ఎస్ఐఆర్లో పాల్గొనండి.. పటాన్చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి..
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.
పటాన్చెరు:
ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి ఓటు ప్రాణాధారమని, ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని, ఆగస్టు 3వ తేదీ లోపు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గురువారం పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐఆర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామ్యానికి తొలి మెట్టు ఓటు హక్కేనని స్పష్టం చేశారు.
పటాన్చెరులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో పాల్గొనని వారు తమ విలువైన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి, పటాన్చెరు అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా ఎస్ఐఆర్లో పాల్గొనాలని కోరారు.
నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లు, మూడు మున్సిపాలిటీలు, రెండు మండలాల్లోని ప్రతి వార్డు వరకు ఈ ప్రచార రథాలు చేరుకుని ప్రజలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. అలాగే ప్రార్థనా స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థలు, పార్కులు, మార్కెట్లు, పారిశ్రామిక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@BRSparty@BRSHarish@TelanganaCMO@hydcitypolice@ECISVEEP@KTRBRS
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..!
అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..!
ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి, నిర్లక్ష్యం సహించేది లేదు..!
ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి–65 విస్తరణ పనుల్లో జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలపై పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను కొందరు కాంట్రాక్టర్లు తమ స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మార్చుకున్నారని మండిపడ్డారు.
మంగళవారం సాయంత్రం పటాన్‌చెరులోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి రుద్రారం గణేష్ గడ్డ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు. నిర్మించిన కొద్ది రోజులకే సర్వీస్ రోడ్లు దెబ్బతినడం, వర్షపు నీటి కాలువలు కూలిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
రహదారి విస్తరణలో వెలికితీసిన విలువైన మట్టిని ప్రజా అవసరాలకు వినియోగించకుండా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు ఆ మట్టిని అందించాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
రహదారి విస్తరణలో తొలగించిన మహనీయుల విగ్రహాలను పటాన్చెరు సాకి చెరువు కట్టపై ప్రతిష్ఠించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.
ఇప్పటివరకు 20 సార్లకు పైగా సమీక్ష సమావేశాలు నిర్వహించినా పనుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
కాంట్రాక్టర్లు, అధికారులు వెంటనే తమ పనితీరును మార్చుకుని నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, లేకపోతే ప్రజల తరఫున కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానని హెచ్చరించారు.
ఈ సమీక్ష సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ డీఈ సందీప్, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
చెరువుల సుందరీకరణకు కృషి..
ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు..
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధిలోని స్థలాల ఆక్రమణకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.
మంగళవారం సాయంత్రం నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గల పోచమ్మ కుంట, అమీన్పూర్ డివిజన్ పరిధిలోని దయారా పరిధిలోని జంగంకుంటల పరిధిలో చెరువు సరిహద్దులను నిర్ణయించి.. సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వడక్పల్లి గ్రామ చెరువు బఫర్ జోన్ పరిధిలో ప్రముఖ నిర్మాణ సంస్థ బఫర్ జోన్ ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించిందని స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందని.. వెంటనే దానిని తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందిస్తూ ప్రకృతి సమతుల్యతకు కీలకమైన చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని.. ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, డిఈ బాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.
గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు
కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. ఇటీవల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో బీరంగూడకు చెందిన క్రేజీ క్రూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో చిన్నారులను జిఎంఆర్ అభినందించారు. విద్యార్థి స్థాయి నుండి క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. @BRSparty
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే..
పటాన్చెరు గడ్డపై గులాబీ జెండా హోరు..
యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు..
ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో.. 1200 ల వాహనాల్లో తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు..
జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పల్లెలు, పట్టణాల నుండి కదం తొక్కిన నిరుద్యోగులు, బిఆర్ఎస్ కార్యకర్తలు
నిరుద్యోగుల గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..
యూత్ డిక్లరేషన్ పేరుతో యువత భవిష్యత్తుకు చరమగీతం పాడారు..
2028లో ఎగిరేది గులాబీ జెండాయే..
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు
@BRSparty
ఆగస్టు 19న పటాన్చెరు యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ సంఘం కళ్యాణ మండపాన్ని ఆగస్టు 19న ప్రారంభించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మాజీ ప్రజా ప్రతినిధులు, యాదవ సంఘం ప్రతినిధులు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పటాన్చెరు పట్టణంలోని యాదవుల కోసం ఆధునిక హంగులతో, పూర్తి సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఆగస్టు 19న కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానదేవ్, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిఈ కృష్ణవేణి, యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే!
ప్రజల గుండెల్లో గులాబీ జెండా రెపరెపలాడే!
పటాన్చెరు గడ్డపై గులాబీ జోరు పెరిగే!
యువజన సంగ్రామ సదస్సు లక్ష్యంగా గులాబీ దండు కదిలే!..
జై తెలంగాణ జై కేసీఆర్ జై జిఎంఆర్..
@BRSparty@BRSHarish@KTRBRS
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే!
ప్రజల గుండెల్లో గులాబీ జెండా రెపరెపలాడే!
పటాన్చెరు గడ్డపై గులాబీ జోరు పెరిగే!
యువజన సంగ్రామ సదస్సు లక్ష్యంగా గులాబీ దండు కదిలే!..
జై తెలంగాణ జై కేసీఆర్ జై జిఎంఆర్..
@BRSparty@KTRBRS@BRSHarish
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే!
ప్రజల గుండెల్లో గులాబీ జెండా రెపరెపలాడే!
పటాన్చెరు గడ్డపై గులాబీ జోరు పెరిగే!
యువజన సంగ్రామ సదస్సు లక్ష్యంగా గులాబీ దండు కదిలే!..
జై తెలంగాణ జై కేసీఆర్ జై జిఎంఆర్..
@BRSHarish@BRSparty@BRSHarish@KTRBRS
అందరికీ నమస్కారం..
రేపు అనగా 18-07-2026, శనివారం ఉదయం 10:00 గంటలకు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సు సందర్భంగా..
రేపు ఉదయం 07:00 గంటలకు GMR కన్వెన్షన్ సెంటర్ కి చేరుకుని..అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరాలని పటాన్చెరు శాసన సభ్యులు శ్రీగూడెం మహిపాల్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది.
దయచేసి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, యువత, మహిళా, విద్యార్థి విభాగాల నాయకులు, ప్రతినిధులందరూ సకాలంలో జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోవాలని విజ్ఞప్తి.
ఇట్లు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,
పటాన్చెరు. @BRSparty
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
తిరుమల:
పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తిరుమలలో భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుభిక్షం, అభివృద్ధి చేకూరాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
టైలర్స్ కాలనీలో రూ.55 లక్షలతో మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
అమీన్పూర్:
అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, రక్షిత మంచినీటి సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
అమీన్పూర్ డివిజన్లోని టైలర్స్ కాలనీలో జలమండలి ఆధ్వర్యంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ ప్రాంతంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మరింత బలోపేతం చేయడానికి నూతన పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ పనులు పూర్తయిన అనంతరం టైలర్స్ కాలనీ ప్రజలు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రతి కాలనీని ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, జలమండలి జిఎం శ్రీనివాస్ రెడ్డి, డీజీఎం శివ, ఏఈ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, జగదీష్, గోపాల్, రాములు, చంద్రశేఖర్, రాజు, బాలరాజు, స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఆరు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ
పటాన్చెరు
ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
బీరంగూడ ఎన్ఎస్ఎల్ కాలనీకి చెందిన పుష్పలత, ప్రగ్య శ్రీ తల్లి కూతుర్లు. ప్రగ్యశ్రీ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. శస్త్ర చికిత్స తదనంతర ఖర్చుల నిమిత్తం మంజూరైన ఆరు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసిని సోమవారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసి లతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. @BRSparty
*సంగారెడ్డి*
*హరీష్ రావు కామెంట్స్@పటాన్ చెరు*
రేవంత్ రెడ్డి కి ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేనా అన్నట్టు సమాధానం ఇచ్చాను
ప్రజల్లో మార్పు చూస్తుంటే మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది
స్కామ్ ల ప్రభుత్వం పోయి స్కిం ల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, రాష్టాల్లో SIR ప్రక్రియతో ఓట్లు గోల్ మాల్ అయ్యి ఫలితాలు మారాయి అంటున్నారు
కాబట్టి SIR పై అలెర్ట్ గా ఉండాలి
GHMC ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశవాహులు SIR ని సీరియస్ గా తీసుకోండి
BLA లను పట్టించుకోండి
లేకపోతే మీకే ఇబ్బంది గుర్తు పెట్టుకోండి
పటాన్ చెరు గడ్డ... BRS అడ్డా
మున్సిపల్ ఎన్నికల్లో 5 కి 5 చైర్మన్ సీట్లు గెలిచాం
యావత్తు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు వైపు చూసింది
రేవంత్ రెడ్డి 30 వేల కోట్ల రూపాయల భూములను అమ్మాడు
BRS హయాంలో పెట్టిన పథకాలను రేవంత్ పక్కన పెట్టారు
కళ్యాణాలక్ష్మి చెక్కు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తుంది
అందాల పోటీలు, బోధి భవన్ కి వందల కోట్లు ఖర్చు చేశావు
రాహుల్ గాంధీకి డబ్బులు పంపడానికి, పక్క రాష్ట్రాల్లో యాడ్ లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి
మూసి సుందరికరణ కోసం డబ్బులు ఉంటాయి
అంటే నీకు కమీషన్ వచ్చే వాటికి డబ్బులు ఉంటాయి... కానీ పేదలకు ఇచ్చే వాటికి డబ్బులు ఉండవు
ఔరంగజేబు జుట్టుకు టాక్స్ కట్టినట్టు...రేవంత్ భూమికి శిస్తు పెడతాడట
*సిగాచి ప్రమాదంలో 54 మంది చనిపోతే రేవంత్ ఒక్క రూపాయి ఇవ్వలేదు*
*కంపెనీ వాళ్లే బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చారు*
*రేవంత్ ది నోరా..మోరా అర్థం కావడం లేదు*
కాంగ్రెస్ కి ప్రజలు దూరం అవుతున్నారు
కేసీఆర్ కట్టిన ఆస్పత్రికి ఇప్పటికి ప్రారంభం చేయలేదు
పటాన్ చెరులో IT పార్కు కోసం భూమి కేటాయిస్తే దాన్ని రేవంత్ అమ్మేశారు
కేసీఆర్ ఉన్నప్పుడు కనురెప్ప కొట్టేంత సేపు కూడా కరెంట్ పోలేదు
*రేవంత్ రెడ్డి గుడిని.. గుడిలో లింగాన్ని మింగేట్టట్టు ఉన్నారు*
*ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తాం*
*ఉమ్మడి మెదక్ జిల్లాలో సీట్లు పెరిగితే అవి కూడా మేమే గెలుస్తాం*
*వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తాం అని రేవంత్ అంటున్నారు*
*వన్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ అంటే
9 సీట్ల కంటే ఎక్కువ గెలవవు*
@BRSparty@BRSHarish
పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే నంబర్-1గా తీర్చిదిద్దుతాం..
రూ.21 కోట్లతో 172 దుకాణాల నిర్మాణం వేగవంతం..
మేకల మండి, చేపల మార్కెట్, స్లాటర్ హౌస్, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ..
అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు
వ్యవసాయం, వాణిజ్యం, ఉపాధి రంగాలకు కొత్త ఊపిరి పోస్తూ పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక, ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
గురువారం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించి, నిర్ణీత గడువులోగా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో 12 సంవత్సరాల క్రితం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి దశలవారీగా నిధులు మంజూరు చేస్తూ మార్కెట్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం 21 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను కేటాయించడంతో పాటు కొత్త వ్యాపారులకు కూడా లైసెన్సులు మంజూరు చేసి వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం మార్కెట్‌కు పన్నులు, కిరాయిలు, టెండర్ల ద్వారా ఏటా సుమారు రూ.6 కోట్ల ఆదాయం సమకూరుతోందని, దీనిని మరింత పెంచేందుకు కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ యార్డులో ఆధునిక మేకల మండి, చేపల మార్కెట్, అత్యాధునిక స్లాటర్ హౌస్, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే రోజువారీ కూరగాయల విక్రయాలు నిర్వహించే చిరు వ్యాపారులకు ప్రత్యేక షెడ్లు నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ప్రభుత్వ నిధులతో పాటు మార్కెట్ స్వంత ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన, నంబర్-1 మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు..
తిమ్మక్క చెరువుకు సరికొత్త వైభవం..
రూ.4.45 కోట్లతో సుందరీకరణ పనులు..
హెచ్ఎండిఏ–సీఎస్ఆర్ నిధులతో బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, హరితవనంతో పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నాం
ప్రజల ఆరోగ్యం.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూలై 9:
పటాన్చెరు పట్టణానికి మరో ఆణిముత్యంగా తిమ్మక్క చెరువు రూపుదిద్దుకోనుంది. రూ.4.45 కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ చెరువు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలవనుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
గురువారం ఉదయం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులతో కలిసి తిమ్మక్క చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యతపై ఆరా తీస్తూ..ప్రతి నిర్మాణం అత్యుత్తమ ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని పరిసరాలు, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గంలోని చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా తిమ్మక్క చెరువును అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.
చెరువు అభివృద్ధికి హెచ్ఎండిఏ నుంచి రూ.3.05 కోట్లు, ఏపీఆర్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.40 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే వాకింగ్ ట్రాక్ నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలోనే బతుకమ్మ ఘాట్, ఓపెన్ జిమ్, ఆకర్షణీయమైన స్వాగత తోరణాలు, విశ్రాంతి బెంచీలు, చిన్నారుల ఆట స్థలం, అందమైన ల్యాండ్‌స్కేపింగ్, హరితవనం అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు.
అంతేకాకుండా రూ.30 లక్షల వ్యయంతో చెరువు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు పూర్తయిందని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత తిమ్మక్క చెరువు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చే ప్రజలకు, కుటుంబ సభ్యులతో విహారానికి వచ్చే వారికి అత్యంత అనువైన ప్రదేశంగా మారుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా సాకి చెరువు, తిమ్మక్క చెరువులను పటాన్చెరు పట్టణానికి శోభాయమానమైన గుర్తింపుగా తీర్చిదిద్ది, ప్రజలు గర్వపడే ప్రజా ఆస్తులుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
పటాన్చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు
భారత మాజీ ఉప ప్రధాని, దేశంలో సామాజిక న్యాయ సాధనకు అవిరళ కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి స్థానిక మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు బిక్షపతి, శంకర్, వెంకటేష్, బల్వంత్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కన్నేపల్లి పర్యటనలో గాయపడిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరామర్శించారు.
సోమవారం ఉదయం శంభీపూర్ లోని
ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి కృపతో త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని అభిలాషించారు.
ఇష్టంతో చదవండి..లక్ష్యాన్ని సాధించండి..
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
ఇష్టపడి చదివి..క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచే సిన ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు 5000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఆధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మించి అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. పటాన్చెరు కేంద్రంలో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడం మూలంగా అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గం వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు మానసిక వికాస శిక్షణ తరగతులతో పాటు
విద్యార్థులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టడం పట్ల మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు అశోక్, ప్రభాకర్, వెంకటేష్, రాజు, ఇమ్రాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండండి..
ప్రతి ఓటు అత్యంత కీలకము..
బి ఎల్ ఓ ల పనితీరు అద్వాన్నం..
ఓటర్లకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం..
జూలై 12న పటాన్చెరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన..
ఎస్ ఐ ఆర్, బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ పై అవగాహన సదస్సు..
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంలో ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని.. అర్హులైన ఓటరు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ తరఫున నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి.. అర్హులైన ప్రతి ఓటు ఎస్ఐఆర్లో నమోదు చేయించాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్, బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అంశాలపై బి ఎల్ ఏ లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 12 న పటాన్చెరు లోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు ముఖ్య అతిథిగా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సోమవారం ఉదయం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం మూలంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు నియోజకవర్గంలో నివాసం ఏర్పరచుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని.. వీరి ఓటు హక్కు అంశం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ తరపున నియమించబడిన బూతు లెవల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటరుకి ఎస్ఐఆర్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి.. తమ వివరాలు నమోదు చేయించుకునేలా కృషి చేయాలని సూచించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో బిఆర్ఎస్ ఓట్లను తొలగించాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు.
ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గంలో 70 వేల ఓట్లు తొలగించి.. ఆమెను ఓడించారని గుర్తు చేశారు.
పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిది డివిజన్లో ఉన్నాయని.. రాబోయే బల్దియా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలంటే ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత కార్యకర్తలపై ఉందని తెలిపారు..
రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్లకు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా సూచించాలని కోరారు.
ఈ అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 12వ తేదీన పటాన్చెరులో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే జిఎంఆర్ పిలుపునిచ్చారు.
@BRSparty@BRSHarish@KTRBRS@TSwithKCR