రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు.