బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పునాది క్రమంగా దెబ్బతిన్న విధానం
(SOSF 2025 నివేదిక ఆధారంగా)
2014–23 మధ్య బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలహీనపడింది. నివేదిక ప్రకారం రాష్ట్రం ఆదాయ మిగులు స్థితి నుండి లోటు రాష్ట్రంగా మారింది.
•రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు GSDPలో 15.1% వరకు పెరిగాయి — ఇది దేశ సగటు (4.4%) కంటే మూడింతలు ఎక్కువ.
•37% గ్యారంటీలు నీటిపారుదల రంగానికే ఇవ్వబడ్డాయి.
•Off-Budget Borrowings ద్వారా శాసనసభ అనుమతి లేకుండా అప్పులు తీసుకోవడం పారదర్శకతను దెబ్బతీసింది.
•వడ్డీ చెల్లింపులు 14% వృద్ధి, ఆదాయం కేవలం 9% వృద్ధి చూపాయి.
•Outstanding Debt 26% of GSDP స్థాయికి చేరింది.
•రెవెన్యూ లోటు 21%, మూలధన వ్యయ తగ్గుదల 13% నమోదయ్యాయి.
ఈ సూచికలు చూపుతున్నాయి — బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక క్రమశ���క్షణ కోల్పోయి, రాష్ట్రం అప్పులు మరియు గ్యారంటీల భారంలో కూరుకుపోయింది.
@INCTelangana
@revanth_anumula
@Bhatti_Mallu
@TelanganaCMO@revanth_anumula హెలీకాప్టర్ సర్వే ద్వారా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు వేగవంతం కావడం రైతులకు ఆశాకిరణం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అభినందనలు! 🌾🚁
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (#SLBC) ప్రాజెక్టు టన్నెల్ ప���ులు కొనసాగించడానికి సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (#NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.
❇️మంత్రులు @UttamINC గారు, @KomatireddyKVR గారితో కలిసి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి గారు సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ -1 (ఔట్ లెట్ సీ- పాయింట్) వద్ద హెలి��ోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే కోసం హెలికాప్టర్లో ఏర్పాటు చేసిన అత్యంత అధునాతన ట్రాన్స్మిటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
❇️అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భుగర్భ స్థితిగతులను తెలుసుకునే అంశాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు. ఎస్ఎల్బీసీ పనులను కొనసాగించడానికి టన్నెల్ ప్రాంతంలో 800-1000 మీటర్ల లోతులో షియర్ జోన్ (రాతి) అలాగే నీటి ప్రవాహాలు, వాటి తీవ్రతను గుర్తించడానికి ఈ సర్వేను ఉపయోగపడుతుంది.
❇️సర్వే చేపట్టే విధానంపై శాస్త్రవేత్తలు వివరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు సర్వే నిర్వహణకు హెలికాప్టర్ టేక్ఆఫ్ కోసం అనుమతించారు. ఆ హెలికాప్టర్ వెంట ముఖ్యమంత్రి గారు, మంత్రులతో కలిసి మరో హెలికాప్టర్లో కొంత దూరం ప్రయాణించి లోలెవల్‌లో జరిగే ఎక్సర్సైజ్ను పరిశీలించారు.
❇️సర్వే చేసే ప్రాంతం, సర్వే కోసం ఉపయోగిస్తున్న సా��కేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలపై @csirngri డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్ గారు, శాస్త్రవేత్త డాక్టర్ హెచ్‌వీఎస్ సత్యనారాయణ గారు, భారత సైనిక అధికారి పరీక్షిత్ గారు వివరించారు.
❇️ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు @Dr_VamshiINC గారు, @balunaiknenavat గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. #AerialGeophysicalSurvey #SLBCTunnelWork
@TelanganaCMO@revanth_anumula అక్షయపాత్ర ఫౌండేషన్‌తో కలిసి మధ్యాహ్న భోజన పథకంలో ఈ అద్భుతమైన ప్రయత్నం తెలంగాణ పిల్లల భవిష్యత్తును ప్రకాశింపజేస్తుంది, శుభం ఆశీస్సులు! 🌱📚
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. అక్షయపాత్ర పౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని కలిసి, నవంబర్ 14వ తేదీన కొడంగల్ లో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
❇️ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో #AkshayaPatraFoundation గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది.
❇️ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్ర��ుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. నాణ్యమైన భోజనం తయారు చేసి అందించేందుకు అక్షయ ఫౌండేషన్ దాదాపు రూ.25 వరకు ఖర్చు పెడుతుంది.
❇️ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్ భరిస్తుంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల సాయంతో ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
❇️గ�� ఏడాది డిసెంబర్ నుంచి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతుంది. 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నారు.
❇️అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన వచ్చింది. ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. @AkshayaPatra #Kodangal #MiddayMeal #Telangana
@TelanganaCMO@revanth_anumula ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల కోసం హెలీకాప్టర్ సర్వే ప్రారంభం రైతుల ఆశలకు కొత్త ఆశాకిరణం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అభినందనలు! 🌾🚁
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (#SLBC) టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
❇️ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (#NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ముఖ్యమంత్రి గారి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది.
❇️ఈ సందర్భంగా మంత్రులు @UttamINC గారు, @KomatireddyKVR గారు, స్థానిక శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడారు.
❇️“రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేపట్టాం. ఆ క్రమంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిపోయిన 9.8 కిలోమీటర్ల పనుల కోసం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధ��కారుల సేవలను వినియోగించి ముందుకు వెళుతున్నాం.
❇️ఎన్జీఆర్ఐ నేతృత్వంలో నిర్వహిస్తున్న సర్వే వల్ల భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్లలోపు ప్రతి 2.5 మీటర్లలో రాయి, నీటి ప్రవాహాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతమంతా టైగర్ రిజర్వ్ ఉంది. పర్యావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
❇️గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలను 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు సరఫరాకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 1983 లో పునాది పడినప్పటికీ ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పనులు జరగలేదు. తిరిగి 2004 లో నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రాజెక్టు టన్నెల్-1, టన్నెల్ 2 పనులు ప్రారంభమయ్యాయి.
❇️గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు 44 కి.మీ టన్నెల్ కోసం ఆనాడు దాదాపు 33 కి.మీ పూర్తి చేయగా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దకాలం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాజెక్టును ప్రారంభించిన నాడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించి ప్రయోగాత్మకంగా పనులు చేపట్టారు.
❇️దేశంలోనే ఇదొక అత్యుత్తమ ప్రాజెక్టు. 44 కి.మీ టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీ���ో నీటిని సరఫరా చేయొచ్చు. ప్రస్తుతం ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీటికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గడిచిన పదేండ్లలో కేవలం విద్యుత్ చార్జీలే 5 వేల కోట్లు చెల్లించాం.
❇️ఎస్ఎల్బీసీతో పాటు కృష్ణా నదిపై బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల సాధించుకున్న తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని కారణంగా మన వాటా మనం వాడుకోలేకపోయాం. నికర జలాల హక్కులు కలిగినప్పటికీ పదేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో తెలంగాణలోని ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభ్యంతరం చెబుతోంది.
❇️మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్లినప్పుడు ఊహించని ప్రమాదం సంభవించింది. మాకెంతో బాధ కలిగి��చింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకున్నాం. అందుకే అనుభవం, అత్యంత నైపుణ్యం ఉన్న వారిని ఇక్కడికి రప్పించాం. ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత సైన్యం నుంచి కూడా అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నాం.
❇️ఈ క్రమంలో టన్నెల్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి భూగర్భంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టాం. పైగా అదనంగా పైగా ఖర్చు లేకుండా ఆనాడు వేసిన అంచనాలతోనే ఈనాడు పనులు పూర్తి చేయనున్నాం.
❇️నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరు. ఇప్పుడు పూర్తి చేసుకోలేకపోతే మరెప్పుడూ పూర్తి చేసుకోలేం. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. నిధులకు ఎలాంటి ఆటంకం లేదు. గ్రీన్ చానెల్ ద్���ారా మంజూరు చేస్తాం.
❇️ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి మర్లపాడు తండా, కేశీ తాండా, నక్కలగండి తాండా వాసులకు డిసెంబర్ 31 నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టం లేకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది..” అని స్పష్టం చేశారు. @csirngri #SLBC #AerialGeophysicalSurvey #SLBCTunnelWork
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేశాయి.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, అండగా ఉంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీతో మాట్లాడాను. ��ెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలించాల్సిందిగా ఆదేశించాను.
కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ లను ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించాను.
సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబం���ించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.
మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌ల��� విశ్వ విజేతగా నిలిచిన మన టీమ్ ఇండియాకు అభినందనలు.
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి విజయం సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది.
ఈ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత మహిళా జట్టు కొత్త అధ్యాయం నమోదు చేసింది.
#TeamIndia #WomensWorldCup2025
నాగర్‌కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకానికి సంబంధించి హెలీకాప్టర్ సర్వేను భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి ��ెంకట్ రెడ్డితో కలిసి పర్యవేక్షించాను.
నల్గొండ జిల్లా వరప్రదాయని ఐన SLBC టన్నెల్ ను పూర్తి చేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది గొంతులకు తాగునీరు ఇవ్వాలన్న పట్టుదలతో ఈ పథకాన్ని పూర్తి చేసే సంకల్పం తీసుకున్నాం.
ఈ రోజు… మాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే నిర్వహించి పెండింగ్ లో ఉన్న 9.8 కిలో మీటర్ల సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయడానికి కార్యచరణ తీసుకుంటున్నాం.
ఈ సర్వే ద్వారా భూ అంతర్భాగంలో 800 నుంచి 1000 మీటర్ల లోతులో భూ పొరల స్వభావం, నీటి జాడలు, సొరంగం తవ్వే సమయంలో ఇతర ప్రమాదాలు ఏవైనా సంభవించే అవకాశాలను అంచనా వేస్తాం. 24 మీటర్ల వ్యాసం కల ట్రాన్స్ మిటర్ లూప్ ద్వారా ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఇచ్చే సమాచారాన్ని విశ్లేషణ చేసుకుని మిగిలిన 9.8 కిలో మీటర్ల టన్నెల్ తవ్వకానికి అనుసరించాల్సిన వ్యూహం, ఉపయోగించాల్సిన టెక్నాలజీ పై నిర్ణయం తీసుకోబోతున్నాం.
#SLBCTunnel
అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ నెల 14 న కొడంగల్ నియోజకవర్గంలోని ఎన్కేపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్��ారంభోత్సవానికి ఆహ్వానించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఈ కిచెన్ ను నిర్మిస్తోంది. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ లో వండిన భోజనాన్ని నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తారు.