గుంటూరు ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడంలో నగరవాసులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం.సాయికాంత్ వర్మ గారు పిలుపునిచ్చారు. జిల్లాను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, భూములు ఉన్న యజమానులు తమ వివరాలను https://t.co/IsJhsIwWgF వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.తమ ఆస్తులను విక్రయించడానికి, అద్దెకు లేదా లీజుకు ఇవ్వడానికి ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#ITHubGuntur #InvestInGuntur #ITInfrastructure #DigitalAndhra #GrowWithGuntur
#CollectorGuntur
#GunturUpdates
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.47, తేదీ 24-07-2026 మేరకు పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచిన నేపథ్యంలో, శ్రీ పి.వి.ఎన్. సత్యనారాయణ గారు సోమవారం గుంటూరు జిల్లా **STEP కార్యాలయం ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)**గా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ పి.వి.ఎన్. సత్యనారాయణ గారు గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం.సాయికాంత్ వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
#STEPGuntur #CEOStepGuntur #CollectorGuntur #Gunturupdates
జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ గారు యూరియా సరఫరా, పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల నిర్వహణ, గ్రీన్ గుంటూరు, మోడల్ చెరువుల అభివృద్ధి, పంటల బీమా నమోదు వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి కార్యక్రమం ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ గారు తెలిపారు. ఆగస్టు 15 నాటికి 1.2 లక్షల మొక్కల నాటడం, 10 మోడల్ చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, పాఠశాలలు, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరా అవలాని ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పంటల బీమా, సీసీఆర్ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు.
#GreenGuntur #FarmerWelfare #DevelopmentWorks #CollectorGuntur #GunturUpdates
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉండేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలను స్వయంగా విని, ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి సంబంధిత శాఖలు సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం సాధ్యం కాని అంశాలపై అర్జీదారులకు స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేసి, ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు. అర్జీదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి వసతి, మజ్జిగ పంపిణీ, భోజన సౌకర్యం, వైద్య శిబిరం తదితర ఏర్పాట్లపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గారుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
#PGRS #PublicGrievances #ResponsiveGovernance #CollectorGuntur #GunturUpdates
Kargil Vijay Diwas
A heartfelt tribute to the unparalleled courage, sacrifice, and patriotism of our brave soldiers who safeguarded the nation's pride.Their valor will continue to inspire generations.
– Sri C.M.SaiKanth Varma, I.A.S.
District Collector & District Magistrate, Guntur
#KargilVijayDiwas #KargilHeroes #RememberingOurHeroes #CollectorGuntur #Gunturupdates
ఇ.వి.యం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ గారు శనివారం తనిఖీ చేశారు. ఇ.వి.యం గోడౌన్లో సీసీ కెమెరాల పనితీరు, భద్రతా చర్యలను పరిశీలించారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి గారు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీనివాసరావు గారు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లేశ్వరి గారు, అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి గారు, తహసీల్దార్ కిరణ్ గారు, రహదారులు & భవనాల శాఖ డిప్యూటీ ఇ.ఇ.తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#EVM #EVMStrongRoom #Inspection #CollectorGuntur #Gunturupdates
ఎస్.ఐ.ఆర్ జాబితాలో ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా సమర్పించక పోవడం వలన గాని, వివరాలు సమర్పించక పోవడం వలన గాని తిరస్కరణకు గురైన వ్యక్తులను విచారణ చేసి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం.సాయికాంత్ వర్మ గారు తెలిపారు. ఓటరు ప్రత్యేక సవరణ (ఎస్.ఐ.ఆర్)పై రాజకీయ పార్టీలతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్ ఒక దశ పూర్తి అయిందన్నారు. ఓటరు జాబితాలో మ్యాప్ కాని ఓటర్ల వివరాలు ఆధారంగా తదుపరి విచారణ చేపట్టడం జరుగుతోందని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్ళినవారి ఓట్లు దాదాపు లక్ష వరకు ఉన్నాయని తెలిపారు.
#SIR2026 #VoterVerification #GunturCollector #Gunturupdates
తెనాలి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం.సాయికాంత్ వర్మ గారు పరిశీలించారు. శనివారం తెనాలి పర్యటనలో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రాంగణంలో వాతావరణాన్ని పరిశీలించి, మౌళిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి మంచి వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి గారు, తాసిల్దార్ గోపాలకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.
#Tenali #GovernmentPolytechnic #Inspection #CollectorGuntur #Gunturupdates
జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు సూచించారు.కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు, ఇతర అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాల ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్‌లు, స్ట్రీట్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు వంటి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కంపెనీల వాహనాలకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, నిర్మాణ సామగ్రి రోడ్లపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే జాతీయ రహదారులపై పనిచేయని వీధి దీపాలను వెంటనే సరిచేయడంతో పాటు, సర్వీస్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు మాట్లాడుతూ మేడికొండూరు రహదారిపై రాత్రి సమయంలో డివైడర్ స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
#RoadSafety #AccidentPrevention #ResponsibleDriving #CollectorGuntur #GunturUpdates
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతగా, పరిశుభ్రంగా అమలు చేయడానికి స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ గారు తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు, అవసరమైన స్థలాల గుర్తింపు, మండలాల వారీగా పాఠశాలలు మరియు విద్యార్థుల వివరాల సేకరణపై దిశానిర్దేశం చేశారు. ఈ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని సురక్షితంగా, పరిశుభ్రంగా తయారు చేసి పాఠశాలలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
స్మార్ట్ కిచెన్లలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ఆహార తయారీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వంటలో ఏర్పడే వ్యర్థాలను బయోగ్యాస్ ఉత్పత్తికి వినియోగించడంతో పాటు, ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయలను ఉపయోగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్షయపాత్ర సంస్థ సేవలు అందని మండలాలకు ఈ స్మార్ట్ కిచెన్ల ద్వారా భోజనం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మొత్తం ప్రక్రియను యాప్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ అశుతోష్ శ్రీవాస్తవ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సలీం భాషా గారు, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీమతి పి. కోమలి పద్మ గారు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎం. పద్మావతి గారు, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు శ్రీ రవీంద్ర బాబు గారు తదితరులు పాల్గొన్నారు.
#SmartKitchen #MidDayMeal #BioGas #NutritionFood #CollectorGuntur #GunturUpdates
రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి-నవజాత శిశు సంరక్షణ కేంద్రం (MNCU), మాతృ-నవజాత శిశు సంరక్షణ విభాగం, ఆధునిక వైద్య పరికరాలు, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం (HDS) సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, ఆధునిక వైద్య పరికరాల సమీకరణ, వైద్య సేవల విస్తరణపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం.సాయికాంత్ వర్మ గారు మాట్లాడుతూ జిల్లాలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీరమణి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. బి.వి. రంగారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#NadendlaManohar #CMSaikanthVarma #TenaliGovernmentHospital #MNCU #PublicHealthcare #QualityHealthcare #GunturDistrict #GovernmentHospital #HealthForAll #AndhraPradesh
Every tree we plant is a step towards a cleaner, cooler, and greener Guntur. Join the Green Guntur Programme and be a part of creating a healthier environment for future generations.
పరిశుభ్రమైన, చల్లని, పచ్చని గుంటూరు నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. రండి... "గ్రీన్ గుంటూరు కార్యక్రమం"లో భాగస్వాములై మొక్కలు నాటి భావి తరాలకు హరిత భవిష్యత్తును అందిద్దాం.
శ్రీ సి.యం. సాయికాంత్ వర్మ, ఐ.ఏ.ఎస్.,
కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, గుంటూరు.
#GreenGuntur #PlantATree #CleanGuntur #CollectorGuntur #GunturUpdates
గుంటూరు నగరాన్ని హరిత, పరిశుభ్ర, సుందర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ‘గ్రీన్ గుంటూరు’, ‘నవ గుంటూరు’ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, పోస్టర్లను ఆవిష్కరించారు.
గుంటూరు పార్లమెంట్ పరిధిలో 1.20 లక్షల మొక్కల నాటడం,ట్రీ గార్డుల ఏర్పాటు, జియో ట్యాగింగ్, మిషన్ జీరో ప్లాస్టిక్, వెల్త్ ఫ్రమ్ వేస్ట్, స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్, ఆధునిక తాగునీటి ప్రాజెక్టులు వంటి కార్యక్రమాల ద్వారా గుంటూరును గ్రీన్ అండ్ క్లీన్ నగరంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా గ్రీన్ గుంటూరు లక్ష్యాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి, జీఎంసీ అదనపు కమిషనర్ ఐ. కిషోర్, డ్వామా పీడీ శంకర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నజీనా బేగం, గ్రీన్ గుంటూరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
#GreenGuntur #NavaGuntur #CleanGuntur #MissionZeroPlastic #PlantationDrive #GunturMunicipalCorporation #SustainableGuntur #TeamGuntur
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష సేవలు అందించిన వైద్యాధికారులు, అలాగే గర్భిణీలను 100 శాతం **ABHA (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)**తో అనుసంధానం చేసిన ఆరోగ్య సిబ్బందిని జాయింట్ కలెక్టర్ శ్రీ అశుతోష్ శ్రీవాస్తవ గారు అభినందించారు. కలెక్టరేట్ డీఆర్సీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఈ. అన్నపూర్ణ, డా. కె. సుజాత, డీపీఎంఓలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలులో వారి సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.
#FamilyWelfare #ABHA #MedicalOfficers #CollectorGuntur #GunturUpdates
నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారు.మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా నాణ్యమైన విద్య అందించేందుకు తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, LEAP యాప్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. పాఠశాలల్లో నో బ్యాగ్ డే, స్కూల్ రేటింగ్ విధానం, క్విజ్లు, డిబేట్లు, క్రీడలు, వృత్తి నైపుణ్యాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములుగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు , గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ గారు,విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
#MegaPTM #ParentTeacherMeeting #LEAPApp #CollectorGuntur #GunturUpdates
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు పూలు చల్లి స్వాగతం తెలిపి, స్వయంగా ఆహారం అందించారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీ ఏనుగుల ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీ ఏనుగుల భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. గుచ్చిమి శిబిరానికి చేరుకున్న అనంతరం స్థానిక వాతావరణానికి అలవాటు పడేలా నిపుణుల పర్యవేక్షణలో చర్యలు చేపట్టాలని సూచించారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తోంది. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు ఆపరేషన్లలో జయంత్, అభిమన్యులు అడవి ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ పి.వి. చలపతిరావు గారు, అడవులు-పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గారు, జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ గారు, చీఫ్ కన్జర్వేటర్ ఎన్. నాగేశ్వరరావు, కన్సల్టెంట్ పి.వి. మల్లికార్జునరావు, జిల్లా అటవీ అధికారి ఎం. హిమ శైలజ గారు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
#Kumki #ParvathipuramManyam #DeputyCM #CollectorGuntur #GunturUpdates
గురువారం జిల్లా కోర్టుకు విచ్చేసిన హై కోర్ట్ జడ్జి దోనాడి రమేష్ గారికి సాదర స్వాగతం పలికిన ప్రధాన జిల్లా మరియు సెషన్స్ జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు, జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు.
#HighCourtJudge#Judge#DistrictCourt#CollectorGuntur#GunturUpdates
సి.ఆర్.డి.ఏ రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేసి, వారం రోజుల్లో గణనీయమైన పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ, భూ సమీకరణకు సంబంధించి రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా పెద్దపరిమి, హరిశ్చంద్రాపురం, వడ్డమాను గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. భూ సమీకరణ కోసం నియమించిన సర్వేయర్లు వెంటనే విధుల్లో చేరి ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
రికార్డుల్లో నమోదైన భూమి వివరాలు, భౌతికంగా ఉన్న భూమి వివరాలు సరిపోలిన సందర్భాల్లోనే భూ సమీకరణ చేపట్టాలని కలెక్టర్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన విస్తీర్ణం కంటే అధిక భూమిని ఎవరూ క్లెయిమ్ చేయలేరని, రైతులు తమ పత్రాల్లో ఉన్న భూమినే చూపించాలని సూచించారు. సమావేశంలో సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ గారు భూ సమీకరణ పురోగతిని వివరించగా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గారు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి గారు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
#CRDA #LandPooling #Awareness #CollectorGuntur #GunturUpdates