మహిళా ప్రజాప్రతినిధులపై అటాక్.. గవర్నర్కు BRS ఫిర్యాదు
అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన ఉద్రిక్తత సమయంలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది. సీనియర్ మహిళా నేతలను జుట్టు పట్టుకుని, చీరలు లాగుతూ పోలీసులు దారుణంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ బలమైన నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిసి గౌరవ గవర్నర్ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న దమనకాండను గవర్నర్కు వివరించారు.
#BRSDelegation #GovernorMeeting #TelanganaPolitics #WomenMLAs #RevanthReddy #PoliceAtrocity #AssemblyIncidents #TeluguNews #TrendingReels #DeeptiInsights
పోలీస్ స్టేషన్ నుండే పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లిన దొంగ!
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పీఎస్లో పార్క్ చేసిన పెట్రోలింగ్ వాహనాన్ని ఓ వ్యక్తి అర్థరాత్రి ఎత్తుకెళ్లి, రాత్రంతా అందులోనే జిగేల్ మంటూ షికారు చేశాడు. ఇవాళ తెల్లవారుజామున వరంగల్ వైపు వెళ్తుండగా ఎల్కతుర్తి దగ్గర ఆ వాహనం ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
#Karimnagar #PoliceVehicleStolen #Elkathurthi #TelanganaNews #CrimeNews #ShockingNews #TeluguNews #TrendingReels #DeeptiInsights #LocalNews
అసెంబ్లీ ఎదుట అసలు ఏం జరిగింది?
మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఎదుట చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ప్రభుత్వం కొన్ని కీలక ఫోటోలను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది? ఈ ఫోటోలు ఇస్తున్న సంకేతాలు ఏంటి? వీటి ఆధారంగా విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
#AssemblyIncidents #TeluguNews #TelanganaPolitics #PoliticalNews #CurrentAffairs #TrendingReels #DeeptiInsights #NewsUpdates #PoliticalDrama