నేత పిలుపు
TV5 Top Story: గెలిచిన ఎన్డీఏ విజేతలు పనిచేయాలని, 2029లో మళ్లీ ప్రజల ఆశీర్వాదమే లక్ష్యమని బీజేపీ నేత అన్నారు.
"మన లక్ష్యం 2029లో మళ్లీ ప్రజల ఆశీర్వాదం పొందాలి" - బీజేపీ నేత
#TV5News#BJP#TopStory
రెట్టింపు ఆగ్రహం.. కూటమికి 3.6%, వైసీపీకి 6.6% తగ్గుదల
TV5 Top Story: కూటమికి 3.6% పెరిగితే వైసీపీ 6.6% తగ్గిందని, ఇది రెట్టింపు ఆగ్రహమని డి.వి. శ్రీనివాస్ అన్నారు.
"ఇద్దరికీ ఈ తీర్పు ఒక చక్కటి లెసన్" - డి.వి. శ్రీనివాస్
#TV5News#APLocalBodyElections#TopStory
నిరుద్యోగులకు శుభవార్త.. అమరావతి నుంచి గ్రూప్-2 పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
గ్రూప్-2 పోస్టుల సంఖ్య 686 నుంచి 720కి పెరిగింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
203 డిప్యూటీ తహసీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీవో, 40 జీఎస్టీ ఆఫీసర్, 29 ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్నారు. నేటి నుంచే ఆన్లైన్ దరఖాస్తులు, డిసెంబర్ 11 తుది గడువు.
#APPSC #Group2 #TV5News
671 బ్రాండ్ల క్యాన్సర్ మందులపై 96 శాతం వరకు ధరల తగ్గింపు.. అమరావతిలో అమలుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. 671 బ్రాండ్లపై ఎంఆర్పీలో గరిష్ఠంగా 96.45 శాతం వరకు ధరలు తగ్గాయి.
ఆసుపత్రులు, మందుల దుకాణాలకు విధివిధానాలు జారీ చేశామని, మందుల లభ్యత, ధరల అమలును నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
#CancerDrugs #Amaravati #TV5News
డిసెంబర్ కల్లా హైదరాబాద్‌కు నీటి గండం.. సింగూరు, మంజీరా నిల్వలు 10 శాతానికి
Hyderabad water crisis: Singur and Manjira storage set to fall to 10% by December, Water Board MD Ashok Reddy has said.
"ఐటీ హబ్‌గా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్ గొంతెండబోతోందా?" - మూర్తి
#TV5News #Hyderabad #WaterCrisis