భయం, బాధ, ఆందోళన.. గుండెలను పిండేసే వీడియో
పహల్గామ్లోని బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న పలువురు భయంతో వణికిపోయారు. కొండలు, గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఓ చోట కుప్పకూలిపోయారు. కళ్ల ముందే బిడ్డలను, భర్తలను, బంధువులు, స్నేహితులను, పేరెంట్స్‌ని కోల్పోయిన బాధతో గుక్కపట్టి ఏడ్చారు. కాపాడటానికి వచ్చిన జవాన్లను చూసి కూడా భయపడ్డారు... చంపొద్దని వేడుకున్నారు. గుండెలను పిండేసే వీడియో 🙏🥺
#PahalgamTerroristAttack