@NagarajuReddy48 @TheNaveena 2024 lo BRS ekkada rule chesindi bro😳😳 they left in 2023 December inka nedra levvanattu unav congress govt form chesi 1yr crossed
డిసెంబర్ - 09, 2009
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు... తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి ముందడుగు పడ్డ రోజు.
#JaiTelangana
మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు
స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు
" కేసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. "
అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి..
దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజు
తెలంగాణ చరిత్రలో..
“నవంబర్ 29” లేకపోతే..
“డిసెంబర్ 9” ప్రకటన లేదు..
ఈ కీలక మలుపు లేకపోతే..
“జూన్ 2” గెలుపు లేనే లేదు..
దగాపడ్డ నేల విముక్తి కోసం..
ఉద్యమ సారథే ప్రాణత్యాగానికి సిద్ధమై..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరిపోసిన..
“దీక్షా విజయ్ దివస్” సందర్భంగా..
యావత్ తెలంగాణ ప్రజలకు..
లక్షలాది గులాబీ సైనికులందరికీ..
హృదయపూర్వక శుభాకాంక్షలు
జై తెలంగాణ
జై కేసీఆర్
✊✊✊✊✊✊
రైతే రాజు నినాదం కాదు
కేసీఆర్ ప్రభుత్వ విధానం
అడగకుండానే రైతుబంధు
అడగకుండానే రైతుబీమా
అడగకుండానే సాగునీళ్లు
అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు
అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు
దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో
వ్యవసాయ రంగం వెన్నువిరిగి
బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపి
వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది
కరోనా విపత్తులోనూ
కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ గారిది
ప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిది
రైతుబంధును రాజకీయం చేసి
రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించి
రైతుభీమాను మాయం చేసి
24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి
పంటల కొనుగోళ్లకు పాతరవేసి
సాగునీళ్లను సాగనంపి
అన్నదాతల ఆత్మగౌరవాన్న��� దెబ్బతీసి రైతును రహదారుల పైకి లాగిన
మీరా.. రైతుల గురించి మాట్లా��ేది !
రైతుభరోసాకు ఎగనామం పెట్టి
రుణమాఫీ పేరుతో కనికట్టు చేసినా
మీరా .. రైతుల గురించి మాట్లాడేది !
ఇల్లిల్లూ తిరిగి అబద్దపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీది
అధికారం దక్కాక ఇల్లిల్లూ తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కుని, కొనుక్కున్న చరిత్ర మీది
రైతులు ఎప్పుడూ .. ఆశపడతారు తప్ప అడుక్కోరు
సమయం రాక పోదు
మీకు గుణపాఠం చెప్పక పోరు
జాగో తెలంగాణ జాగో