𝗛𝗮𝗽𝗽𝘆 𝗖𝗵𝗶𝗹𝗱𝗿𝗲𝗻’𝘀 𝗗𝗮𝘆!
Every child deserves a safe, happy and bright future. Let’s protect their dreams and nurture their smiles.
#HappyChildrensDay#HyderabadCityPolice
May the festival of lights illuminate your life with happiness, peace, prosperity and good health. May this Diwali bring new hopes, endless joy and success to you and your loved ones.
Stay Safe, Celebrate Responsibly! ✨🪔
#HappyDiwali2026
I sincerely congratulate all police personnel and members of the local community for their enthusiastic participation and voluntary blood donation. Their selfless contribution reflects our shared commitment to saving precious lives and serving society.
In observance of Police Commemoration Day, Today in Jubilee Hills Zone of Hyderabad City Police organised blood donation camps at 3 Divisions (Jubileehills,Banjarahills and SR Nagar). I had the privilege of participating in this noble initiative by donating blood.
జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజా రంజన్ గారి హత్య-దోపిడీ కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు.
రెండు నెలల పాటు నేపాల్, ఇతర రాష్ట్రాల్లో అలుపెరగక శ్రమించి, దారుణానికి ఒడిగట్టిన పనిమనిషితో సహా నలుగురు సభ్యుల అంతర్జాతీయ నేపాల్ ముఠాను సిట్, జూబ్లీహిల్స్ బృందాలు అరెస్ట్ చేశాయి.
ఇళ్లలో పనిమనుషులు లేదా వాచ్మెన్లను పెట్టుకునే ముందు యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లలో ఉచిత పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.
#HyderabadCityPolice #JubileeHills #SafeHyderabad #PublicAdvisory
పండుగ అంటేనే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడం. కానీ, దసరా వేళ శుభం అంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి, బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారు.
ఆలోచించండి...
ఒక మూగజీవి స్వేచ్ఛను హరించి, దానికి ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ చూస్తే ఎవరికైనా మేలు ఎలా జరుగుతుంది? ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
పాలపిట్ట మన పర్యావరణానికి రక్షకుడు, రైతుకు మేలు చేసే నిజమైన నేస్తం. అది నీలాకాశంలో స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం, మన సమాజానికి గౌరవం.
వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరం.
ఈ పండుగ పూట మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం. బంధించిన పక్షుల ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకండి.
ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించండి.
#SavePalapitta #IndianRoller #CrueltyFreeDussehra #EcoFriendlyDussehra #TelanganaForest #WildlifeConservation
▶️'NO' అంటే.. బ్యాంకు ఖాతా ఖాళీ!
▶️ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!
▶️వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా!
▶️ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం!
వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది! బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం 'NO' అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది.
ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది!
ఈ మోసం ఎలా జరుగుతోందంటే.. మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ సందేశం వస్తుంది.
ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారు.
ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారు.
అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే... గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు 'YES' గానీ, 'NO' గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండి!
కంగారుపడి ఎలాంటి సమాధానమూ పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయండి.
మీ ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి తప్ప, వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మకండి.
ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదు. ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో వెంటనే '1930' సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా https://t.co/bdJLRXbJD3 లో ఫిర్యాదు చేయండి.
కంగారులో ఇచ్చే ఒక్క నో అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!!
#CyberCrimeAlert #WhatsAppScam #StayAlert #CyberSecurity #HyderabadPolice
Remembering the Father of the Nation, Mahatma Gandhi, on his birth anniversary.
His principles of peace, unity, and mutual respect remain our guiding lights in serving the citizens. Let's pledge to keep our neighborhoods harmonious and law-abiding.
#GandhiJayanti#Hyderabad #Bapu #TruthAndNonViolence #HydPolice
భారీ డీజే శబ్దం ఆరోగ్యానికి హానికరం, నిషేధిత డీజే శబ్దాలు చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు. శబ్ద కాలుష్యాన్ని తగ్గిద్దాం… భక్తి భావాన్ని పెంచుదాం.
Heavy sound from prohibited DJs can harm and disturb surrounding homes, especially children, elderly persons, and those who are unwell. Celebrate Ganesh Chaturthi with safe sound levels
#GaneshFestival2026 #SafeCelebrations #NoisePollution
Today, a coordination meeting was held with members of the Peace Committee in connection with the upcoming Ganesh Festival. Discussions were held regarding the active involvement and cooperation of the public and police in ensuring the peaceful and smooth conduct of celebrations