ఆలేరు నియోజకవర్గం, బొమ్మలరామారం మండలంలోని సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత గారితో కలిసి సబ్ స్టేషన్ ని సందర్శించారు. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్ లాగ్ బుక్ ను చెక్ చేసి, రైతులకు రోజుకు ఎన్ని గంటల కరెంట్ సప్లై చేస్తున్నారనే వివరాలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది.
కేసీఆర్ గారి ప్రభుత���వం ప్రతిరోజూ రైతులకు అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు అందించింది.
బొమ్మలరామారంలో చనిపోయిన మా పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వస్తే.. ఇక్కడి మహిళలు రెండు రోజులకు ఒకసారే నల్లా నీళ్లు వస్తున్నాయని తమ బాధలు చెప్పుకుంటున్నారు.
కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా ��ేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ఐదేళ్ల పాటు రాష్ట్రమంతా నీళ్లు ఇస్తే.. ఉన్న వ్యవస్థను నడపడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు.
మిషన్ భగీరథను సరిగ్గా నడిపితే ఆ పేరు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి వస్తుందనే అక్కసుతోనే కావాలని నీళ్లు ఇవ్వడం లేదా..
సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్��ో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మళ్ళీ బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి కనబడుతోంది. మీరు తెస్తామన్న ఆనాటి రోజులు అంటే ఇవేనా?
కరెంటు కోసం, ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేయడం, తరుగు తీయడమేనా మీ మార్పు.
రైతులు కరెంటు కోసం ఇబ్బంది పడుతున్నారని సోదరి సునీత గారు చెబితే ఈరోజు సోలేపేట సబ్‌స్టేషన్‌కు సర్ప్రైజ్ విజిట్ ��ి వచ్చాం.
సబ్‌స్టేషన్ ఆపరేటర్ని అడిగితే.. మొన్నటి దాకా 14-15 గంటలు ఇచ్చాం సార్, ఈ వారం నుంచి కేవలం 12 గంటలే ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెబుతున్నాడు.
ప్రభుత్వం ఇస్తున్న ఆ 12 గంటల కరెంటులో కూడా రెండు మూడు సార్లు ట్రిప్ అవుతోంది. 24 గంటల కరెంటుకు రైతాంగాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు?
కరెంటుకు మేమే పేటెంట్ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.. మీ పేటెంట్ అంటే ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేయడమేనా.
నారుమళ్లు పోసుకునే, నాట్లు వేసుకునే ఈ కీలక సమయంలో నీళ్లు చాలా అవసరం. కరెంటు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా సబ్స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో, జగిత్యాల జిల్లా ఐలాపూర్, బాల్కొండ, కోహీర్ మండలం దిగ్వాల్, సిద్దిపేట జిల్లా కాజీపూర్, సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్‌స్టే���న్ల ముందు కేసీఆర్ గారు 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో 15,000 మెగావాట్ల లోడు కూడా లేదు, ఎండాకాలం కూడా కాదు.. అయినా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు..
కోతలు పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమా. ఎన్నికల ముందు 4000 పెన్షన్, 15000 రైతుబంధు, మహిళలకు 2500, విద్యార్థి భరోసా అంటూ మాటల కోతలు కోశారు. ఇప్పుడేమో కరెంటు, బోనస్, కేసీఆర్ కిట్, గొర్రెలు,చేపల పంపిణీ, రైతు బీమాలలో కోతలు పెడుతున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మొన్న వరంగల్‌లో మాట్లాడుతూ రాష్ట్రంల��� కరెంట్ కోతలే లేవని చెప్పారు. మరి ఈరోజు నేను సోలేపేట సబ్‌స్టేషన్ రికార్డులు చూస్తే 12 గంటల కరెంటే ఇస్తున్నారు.. భట్టి గారు దీనికి ఏం సమాధానం చెబుతారు..
రాష్ట్రంలో 10-11 గంటల కరెంటే వస్తోంది. మీ మాటలు గడప దాటుతున్నాయి కానీ మీ పనులు గడప దాటడం లేదు. మీరు నిజంగా కడుపు నిండా 24 గంటల కరెంటు ఇస్తే రైతులు ఎందుకు సబ్స్టేషన్ల ముందు ధర్ణాలు చేస్తారు..
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు ల��కపోవడం వల్ల కేసీఆర్ గారు నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు మూతపడి నెలలు గడుస్తోంది.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కూడా 270 మెగావాట్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సింగరేణి మన చేతిలోనే ఉన్నప్పటికీ 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలి.
రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తే పైసలు రావని, కరెంటు ఉత్పత్తి ఆపేసి రైతులకు కోతలు పెడుతున్నారా? కరెంటు లేక కాదు.. రేవంత్ రెడ్డికి మనసు లేక కరెంటు రావడం లేదు.
రైతులకు మూడు గంటల కరెంటు చాలని గత��లో రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పుడు ఆ మాటనే నిజం చేయదలుచుకున్నారా..
హైదరాబాద్ ప్రజలకు ఎలాగైతే 24 గంటల కరెంటు వస్తుందో, బాయికాడ రైతుకు కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ పాలసీ.
బీఆర్ఎస్ ముల్లు గర్రతో పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం కదలడం లేదు. దేవాదుల మోటార్లు ఆన్ చేయాలని మేము ప్రశ్నిస్తే తప్ప, నిద్రలేచి 5 నుంచి 9 మోటార్లు ఆన్ చేయలేదు.
ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాం.. యాదాద్రి, భద��రాద్రిలో ఆగిపోయిన 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించి, రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. కరువు పరిస్థితుల్లో బోర్లు అడుగంటిపోయినప్పుడు రైతులకు కరెంటు అవసరం చాలా ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథపై వెంటనే రివ్యూ చేసి, ప్రతిరోజూ ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మం��లంలో వ్యవసాయ అధికారిని అడిగితే ఒక్క బొమ్మలరామారం మండలంలోనే 10 రైతు బీమాలు పెండింగ్ ఉన్నాయని చెప్పారు.
దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షలు ఇచ్చేలా కేసీఆర్ గారు రైతు బీమా తెస్తే.. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 4000 మంది రైతులకు బీమా డబ్బులు ఐదు నెలలుగా రావడం లేదు.
రైతుబంధు ఎగ్గొట్టారు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ సగం ఎగ్గొట్టారు.. ఇప్పుడు రైతు బీమా కూడా ఎగ్గొట్టదలుచుకున్నారా..
ఎల్ఐసీకి ప్రభుత్వం ప్రీమియం కట్టలేదా? వెంటనే రైతు బీమాపై రివ్యూ చేసి చనిపోయిన 4000 మంది రైతుల కుటుంబాలకు తక్షణమే 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవ���్గంలోని 367 మందికి 78 లక్షల 40 వేలు రూపాయల విలువ గల CMRF చెక్కులను పంపిణి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు..
సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి నవగ్రహ దేవాలయ పునః ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని, పూజలు నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు.
మరోసారి తన మంచి మనసు చాటుకున్న మాజీ మంత్రి @BRSHarish గారు. 🙏
సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు గ్రామానికి చెందిన రంజిత్ ప్రమాద��లో కాలు కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉండగా, రూ.5 లక్షల వ్యయంతో కృత్రిమ కాలు అందించి అండగా నిలిచారు.
కేసీఆర్ గారి ఆశయాల సాధనలో ముందుండే యోధుడు...
కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుండే నాయకుడు...
ప్రజల కోసం నిరంతరం పరితపించే జన సేవకుడు..
తెలంగాణ ట్రబుల్ షూటర్ @BRSHarish గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉
#HappyBirthdayHarishAnna
ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకుడు, ప్రజల విజయాన్ని తన విజయంగా భావించే జన సేవకుడు, మాజీ మంత్రి @BRSHarish గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐🎉
#HappyBirthdayHarishAnna
సిద్దిపేట పట్టణం లో జరిగిన రిజనల్ ఎడ్యూకేషన్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే @BRSHarish గారు.
ఈ సందర్భంగా మాట్లాడు��ూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. జిల్లా యువత, విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు సందర్శించారు. 50 రోజులుగా వడ్లు పోసుకుని, గత 12 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను కలిసి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు.
కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్న రైతులకు భరోసానిచ్చారు. అక్కడి నుంచే ఆర్డీఓ, ఇతర అధికారులకు ఫోన్ చేసి కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..
కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా కేసీఆర్ గారు వడ్లు కొన్నారు.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మాలంటే రైతుల కళ్లలో రక్తం వస్తోంది.
క్వింటాల్ కు ఐదారు కిలోల తరుగు, మళ్లీ బీ-గ్రేడ్ అని చెప్పి ఎకరాకు దాదాపు రెండు మూడు వేల రూపాయలు నష్టపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ ధరలు పెంచింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్లు సరిగ్గా చేయక మిల్లర్ల దోపిడీకి వదిలేసింది. వడ్లకు తరుగు లేదన్న రేవంత్ రెడ్డి మాటలన్నీ గాలి మాటలే అయ్యాయి.
కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా బంద్ పెట్టింది. నాటి కేసీఆర్ పాలనలో రైతు చనిప���తే వారం రోజుల్లో 5 లక్షలు వచ్చేవి, ఇప్పుడు ఆ పరిస్థిత��� లేదు.
ఇప్పుడు కరెంటును కూడా ఆగం చేస్తున్నారు. కొత్తగా 'రైతు డిస్కం' పేరుతో మీ మెడలకు ఉరితాడు వేస్తున్నారు.
రైతు డిస్కం అమల్లోకి వస్తే ఉదయం ఏడింటికి ఇచ్చి సాయంత్రం ఐదింటికి కరెంటు తీసేస్తారు. ఇక రాత్రి కరెంటు ఉండనే ఉండదు. 24 గంటల కరెంటుకు ఎసరుపెట్టే ఈ కుట్రను మనం అడ్డుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు అధైర్యపడొద్దు. కటింగ్ లేకుండా ప్రతి గింజనూ కొనిపించేలా అధికారులపై ఒత్తి���ి తెస్తాం. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
4 Days to go ⏳
ప్రజల కోసం పుట్టిన నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచిన సేవకుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు 💐
#HappyBirthdayHarishAnna
"రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు… 3 గంటల కరెంట్ చాలు" అని ERC ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయి.
ఇది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు… ఇది రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన.
అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయి.
పొలం అంటే ఏమిటో… బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో… రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది.
కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోం��ి.
రుణమాఫీ అటకెక్కించారు.
రైతు బంధు బంద్ చేశారు.
పంట బోనస్ బోగస్ చేశారు.
ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు, పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు.
ఇవి చాలదన్నట్లు కేసీఆర్ గారు ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్ ను ఖతం పట్టిస్తున్నారు.
రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా?
కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి పంచమ వార్షికోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్��ారు.
సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి విగ్రహ పునర్ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే @BRSHarish గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Incredible achievement!
9-year-old Vihaan Ram from Siddipet scaling Australia’s highest peak, Mt. Kosciuszko, is truly inspiring.
His achievement, along with a strong message against drugs #SayNoToDrugs reflects the determination of our young generation.
Congratulations to this young achiever and his family.