కాంగ్రెస్ వెయ్యి రోజుల విధ్వంస పాలనపై బీఆర్ఎస్ పోరుబాట
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ‘కాంగ్రెస్ 1000 రోజుల పాలన – 420 మోసాలు’ పేరుతో సెప్టెంబర్ 2 నుంచి 8వ తేద�� వరకు చేపట్టనున్న ఏడు రోజుల నిరసన కార్యక్రమాలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు దిశానిర్దేశం చేశారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి అధ్యక్షతన నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏడు రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల నిర్వహణపై నాయకుల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను ఎమ్మెల్యే గారు తెలుసుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి చంద్ర గౌడ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఏడు రోజుల కార్యక్రమాల కార్యాచరణను నాయకులకు వివరించారు.
ప్రజల తరఫున పోరాడే సమయం ఆసన్నమైంది: చింతా ప్రభాకర్ గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విధ్వంసక పాలనపై ప్రజల తరఫున పోరాడే సమయం ఆసన్నమైంది. అరచేతిలో వైకుంఠం చూపించినట్లు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది” అని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్ర�� కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించడంతో పాటు అదనంగా మరిన్ని ప్రయోజనాలు అందిస్తామని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఏడు రోజుల కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాల���ి పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ‘ బాకీ కార్డులు ’ రూపంలో కాంగ్రెస్ హామీలను ప్రతి గడపగడపకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
“ రానున్నది మన ప్రభుత్వమే. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ పాలన రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో ఉన్న లోటుపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలి” అని చింతా ��్రభాకర్ గారు అన్నారు.
ఆరోగ్యం సహకరించకపోయినా తన గెలుపు కోసం పార్టీ అభ్యర్థులను గెలిపించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు అన్నారు.
“ నేన��� ఉద్దేశపూర్వకంగా ఎవరికీ పొరపాటు చేయాలని, ఎవరికైనా నష్టం లేదా కష్టం కలిగించాలని భావించే వ్యక్తిని కాదు. క్షేత్రస్థాయి నుంచి రాజకీయాల్లో, జీవితంలో పైకి వచ్చిన వ్యక్తిని. జీవితంలో నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో నాకు తెలుసు. అలాంటి అవమానాలు ఎవరికీ జరగకూడదని నేను భావిస్తాను” అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పేర్కొన్నారు.
ఎంపీపీఎస్ మునిపల్లి అశోక్ సార్ రిటైర్మెంట్ వేడుకల్లో చింత సాయినాథ్ గారు...
ఎంపీపీఎస్ మునిపల్లి పాఠశాలలో సేవలందించిన ఉపాధ్యాయులు అశోక్ సార్ రిటైర్మెంట్ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మ���ల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ సార్ అందించిన విద్యా సేవలను కొనియాడుతూ, ఆయనకు శాలువాతో సత్కరించి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని చింత సాయినాథ్ పేర్కొన్నారు.
అశోక్ సార్ రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించా��ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
చింత సాయినాథ్ గారికి సోదరి రాఖీ...
రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ గారికి ఆయన సోదరి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాయినాథ్ గారు తన సోదరికి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రేమాభిమానాలతో రాఖీ పండుగను జరుపుకున్నారు.
సీఎం పర్యటనలో బీఆర్ఎస్ యువ నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్కు వెళ్లి విడిపించిన చింత సాయినాథ్
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి పర్యటన సందర్భం��ా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ వెంటనే ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులతో మాట్లాడి, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ యువ నాయకులను విడుదల చేయించి తన వెంట తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా చింత సాయినాథ్ మాట్లాడుతూ.. ప్రజాస్వా��్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, యువ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ యువతకు అండగా ఉంటామని తెలిపారు.
సంగారెడ్డిలో ఘనంగా మాదిగ సంఘం బోనాల ఊరేగింపు పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాదిగ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐబీ నుంచి ప్రారంభమైన ఊరేగింపులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. �� సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాదిగ సంఘం నాయకులను ఆప్యాయంగా పలకరించి, వారితో కలిసి ఉత్సాహంగా గడిపారు. బోనాల ఊరేగింపులో దేవతామూర్తుల వేషధారణలు, డప్పు చప్పుళ్లు, మహిళల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, డీజే, ప్రత్యేక బ్యాండ్ ఆకట్టుకున్నాయి.
అమ్మవారి ఆ��ీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరుకున్నారు.
అనంతరం అస్తబాల్ ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు..
సదాశివపేట దుర్గమ్మ జాతరలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సదాశివపేట పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ దుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ��మ్మెల్యే చింత ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
జాతరలో భక్తుల భారీ రద్దీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి…
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మన సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ఒక సజీవ ప్రతీక. ప్రతి చేనేత వస్త్రం వెనుక ఓ కళాకారుడి నైపుణ్యం, శ్రమ, కుటుంబ జీవనం దాగి ఉంటుంది.
మన ��ేనేతను ఆదరిద్దాం… చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం… స్వదేశీ ఉత్పత్తులను గర్వంగా ధరించి వారి జీవనోపాధికి తోడ్పడదాం.
#జాతీయచేనేతదినోత్సవం #చేనేత #HandloomDay
MLA క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు...
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప���రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని కొనియాడుతూ ఆయన ఆశయాలను భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.
‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ తన రచనలతో తెలంగాణ అస్థిత్వపు భావజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యలు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యస్ఫూర్తిదాయకం.
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ గారు...
సదాశివపేట పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
దుర్గమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర బసవ సదన్ వరకు భక్తి శ్రద్ధలతో సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, హరినామ సంకీర్తనలు, భజనలతో యాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని ��ంతరించుకుంది. రథాన్ని భక్తులు ఉత్సాహంగా లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా చింత సాయినాథ్ మాట్లాడుతూ, జగన్నాథ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సనాతన ధర్మ విలువలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ సోము , నగేష్, ఇస్కాన్ ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆషాఢ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
పద్మశాలి సంఘం ఆషాఢ విందు.. ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు...
సంగారెడ్డి పట్���ణంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు పాల్గొన్నారు.
మొదటగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆషాఢ విందు భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పెద్దలను, సభ్యులను ఆప్యాయంగా పలకరించి ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం ఆషాఢం సందర్భంగా మల్కాపూర్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మల్కాపూర్ గౌడ్ సంఘం మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాలని ఆకాంక్షించారు.