— 1800 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
✳️ సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్, మచ్చబొల్లారం జొన్నబండ ప్రాంతంలో ఉన్న శ్రీ గణేష్ ఎన్క్లేవ్ కాలనీలో సుమారు 1800 చదరపు గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది.సర్వే నంబర్లు 17, 33, 34 పరిధిలో ఉన్న శ్రీ గణేష్ ఎన్క్లేవ్ కాలనీలో గ్రామ పంచాయతీ ఆమోదించిన లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాల కోసం 1800 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే కొందరు వ్యక్తులు ఈ స్థలాన్ని ఆక్రమించి, పక్కనే ఉన్న సర్వే నంబర్లతో కలిపి తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఫిర్యాదులు అందాయి.ఈ నేపథ్యంలో కాలనీకి చెందిన వారు లేఅవుట్ అనుమతి పత్రాలు, 1969 నాటి లింక్ డాక్యుమెంట్లు, 1981 నాటి జీపీఏ పత్రాలు, భువన్ శాటిలైట్ చిత్రాలు, సర్వే రికార్డులతో హైడ్రాను ఆశ్రయించారు.ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా అధికారులు సంబంధిత రికార్డులు, లేఅవుట్ పత్రాలను పరిశీలించి పార్కు స్థలాన్ని ఆక్రమణల నుంచి పరిరక్షించారు. ప్రజల కోసం కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టారు. పార్కు స్థలాన్ని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేశారు. అలాగే పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసారు.
#HYDRAA #ParkProtection #SaveParks
— కృష్ణాకాంత్ పార్కులో చెరువు విస్తరణకు హైడ్రా చర్యలు
— చెరువు పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్
— 3 ఎకరాల చెరువును 12 ఎకరాలకు పెంచుతున్న హైడ్రా
— అమీర్‌పేట ప్రాంతాల్లో వరద కట్టడి లక్ష్యంగా పనులు
✳️ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువు విస్తరణ పనులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు శనివారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసి చెరువు అభివృద్ధి పనులకు కమిషనర్ శ్రీకారం చుట్టారు. గతంలో ఇక్కడ 27 ఎకరాల చెరువు ఉండేది. జూబ్లీహిల్స్, వెంకటగిరి, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో వచ్చే వరద నీరు ఈ చెరువుకు చేరేది. తర్వాత కాలంలో ఈ చెరువు ప్రాంతం కృష్ణాకాంత్ పార్కుగా అభివృద్ధి చేశారు. ఇందులో చెరువును కేవలం 3 ఎకరాలకు పరిమితం చేశారు. దీంతో 5 సెంటీమీటర్ల వర్షం పడితే కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట మైత్రేయివనం పరిసరాలను వరద ముంచెత్తడం సర్వ సాధారణంగా మారింది. ఇలాంటి తరుణంలో ఈ చెరువును అభివృద్ధి చేసి వరద కట్టడికి వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి గారు వరద కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ క్రమంలో కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువును విస్తరించడంతో పాటు.. లోతు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును 12 ఎకరాలకు విస్తరించాలని భావించారు. అయితే ఇందులో చెట్లను సురక్షితంగా.. శాస్త్రీయ పద్ధతిలో తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అనుమతులు లభించడంతో ఇక్కడ ఉన్న చెట్లను హైడ్రా అభివృద్ధి చేసిన సున్నం చెరువు చెంత నాటాలని నిర్ణయించారు. ఈ పనులు కూడా వెనువెంటనే మొదలౌతున్నాయి.
— పార్కు అందాలకు మరింత ఊతం..
✳️ ప్రస్తుతం కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువు మురుగు నీటి నిలయంగా మారింది. ఇక్కడ చెరువును అభివృద్ధి చేసి వరద నీటిని కట్టడి చేయడం వరకే హైడ్రా పరిమితం అవ్వడంలేదు. చెరువులోతును పెంచి వరద నీరు సులభంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్లెట్లను అభివృద్ధి చేసి.. వరద నీరు చేరడం.. చెరువు నిండిన తర్వాత బయటకు వెళ్లేలా ఔట్లెట్లను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఈ చెరువుకు ఇన్లెట్లు, ఔట్లెట్లు సమకూరనున్నాయి. చెరువు చుట్టూ బండ్ నిర్మించడం.. పాత్‌వేను అభివృద్ధి చేయడం జరుగుతుంది. పార్కులో ఉన్న ఓపెన్ జిమ్కుతోడు అదనంగా మరో ఓపెన్ జిమ్ అందుబాటులోకి రానుంది. చెరువు చుట్టూ కూర్చునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గజబోలు, పిల్లల ప్లే ఏరియాను అభివృద్ధి చేస్తారు. చెరువు నీటిలోకి ఎవరూ వెళ్లడానికి వీలు లేకుండా.. ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. బోటు షికారుకు అనువైన వాతావరణం సమకూరనుంది. చెరువు సహజ లక్షణాలన్నీ సమకూర్చి.. భూగర్భ జలాలు ఆ ప్రాంతంలో పెరిగేలా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. విమోస్ టెక్నోక్రాట్స్ పర్యవేక్షణలో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
#HYDRAA #KrishnakanthPark #LakeRestoration #LakeDevelopment #FloodControl
— 2.20 ఎకరాల పరిధిలోని..
— పార్కులను కాపాడిన హైడ్రా
✳️ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం ప్రశాంత్‌నగర్ కాలనీలో 2.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కులను హైడ్రా కాపాడింది. 45 ఎకరాలు, 30 ఎకరాల పరిధిలో రెండు దశల్లో వేసిన లే ఔట్లలో మొత్తం 10 పార్కులు కేటాయించారు. హెచ్ ఎం డీ ఏ అనుమతి పొందిన లే ఔట్లలో 4 పార్కులు అన్యాక్రాంతం అయ్యాయి. ఒక పార్కును జీహెచ్ ఎంసీ అభివృద్ధి చేసింది. మిగతా పార్కులను కూడా కబ్జా చేసేందుకు చిన్న గదులను నిర్మించారు. ఇదే విషయమై ప్రశాంత్‌నగర్ కాలనీ నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కింగ్ కోసం వినియోగించుకుంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాలను నిర్ధారించుకుంది. వెనువెంటనే 2.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కులను కాపాడుతూ చర్యలు తీసుకుంది. షెడ్డులను తొలగించింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే కాపాడిన పార్కుల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
#HYDRAA #SaveParks #ProtectPublicParks #Miyapur
— సున్నం చెరువు చెంత..
— అక్రమ బోర్లపై హైడ్రా కొరడా
— గతంలోనే చెరువులో బోర్లను తొలగించిన హైడ్రా
— నేడు పరిసర ప్రాంతాల్లో నీటి దందాకు హైడ్రా చెక్
✳️ హైడ్రా శనివారం భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. సున్నం చెరువు చెంత అక్రమ బోర్లపై హైడ్రా స్టింగ్ ఆపరేషన్ చేసి అక్రమ నీటి వ్యాపారం సాగుతున్న తీరును బయట పెట్టింది. ఇళ్లలో, బెడ్ రూంలలో, వంట గదుల్లో భారీ స్థాయిలో బోర్లు వేసి.. హైపవర్ మోటార్ల ద్వారా తోడిన నీటిని భూగర్భంలో వందలమీటర్ల పైపులు అమర్చి.. తరలించే వైనాన్నిబట్టబయలు చేసింది. ఎక్కడో బోరుంటుంది.. మరెక్కడో ట్యాంక్ ఉంటుంది. అలా తోడిని నీటిని భారీ వాటర్ ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి చిన్న ట్యాంకర్లను నింపి.. అమ్ముకునే వైనాన్ని మీడియా సాక్షిగా బయట పెట్టింది. వెనువెంటనే రంగంలోకి దిగి సున్నం చెరువు చెంత నీటి దందాకు చెక్ పెట్టింది. సీఎంసీ, రెవెన్యూ, జలమండలి అధికారులతో కలిసి హైడ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇళ్లలో బోర్లు వేసి.. గుట్టు చప్పుడు కాకుండా దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ నీటి వ్యాపారానికి హైడ్రా ఎట్టకేలకు చెక్ పెట్టింది. అక్రమంగా వేసిన బోర్లను పదుల సంఖ్యలో తొలగించింది. శనివారం మధ్యాహ్నానికి మొత్తం 15 బోర్లను ప్రత్యక్షంగా తొలగించిన హైడ్రా.. పరోక్షంగా పదుల సంఖ్యలో బోర్లను అనుసంధానం చేసే భూగర్భ పైపులను తొలగించింది. ఈ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.
— అక్రమ నీటి దందాతో సున్నం చెరువును ఖాళీ..
✳️ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే పదుల సంఖ్యలో బోర్లు వేసి.. దుర్గంధ భరిత నీటి దందాకు హైడ్రా గతంలోనే చెక్ పెట్టింది. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా అక్కడి బోరు నీటిని పరీక్షించి ప్రమాదకర, ప్రాణాంతక రసాయనాలున్నాయని తేల్చి చెప్పింది. కాడ్మియం, సీసం, నికెల్ వంటి లోహాలు అధికంగా ఉన్నాయని రుజువు చేసింది. ఈ నీళ్లు తాగిగే కాలేయ సమస్యలు... క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలతో పాటు.. గర్భశ్రావాలు జరుగుతాయి. ఇలాంటి నీళ్లను మాధాపూర్‌లోని హాస్టళ్లకు, హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకునే వారికి హైడ్రా చెక్ పెట్టింది. శనివారం నవభారత్‌నగర్, బోరబండ్ ఫేజ్ 3 ప్రాంతాల్లో ఉన్న బోర్లను తొలగించింది. సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తున్న క్రమంలో అందులోని 10 అడుగుల మేర పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించింది. దీంతో చెరువులో నీరు భూగర్భంలోకి ఇంకడం మొదలయ్యింది. భూగర్భ జలాలు పెరిగాయి. అయితే ఈ ఫలాలు అక్కడి నివాసితులకు దక్కకుండా.. నీటి వ్యాపారులు చేసినవైనంపై హైడ్రాకు ఫిర్యాదులందాయి. పదుల సంఖ్యలో నీటి ట్యాంకర్లు తరలించి నీటిని తోడేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది.
— బెడ్ రూంలు, ఇంటి గదుల్లో బోర్లు..
✳️ సున్నం చెరువు చెంత నివాసాలలో ఆశ్చర్యం కలిగించే విధంగా బోర్లున్నట్టు హైడ్రా గుర్తించింది. నిద్రపోయే బెడ్ల కింద, వంటగదుల్లో బోర్లును గమనించింది. నీటి సంపులో భారీ బోర్లు.. ఇలా నీటి దందా కొనసాగిన తీరు కనిపించింది. స్థానికుల ముందే వాటిని తొలగించింది. బోర్లకు బిగించిన మోటార్లతో సహాతొలగించి నీటి దందాకు హైడ్రా చెక్ పెట్టింది. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభించిన ఆపరేషన్‌ను శనివారం సాయంత్రం వరకూ కొనసాగించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గతంలో 60 అడుగుల్లో నీల్లు పడేవి.. ఇప్పుడు 600ల అడుగులు వెళ్లినా బోర్లు పడట్లేదని వాపోయారు. బోర్లు ఎండిపోయి.. మోటార్లు కాలిపోవడంతో నీళ్లను కొనుక్కొంటున్నామని.. వాళ్లు మాత్రం నీటిని అమ్ముకుంటున్నారని వాపోయారు. సున్నం చెరువులో నీటి నిల్వలపైనా అక్రమ నీటి దందా ప్రభావం పడుతోందని వాపోయారు. వర్షాకాలం ఆదిలో పడిన వర్షంతో కొంతమొత్తంలో చేరిన నీటిని కూడా పరిసరాల్లో వేసిన భారీ బోర్లు గుంజేశాయని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో ట్యాంకర్లను నింపే కార్యక్రమాలు చేయడంతో తమకు దారిలేకుండా చేస్తున్నారని పలువురు వాపోయారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక తాగు నీటి కష్టాలు రాకముందే హైడ్రా ఇలాంటి చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
#HYDRAA #SunnamCheruvu #IllegalBorewells #SunnamCheruvuOperation
HYDRAA and CMC Commissioner’s inspected the rejuvenated Sunnam Cheruvu and reviewed the arrangements for its inauguration by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Garu. They examined the lake restoration works, walking tracks, fencing, parks, open gyms and boating jetties.
#HYDRAA #SunnamCheruvu #CMC #LakeRestoration
— సున్నం చెరువును పరిశీలించిన HYDRAA- CMC కమిషనర్లు
— ప్రారంభోత్సవ ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో సమీక్ష
✳️ హైడ్రా ఎంతో ప్రతిష్టాత్మక పునరుద్ధరించి సున్నం చెరువును HYDRAA- CMC కమిషనర్లు శ్రీ ఎ.వి. రంగనాథ్ గారు, శ్రీమతి సృజన గారు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ నెల ఆఖరున కానీ వచ్చే నెల ఆరంభంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సున్నం చెరువును ప్రారంభించనున్న నేపథ్యంలో ఇరువురు కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. దాదాపు 20 ఎకరాల మేర FTL హద్దులు నిర్ధారించి పూడికతీయడం నుంచి ఫెన్సింగ్ వేసేవరకు సాగిన పనులను సమీక్షించారు. చెరువు చుట్టూ నిర్మించిన ఎత్తయిన బండ్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణాలను పరిశీలించారు. చెరువు లోపలివైపుతో పాటు పాతవే బయట వేసిన ఫెన్సింగ్ ను చూశారు. ఆక్రమణలు తొలగించి దాదాపు 30 ఎకరాల మేర చెరువుతో పాటు పరిసరాలను అభివృద్ధి చేసిన తీరును పరిశీల8ంచారు. చెరువు చెంతన అభివృద్ధి చేస్తున్న పార్కులు, ఓపెన్ జిమ్ లు, కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గజబోలు, బోటింగ్ జెట్టీల నిర్మాణాన్ని పరిశీలించారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ శ్రీ ఆనంద్ గారు, ACP శ్రీ తిరుమల్ గారితో పాటు CMC అధికారులు ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్నారు.
@CMC_Offcl #HYDRAA #SunnamCheruvu #CMC #LakeRestoration
— పుట్టిన రోజు వేడుకల్లో బాగంగా..
— హైడ్రాపై పాటను విడుదల చేసిన హైడ్రా కమిషనర్
✳️ నగరం ఎలా ఉండేది.. ఆక్రమాణలతో ఎలా వరదలకు గురైంది.. ప్లాస్టిక్ వ్యర్థాలతో వరద కాలువలు ఎలా నిండిపోయాయి.. హైడ్రా వచ్చిన తర్వాత నగరం ఎలా భద్రంగా మారింది అనే అంశాలను వివరిస్తూ బొడసింగి సురేష్ కుమార్ పాడిన పాటను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు గురువారం విడుదల చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఈ పాటను బోడసింగి సురేష్ కుమార్ విడుదల చేయించారు. వలస బతుకుల మీద పాడిన పాటను శ్రీ ఏవీ రంగనాథ్ గారి పుట్టిన రోజున గతేడాది విడుదల చేయించిన సురేష్ కుమార్ ఈ ఏడాది హైడ్రాతో నగరంలో వచ్చిన మార్పును వివరించారు. రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ SHO, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూనే.. జనాన్ని చైతన్యం చేస్తూ సురేష్ కుమార్ పలు పాటలు పాడడం అభినందనీయమని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. ఇటీవల గణేష్ ఉత్సవాల సమయంలో డీజే సౌండ్స్ మీద సురేష్ తన పాటతో తెచ్చిన చైతన్యం అభినందనీయమన్నారు. సురేష్ కడారి ఈ పాటను రచించగా.. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు.
#HYDRAA #HYDRAASong #Hyderabad #FloodFreeHyderabad
—హైడ్రా కార్యాలయంలో...
— కొమురం భీమ్, పండుగ సాయన్న జయంతి వేడుకలు
✳️ ఆదివాసీల హక్కుల సాధన కోసం ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో పోరాడిన కొమురం భీమ్, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిలబడిన ప్రజా వీరుడు పండుగ సాయన్నల జయంతిని హైడ్రా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇరువురి సేవలను స్మరించుకుంటూ.. వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ఘనంగా నివాళులర్పించారు. అన్యాయంపై పోరాటం, సమానత్వం కోసం తపన, పేదలు మరియు అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కమిషనర్ అన్నారు. వారి పోరాట స్ఫూర్తి, ధైర్యం, ప్రజల పట్ల అంకితభావం భావితరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
#HYDRAA #KomaramBheem #PandugaSayanna #JayanthiCelebrations #Tributes
-హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత..
-సందడిగా బతుకమ్మ ఆటలు
🔷దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ ఆటలకు హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు వేదికలయ్యాయి. కూకట్పల్లి నల్లచెరువుతో పాటు.. ఐడీఎల్ చెరువు, మాధాపూర్‌లోని సున్నం చెరువు, అంబర్‌పేట బతుకమ్మకుంట, ఉప్పల్ నల్లకుంట చెరువుల వద్ద పెద్దమొత్తంలో మహిళలు బతుకమ్మ ఆటలాడారు. కూకట్పల్లి నల్లచెరువులోని బేబీపాండ్ను నీటితో నింపడంతో అందులో బతుకమ్మలను వదిలి సందడి చేశారు. కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో గణేష్ నిమజ్జనాలకోసం ప్రత్యేకంగా తవ్విన చెరువు వైపు బతుకమ్మ ఆటలు జోరుగా సాగాయి. ఇదే పరిస్థితి అంబర్‌పేటలోని బతుకమ్మకుంటతో పాటు.. ఉప్పల్ నల్ చెరువులో కూడా బతుకమ్మ ఉత్సవాల సందడి కనిపించింది. కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా డీఆర్ ఎప్ సిబ్బంది అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. బతుకమ్మలను తీసుకుని చెరువులో వదిలారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువుల్లో నీరు లేని పరిస్థితుల్లో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో మహిళలకు ఎంతో ఊరట లభించింది. గతంలో చెరువుల చెంత బతుకమ్మ ఆడడానికి అనువైన వతావరణం ఉండేది కాదు.. కేవలం వాటిని గంగలో వదలడానికే పరిమితమయ్యేవారం.. ఇప్పుడు హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు వేదికలయ్యాయని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. చెరువు చెంత బతుకమ్మ ఆటలాడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
#BathukammaCelebrations #HYDRAALakes #Kukatpally #NallaCheruvu #IDLLake #SunnamCheruvu
✳️ The HYDRAA Prajavani programme on Monday, October 19, 2026, stands cancelled due to administrative reasons.The programme will resume as usual on Monday, October 26, 2026, and continue every Monday thereafter.
The public within the CORE (Core Urban Region Economy) jurisdiction is requested to take note.
#HYDRAA #Prajavani
— చెరువుల పరిరక్షణలో..
స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి
— రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ స్పీకర్ మీట్ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ పిలుపు
✳️ సమాజ శ్రేయస్సుతో పాటు పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కావాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు కోరారు. చెరువుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడడం, విపత్తుల నివారణలో ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఐటీసీ కోహినూర్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్-3150 ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన స్పీకర్ మీట్ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మాట్లాడారు. అధ్యక్షులు రొటేరియన్ రమేష్ పటేల్, కార్యదర్శి రొటేరియన్ శాంతి పాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ ఏవీ రంగనాథ్ గారు మాట్లాడుతూ చెరువులు, నాళాల పరిరక్షణ, పునరుద్ధరణతో పాటు ప్రభుత్వ భూములు పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
చెరువులను పునరుద్ధరించడం, వర్షపు నీరు చెరువుల్లోకి చేరేలా ఇన్లెట్ నాలాలను అభివృద్ధి చేయడం, నీటి ప్రవాహానికి కాలువల్లో ఉన్న అడ్డంకులను తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ వల్ల వరద ముప్పు తగ్గడంతో పాటు భూగర్భ జలాల నిల్వలు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు చెప్పారు.
— ప్రజాసమస్యల పరిష్కార వేదిక హైడ్రా ప్రజావాణి...
✳️ హైడ్రా ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి విజయవంతమైన వేదికగా నిలుస్తోంది.
ప్రతి సోమవారం ప్రజల ఫిర్యాదుల స్వీకరణతోనే మా పనులు ప్రారంభమవుతాయి.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు.ప్రజల నుంచి వస్తున్న స్పందనే ప్రజావాణి విజయానికి నిదర్శనం అన్నారు. ఆక్రమణలను తొలగించడంతో కబ్జాదారుల చెరలో ఉన్న సుమారు 3 వేల ఎకరాలను ఈ రెండేళ్లలో కాపాడమని కమిషనర్ చెప్పారు. చెరువులు, నాలాలు, పార్కులు, రహదారులు, ప్రభుత్వ బహిరంగ స్థలాల పరిరక్షణకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన, సంబంధిత రికార్డుల తనిఖీ, అవసరమైన చట్టపరమైన ప్రక్రియ అనంతరం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
— విపత్తు వచ్చిన తర్వాత కాదు ముందే నివారణ
✳️ హైడ్రా కేవలం ఆక్రమణలను తొలగించే సంస్థ మాత్రమే కాదని, విపత్తులను ముందుగానే గుర్తించి నివారించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తోందని శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడం భవిష్యత్ తరాల ప్రయోజనాలకు ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సేవా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు.
#HYDRAA #LakeConservation #EnvironmentalProtection #RotaryClub #Moinabad
-మాదాపూర్‌లో రూ. 400ల కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
-రెండు ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
-రెవెన్యూ అధికారుల వినతి మేరకు హైడ్రా చర్యలు
🔶రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లోని ఖనమేట్ గ్రామంలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఆక్రమణదారుల చేతిలో ఉన్న రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గురువారం కాపాడింది. 2 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది. ఈ భూమిని కబ్జా చేసిన వాళ్లకు కోర్టులో కూడా చుక్కెదురైంది. ఈ భూమిని కాపాడడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన ఎదురయ్యింది. అక్కడ ప్రహరీ నిర్మించి ఆక్రమించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అయినా ఎప్పటికప్పుడు ఆక్రమించడానికి ఒకరితో ఒకరు పోటీపడ్డారు. తాజాగా 2 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ ఆక్రమణ దారులు బ్లూ షీట్స్ ఫెన్సింగ్ వేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు గురువారం రంగంలోకి దిగి ఆక్రమణదారులు వేసిన బ్లషీట్లను తొలగించారు. రెండు ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేశారు. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రెవెన్యూ అధికారుల సమక్షంలో హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు.
#HYDRAA #Khanamet #Madhapur #GovernmentLandProtection
-- కూకట్పల్లి నాలా విస్తరణకు హైడ్రా చర్యలు
-- ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల ముంపు సమస్య పరిష్కారానికి అడుగులు
-- పూడికతీతతో పాటు ఆక్రమణల తొలగింపు
-- సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ సమీక్ష
❇️ ఫతేనగర్ – బాలానగర్ పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా పరిష్కరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికీ కూకట్పల్లి నాలాలో పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టిన హైడ్రా.. ఆక్రమణలు తొలగించడంపై దృష్టి పెట్టింది. పెదవాళ్ళ నివాసాల జోలికి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు గురువారం సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు హైడ్రా కార్యలంలో సమీక్షించారు.
సీఎంసీ, ఎంఎంసీ, పారిశ్రామికవాడ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు, ఐలా (ILA) అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఫతేనగర్–బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా నివారించాలంటే నాలాల్లో పూడికతీతతో పాటు, ఆక్రమణలను తొలగించి నాలాను విస్తరించడం అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. చెరువుల నుంచి వచ్చే వరద నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నాలాల ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. నల పొడుగునా పారిశ్రామికవాడ లేఅవుట్ ను పరిశీలిస్తే ఆక్రమణలు ఎంతమేర జరిగాయనేది స్పష్టం అవుతుందన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా విస్తరణ మాదిరి ఇక్కడ కూడా పనులు జరగాలన్నారు. ప్యాట్నీ నాల విస్తరణతో ఎగువున ఉన్న వేల కుటుంబాలకు, పదులసంఖ్యలో ఉన్న బస్తీలకు వరద ముప్పు తప్పించామని గుర్తు చేశారు.
-- భారీమోత్తంలో వరద సాఫీగా సాగేలా
❇️ పరికిచెరువు, ఐడీఎల్ చెరువుల నుంచి వచ్చే వరద నీరు కూకట్పల్లి నాలా ద్వారా ప్రవహిస్తుండగా, ఫాక్స్ సాగర్ నుంచి జీడిమెట్ల మీదుగా వచ్చే వరద కాలువ గౌతంనగర్ పరిసరాల్లో ఈ నాలాలో కలుస్తుంది. యిలా హుస్సేన్‌సాగర్‌లో కలిసే వరకు నల విస్తరణ చేపట్టాల్సి ఉంది.
-- 40 మీటర్ల వెడల్పు నాలా 9 మీటర్లకు చేరింది
❇️ ఫతేనగర్ ప్రాంతంలో సుమారు 40 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణల కారణంగా కేవలం 9 మీటర్లకు కుంచించుకుపోయిందని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫతేనగర్–బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లోని నాలా మొత్తం సుమారు 4.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, ఇందులో 2.2 కిలోమీటర్ల పరిధి సీఎంసీ పరిధిలోకి, మరో 2 కిలోమీటర్లు ఎంఎంసీ పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నాలా హద్దులను గుర్తించాలని, ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు.
-- పారిశ్రామికవాడకు 47 ఎకరాల భూ కేటాయింపు.
❇️ పారిశ్రామికవాడ కోఆపరేటివ్ సొసైటీకి 1963లో 30 ఎకరాలు, 1964లో 17 ఎకరాలు కేటాయించినట్లు సమావేశంలో అక్కడి పారిశ్రామిక ప్రతిందులు ప్రస్తావించారు. నాలా హద్దులు, పారిశ్రామిక ప్రాంతంలోని నిర్మాణాలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.కేవలం 30 నిమిషాల పాటు వర్షం కురిసినా పారిశ్రామిక యూనిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పారిశ్రామికవేత్తలు తెలిపారు. నాలా ఆక్రమణల తొలగింపు, విస్తరణ పనులకు తాము పూర్తి సహకారం అందిస్తామని పారిశ్రామికవాడ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హామీ ఇచ్చారు. తొలుత తరచూ వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో నాలా విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హైడ్రా కమిష ఈ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
#HYDRAA #NalaDesilting #FloodPrevention #FloodManagement #fathenagar
— కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా
— వలస పక్షులకు ఆవాసంగా మార్చేందుకు చర్యలు
— స్వచ్ఛందంగా చెరువు అభివృద్ధికి భూములిచ్చిన రైతులు
— రూ.35 కోట్లతో కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు
✳️ కాప్రా చెరువు మళ్లీ కళకళలాడేలా.. పునరుద్ధరణ పనులను హైడ్రా శరవేగంగా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వెట్ల్యాండ్స్లో ఒకటిగా విరాజిల్లి.. వలస పక్షులకు ఆవాసంగా ఉండే ఈ చెరువుకు పూర్వ వైభవం తెచ్చేలా హైడ్రా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సకల జీవకోటికీ ప్రాణాధరంగా.. జీవ వైవిద్యం పెంపొందించేలా హైడ్రా పనులు సాగుతున్నాయి. 112 ఎకరాల మేర విస్తరించిన చెరువులో రైతులకు చెందిన భూములున్నాయి. హైడ్రా చెరువుల అభివృద్ధిని చూసిన స్థానిక రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కాప్రా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని 70 ఎకరాలను చెరువు అభివృద్ధికి అప్పగించారు. నేరుగా హైడ్రా కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఆమోద పత్రాన్ని అందజేశారు. అంతే నిబద్ధతతో కాప్రా చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. దాదాపు 60 శాతం చెరువు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ చెరువు అభివృద్ధి పనులను చూడడానికి స్థానికులు వస్తున్నారు. ఒకప్పుడు చుట్టుపక్కల ప్రజల జీవనంతో.. పక్షుల కిలకిలరావాలతో మమేకమైన కాప్రా చెరువు హైడ్రా రెండో దశలో అభివృద్ధి చేస్తున్న 14 చెరువుల్లో ఒకటి. 112.80 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణం కలిగిన కాప్రా చెరువు అభివృద్ధికి దాదాపు రూ.35 కోట్లను వెచ్చిస్తున్నారు.
— జీవవైవిధ్యానికి చిరునామా కాప్రా చెరువు
✳️ జీవ వైవిద్యానికి ప్రతీకగా చరిత్రకెక్కిన కాప్రా చెరువు.. సాధారణ నీటి వనరు మాత్రమే కాదు.. నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఈ వెట్ల్యాండ్కు ఆస్ట్రేలియా, యూరప్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 470 రకాల జాతుల వలస పక్షులకు ఆవాసంగా కాప్రా చెరువు నిలుస్తోంది. నీటి నిల్వతో పాటు పక్షులు, జలచరాలు, వృక్షజాలానికి అనుకూలమైన సహజ వాతావరణాన్ని అందిస్తున్న ఈ చెరువు జీవవైవిధ్య పరిరక్షణలో కీలకంగా ఉంది. అందువల్ల కాప్రా చెరువు అభివృద్ధి పనుల్లో సుందరీకరణతో పాటు దాని సహజ పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు హైడ్రా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. చెరువు అభివృద్ధి అంటే కేవలం అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు.. చెరువును భవిష్యత్ తరాలకు భద్రంగా అందించడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి.
— ప్రకృతికి పెద్ద పీట వేస్తూ హైడ్రా పనులు..
✳️ భారీ వర్షాల సమయంలో వరదల నివారణ, భూగర్భ జలాల పెంపు, చేపలు, పక్షులు, ఉభయచరాలు, ఇతర జలచరాలకు ఆవాసంగా... జీవవైవిధ్య పరిరక్షణ, నీటిలోని కాలుష్య పదార్థాలు, మలినాలను సహజసిద్ధంగా వడపోతకు అనువుగా పూడిక తొలగింపు, వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ ఇలా వెట్ ల్యాండ్(చిత్తడి నేలల) ప్రాధాన్యతలన్నీ కలగలిపేలా చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. అంతే కాకుండా..ప్రజలందరికీ అన్ని విధాలా ఉపయోగపడేల.. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన ఫెన్సింగ్, ఇన్లెట్, ఔట్లెట్ వ్యవస్థల అభివృద్ధి చేస్తోంది. పెద్దమొత్తంలో వరద నీరు నిలిచేలా లోతును పెంచుతున్నారు. ఉదయం వాకింగ్‌కు వచ్చే వారు.. సాయంత్రం చెరువు గాలిని ఆస్వాదించే కుటుంబాలు.. పిల్లలతో ప్రశాంతంగా గడిపే స్థానికులు.. ఇలా కాప్రా చెరువు మళ్లీ ప్రజల జీవితంలో ఒక భాగంగా మారేలా పనులు కొనసాగుతున్నాయి. చెరువు చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. చెరువు పరిధి పరిరక్షణతో పాటు భవిష్యత్తులో ఆక్రమణలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు చెరువు పరిరక్షణ.. మరోవైపు వర్షపు నీటిని చెరువులోకి చేర్చేలా మెరుగైన నీటి ప్రవాహ వ్యవస్థ.. ఇంకోవైపు ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఈ మూడు లక్ష్యాలతో కాప్రా చెరువు రూపుదిద్దుకుంటోంది.
#HYDRAA #KapraLake #LakeRestoration #WetlandConservation #Biodiversity
— HYDRAA is restoring Kapra Lake with an investment of ₹35 crore, with nearly 60% of the works completed. The project focuses on protecting wetlands, providing a habitat for migratory birds, preserving biodiversity, and creating a cleaner, greener space for the public.
#HYDRAA #KapraLake #LakeRestoration #WetlandConservation #Biodiversity