Top Tweets for #INSIDEstories
@Telugu360 #InsideStories #OutsideStories
You hide behind hashtags and hints, making everyone guess. Maybe that hero is doing the same with producers. If you really want accountability, name the hero and put the facts out there. Then the message will actually hit. 👀
#JustSaying.
#InsideStories
టాలీవుడ్ లో ఓ హీరో గురించి నిర్మాతల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఆ హీరో ఒట్టి డబ్బు మనిషని ప్రచారం..
ఓ సినిమా ఒప్పుకొన్నాక.. పారితోషికం ఇంతని ఫిక్సయ్యాక కూడా ఆ హీరోతో ఇబ్బందే అని చెప్పుకొంటుంటారు.
ఉదాహరణకు ఆ హీరో పారితోషికం రూ.20 కోట్లు అనుకొందాం. ఎగ్రిమెంట్ కూడా రూ.20 కోట్లకు జరిగిపోతుంది. దానికి మించి నిర్మాత ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పనిలేదు.
కానీ సినిమాకు అనుకొన్నదానికంటే బిజినెస్ బాగా జరిగినా, జరుగుతోందని తెలిసినా.. హీరో ప్లేటు పిరాయిస్తాడట.
''నా వల్లే మీకు డబ్బులు వస్తున్నాయి... నా పేరుతోనే మీరు బిజినెస్ చేసుకొంటున్నారు కాబట్టి.. నాకు ఇంకొంత అదనపు పారితోషికం ఇవ్వాల్సిందే'' అని పట్టుపడతాడట.
లేదంటే.. 'డబ్బింగ్ చెప్పను.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాను..' అని మొండికేస్తాడట.
పేరున్న హీరో.. భవిష్యత్తులో అతనితో అవసరాలు ఉంటాయి.. పైగా సినిమా చేతిలో ఉంది.. కాబట్టి.. నిర్మాత కూడా ఏమీ అనలేని పొజీషన్.
బిజినెస్ బాగా అవుతుంటే పారితోషికం అమాంతం పెంచేసే హీరో.. అదే నిర్మాతకు నష్టాలొస్తే ఎదురు ఇస్తాడా..? ఈ విషయంలో మాత్రం ఆ హీరో మహా పిసినారట. డబ్బుకీ ప్రాణానికీ అంతలా లింకు పెట్టుకొన్నాడా హీరో.
మరి నిర్మాతలంతా ఆ హీరోని ఎందుకు భరిస్తున్నారో, వెంటపడి మరీ ఎందుకు సినిమాలు తీస్తున్నారో..?
#InsideStories
హీరోని చెప్పుతో కొట్టిన హీరోయిన్?!
👉ఇటీవల ఓ హీరోయిన్.. ఓ హీరోకు బ్రేకప్ చెప్పేసిందంటూ వార్తలు గుప్పుమన్నాయి.
చిత్రసీమలో ఇలాంటి బ్రేకప్ లూ, ప్యాచప్ లూ మామూలే అనుకొందురు.
👉కానీ ఈ బ్రేకప్.. అన్ని కథల్లా కాదు. తీస్తే సినిమానే అవుతుందట. అన్ని ట్విస్టులూ.. డ్రామా ఉందంటున్నారు చెన్నై వాసులు.
ఆ హీరో... హీరోయిన్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి అనుకొన్నారు. కానీ హీరో మెల్లమెల్లగా హీరోయిన్ జీవితంపై ఆధిపత్యం చెలాయించాలని చూశాడు. తన వృత్తిగత జీవితంలోకీ చొరబడ్డాడు. ఏం చేసినా తన అనుమతి తీసుకోవాల్సిందే అంటూ హుకూం జారీ చేశాడు. ఇవన్నీ ఆమె భరించలేక పోయిందని టాక్.
👉బ్రేకప్ రోజున చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటెల్ లో ఇద్దరి మధ్యా పెద్ద గొడవే జరిగిందట.
హీరోని చెప్పుకో కొట్టి, నానా శాపనార్థాలూ పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయిందట. వెళ్లగానే ఇన్స్టాలో అన్ ఫాలో కొట్టి.. రిలాక్సయిపోయింది హీరోయిన్.
👉కానీ హీరో మాత్రం అప్పటి నుంచీ.. ఒంటరిగానే ఉంటున్నాడట. ఎవర్నీ కలవడం లేదట. ఆ అమ్మాయికి మాత్రం తనకు కావాల్సిన స్వేచ్చ దొరికింది.
'ఇండస్ట్రీలో చాలా ప్రేమకథలు విన్నాం కానీ, ఇలాంటి కథ ఎక్కడా వినలేదు' అని గుసగుసలాడుకొంటున్నారు కోలీవుడ్ జనాలు.
#InsideStories
'విశ్వంభర'లో కొత్త ఎపిసోడ్..
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న సినిమా.
అయితే ఇప్పుడు మరో ఎపిసోడ్ చేరిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్న చిత్రబృందం.
ఇందుకుగానూ మెగాస్టార్ చిరంజీవి మరో 4-5 రోజుల కాల్షీట్లు కేటాయించాలి.
ఈ ఎపిసోడ్ పూర్తయితే... సినిమా షూటింగ్ కు పేకప్ చెప్పేసినట్టే.
దసరా కానుకగా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. రిలీజ్ డేట్ పై స్పష్టత రావాల్సివుంది.
#Viswambhara

#InsideStories
గోపీచంద్ - సంకల్ప్ రెడ్డి సినిమా 'భరత వర్ష' రూ.30 కోట్లలోపు పూర్తి చేయాలని బరిలో దిగారు.
కానీ ఇప్పుడు రూ.70 కోట్ల వరకూ అవుతోంది.
అవుట్ పుట్ పై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉంది.
అందుకే నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఖర్చుకు వెనుకంజ వేయడం లేదు.
#BharataVarsha
#Gopichand
#InsideStories
టాలీవుడ్ లో రీ షూట్ల పర్వం కొనసాగుతోంది.
👉ఓ పాన్ ఇండియా సినిమా 30 శాతం ఫుటేజీ పక్కన పెట్టి రీ షూట్ చేశారు.
👉ఓ మిడ్ రేంజ్ సినిమా (జులైలో విడుదల) పాట మొత్తం పక్కన పెట్టి, మళ్లీ తెరకెక్కించారు.
👉ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ దక్కించుకొన్న ఓ హీరోతో.. స్టార్ డైరెక్టర్ చేస్తున్న సినిమాకు రిపేర్లు.. రీషూట్లు..
👉టైర్ 2 హీరోతో రెండో సినిమా తీస్తున్న దర్శకుడు.. రీషూట్ల పర్వం కొనసాగిస్తున్నాడు. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోంది.
👉ఇలా.. దాదాపు ఆరేడు సినిమాలు రిపేర్లు.. రీషూట్ల బారీన పడ్డాయి.
👉నిజానికి రీషూట్లు లేకపోతే.. ఇవన్నీ ప్రాఫిటబుల్ వెంచర్లే. రీషూట్ల వల్ల, సినిమా ఆలస్యం అవ్వడం వల్ల.. ఖర్చులు పెరిగిపోయాయి. ఆ భారం నిర్మాతే మోయాలి.
#Tollywood
#InsideStories
టాలీవుడ్ లో జాతకాల పిచ్చి ముదిరిపోయింది. సినిమా క్లాప్ కొట్టడానికి, ప్రీమియర్ షో వేయడానికీ జాతకం చూశారంటే.. అది ఓకే.
కానీ ఓ సంగీత దర్శకుడు... తన సినిమాలో ఎన్ని పాటలు ఉండాలన్నది సంఖ్యా శాస్త్రం చూసి మరీ డిసైడ్ చేసుకొంటున్నాడట.
ఓ దర్శకుడేమో.. 'రన్ టైమ్' ని కూడా జాతకం చూసే లాక్ చేస్తున్నాడట.
ఓ హీరోకి కథ చెప్పాలన్నా సరే... జ్యోతిష్యుడికి ఫోన్ వెళ్లిపోతుంది. 'ఈ టైమ్ లో చెప్పొచ్చా.. లేదా' అని.
టైటిల్ లో ఎన్ని అక్షరాలు ఉండాలో కూడా జ్యోతిష్యులే డిసైడ్ చేస్తున్నారు.
ఓ హీరో ఉన్నాడు.. ఆయనకు ఈ సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఏ ఆకు కూర ఏ రోజు తినాలో కూడా ఆయన జ్యోతిష్యుడ్ని అడిగి మరీ డిసైడ్ చేసుకొంటార్ట.
పోనీ.. ఇంత చేసినా సినిమాలు ఆడుతున్నాయా అంటే అదీ లేదు..
ఏం పిచ్చో ఇది..?!
किस एक्टर को किस करके आज भी Madhuri Dixit करती हैं पछतावा?
#MadhuriDixit #VinodKhanna #happybirthdaymadhuridixit #Dayavan #BollywoodSecrets #DhakDhakGirl #ControversialScenes #90sBollywood #DarkSecrets #InsideStories #BollywoodNews
🚨 Big Pan-India film with a MASS-ive star cast which is going to unveil soon faces major shoot delay!
Hero reportedly jetting off on vacation, putting the entire schedule on hold.
Priorities over production?
#Tollywood #Insidestories
#InsideStories :
అనుకున్న బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో ప్రాజెక్ట్ మొత్తం హీరో & డైరెక్టర్ కి అప్పజెప్పేసిన ప్రొడ్యూసర్...
సినిమా పై నమ్మకంతో హీరో, డైరెక్టర్ తర్జనభర్జనలు...
#InsideStories
👉ఓ మిడ్ రేంజ్ హీరో.. కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.
👉రూ.80 నుంచి రూ.100 కోట్ల బడ్జెట్ లెక్కలతో సినిమా మొదలెట్టారు.
👉అయితే నిర్మాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగుతూ, సాగుతూ షూటింగ్ జరుగుతోంది.
👉ఇలాంటి దశలో దర్శకుడు ఖర్చు తగ్గించాల్సింది పోయి.. మరింత పెంచేస్తున్నాడట.
👉దర్శకుడి అనుభవలేమి వల్ల ఇప్పటికే బడ్జెట్ తడిసి మోపెడు అవుతోంది. దానికి తోడు రీషూట్లు, పర్ఫెక్షన్లు అంటూ షూటింగ్ డేస్ పెంచుకొంటూ పోతున్నాడు. కనీసం మరో రూ.20 కోట్లు అదనంగా అయ్యే ఛాన్సుంది. ఇప్పటికే ఆ హీరో మార్కెట్ ని మించి ఖర్చు పెట్టారు. సినిమా సూపర్ డూపర్ హిట్టయినా తిరిగి రాబట్టడం కష్టం.
👉ఈమధ్య ఓ ఫైట్ కోసం వంద మంది ఫైటర్లతో పది రోజుల పాటు రిహార్సల్స్ చేయించార్ట. రిహార్సల్స్ కే దాదాపు అరకోటి ఖర్చు. ఇక ఈ సినిమా ముందుకు సాగేదెలా..?
👉సినిమా మొదలై చాలా కాలం అయ్యింది. ఇంకా 40 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది. పూర్తయ్యేటప్పటికి ఇంకెంత అవుతుందో అని నిర్మాతలో టెన్షన్ పట్టుకొంది.
#Tollywood
#InsideStories
కొంతమంది హీరోల మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే... తమ సినిమా కంటే పక్కవాళ్ల సినిమాల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు.
'ఆ హీరోకి, ఆ సినిమాకి అంత ఖర్చు పెట్టారు కదా, నా సినిమాకి మీరు అంత కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి..' అంటూ నిర్మాతల్ని బలవంతం చేస్తున్నారు.
ఒక నిర్మాత.. ఒకేసారి ఇద్దరు హీరోలతో రెండు సినిమాలు చేస్తుంటే ఇంకా బాధ.
'ఆ హీరోకైతే స్టార్ హీరోయిన్ ని పెట్టుకొంటే, నాకు వద్దా? ఆ సినిమా ప్రీ రిలీజ్ కి ఆ గెస్ట్ వస్తే నాకు వీళ్లను తీసుకు రారా' అని పోలికలు పెట్టి మరీ డిమాండ్ చేసే స్థాయికి వెళ్లిపోతున్నారు.
నా మార్కెట్ ఏంటి? నా కథేంటి? దానికి ఎంత ఖర్చు పెట్టాలి..? ఇవి కదా కావాల్సింది. కానీ.. అలా జరగడం లేదు.
''హీరోల్ని, వాళ్ల ఈగోల్నీ పెంచి పోషించడానికి మేం సినిమాలు తీయాలా'' అని నిర్మాతలు ఎదురు తిరిగే పరిస్థితి కి రానివ్వకూడదు.
అలా వస్తే... చిత్ర పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.
#InsideStories
ప్రభాస్ పేరెత్తగానే, యాంటీ ఫ్యాన్స్... డూప్, కిరణ్ రాజ్ అంటూ ట్రోలింగ్ మొదలెడుతుంటారు.
డూప్ వాడే హీరో ప్రభాస్ ఒక్కడేనా... మిగిలిన వాళ్లు వాడడం లేదా? అస్తమానూ ప్రభాస్ ప్రస్తావనే ఎందుకు తీసుకొస్తారన్నది అర్థం కాని విషయం.
ట్రోల్ చేసేవాళ్లకు తెలియని విషయం ఏమిటంటే కిరణ్ రాజ్ ని ప్రభాస్ పక్కన పెట్టి చాలా కాలం అయ్యింది.
'స్పిరిట్', 'ఫౌజీ' సినిమాల్లో నూటికి 90 శాతం ప్రభాస్ వర్జినల్ షాట్లే వాడుతున్నారు.
ఒకట్రెండు రిస్కీ షాట్లకు డూప్ వాడడం తప్పని సరి. ఇది తప్పూ కాదు, ట్రోల్ చేయాల్సిన విషయం అస్సలు కాదు.
ఇప్పుడు ఏది డూప్ షాటో, ఏది వీఎఫ్ఎక్స్ షాటో ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. వాళ్లకు దొరకడం, ఇలా ట్రోల్ అవ్వడం హీరోలకు కూడా ఇష్టం లేదు. అందుకే సాధ్యమైనంత వరకూ డూప్స్ ని పక్కన పెడుతున్నారు.
కొన్నిసార్లు నిర్మాతలే హీరోల్ని 'ఇది రిస్కీ షాట్. కాబట్టి మీ డూప్ వాడతాం..' అని బతిమాలుకోవాల్సివస్తోంది.
హీరోలతో వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు రిస్క్ ఎక్కువైనప్పుడు ఇలా ఆలోచించడం, పెరిగిన టెక్నాలజీని వాడుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు.
#Spirit
#Fouzi
#Prabhas
#InsideStories
ఓ నిర్మాణ సంస్థ ఎక్కువ సినిమాలు చేయాలన్న ఉద్దేశ్యంతో దాదాపు ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులందరికీ అడ్వాన్సులు ఇచ్చింది. కొంతమందితో సినిమాలూ చేసింది. కానీ సంస్థ ఒక్కసారిగా నష్టాల బాట పట్టింది.
దాంతో ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్సులు రికవరీ చేసుకొనే ప్రయత్నం ఉంది.
అందుకోసం ఓ టీమ్ ఏర్పాటు చేసింది.
ఈ టీమ్ పనేంటంటే.. అడ్వాన్సులు అందుకొన్న హీరోలు, దర్శకులకు ప్రతీ రోజూ ఫోన్లు చేయడం.. అడ్వాన్సులు వెనక్కి ఇవ్వమని బతిమాలడం.. రోజూ ఇదే పని.
పొద్దుటే ఈ ఫోన్ల గోల భరించలేక.. కొంతమంది వెనక్కి ఇచ్చారు.
ఇంకొంతమంది తెలివిగా ఫోన్ నెంబరు బ్లాకు చేసేశారు.
#InsideStories
👉ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఓ స్టార్ హీరో సినిమాలో ఓ లెంగ్తీ లిప్ లాక్ సీన్.
👉ఇలాంటి సీన్లో నటించడం ఆ హీరోకి పూర్తిగా కొత్త.
👉అందుకే మొదట 'నో' చెప్పినా, ఆ తరవాత దర్శకుడి కోసం 'ఓకే' చేయక తప్పలేదు.
👉సెట్లో అతి తక్కువ మంది క్రూ ఉండేలా జాగ్రత్త పడి, లిప్ లాక్ సీన్ షూట్ చేసిన దర్శకుడు.
👉ఇలాంటి సినిమలో.. ఇలాంటి కాంబోలో... ఇలాంటి సీన్.. నిజంగా షాకింగే!
#InsideStories
ఓ హిట్ సినిమా సీక్వెల్ కోసం కథ సిద్ధం అవుతోంది.
బడ్జెట్ కూడా ఫైనల్ చేశారు.
ఓటీటీ డీల్ ముందే క్లోజ్ చేసి, ఆ మొత్తం ఇన్వెస్టిమెంట్ గా మార్చుకోవాలని అనుకొంది చిత్రబృందం.
అక్కడే ఓటీటీ సంస్థ షాక్ ఇచ్చింది.
పార్ట్ 1 కి ఇచ్చిన దాంట్లో 50 శాతం కోత విధించింది. 'సగం డబ్బులే ఇవ్వగలం' అని తేల్చేసింది. మిగిలిన ఓటీటీ సంస్థలు కూడా ఇదే మాట మీద ఉన్నాయి.
ఓటీటీతోనే సగం పోతోంది అంటే... ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లాలా, వద్దా? అనే డైలామాలో పడిపోయింది చిత్రబృందం.
ఓటీటీలే ప్రాజెక్టు జాతకాల్ని డిసైడ్ చేస్తున్నాయి అనడానికి ఇదే పెద్ద సాక్ష్యం.
#Ott
#InsideStories
దురంధర్ ప్రభావం గట్టిగానే పడింది. ముఖ్యంగా కథకులు, దర్శకులపై.
తమ స్క్రిప్టుల్ని ఒక్కసారి రీ చెక్.. రీ రైట్ చేసుకొంటున్నారు.
ఓ స్టార్ దర్శకుడితో, స్టార్ హీరో సినిమా ఫిక్సయ్యింది. కథ కూడా రెడీనే. కానీ 'దురంధర్ 2' చూశాక.. ఆ దర్శకుడు మళ్లీ తన రైటర్స్ తో మీటింగ్ పెట్టాడట.
'దురంధర్' లా పెద్ద స్పాన్, కాన్వాస్ ఉన్న కథ రాద్దాం` అని ప్రిపేర్ చేస్తున్నాడట. అంతకు ముందు రాసిన కథ చెత్తబుట్టలోకే.
దేశభక్తి, జాతీయవాదం... వీటిపై కథలు రాయాలని దర్శకులకు హీరోలు సూచనలు చేస్తున్నార్ట. దర్శకులకు ఇదో కొత్తరకమైన టెన్షన్.
ఓ సూపర్ హిట్ సినిమా ఎఫెక్ట్ అలా ఉంటుంది మరి!
#Dhurandhar2
#InsideStories
'ఉస్తాద్ భగత్ సింగ్' మరో 15 రోజుల్లో రిలీజ్ అనగా మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యత దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్ తీసుకొన్నారు.
మళ్లీ ఇలాంటి 'మ్యూజికల్ ఛైర్' ఆట టాలీవుడ్ లో చూడబోతున్నాం.
ఓ పెద్ద సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడ్ని మార్చే ఆలోచన ఉంది.
ఆల్రెడీ ఆయన ట్యూన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆర్.ఆర్ కోసం మరో సంగీత దర్శకుడ్ని తీసుకొంటారని, అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.
మరి ఆ సినిమా ఏమిటో మీరేమైనా గెస్ చేయగలరా?
#InsideStories
ఓ సినిమా కోసం హీరోని ఒప్పించడానికి దర్శకుడు ప్రీ విజువలైజేషన్ చేసుకెళ్లాడు.
ఆ వర్క్ చూసి హీరో షాకయ్యాడు. సినిమా అంతా అలానే ఉంటుందని ఫీలై.. కథ ఓకే చేశాడు. సినిమా పూర్తయ్యింది.
తీరా రషెష్ చూస్తే.. ప్రీ విజువల్స్ లో చూపించిన సినిమా ఒకటి, తీసింది ఒకటి.
దాంతో హీరో పూర్తిగా అప్ సెట్. 'చెప్పిందేమిటి? తీసిందేమిటి' అంటూ హీరో ఫైర్ అవుతుంటే...
దర్శకుడేమో 'అడిగింది ఇవ్వలేదు... చెప్పినట్టు చేయలేదు' అంటూ కారణాలు వెదుకుతున్నాడు. ఎవరి వెర్షన్ వాళ్లది.
ప్రీ విజువలైజేషన్స్ తో హీరోల్ని పడగొట్టే దర్శకులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న నిజం.. ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది.
#InsideStories
👉పేరు మోసిన నిర్మాణ సంస్థ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొంది.
👉ఓ స్టూడియోకి ఇంచుమించు రూ.75 కోట్ల బాకీ పడింది. రన్నింగ్ లో సినిమాలు ఉన్నాయి కాబట్టి, అవన్నీ అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటాయి కాబట్టి, ఆ స్టూడియో కూడా ఏం అనలేని పరిస్థితి.
👉ఒక్క స్టూడియోకే ఇంత బాకీ ఉంటే.. మొత్తంగా ఎన్ని అప్పులు ఉన్నాయో అర్థం చేసుకోవొచ్చు.
👉బ్యాక్ ఎండ్ లో ఉన్న ఇన్వెస్టర్లు ఒకొక్కరిగా దూరం అవుతున్నారు.
👉ఎప్పటికైనా ఈ బుగడ పేలే ప్రమాదం ఉంది.
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




