ఒక్క భారతదేశ గ్రంథాలు మాత్రమే అందరిలో పరమాత్మని దర్శించి, నువ్వే పరమాత్మవి అనే సత్యాన్ని చెబుతాయి. అందుకే యుగాలు దాటి, ఎన్నో ప్రమాదాలుకి నిలిచి, మరెన్నో దాడులు తట్టుకొని, నిలిచి ఉంది భారతదేశం...
నేర్చుకొనే గుణం కలిగి వుంటేనే
ఎదురైన ప్రతీ పరిచయం నుంచి,
అనుభవంలోకి వచ్చిన వాటినుంచి,
ఏం చేయాలో ఎలా చేయాలో
ఏవిధంగా చేయాలో తెలుసుకోగలం!
తీసుకోవడమే తప్ప తిరిగివ్వాలని
తెలియని, తెలుసుకోలేని,
తెలియజెప్పలేనితనానికి బదులు చెప్పడంలోనే నేర్చుకునే గుణం యొక్క ప్రాముఖ్యత దాగుంది..! -ధాత్రి
బారిష్టర్ పార్వతీశంలో మొక్కపాటి నరసింహశాస్త్రి గారు భలే చెప్పారు. నాకు తెలిసినంతవరకు ఒక్క ఆంధ్రుడే కాదు చాలా మంది ఇలాగే ఉన్నారు...
#బారిష్టర్_పార్వతీశం#తెలుగుపుస్తకం
జీవితం మొత్తం అడ్జస్ట్మెంట్ తప్ప ఎం లేదు....
ఒకరు డబ్బు కోసం...
ఇంకొకరు జబ్బు కోసం...
ఒకరు ప్రేమ కోసం...
ఇంకొకరు ప్రాణం కోసం..
అనుక్షణం ప్రతి క్షణం పోరాడుతూనే ఉన్నారు ఏదొక దానికి...! ✍️||. -ధాత్రి
ఐ బొమ్మ రావటం లేదు. ఓ మలయాళ సినిమా చూడాలి .. నీ netflix పాస్వర్డ్ ఇవ్వు అన్నాడు. ఏమి చూస్తున్నాడో ఏమో.
చూసి ఊరుకొనే రకం కాదు . రివ్యూ కూడా పెడతాడు. వాడు మంచిగా ఉందంటే నేనూ చూస్తా. అందుకే అపుడప్పుడంటూ ఉంటా. నువ్వు చూడటం కాదు, నన్నూ చెడగొడుతున్నావని . ఓ నవ్వు నవేస్తాడు. ఎప్పుడూ పొరుగింటి మలయాళమే ఎందుకు అంటే, జీవితానికి కాదు మనసుకూ దగ్గరగా ఉంటుందంటాడు. నాదీ అదే ఫీలింగ్.
మౌన లేఖల ముఖ ద్వారం ఒడ్డు ��మీపం!
భరించుట తన బాధ్యత అంటుంది జల దైవం!
వరదలు ఎన్ని ముంచెత్తినా హద్దు దాటని ఓర్పు!
ప్రశ్నించే స్వరం లేదని కలుషితం చేయకు!
విసుగెత్తిన నాడు వరదగా ముంచేస్తుంది భద్రం!
మనిషి మనుగడకు ఆధారం!
విజ్ఞతతో నడుచుకో..!
రేపటి తరానికి ఆదర్శంగా నిలిచిపో.!✍️ -ధాత్రి