స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు,ఉద్యమకారులు,ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,ఆశ వర్కర్లతో కలిసి జాతీయ జెండాను సీతాఫల్మండి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎగరవేయడం జరిగింది.
స్వేచ్ఛ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని మనసారా స్మరించుకుంటూ…
మన దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం బాధ్యతతో ముందుకు సాగుదాం🇮🇳
జై హింద్!
వందే మాతరం! 🇮🇳
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆకస్మిక మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు,అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని, ఆగస్టు 2, 3న నిర్వహించే మహంకాళి బోనాల జాతరకు హాజరు కావాలంటూ ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు మరియు పండితులు ఆహ్వానించడం జరిగింది.
BRS పార్టీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ యువతను నయవంచన చేసిన కాంగ్రెస్ మోసాలను ఎండకట్టెందుకు సరూర్ నగర్ లో నిర్వహించిన యువ సంగ్రామ సభకు సీతాఫలమండీ నుంచి సరూర్ నగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
Visited the SIR Enumeration Centres in the view of inspecting the ongoing process and interacted with the teams working to facilitate voter verification across Mettuguda
and areas under Bouddhanagar division, within Secunderabad limits.
Inspected the SIR application centres across Seethaphalmandi, mahmood guda, Madhura Nagar, Boudha Nagar areas of Secunderabad constituency and suggested the BLOs and BLAs to coordinate smoothly with the voters within the Secunderabad constituency limits.
As a part of the SIR program,inspected the distribution of enumeration papers held at Joshi compound in chilakalguda and directed the officials to register the name of eligible voters,Ensuring that every eligible voter is on the electoral roll & exercises right to vote.
సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 49 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 22 లక్షల విలువైన చెక్కులను సీతాఫల్మండి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది.
యువనేత రామేశ్వర్ గౌడ్ గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,సికింద్రాబాద్ SIR ఇంచార్జ్ సలీం, కంటోన్మెంట్ ఇంచార్జి క్రిశాంక్,
ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
@BRSparty
సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన SIR & సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారి మార్గదర్శకత్వంలో పార్టీ శ్రేణులతో విస్తృత చర్చ జరిగింది.
SIR ప్రక్రియను సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని, బూత్ స్థాయి సమన్వయాన్ని బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని KTR సూచన చేశారు.
ప్రతి అర్హుడైన ఓటరుకు న్యాయం జరగాలి, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.