✳️ అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) నాగ భరత్ డాకా ఢిల్లీలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
✳️ భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.
✳️ సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి అభినందించారు. వారు సాధించిన విజయం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుందని ప్రశంసించారు.
#CMRevanthReddy
#Telangana
#SkyrootAerospace
#Vikram1
#SpaceTech #TelanganaRising2047
@TelanganaCMO@revanth_anumula
500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం విడుదల చేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయగా, అధికారులు ఇటీవలే వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు.
తాజాగా జనరల్ సర్జరీ – 174, జనరల్ మెడిసిన్ – 166, ఆర్థోపెడిక్స్ – 89, రేడియాలజీ – 71 చొప్పున మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ఎంహెచ్ఆర్బీ విడుదల చేసింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి, తుది ఫలితాలను ప్రకటించింది.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎంహెచ్ఎస్ఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నూతనంగా ఎంపికైన స్పెషలిస్ట్ డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, 24 విభాగాల్లో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. నేటితో 1192 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను మంత్రి ఆదేశించారు.
@DamodarCilarapu
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి!
నగరంలో నెలకొన్న పరిస్థితులను నేను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నాను. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది
ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించాను. ముఖ్యంగా రాజ్‌భవన్ రోడ్, సోమాజిగూడ, ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్ లాగింగ్‌ను సిబ్బంది వేగంగా తొలగించారు. కృష్ణానగర్ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో కొంతమేర ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు వివరించారు.
ప్రస్తుతం రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోందని, మరో రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా బృందాలు పూర్తి అప్రమత్తతతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించడం జరిగింది.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మ్యాన్హోల్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ మరియు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడం జరిగింది
అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు వీలైనంత వరకు బయటకు రావద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది.
@GHMCOnline@Collector_HYD@TelanganaCMO
ఢిల్లీ: ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.
✅కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసిన అనంతరం ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి వేదికలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
✅ఈ విషయంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు.
✅విద్యను వీలైనంతవరకు రాష్ట్రాల పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం తక్కువగా ఉంటుందని, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉందన్నారు.
✅యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
✅గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించి, వాటిని గందరగోళం చేశారని విమర్శించారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
✅ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలే భారంగా మారాయని, అయినా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని, ముందస్తుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
✅రాష్ట్రంలో ప్రతి ఏటా రూ. 2,200 నుంచి రూ. 2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమవుతాయని చెప్పారు. క్రమం తప్పకుండా వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించుకుందని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య రాష్ట్రంలో ఉండదని స్పష్టం చేశారు.
✅#HYDRAA కారాచరణపైనా, నిర్వహిస్తున్న బాధ్యతలపైనా ప్రభుత్వానికి స్పష్టత ఉందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వపరంగా సమీక్షిస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామని, అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
#Telangana #ExamReforms #TGPSC #FeeReimbursement #PaperLeak
❇️ తెలంగాణ టెలివిజన్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డులు(TGSTA)ను ప్రదానం చేయనున్నట్లు ఈరోజు డా. బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డుల కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో అవార్డుల విధివిధానాలు, లోగో, అవార్డుల పేర్లు, కేటగిరీలు, అవార్డుల ప్రదానోత్సవ వేదిక తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
❇️ ఈ సందర్భంగా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, టెలివిజన్ రంగం సమాజంపై విశేష ప్రభావం చూపే మాధ్యమమని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాలను అధికంగా వీక్షిస్తున్నారని పేర్కొన్నారు. మంచి సందేశాన్ని అందించే ధారావాహికలు, కార్యక్రమాలు, బాలల చిత్రాలు, సామాజిక స్పృహ కలిగిన కంటెంట్‌ను రూపొందించే వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. టెలివిజన్ నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు, దినసరి ధారావాహికలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక ప్రాధాన్యత గల చిత్రాలు, విద్యా చిత్రాలతో పాటు వివిధ సాంకేతిక, సృజనాత్మక విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
❇️ టీవీ రంగానికి చెందిన నిష్ణాతులైన కమిటీ చైర్మన్,సభ్యులు ఉన్నారు కాబట్టి ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని మంత్రి అన్నారు. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని ప్రతిబింబించే టెలివిజన్ కృతులకు శ్రీ పి. వి. నరసింహారావు పేరును అనుసంధానించే అంశాన్ని కమిటీ ప్రతిపాదించిందని, దీనిపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని, మొదటిసారిగా ప్రదానం చేయనున్న ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని కమిటీకి మంత్రి సూచించారు.
❇️ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ముకుంద్ రెడ్డి, డైరెక్టర్ కిషోర్ బాబు, కమిటీ ఛైర్మన్ శరత్ మర్రార్, సభ్యులు డా. ఎం. వినోద్‌బాల, పి. బిందు నాయుడు, పి. మంజుల నాయుడు, ఎం. రూపా దేవి, సయ్యద్ మీర్, పి. కిరణ్ (జెమిని కిరణ్), కె. బాపినీడు చౌదరి (ఈటీవీ), ఎం. విజయ్ భగవాన్ (మాజీ డైరెక్టర్, డీడీకే, హైదరాబాద్), కె. సీతాదేవి, డా. అనుక్నూర్ గౌతమ్, మధు మహంకాళి, విష్వేందర్ రెడ్డి, ఎల్. త్రినాథ్ రావు తదితరులు పాల్గొన్నారు.
#TGSTA
#TelanganaStateTelevisionAwards
#KomatireddyVenkatReddy
#TelanganaGovernment
#TelanganaCinema
#TelanganaRising2047
@TelanganaCMO@revanth_anumula@KomatireddyKVR
ఢిల్లీ: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ @ChouhanShivraj గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
✅ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు పలువురు ఎంపీలతో కలిసి కృషి భవన్లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివరించారు. గత ప్రభుత్వం #PMAYG ను వినియోగించుకోకపోవడంతో రాష్ట్రంలో గత పదేళ్లు పేదలు సొంత ఇండ్లు నిర్మించుకోలేకపోయారని, ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెలకొందని తెలిపారు.
✅కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ (#Awaas+) యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణకు ఇళ్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.
✅ఎల్‌నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)లో (#VBGRAMG) అదనపు పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. వర్షాభావంతో పనులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు జీవనోపాధులు మెరుగుపర్చేందుకు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహానికి అదనపు పనులను చట్టంలో చేర్చాలని కోరారు.
✅రైతులు తమ భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల సమీపంలో ఆకు కూరలు, కూర గాయల తోటలు, వెదురు వనాలు పెంచుకునే పనులను వీబీ జీ రామ్ జీలో చేర్చాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
✅కొండ ప్రాంతాలతో పాటు కొండ వాలుల్లో నీటి నిల్వ చేసుకునే కందకాలు, ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్లు, పండ్ల తోటల్లో తేమ రక్షణకు కందకాల నిర్మాణం, వరదలు, ఇసుక మేటలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణకు అవసరమైన పనులు వీబీ జీ రామ్ జీలో చేపట్టాలని కోరారు.
✅ఉపాధి హామీ పథకం (#MGNREGS) కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సమయంలో 90 రోజుల వరకు పనులు చేసే అవకాశం ఉండేదని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. వీబీ జీ రామ్ జీ లోనూ అందుకు అనుమతి ఇప్పించాలని కోరారు. స్థానిక అవసరాలకు తగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇతర పనులను వీబీ జీ రామ్ జీలో చేర్చాలన్నారు.
✅ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి పనుల విషయంలో సమస్యలను శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి వారు సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి గారు తెలిపారు. తెలంగాణలో పరిస్థితుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించినట్లు తెలిపారు.
✅ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీలు @AKY_INCMP గారు, @Vemnarenderredy గారు, @DrMalluRavi1 గారు, @porika_balram గారు, @suresh_shetkar గారు, @kiran_chamala గారు, @MP_KHAMMAM_RRR గారు, @KakaVamsiGaddam గారు, ఎక్స్-అఫిషీయో స్పెషల్ సెక్రటరీ కె. రామకృష్ణారావు గారు, సెక్రటరీ కో-ఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ గారున్నారు. @OfficeofSSC
#IndirammaIndlu #HousingForAll #TelanganaHousing
❇️ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్ గుర్తింపు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు సచివాలయంలోని తన కార్యాలయంలో రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో పురోగతి, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షించారు.
❇️ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసిన 2,240 గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ రీసర్వేపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని, రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు, భూ యజమానులకు వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆయన తెలిపారు. రీ-సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలు వ్యక్తం చేసే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
❇️ భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ ప్రతి దశలో ప్రజలను భాగస్వాములుగా చేయాలని మంత్రి సూచించారు. రీ-సర్వే పనులను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, వారానికోసారి పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలని ఆయన చెప్పారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది కుటుంబ జీవనాధారమని, దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ-సర్వే చేపట్టిందని మంత్రి అన్నారు.
❇️ డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతికతతో శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించడం వల్ల ప్రతి కమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించబడతాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి, భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా భూముల యాజమాన్యంపై శాశ్వత స్పష్టత వస్తుందని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనివల్ల భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతాయని చెప్పారు.
#PonguletiSrinivasaReddy #LandResurvey
#BhuBharati #TelanganaGovernment
#CMRevanthReddy #FarmerFirst
@TelanganaCMO@revanth_anumula@INC_Ponguleti
✳️ హైదరాబాద్ సచివాలయంలో ఈరోజు నిర్వహించిన 'రైతునేస్తం' 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకే వేదికపై ప్రత్యక్షంగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. 2024 మార్చి 6న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన 'రైతునేస్తం' కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం రైతుల విశ్వాసానికి నిదర్శనమని మంత్రి అన్నారు.
✳️ ఇప్పటివరకు 24,85,581 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొనగా, వారిలో 5,26,107 మంది మహిళా రైతులు ఉన్నారని మంత్రి తెలిపారు. రెండేళ్ల కాలంలో 2,43,830 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మొత్తం 27.30 లక్షలకు పైగా రైతులు కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని వెల్లడించారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే 'రైతునేస్తం' ద్వారా రైతులు అడిగే ప్రశ్నలకు అదే సమయంలో శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు లభిస్తున్నాయని, దీనివల్ల పంటలకు నష్టం కలగకముందే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం రైతులకు లభిస్తోందని మంత్రి వివరించారు.
✳️ 'రైతునేస్తం' ద్వారా రైతులకు వాతావరణ హెచ్చరికలు, జిల్లాల వారీగా అనువైన పంటలు, శాస్త్రీయ సాగు విధానాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు ఎల్-నినో ప్రభావం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం, రైతులు కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మంత్రిశ్రీ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
✳️ కార్యక్రమంలో మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, వివిధ జిల్లాల ఆదర్శ రైతులు, అధికారులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతులు మరియు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
#RythuNestham #TelanganaFarmers
#Agriculture #CMRevanthReddy
#TummalaNageswaraRao #TelanganaGovernment #TelanganaAgriculture
@TelanganaCMO@revanth_anumula@Tummala_INC
కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి పుష్పాంజలి ఘటించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. #SJaipalReddy
Chief Secretary Shri @sjaju1, IAS today chaired a review meeting at the Telangana Secretariat on road safety across the State with senior officials. He reviewed ongoing road safety initiatives, stressed the need for stronger inter-departmental coordination, and directed officials to implement effective measures to reduce road accidents, improve enforcement, and enhance public awareness for safer roads.
Chief Secretary Shri @sjaju1, IAS today reviewed Telangana's power generation and distribution with senior officials, assessing the performance of power utilities and the operational activities of Singareni Collieries. He emphasised coordinated planning, efficient power management, and strengthening the State's energy infrastructure to ensure reliable and sustainable power supply.
Chief Secretary Shri @sjaju1, IAS, visited the Model School & Junior College, Maheshwaram, where he reviewed the facilities and learning environment, and spent time with students and staff.
He encouraged everyone to keep striving for excellence and reaffirmed the government’s commitment to quality education and the holistic growth of every student.
Chief Secretary Shri @sjaju1, IAS, visited M/s. Wipro Enterprises Pvt. Ltd. and Malabar Gems & Jewellery Manufacturing Pvt. Ltd. at TGIIC’s General Park, Maheshwaram, highlighting the Government of Telangana’s commitment to fostering an environment where industries can grow, expand, and create large-scale employment.
The Wipro Enterprises manufacturing facility has successfully implemented both its original and expansion projects and is in commercial operation, providing employment to 331 people. Malabar Gems & Jewellery Manufacturing Pvt. Ltd. has emerged as a major employment generator, creating livelihoods for around 1,600 people.
The continued expansion of industries in Telangana reflects the confidence of investors in the State’s robust infrastructure, proactive governance, and industry-friendly policies.
#Telangana #IndustrialGrowth #MakeInIndia #InvestTelangana #Manufacturing #Employment #EaseOfDoingBusiness
Chief Secretary Shri @sjaju1, IAS, visited M/s. Chiripal Poly Films Ltd. at TGIIC’s Industrial Park, Mankhal, underscoring the Government of Telangana’s commitment to engaging with industries beyond the investment stage and supporting them throughout their growth journey.
During the visit, the Chief Secretary reviewed the company’s manufacturing operations and interacted with its leadership on future expansion opportunities and the enabling role of the Government.
The integrated facility manufactures BOPP/BOPET films with coating, metallizing, slitting, and recycling capabilities. The project is fully operational and provides employment to 500 people.
#Telangana #IndustrialGrowth #MakeInIndia #InvestTelangana #Manufacturing #IndustryPartners
Chief Secretary Shri @sjaju1, IAS, today visited the Electronic Manufacturing Cluster (E-City), Raviryala, along with officials from TGIIC and the Industries Department, reaffirming the Government of Telangana’s commitment to partnering with industry for sustained growth.
The visit focused on engaging with industry leaders to understand their expansion plans, review the support ecosystem, and identify opportunities for the Government to further facilitate investments, ease of doing business, and job creation.
The delegation visited:
* Premier Energies’ Solar PV Module Manufacturing Facility, creating over 1,200 jobs.
* Avantel Ltd.’s Advanced Defence Electronics Facility, generating around 400 jobs.
The Government of Telangana remains committed to providing responsive governance, world-class industrial infrastructure, and policy support to enable businesses to expand, innovate, and thrive.
With its industry-first approach, Telangana continues to strengthen its position as a preferred destination for advanced manufacturing, electronics, clean energy, and aerospace & defence investments.
#Telangana #MakeInIndia #InvestTelangana #EaseOfDoingBusiness #Electronics #AdvancedManufacturing
❇️ దేశవ్యాప్తంగా నెలకొన్న 'ఎల్ నినో' పరిస్థితుల దృష్ట్యా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో ముందుండి పాల్గొని ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
❇️ వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని మంత్రి పేర్కొన్నారు. రానున్న తరాలకు నీటి భద్రత కల్పించాలంటే ఇప్పటి నుంచే ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం జల సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'తెలంగాణ జలసిరి' కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంగా విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
❇️ మహిళా సంఘాలు గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ నీటి సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని మంత్రి సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట నిర్మించాలనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఈ నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించవచ్చని ఆమె తెలిపారు.
❇️ జల సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వర్షపు నీటి సంరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. "జల సంరక్షణే మన భవిష్యత్తుకు భరోసా. 'తెలంగాణ జలసిరి'ని ప్రజలందరం కలిసి విజయవంతం చేద్దాం. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి సస్యశ్యామల తెలంగాణ నిర్మాణానికి మనమంతా భాగస్వాములు కావాలి" అని మంత్రి శ్రీమతి సీతక్క పిలుపునిచ్చారు.
@TelanganaCMO@revanth_anumula@seethakkaMLA