డ్రగ్స్ రహిత వరంగల్ కమిషనరేటే మనందరి లక్ష్యం
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS.
డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని డ్రగ్స్ వ్యతిరేకంగా, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తుపదార్థాలను ఈ సమాజం నుండి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్క పౌరుడు భాగస్వాములు కావడంతో పాటు పోలీసులుకు పూర్తి సహకారం అందించాలని, ఈ వారోత్సవారలను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటి వినియోగం ద్వారా నష్టాలపై ప్రజలకు పోలీసుల వివరించడం జరుగుతోందని, ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ ప్రవైయిట్ పాఠశాల్లో ఈ డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతొందని, ఎవరైన మత్తు పదార్థాలు వియ్రించిన, వినియోగించిన తక్షణమే 8712584473 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో అదనపు డిసిపి రవి, సిసిఆర్బి ఎసిపి డేవిడ్‌రాజు, ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గోన్నారు.
-వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము.
Join your hands with #WarangalPolice to eradicate #DrugAbuse & #SayNoToDrugs @director_tsnab @narcoticsbureau
#tgnab #DrugfreeTelangana
@TG_ANB
#drugfreetelangana
#drugfreewarangal
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.
వరంగల్ పోలీస్ కమిషషనరేట్ కార్యాలయములో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా హజరయి కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కమిషనర్ చేతుల మీదుగా చిన్నారులతో పాటు పోలీస్ సిబ్బందికి మిఠాయిలను అందజేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, అదనపు డిసిపిలు సురేష్‌కుమార్, రవి, ప్రభాకర్ రావుతో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు ఇతర విభాగాలకు చెందిన పోలీస్ మరియు పరిపాలన సిబ్బంది పాల్గోన్నారు.
#TelanganaFormationDay #TelanganaPolice #PrideOfTelangana #warangalpolice
మత్తు పదార్థాల నియంత్రణలో శ్రమించిన అధికారులకు డీజీపీ చేతుల మీదుగా రివార్డులు.
విస్తృత స్థాయిలో మత్తు పదార్థాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు @TelanganaDGP చేతుల మీదుగా రివార్డులు అందుకున్నారు. @TG_ANB తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ డీజీపీ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో వరంగల్ పోలీన్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను పట్టుకోవడంలో శ్రమించిన వరంగల్ పోలీన్ కమిషనరేట్ ఇన్స్ స్పెక్టర్లు కరుణాకర్, సుధాకర్ రెడ్డి, సార్ల రాజు, శ్రీధర్ లను రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ అభినందించి రివార్డులను అందజేసారు. ఈ సందర్భంగా రివార్డులను అందుకున్న అధికారులను @cpwarangal సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
వరంగల్ పోలీన్ కమిషనరేట్ కార్యాలయము.
పదవీ విరమణ చేసిన మహిళా హోంగార్డ్ ను సత్కరించిన సిపి.
సుధీర్ఘ కాలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో హోంగార్డ్ విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన మహిళా హోం గార్డ్ పార్వతి మెహతను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారు శనివారం సీపీ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్ లో ఆరోగ్య పట్ల శ్రద్ద వహించాలని సిపి పదవి విరమణ చేసిన హోం గార్డ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగయ్య, ఆర్. ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం -
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. గత నెల మార్చిలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) ఛాంపియన్ షిప్ లో తెలంగాణ పోలీస్ తరపున ప్రాతినిధ్యం వహించి మూడు వందల మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సుబేదారి ఏఎస్ఐ సువర్ణను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తు కాలంలో ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని పోలీస్ కమిషనర్ సువర్ణకు భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదరపు డిసిపి రవి పాల్గొన్నారు.
తెలియని వారి నుంచి మీకు డబ్బులు డిపాజిట్ అయితే వెంటనే యూపీఐ అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. వందల్లో డబ్బులు పంపించి...మీ నుంచి వేలల్లో కాజేసే ప్లాన్ అది. జంప్ డిపాజిట్ స్కామ్‌పై జాగ్రత్తగా ఉండండి.
#TelanganaPolice#JumpDepositScam
ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడానికి, పోలీస్ స్టేషన్ల ద్వారా సేవలు అందుకున్న ప్రజలు ఆ సేవలకు సంబంధించినటువంటి ఫీడ్‌బ్యాక్ ను ఇప్పుడు మరింత సులభంగా క్యూఆర్ కోడ్ ద్వారా అందించవచ్చు.
IVRS కాల్స్ ద్వారా సైబర్ మోసాలు..
ఇటీవల, IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రిస్పాన్స్ సిస్టమ్) ద్వారా కొత్త రకమైన సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. కస్టమర్ కేర్ నుంచి అని చెప్పి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
సైబర్ మోసాలను గుర్తించి, అప్రమత్తంగా ఉండండి.
#TelanganaPolice