📢 TGSRTC Hyderabad Region invites e-Tenders & Manual Auction Tenders for stalls at major bus stations.
🗓️ Tender Forms: 20.08.25–03.09.25
📩 Submission: 04.09.25 (10:30AM–2PM)
📍 RM/HR Office, Kachiguda Bus Stn
Details 👉 https://t.co/h8YhFBLinB
#TGSRTC#TenderNotification
ఐటీఐ విద్యనభ్యసించే వారికి శుభవార్త. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి #TGSRTC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం సంస్థ కల్పిస్తుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ నెల 21వ తేదీలోపు https://t.co/20abgdBpFa వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకున�� వారికి ఐటీఐ ఒక మంచి అవకాశం. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్ లోని ఐటీఐ కళాశాలలను నేరుగా సంప్రదించగలరు.
@TGSRTCHQ @PROTGSRTC
విధి నిర్వహణలో మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో గురువారం ఉన్నతాధికారులతో కలిసి 12 మంది ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా సన్మానించారు.
ఈ నెల 2వ తేదిన గజ్వేల్ ప్రజ్జాపూర్ డిపోనకు చెందిన బస్సులో జగదేవ్‌పూర్ వద్ద ఒక ప్రయాణికుడు తన బ్యాగును మరిచిపోయారు. ఈ విషయాన్ని గు��్తించిన కండక్టర్ ఓం ప్రకాశ్, డ్రైవర్ సలీమ్ బ్యాగ్‌ను పరిశీలించగా.. అందులో రూ.15 తులాల బంగారు ఆభరణాలు, రూ.3.50 లక్షల నగదు ఉంది. వెంటనే డిపో అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై సహాకారంతో రూ.18 లక్షల విలువైన ఆ బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తమ నిజాయితీని నిరూపించుకున్నారు.
మరోక ఘటనలో.. బాన్సువాడ డిపో బస్సులో ఈ నెల 4వ తేదిన ఒక ప్రయాణికుడు తన బ్యాగున�� మరిచిపోయారు. సంగారెడ్డి బస్ స్టేషన్లో ఉన్న ��ర్టీసీ ఉద్యోగులకు అతడు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే వారు జోగిపేట కంట్రోలర్ జన్నుబాయికి సమాచారం చేరవేశారు. జోగిపేటలో కండక్టర్ బస్వరాజు సాయంతో ఆ బ్యాగును జన్నుబాయి తీసుకుని.. ప్రయాణికుడికి అందజేశారు. అందులో రూ.2.50 లక్షల నగదుతో పాటు ఒక ల్యాప్ టాప్, ప్రొజెక్టర్ ఉంది.
మణుగూరు డిపోనకు చెందిన డ్రైవర్ మహేశ్ గత నెల 28న అమలాపురం సర్వీసులో విధులు నిర్వహిస్త���ండగా.. అశ్వారావుపేటలో ఒక ప్రయాణికుడు పర్సును మరిచిపోయారు. అందులో రూ.లక్ష నగదు ఉంది. పర్సులో ఉన్న గుర్తింపు సమాచారంతో ప్రయాణికుడికి ఫోన్ చేసి మానవత్వంతో పర్సును డ్రైవర్ అందజేశారు.
అలాగే, కల్వకుర్తి డిపోనకు చెందిన కండక్టర్ ప్రసాద్, డ్రైవర్ అనిల్ కుమార్‌లు.. 2 లక్షల విలువైన బ్యాగ్‌ను ప్రయాణిడికి అందజేశారు. అదే డిపోనకు చెందిన కండక్టర్ ప్రసాద్, బాల���ాజులు ఈ నెల 25న బస్సులో మరిచిపోయిన ల్యాప్‌టాప్‌ను ప్రయాణికుడికి అప్పజెప్పారు. దేవరకొండ బస్ స్టేషన్లో స్వీపర్‌గా పనిచేస్తోన్న ముత్తమ్మ.. ప్రయాణికుడి మరిచిపోయిన రూ.30 వేల విలువైన ఫోన్‌ను అందజేశారు.
ఆదిలాబాద్ డిపో కండక్టర్ రమణ, డ్రైవర్ గులాబ్లు గత నెల 31వ తేదిన ఒక ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగ్‌ను అందజేశారు. అందులో 12 గ్రాముల బంగారు అభరణంతో పాటు ఒక ఫోన్, రూ.1000 నగదు ఉంది. అలాగే, ఎయిర్ ఫోర్ట్ పుష్పక్ బస్సులో మరిచిపోయిన ల్యాప్ టాప్, విలువైన పత్రాలతో కూడిన బ్యాగ్‌ను డ్రైవర్ మీర్జా ప్రయాణికుడికి అందజేశారు.
ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ నిర్వహణలోనే కాక.. మానవత్వంలో ముందుండటం అభినందనీయమని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రశంసించారు. ఉద్యోగులు నిజాయితీని నిరూపించుకుంటుండటం చూస్తుంటే.. ప్రజల కోసం ఆర్టీసీ సిబ్బంది ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో తెలుస్తోందని అన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC @bigtvtelugu @RTVnewsnetwork @TV9Telugu @NtvTeluguLive @way2_news @TelanganaCMO @eenadulivenews
పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు టీజీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిని ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు వ��ించింది. ప్రభుత్వ ఆస్పత్రుల కేటగిరిలో బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపులో ఆస్పత్రి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ��ైదరాబాద్ సనత్‌నగర్‌లోని టీజీపీసీబీ కార్యాలయంలో ఈ అవార్డును టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రి బృందానికి గురువారం పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందజేశారు.
టీజీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించడం పట్ల సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంతో ���ాటు పర్యావరణ పరిరక్షణను కొనసాగించేందుకు మరింత ప్రేరణ ఇస్తోందని అన్నారు. ఆస్పత్రిలో బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపు, ఘన వ్యర్థాల నిర్వహణ పకడ్బందిగా చేస్తోన్న వైద్యులు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.
@PROTGSRTC
Eid al-Adha Mubarak!
May this holy day bring peace, sacrifice, and devotion to our hearts. Let us remember the true essence of giving and unity.
#EidAlAdhaMubarak#EidMubarak2025
On World Environment Day 2025, TGSRTC Hospital was awarded a Certificate of Appreciation for its commitment to bio-medical waste management and efforts to combat plastic pollution.
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC
#TGSRTC#Telangana#Hyderabad #TakingTelanganaForward #TGSRTCHospital