పార్టీ మారితే వేటు తప్పదు
పార్టీ ఫిరాయించిన బీజేపీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన కలకత్తా హైకోర్టు
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు తప్పని అనర్హత వేటు ?
ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని పిటిషన్ వేసిన స్పీకర్
ఆలస్యం చేస్తున్నాడని స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం రోజు విచారణ
ఇదే సమయంలో వెస్ట్ బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
కలకత్తా హైకోర్టు తీర్పుతో, తెలంగాణ జంపింగ్ ఎమ్మెల్యేలకు మొదలైన అనర్హత భయం
అమెరికాలో గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి
2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అనంతరం సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించిన రవితేజ (34)
ఒహాయో రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో నివాసం ఉంటూ, ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశానికి తల్లిదండ్రులను పిలిపించుకున్న రవితేజ
ఈనెల 18న రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తుండగా, రవితేజకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
సర్జరీ చేసినప్పటికీ పరిస్థితి విషమించి ఈనెల 19న రవితేజ మృతి
రవితేజ స్వస్థలం పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామం
హైడ్రా తరహాలో మరో ప్రభుత్వ సంస్థ
ప్రభుత్వ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు కొత్త సంస్థ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరగకపోవడంతో, ప్రభుత్వ ఆదాయానికి పలువురు అక్రమార్కులు గండి కొడుతున్నారని గుర్తించిన అధికారులు
దీంతో హైడ్రా తరహాలో మరో సంస్థను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డికి సూచించిన అధికారులు
వాణిజ్య పన్నులు, గనులు, పౌర సరఫరాలు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి జరగకుండా అన్ని శాఖలకు ఒకే నిఘా విభాగం ఉండాలని తెలిపిన రేవంత్ రెడ్డి
ఈ నిర్ణయంతో అన్ని శాఖలపై మంత్రులు పట్టు కోల్పోతారని, నేరుగా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే అన్ని శాఖలు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణుల విమర్శలు
వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్న రైతులు
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలపనున్న రైతులు
ప్రతిపాదిత భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల నిరసన
శంభు బార్డర్ (పంజాబ్–హర్యానా సరిహద్దు) వద్దకు భారీగా చేరుకున్న రైతులు
భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు
సిక్కింలో ఘోర ప్రమాదం
నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న 27 మంది కార్మికులు.. ఏడుగురు మృతి
టన్నెల్లో పని చేస్తుండగా కొండచరియలు విరిగిపడి మూసుకుపోయిన ప్రవేశ ద్వారం
మీథేన్ వాయువు విడుదల కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది
టన్నెల్లో చిక్కుకున్న వారిలో ఏడుగురు మృతి.. మిగతా కార్మికుల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
లక్షెట్టిపేటలోని శ్రీ వాసవి గార్డెన్స్‌లో జరిగే రైతు సదస్సులో పాల్గొననున్న కేటీఆర్
అనంతరం ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించనున్న కేటీఆర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను అరెస్ట్ చేయండి
అతను అలవాటుపడిన నేరస్తుడిలా మారాడు
కోర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్‌ను అరెస్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాల ఉపసంహరణ
హైదరాబాద్ – మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య కొనసాగుతున్న వివాదం
రెండుసార్లు ప్రభుత్వం ఓడిపోయినా, మూడోసారి సంస్థ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, ఈ నెల 17వ తేదీన ఫెన్సింగ్ వేసిన హైడ్రా
దీంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
బాధితుల పిటిషన్‌ను విచారిస్తూ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తి
దీంతో సాయంత్రం 6:30 గంటలకు కోర్టులో హాజరై, కోర్టు ధిక్కరణ నేరస్తులు నిలబడే ప్రదేశంలో ఒక మూలకు నిలబడ్డ రంగనాథ్
ఈ క్రమంలో "అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉందని హైడ్రా మర్చిపోతుందా? ఇష్టారీతిన వ్యవహరిస్తే ఎలా కుదురుతుంది?" అంటూ రంగనాథ్‌పై తీవ్రంగా మండిపడ్డ న్యాయమూర్తి
ప్రైవేట్ భూమిలోకి వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా మూడుసార్లు ఆ భూమిలోకి ఎలా ప్రవేశిస్తారు? బాధితులపై క్రిమినల్ కేసు ఎందుకు పెట్టారు? ఆ ఎఫ్ఐఆర్ను వారికి ఎందుకు ఇవ్వలేదు? అంటూ అసహనం
కోర్టు చెప్పిన తర్వాత కూడా హైడ్రా తనకు నచ్చినట్లు చేయడం అర్థరహితం
రంగనాథ్ అలవాటుపడిన నేరస్తుడిలా మారారు, వెంటనే అరెస్ట్ చేయండి అంటూ న్యాయమూర్తి ఆగ్రహం
హైడ్రా తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు అరెస్ట్ ఆదేశాలను ఉపసంహరించుకుని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈరోజుకు వాయిదా వేసిన హైకోర్టు
బిగ్ బ్రేకింగ్ న్యూస్
బహదూర్ గూడా 650 ఎకరాల కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కోర్టు ఆదేశాలున్నప్పటీకి హైడ్రా ఎంటర్ కావడాన్ని సీరియస్‌గా తప్పు పట్టిన హైకోర్టు
ఈరోజే హైకోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌కు ఆదేశాలు
కోర్టుకు హాజరు కాకుంటే చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని వాక్యానించిన హైకోర్టు
దీంతో వెంటనే హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరిన జగదీష్ రెడ్డి
గత 10-12 ఏళ్లలో అధికారుల సమీక్షల్లో తాను ఎప్పుడూ రాజకీయం మాట్లాడలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చర్చించే ధైర్యం ఉంటే ఎక్కడైనా సిద్ధం
హుజూర్నగర్, సూర్యాపేట, హైదరాబాద్ లేదా కన్నెపల్లి పంప్‌హౌస్.. ఎక్కడికి రమ్మన్నా వస్తా
ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతోనే కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని, నీళ్లు ఎలా ఇవ్వొచ్చో నిరూపిస్తా
మీ వద్ద నిజాయితీ ఉంటే చర్చకు రావాలి. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లోనైనా, విలేకరుల సమక్షంలోనైనా చర్చకు సిద్ధం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
కరెంట్ బిల్లుల భయంతోనే నీళ్లు ఇవ్వడం లేదు
తెలంగాణలో కరువు పరిస్థితులను తట్టుకోవడానికి కేసీఆర్ కాళేశ్వరం, కన్నెపల్లి, సుందిళ్ల వంటి ప్రాజెక్టులను నిర్మించారు. కేవలం వేల కోట్లు పవర్ బిల్లులు అవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా రైతాంగాన్ని వంచిస్తోంది
మొదటి రోజు నుంచే కన్నెపల్లి దగ్గర నీళ్లు ఎత్తిపోసి ఉంటే బసవాపూర్, గంధమల్ల, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణతో పాటు వరంగల్, ఉమ్మడి జిల్లాలలోని ప్రతి ఊరి చెరువు నిండేది
150 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవ్వడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
రైతులకు నీళ్లిచ్చే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
నీళ్ళు ఉన్నా ఎత్తిపోయరు
ఇది నేరపూరిత నిర్లక్ష్యం
గోదావరిలో సమృద్ధిగా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది
దేవాదుల ప్రాజెక్ట్ కింద 10 మోటార్లకు గానూ కేవలం 5 మోటార్లు మాత్రమే నడిపిస్తూ ఉద్దేశపూర్వకంగా నీటిని నిలిపివేశారు. వర్షాభావంతో ఉన్న వరంగల్, హన్మకొండ జిల్లాల రైతులకు దేవాదుల ద్వారా సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల పనులను పూర్తి చేసి 3.50 లక్షల ఎకరాలకు నీరు అందించాము
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Video Credits- Z Telugu News
రేవంత్ రెడ్డి పంతానికి పోయి రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నాడు
అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను చెక్ చేసుకోండని NDSA అడ్వైస్ ఇచ్చింది
ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో నీళ్ళు లిఫ్ట్ చేసి మినిమం లెవెల్ మెయింటెయిన్ చేసి ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు
చిన్న రబ్బర్ డ్యాం, కాఫర్ డ్యాం వేసి నీళ్ళు లిఫ్ట్ చేద్దామని ప్రస్తుత ఇరిగేషన్ శాఖ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది
వీళ్ళు చెప్పింది వినకుండా, శాస్త్రి లాంటి నిపుణులు చెప్పింది వినకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడు
- హరీష్ రావు
Video Credits - Zee Telugu News
జీహెచ్ఎంసీ ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేయండి
తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు
వార్డుల సరిహద్దులను తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరిన పిటిషనర్లు
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) చట్టవిరుద్ధంగా జరిగిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు
1996 జీవో నంబర్ 570లోని రూల్ నంబర్ 5 ప్రకారం డీలిమిటేషన్ జనాభా లెక్కల ఆధారంగా చేయాలని, ఆ నిబంధనను ఉల్లంఘించారని పిటిషన్
అదేవిధంగా 2019లో వచ్చిన తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్‌లోని సెక్షన్ 6ను కూడా ఉల్లంఘించారని కోర్టుకు తెలిపిన పిటిషనర్లు
ప్రభుత్వం, పిటిషనర్ల తరపు వాదనలు విని విచారణను వాయిదా వేసిన హైకోర్టు
కరెంట్ బిల్లుల భయంతోనే నీళ్లు ఇవ్వడం లేదు
తెలంగాణలో కరువు పరిస్థితులను తట్టుకోవడానికి కేసీఆర్ కాళేశ్వరం, కన్నెపల్లి, సుందిళ్ల వంటి ప్రాజెక్టులను నిర్మించారు. కేవలం వేల కోట్లు పవర్ బిల్లులు అవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా రైతాంగాన్ని వంచిస్తోంది
మొదటి రోజు నుంచే కన్నెపల్లి దగ్గర నీళ్లు ఎత్తిపోసి ఉంటే బసవాపూర్, గంధమల్ల, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణతో పాటు వరంగల్, ఉమ్మడి జిల్లాలలోని ప్రతి ఊరి చెరువు నిండేది
150 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవ్వడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
రైతులకు నీళ్లిచ్చే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
రేవంత్ రెడ్డి పంతానికి పోయి రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నాడు
అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను చెక్ చేసుకోండని NDSA అడ్వైస్ ఇచ్చింది
ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో నీళ్ళు లిఫ్ట్ చేసి మినిమం లెవెల్ మెయింటెయిన్ చేసి ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు
చిన్న రబ్బర్ డ్యాం, కాఫర్ డ్యాం వేసి నీళ్ళు లిఫ్ట్ చేద్దామని ప్రస్తుత ఇరిగేషన్ శాఖ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది
వీళ్ళు చెప్పింది వినకుండా, శాస్త్రి లాంటి నిపుణులు చెప్పింది వినకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడు
- హరీష్ రావు
Video Credits - Zee Telugu News
జూబ్లీహిల్స్ కార్పీడియం పబ్‌లో మహిళపై దాడి
వేడుకున్నా వదలకుండా దాడి చేసినట్లు బాధితురాలి ఆరోపణ
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఘటన దృశ్యాలు
జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. సీసీ ఫుటేజ్ స్వాధీనం
నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు
హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
బహదూర్‌గూడ 650 ఎకరాల భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడంపై తీవ్ర అభ్యంతరం
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ రంగనాథ్‌ను నిలదీసిన హైకోర్టు
ఈరోజే కోర్టుకు రావాలని రంగనాథ్‌కు ఆదేశాలు.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో వెంటనే కోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఇదే కేసులో రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు
బహదూర్‌గూడ సర్వే నంబర్లు 3, 4లో 28 ఎకరాల భూమి తమదేనని రైతులు పిటిషన్
గత 30 ఏళ్లుగా ఈ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని కోర్టుకు తెలిపిన రైతులు
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వినిపించిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
బహదూర్‌గూడలో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు
బిగ్ బ్రేకింగ్ న్యూస్
బహదూర్ గూడా 650 ఎకరాల కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కోర్టు ఆదేశాలున్నప్పటీకి హైడ్రా ఎంటర్ కావడాన్ని సీరియస్‌గా తప్పు పట్టిన హైకోర్టు
ఈరోజే హైకోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌కు ఆదేశాలు
కోర్టుకు హాజరు కాకుంటే చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని వాక్యానించిన హైకోర్టు
దీంతో వెంటనే హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీతో నేను రిలేషన్లో ఉన్నాను
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యకు యత్నించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో వెలుగులోకి కీలక అంశాలు
మహిళా ట్రైనీతో ఏడాదిగా రిలేషన్లో ఉన్నా
తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్లీ నా రూంకి వచ్చింది.. దీంతో మళ్లీ మా రిలేషన్ కొనసాగింది
ఇందుకు వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి
నా చావుకు నలుగురు కారణమని పేర్కొన్న లేఖలో పేర్కొన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో రూ.469 కోట్ల స్కాం
రూ.10,199.54 కోట్ల నుంచి రూ.10,693.55 కోట్లకు చేరిన 76 స్కూళ్ల నిర్మాణ వ్యయం
32 స్కూళ్లను 5% ఎక్సెస్‌కు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్, కేఎంవీ సంస్థలు
మంత్రుల నియోజకవర్గాల్లో స్కూళ్లకే ఎక్సెస్ టెండర్లు వేయడం వెనుక భారీ స్కాం
కమీషన్లు దండుకోవడానికే ఎక్సెస్ టెండర్ల దారి ఎంచుకున్న రేవంత్ రెడ్డి సర్కారు
టెండర్లకు డిమాండ్ లేదనే సాకుతో ఎక్సెస్ కొటేషన్లతో రూ.470 కోట్లు ధారాదత్తం
కుట్రపూరితంగానే హెచ్ -1, హెచ్ -2 కాంట్రాక్టర్ల మధ్య చాలా తక్కువ వ్యత్యాసం
చిన్న కంపెనీలను పోటీలో నుంచి తప్పించి, నచ్చిన సంస్థలకు ఎక్సెస్ టెండర్లు
ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.127 కోట్ల నుంచి రూ.146 కోట్ల వరకు పెరిగిన వ్యయం
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్
చేయడం సిగ్గుచేటు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీజేపీ పై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్
ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించింది
కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రశ్నించిన గొంతు నొక్కడాన్ని ఆపాలి