I express my sincere gratitude for your unwavering support and guidance, which have been invaluable in securing the Deputy Chief Minister post. Special thanks to smt #Soniamma AICC President Sri @kharge ji, Sri @RahulGandhi ji, Smt @priyankagandhi ji, @kcvenugopalmp ji, @DKShivakumar ji, @Manikrao_INC ji and our dedicated Congress soldiers. I am committed to working diligently to fulfill the aspirations of the people of Telangana.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో సీఎం శ్రీ @revanth_anumula గారితో కలిసి పాల్గొన్నాను. ఈ యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడం ప్రజా ప్రభుత్వ సంకల్పం.
దేశంలో తొలి పూర్తిస్థాయి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా ఇది భూగర్భ పొరలు, ఖనిజ సంపద, భూవిజ్ఞాన పరిశోధనలకు కొ���్త దిశ చూపనుంది. అత్యున్నత ప్రమాణాలతో భవనాలు, ఆధునిక ల్యాబ్స్, పరిశోధనా వసతులు త్వరితగతిన పూర్తి చేసి యూనివర్సిటీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
తెలంగాణ విజ్ఞాన సామర్ధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే కేంద్రంగా ఈ సంస్థ నిలుస్తుంది.
ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల బృందంతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ @kharge గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025”కు విచ్చేయాల్సిందిగా ఆహ్వానం అందించాము.
#TelanganaRising2047
#GlobalSummit2025
ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నూతి సత్యనారాయణ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
డీసీసీగా విశేష సేవలందించిన పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారి కృషికి హృదయపూర్వక అభినందనలు.
ఈ కార్యక్రమంలో మ��త్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోజు ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై రాష్ట్ర ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్ని పార్టీల ఎంపీలతో ఈ సమావేశాన్ని నిర్వహించాం.
బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో సవరణ అత్యవసరం. ఈ అంశాన్ని పార్లమెంటులో అడ్జర్న్‌మెంట్ మోషన్ లేదా ప్రశ్నోత్తరాల ద్వారా బలంగా ముందుకు తీసుకెళ్లాలని సూచన.
అన్ని పార్టీల ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి ��ేవంత్ రెడ్డి గారు, యావత్తు రాష్ట్ర కేబినెట్‌తో కలిసి, ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని తక్షణం అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాము.
విద్యుత్, నీటిపారుదల, GST తదితర శాఖలకు సంబంధించిన పెండింగ్ నిధుల వివరాలు అక్కడ సిద్ధంగా ఉంటాయి.
డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేయనున్న సం���ర్భంగా ప్రభుత్వ విజయాలు మరియు Vision 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తున్నాం.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే ప్రణాళికను కూడా సమగ్రంగా సిద్ధం చేశాము. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన కమిటీలలో ఆసక్తి ఉన్న ఎంపీలు చేరాలని సూచన.
కేంద్రానికి సంబంధించిన 12 శాఖలపై 47 పెండింగ్ అంశాలను గుర్తించి, సెమికండక్టర్ రంగంపై కూడా చర్చించాము.
దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్లు పాలసీ లేకుండా, క్యాబినెట్ అన��మతి లేకుండా, కొద్దిమంది వ్యక్తుల కోసం చేసింది. ఎవరికెన్ని కన్వర్షన్లు ఇచ్చారో త్వరలోనే పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తాం.
ప్రజా ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోదు.
హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పారదర్శకమైన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీని తీసుకువచ్చాం.
ఉన్నతాధికారులు, భాగస్వాములతో చర్చించి, క్యాబినెట్లో విస్తృతమైన పరిశీలన తరువాతనే ఈ పాలసీ అమల్లోకి వచ్చింది.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ప్రజలపై పన్నులు వేయాలనే ఆలోచన లేదు
ఆదాయం సమకూర్చుకోవడం ప్రభుత్వ బాధ్యతే.
80 ఫీట్ల రోడ��లకు అనుసంధానం ఉన్న పారిశ్రామిక భూములను 50% SOR ఆధారంగా పారదర్శకంగా కన్వర్ట్ చేసుకునే అవకాశం కల్పించాం. కన్వర్షన్లు పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది.
నాచారం, మౌలాలి, ఉప్పల్, జీడిమెట్ల, బాలనగర్, కూకట్ పల్లి వంటి ప్రాంతాలు గతంలో నగరానికి వెలుపల పరిశ్రమల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కానీ హైదరాబాద్ విస్తరణతో ఇవి ఇప్పుడు నివాస ప్రాంతాల మధ్యకు వచ్చాయి. కాలుష్య సమస్యను నివారించేందుకు పరిశ్రమలను ORR వెలుపలికి తరలించే అవసరం ఏర్పడింది.
ఢిల్లీలోలాగా కాలుష్య పరిస్థితి హైదరాబాద్‌లో రాకుండా ముందస్తు చర్యలతో సమగ్ర, పారదర్శకమైన ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని తీసుకువచ్చాం.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది
ప్రజా ప్రభుత్వ సంకల్పం.
రాష్ట్రవ్యాప్తంగా
3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల అక్కాచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 304 కోట్లు
వడ్డీ లేని రుణాలు.
ప్రజా ప్రభుత్వం ప్రతి అక్కచెల్లెలు
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు,
తమ స్వంత ��దాయ మార్గాలు నిర్మించుకునేందుకు
అండగా నిలుస్తోంది.
మహిళల అభివృద్ధే
రాష్ట్ర అభివృద్ధి.
ఈ నెల 26న జరుగనున్న మా కుమారుడు సూర్య విక్రమాదిత్య ని��్చితార్థానికి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి దంపతులను కలిసి ఆహ్వానించడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25న 3.50 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీను ఒకేసారి నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా, శ్రద్ధగా నిర్వహించ��లని, మండల సమాఖ్య–గ్రామ సమాఖ్యల ముఖ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించాను.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాల పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నాయకత్వంలో మా ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడంతో రాష్ట్ర మహిళల్లో న��్మకం, ధైర్యం మరింత పెరిగాయి. ఇప్పటికే పలుమార్లు రుణాలు పంపిణీ చేసిన మేము, ఈ 25న మరలా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
ఈ సమావేశంలో మంత్రి @seethakkaMLA , చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గార్లు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.