సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహచర ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించాను
సుదర్శన్ రెడ్డి గారు త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను
ఇటీవల మృతి చెందిన నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల, కవితక్క గారు
@RaoKavitha@OfficeOfKavitha
వనపర్తి జిల్లా: కల్వకుంట్ల కవితక్క ఆదేశాల మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో దామోదర్ గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో సంకిరెడ్డిపల్లి,మదనపురం మండలంలో టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది...ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు...
@RaoKavitha@NaveenAchari@sharathjagruthi
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సీఐ, గారిని ఎస్సై గారిని దేవరకద్ర తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంచార్జ్ దామోదర్ గౌడ్ అన్న గారు, జిల్లా సీనియర్ నాయకులు దాసరి విజయ్ ముదిరాజ్, కేశపాగా ఎలాస్వామి, శ్రీకాంత్, శాలువాతో సన్మానం చేసి మర���యాద పూర్వకంగా కలవడం జరిగింది..
@RaoKavitha @TJagruthi
మే 20 నుండి తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలు
"తెలంగాణ రక్షణ సేన" భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు నెల రోజుల పాటు వాడవాడనా టిఆర్ఎస్ ��ెండా పండుగలు నిర్వహించవలసిందిగా పార్టీ శ్రేణులకు సూచించడమైనది. ఇందులో భాగంగా మే 20 నుండి జూన్ 20 వరకు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించడం జరుగుతుంది.
అలాగే పార్టీ ఆవిర్భావ సభలో తెలిపిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించవలసిందిగా పార్టీ నాయకులను కార్యకర్తలకు సూచిస్తున్న���ను.
నేడు తెలంగాణ ఎదుర్క���ంటున్న అనేక సమస్యలపైన ఎక్కడికక్కడ గళమెత్తవలసిందిగా పార్టీ నాయకులను కార్యకర్తలకు ఇప్పటికే సూచించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రస్థాయి అంశాలతో పాటు స్థానిక సమస్యల పట్ల కూడా అక్కడి శ్రేణులు స్పందించడం, అవసరమైన చోట ఉద్యమించడం జరుగుతుంది.
టిఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా కార్యకర్తలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావలసిన అవసరం ఉంది. కలిసి వచ్చే వారిలో సమాజం పట్ల భాద్యత, అంకితభావం కలిగిన చురుకైన కార్యకర్తలతో సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యం నిండిన ఒక బలమైన జన సమూహాన్ని ప్రజా ఉద్యమాల కోసం నిర్మిద్దాం.
జై తెలంగాణ.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన… పురోగతి లేని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు
జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో పాలమూరు, రంగారెడ్డి ప్రజలతో కలిసి తెలంగాణ రక్షణ సేన పిడికిళ్లు బిగించి తెలంగాణ సాగునీటి సాధన కోసం పోరా���ానికి శ్రీకారం చుట్టింది
తలాపున బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నా... ఆ నీళ్లను వాడుకునే అవకాశం లేకుండా చేసిన పాలకులపై టిఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 33 వేల కోట్లు ఖర్చు చేసి 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా పాలమూరు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎంత మాత్రం సహించరానిది.. వారు చేసిన నష్టాన్ని సరి చేస్తాం
షాద్ నగర్ నియోజకవర్గం, చౌదరి గూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ నుంచి పోరాట కార్యాచరణ ప్రకటించాం... రేవంత్ రెడ్డి సర్కార్ కు డెడ్ లైన్ విధించాం.
దసరా పండుగ లోపు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రారంభించక పోతే ప్రాజెక్టు పరిధిలో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
Prime Minister @narendramodi ji
I am writing to you as a concerned citizen to bring to your immediate attention, four matters of critical importance to the people of Telangana and the broader pursuit of social justice in India:
1. Granting of "National Status" to the Palamuru-RangaReddy Lift Irrigation Scheme (PRLIS)
2. Inclusion of a Dedicated OBC Column in Census 2027
3. Reintroduction of the Women’s Reservation Bill with an OBC sub-quota
4. Expediting Presidential Assent for Telangana’s Backward Classes Bills
I believe that addressing these four pillars: water security, data-driven justice, gender equity, and constitutional safeguards will go a long way in strengthening the federal spirit of our nation. I look forward to a positive consideration of these requests.
దసరా లోపు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులు మొదలు పెట్టాలి. లేని పక్షంలో టీఆ��్ఎస్ ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతాం. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
2 నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తరవాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీని మర్చిపోయింది.
గత ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల వయస్సు సడలింపును మరో రెండేళ్లు పెంచి మేం నిరుద్యోగులకు మేలు చేస్తున్నట్లు జీవో 30 ని 2024 ఫిబ్రవరి 8వ తేదీన జారీ చేసి...రెండేళ్లు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ వయో పరిమితి 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెరిగింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా... ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.
ఆ జీవో వయస్సు సడలింపు పీరియడ్ ముగియగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 18 నుండి 34 ఏళ్ల వయస్సును అర్హతగా పేర్కొన్నారు. ఇది దుర్మార్గం. ఓ చేయితో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేయితో లాగేసుకున్న చందంగా ఉంది మీ ప్రభుత్వం నిర్వాకం.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగుల జీవితాలను అగం చేస్తే ఊరుకునేది లేదు. అలాంటి నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 20న జారీ చేసిన 01/OG/PC/2026 నోటిఫికేషన్ ను రద్దు చేయించ���... ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 30ని అమలు చేయాలని నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలొ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.
The @BJP4India has cheated the women of India yet again.
Knowing fully well that linking delimitation to Women's Reservation would lead to the Opposition voting against the bill, and being aware that they lacked the necessary numbers, the government introduced the bill in a rushed manner.
The emotions of the women of this nation are being exploited for political mileage. I urge all women to see through this web of deception and teach the BJP a lesson, beginning with West Bengal, where a woman is leading the battle.
Secondly, now that the bill has failed to pass, they should wait for the 2027 Census so that an OBC sub-quota can be incorporated. Representation remains hollow until all communities are uplifted.
#WomenReservation #DelimitationBill #LokSabha
మన సమస్యలపై పిడికిలి ఎత్తి పోరాటం చేస్తేనే పరిష్కారం లభిస్తుంది. ఎక్కడ రైతుల భూములు గుంజుకుంటే అక్కడ తెలంగాణ జాగృతి ఉంటుంది
పరిగిలోని కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం సహా పలు గ్రామాల్లో బలవంతపు భూసేకరణ ను నిలిపివేసే వరకు ఉద్యమిస్తాం.
We have to salute @MamataOfficial. She refused to implement the four draconian labour codes, come what may. Similarly, states like Tamil Nadu and Kerala did the same, but the Congress government in Telangana has been silent.
We question the government’s silence and demand that they pass a resolution in the state assembly.
ధైర్యానికి, శక్తికి ప్రతీక… భక్తికి నిలువుటద్దం అయిన ఆ రామదూత ఆశీస్సులు మీకు, మీ కుటుంబసభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
ఎలాగైతే గ్రూప్ 1 లో కొంత మందిని సెలెక్ట్ చేసుకోడానికి కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారో, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ పార్టీ అనుచరులకు, కార్యకర్తలకు ఇప్���ించుకోడానికే జీవో నంబర్ 4 తెచ్చారు. ప్రభుత్వం తక్షణమే జీవో 4 ను రద్దు చేయాలి.
రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసింది.. కాగ్ 2024 - 25 నివేదిక రాష్ట్ర ఖజానా పరిస్థితిని బట్టబయలు చేసింది
ఏడాదిలో రెండు రోజులు తప్ప మిగిలిన 363 రోజులు ర���జర్వ్ బ్యాంకు నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీస్, ఓవర్ డ్రాఫ్ట్ ల పేరుతో చేబదుళ్లు చేసింది.. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో ఇలా రూ.1.30 లక్షల కోట్లు తెచ్చి సర్కారును నెట్టుకొచ్చింది
చేబదులుగా తెచ్చిన మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తిరిగి చెల్లించాల్సి ఉండగా.. 2025 మార్చి 31 నాటికి సుమారు రూ.6 వేల కోట్లు చెల్లించలేకపోయింది
నెలకు సుమారు రూ.12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న మన రాష్ట్ర ఖజానాలో రోజువారీ ఖర్చులకు రూ.1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటేన్ చేయలేని స్థితికి తెలంగాణను తీసుకెళ్లింది
రూ.8.65 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఒక్కో కుటుంబంపై రూ.9 ల���్షల అప్పు మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాపుతూ ఇంకా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని చెప్పడం ప్రజలను మోసం చేయడమే
ఎన్నికలకు ముందు సంపద పెంచుతాం.. దానిని పేదలకు పంచుతాం అన్న కాంగ్రెస్ నాయకుల మాటలు వట్టి డొల్ల అని కాగ్ నివేదికతో బట్టబయలు అయ్యింది
ఆడబిడ్డలకు కనీసం శానిటరీ ప్యాడ్స్ ను అందించలేని దుస్థితిలో ఉన్న మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును చూస్తే జాలేస్తుంది.. ప్రతినెలా శానిటరీ ప్యాడ్స్ కోసం విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను వింటే దు:ఖం వస్తోంది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతోన్న ఆడబిడ్డలకు కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా అందించడం లేదు. ‘‘పీఎం శ్రీ’’ పథకం కింద కొన్ని స్కూళ్లలో వీటిని ఉచితంగా అందజేస్తున్నా... ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లోని విద్యార్థినులకు ఈ స్కీం వర్తించడం లేదు.
ఆరోగ్యకరమైన రేపటి సమాజం కోసం ఏదో చేసేస్తున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. రేపటి తరం నిర్మాతల ఆరోగ్యం కోసం కనీస చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడంతో పాటు ప్రతినెలా కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలి.