125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణంలో నన్ను బాధ్యుడుగా చేసి, దళిత జాతి గర్వించేలా ఇంతటి గొప్ప అవకాశాన్ని అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @TSwithKCR గారికి యావత్ దళితబిడ్డల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు..🙏💐@BRSparty@ambedkariteIND@KTRBRS@TelanganaCMO
వెయ్యి రోజుల ధగా – కాంగ్రెస్ 420 మోసాలపై ధర్మపురిలో @KTRBRS పిలుపు మేరకు, @Koppulaeshwar1) గారి ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల వైఫల్యాలను ఎండగడుతూ 420 మీటర్ల పొడవైన ఫ్లెక్సీతో పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది..
@BRSparty@BRSHarish
రేవంత్ రెడ్డీ..!
అవును.. నువ్వు మాట్లాడిన ‘నంది ఎవరో.. పంది ఎవరో’ అన్న మాటలకు సమాధానం నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది.
మైకు దొరికిన ప్రతిసారీ కేసీఆర్ గారిపై అక్కసు వెళ్లగక్కడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ద్వారా నీ స్థాయి ఏమాత్రం పెరగదు.
పైగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటే నీ రాజకీయ సంస్కారం, ఆలోచనా దౌర్భాగ్యం ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమవుతున్నాయి
ముఖ్యమంత్రిగా ప్రజల కష్టాలను పట్టించుకోవాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. కానీ నీ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారీ కేసీఆర్ గారిపై నిందలు మోపడం, దుర్భాష లాడడం నీ ఏకైక అజెండాగా మార్చుకున్నావు.
ఈ డైవర్షన్ రాజకీయాలను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది.
ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించు @revanth_anumula తెలంగాణ అస్తిత్వం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమ రథసారథి కేసీఆర్.
స్వరాష్ట్రంలో పదేళ్లపాటు సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, సంక్షేమం, సమగ్ర మౌలిక వసతులతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు ఆయన.
అలాంటి నాయకుడిపై నోరుపారేసుకోవడం చాలా సులభమే కావచ్చు, కానీ ఆయనలా తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేయడం, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడం 1000 జన్మలెత్తినా నీవల్ల కాదు.
సూర్యుడిపై ఉమ్మివేస్తే అది తిరిగి నీ ముఖం పైనే పడుతుంది తప్ప సూర్యుడి తేజస్సు తగ్గదు. నువ్వు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా ఎన్ని బూతులు మాట్లాడిన, ఎన్ని తిట్లు తిట్టినా తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ గారి పేరును, ప్రజల గుండెల్లోంచి ఆయన ముద్రను చెరిపివేయడం ఎవరి తరమూ కాదు.
ఇంతకీ నీ పాలనలో ఏం సాధించావో ప్రజలకు సమాధానం చెప్పు. ఆరు గ్యారెంటీల పేరిట ఇచ్చిన హామీల అమలు ఎక్కడకు పోయింది? రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ, మహిళలకు సంక్షేమం, నిరుద్యోగ భృతి వంటి అనేక వాగ్దానాలపై నేడు ప్రజలు రోడ్లెక్కి నిలదీస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల గూళ్లను కూల్చివేయడం, మూసీ ప్రాజెక్టుల పేరుతో సాగిస్తున్న వివాదాలు, భూముల వ్యవహారాలపై వెల్లువెత్తుతున్న ప్రజాందోళనలకు నీ దగ్గర జవాబు ఉందా? ఈ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక, ప్రతిరోజూ కేసీఆర్ గారిని దూషిస్తే నీ పాలనా వైఫల్యాలు మరుగున పడిపోవు.
కేవలం తిట్లతో ప్రజల కడుపు నిండదు, విమర్శలతో వ్యవస్థాగత సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో ప్రజలకు పూర్తి అవగాహన ఉంది.
ప్రజలు చూసేది నీ ప్రగల్భాలు కాదు.. నీ పరిపాలన.
ప్రజలు కోరేది ప్రచార ఆర్భాటం కాదు.. నిజమైన పనితీరు.
ప్రజలు గమనిస్తున్నది నీ దూషణలు కాదు.. ఎన్నికల హామీల ఎగవేత.
ఇప్పటికైనా ఈ స్థాయిలేని చిల్లర మాటలు, డైవర్షన్ రాజకీయాలు బంద్ చేయి.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై నిజాయితీగా దృష్టి పెట్టు.
కేసీఆర్ గారి పై నీ మాటలను వెంటనే ఉపసంహరించుకొని, బేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వారి వైఫల్యాలను ఎండగట్టడానికి @KTRBRS ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
@
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు!
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు, రక్షణగా నిలిచే బంధానికి ప్రతీక అయిన ఈ పండుగ మీ జీవితంలో మరింత సంతోషాన్ని, అనుబంధాన్ని నింపాలని కోరుకుంటున్నాను.
#RakshaBandhan#HappyRakshaBandhan#SiblingLove"
మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రతం హృదయపూర్వక శుభాకాంక్షలు!
ఆ శ్రీ వరలక్ష్మీ దేవి అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ఎల్లవేళలా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పీడిత ప్రజల విముక్తి కోసం, సామాజిక న్యాయం కోసం గళమెత్తిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు. 💐
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు ధర్మపురి @BRSparty ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం నిలిపివేసిన సందర్బంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేయడం జరిగింది.
@BRSHarish@TSwithKCR
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల పంచమి హృదయపూర్వక శుభాకాంక్షలు!
ఆ నాగదేవత అనుగ్రహంతో మీ ఇంట సుఖశాంతులు, ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు మండలాల కేంద్రాల్లో @BRSparty మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 80.వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.
@KTRBRS@BRSHarish@TSwithKCR
పోరాటాల ఫలితం ఈ స్వాతంత్ర్యం.. ఐక్యతే మన అసలైన బలం! అమరుల ఆశయాలను నిజం చేస్తూ, దేశ ఔన్నత్యాన్ని సగర్వంగా నిలబెడదాం. భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳✊
#VandeMataram#ProudIndian#India
రాష్ట్ర ప్రజలకు శ్రీ మహాకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు
ఆ జగజ్జనని కృపాకటాక్షాలతో మీ ఇంట ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ఎల్లప్పుడూ నిండాలని మనసారా కోరుకుంటున్నాను
శ్రీ మహాకాళి దేవి మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా రక్షణగా నిలవాలని ఆశిస్తున్నాను.
@BRSparty
పాటను ఆయుధంగా, స్వరాన్ని శక్తిగా మార్చి పీడితుల కోసం పోరాడిన కవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు 🙏
తెలంగాణ సిద్ధాంతకర్త, మలిదశ ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన జ్ఞానదీపం...
మన ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామాలు! 💐
@BRSparty
ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీళ్లు కేవలం 'గ్రావిటీ' ద్వారానే పోతున్నాయని కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని, అసలు నిజాలు తెలుపుటకు ఈ రోజు నంది మేడారం విచ్చేసిన మాకు ఘన స్వాగతం
@BRSparty@KTRBRS@BRSHarish
ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీళ్లు కేవలం 'గ్రావిటీ' ద్వారానే పోతున్నాయని కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని, అసలు నిజాలు తెలుపుటకు ఈ రోజు నంది మేడారం పంప్ హౌస్ పరిశీలించి, ప్రజలకు వివరించడం జరిగింది.
@BRSparty@KTRBRS@BRSHarish@KCRBRSPresident @
కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, మంత్రులకు నీళ్లపై కనీస అవగాహన లేదు.
ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్లొస్తున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సోయి లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారానే ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీళ్లు తరలిస్తారనే నిజం.. ఈ తెలివిలేని అడ్లూరికి తెలియజెప్పడానికే ఈ యాత్ర చేపట్టాము.
- మాజీ మంత్రి @Koppulaeshwar1
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి అధ్యక్షతన రేపు అనగా తేదీ 02-08-2026 ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు కోటిలింగాల ఎల్లంపల్లి ప్రాజెక్టు, 10 గంటలకు నంది మేడారం నంది పంప్ హౌస్ పరిశీలించడం జరిగింది.
@BRSparty@KTRBRS@BRSHarish