బేతంచెర్ల మండలం గుట్టుపల్లెలో గత పాలకులు 22ఏ జాబితాలో పెట్టిన భూములకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విముక్తి కలిగించారు. భూముల వివాదం పరిష్కరించేందుకు స్వయంగా బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం అక్కడి రైతులకు 22ఏ జాబితా తొలగింపు ఉత్తర్వులను అందించారు.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
బనగానపల్లెలో నేడు జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. మంత్రులు శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సచివాలయంలో నేడు పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు, ట్రేడర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీ కే అచ్చెన్నాయుడు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ గొట్టిపాటి రవికుమార్, శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10 శాతం పెంచి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. నేడు రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై సమీక్ష సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని,. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ నిమిత్తం రూ.100 కోట్లు కేటాయిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. పేదలకు సంక్షేమం అందించడమే కాకుండా జీవనోపాధిని మెరుగు పరిచి మరింత ఆదాయం సమకూర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతోపాటు, పీ4 ద్వారా సాయం అందించాలని, వ్యవసాయం, ఉద్యాన రంగం, పాడి పరిశ్రమ, జీ రామ్ జీ లాంటి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చాలని తెలిపారు. ఉద్యాన, రబ్బర్, కాఫీ, పసుపు వంటి పంటల సాగును ప్రోత్సహించి ఆ వర్గాల రైతులకు లబ్ధి కలిగేలా చూడాలని కోరారు. లిక్కర్ షాపుల్లో కల్లుగీత వృత్తిదారులకు, క్వారీల్లో వడ్డెర్లకు కోటా, నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఇలా వివిధ వర్గాలకు చేస్తున్న ఆర్థికంగా సాయం మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ విధానాలను మిగిలిన కార్పొరేషన్లు కూడా అవలంబించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీ డోలాబాల వీరాంజనేయ స్వామి, శ్రీమతి ఎస్ సవిత, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, శ్రీ ఎన్ఎండీ ఫరూక్, మైనార్టీ సంక్షేమ సలహాదారు శ్రీ మహ్మద్ షరీఫ్ సహా వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్, ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. సచివాలయంలో నేడు ఆయన సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ గోపాలకృష్ణ వేసే నాటకాలన్నీ బాగుంటాయని, తన ప్రదర్శనలతో తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని సీఎం కొనియాడారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో 63వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రెండో దశ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చ జరిపారు. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
#AndhraPradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నేడు 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీ కే.అచ్చెన్నాయుడు, శ్రీ అనగాని సత్యప్రసాద్, శ్రీ పి.నారాయణ, శ్రీ గొట్టిపాటి రవికుమార్, శ్రీ కందుల దుర్గేష్, శ్రీ పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
#AndhraPradesh
సముద్రంలో బోటు తిరగబడిన ఘటన పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వాణిజ్య నౌకకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా మిగిలిన 6 గురు మత్స్యకారుల గాలింపు చర్యల్ని ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. బోటు బోల్తా పడిన గంగవరం పరిసర ప్రాంతాలతో పాటు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో నౌకాదళ హెలికాప్టర్లతో గాలింపు విస్తృతం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి రెండు యుద్ధ నౌకలతో పాటు రెండు హెలికాప్టర్లు కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టాయని తీరప్రాంత భద్రత విభాగం ఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి సీఎంకు వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి కారణంగా సముద్రంలో అలల తీవ్రత, బలమైన గాలులతో గాలింపు చర్యలకు విఘాతం కలుగుతోంది. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు బాసటగా నిలబడాలని సీఎం అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు తనకు తెలియచేయాలని కోరారు.
రాష్ట్రంలోని మూడు ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాల మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని, 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో వచ్చే మరో రూ.60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని అధికారులకు సీఎం చెప్పారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయిప్రసాద్, ఈ మూడు రీజియన్ల ప్రత్యేక అధికారులు శ్రీ ముఖేష్ కుమార్ మీనా, శ్రీ సురేశ్ కుమార్, శ్రీ యువరాజ్ లు పాల్గొన్నారు.
#AndhraPradesh
5 రోజుల జిల్లాల పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక, పంచాయితీరాజ్, హోం తదితర శాఖలు అందిస్తున్న సేవలపై సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జీ సాయిప్రసాద్, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
#AndhraPradesh
మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్వహించారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గానికి చెందిన అధికారులు పోలీసు ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కుప్పం నియోజక వర్గ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సీఎం సమీక్ష లో ప్రస్తావించారు.
కుప్పం పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫారంను నేడు ప్రారంభించారు. ఆధునిక కోళ్ల పెంపకానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు అన్నింటినీ సాంకేతికత ద్వారా నియంత్రించి, కోళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చని రైతులు వివరించారు. దీనివల్ల గుడ్లు, మాంసం ఉత్పత్తి పెరగడంతో పాటు, కోళ్లు చనిపోవడం తగ్గుతుందని తెలిపారు.
#AndhraPradesh
కుప్పం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చెంగాచారి ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు వెళ్లారు. కడపల్లిలోని తన నివాసం నుంచి కుప్పం వెళ్తున్న సమయంలో శ్రీ చెంగాచారి కోరిక మేరకు శాంతిపురంలోని ఆయన ఇంటికి వెళ్లారు. చెంగాచారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అంతకముందు తన నివాసం వద్దకు వచ్చిన కుప్పం వాసుల నుంచి వినతులు అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. చిన్నారులను ఎత్తుకుని ఆడించారు.
#AndhraPradesh
సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు విశాఖ మత్స్యకారుల ఆచూకీ పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నతాధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతంగా జరుగుతోంది. కోస్టుగార్డు నౌకలతో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.
#AndhraPradesh