మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు
•ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు
•పలమనేరు శిబిరంలో అటవీ శాఖ సన్నాహాలు పూర్తి
•ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు అడవి ఏనుగుల బెదడ నుంచి ఉపశమనం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి తరలించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో అడవి ఏనుగుల బెడదతో దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఉపముఖ్యమంత్రివర్యుల సూచనతో రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్ అనే కుంకీతో పాటు కర్ణాటక నుంచి తీసుకువచ్చిన అభిమన్యుని పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండూ… మానవ–ఏనుగు సంఘర్షణ నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత అనుభవం కలిగిన కుంకీ ఏనుగులు. ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్ లు ఆరు మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై విజయవంతంగా పూర్తి చేశాయి. ఇటీవల పలమనేరు సమీపంలో ఒంటరి మగ అడవి ఏనుగుని బంధించిన ఆపరేషన్ లో ఈ రెండు కుంకీలు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. రెండింటి మధ్య సమన్వయం, ఆపరేషన్లలో పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు ఒడిశా రాష్ట్రం నుంచి అడవి ఏనుగుల గుంపులు పదే పదే తరలివస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో చొరబడి పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అడవుల విభజన, అటవీ ఆవరణ తగ్గడం, ఆహారం, నీటి కొరత తదితర సమస్యల కారణంగా తరచూ అడవి ఏనుగులు ఒడిశా సరిహద్దుల నుంచి మన్యం జిల్లాకి చెందిన గ్రామాల్లో చొరబడుతున్నాయి. మన్యం జిల్లాలో ఏనుగుల బెడద నివారణకు ఒడిశా ప్రభుత్వంతో చర్చించి, తిరిగి మళ్లింపు చర్యలు చేపట్టడంతోపాటు ఆ రాష్ట్రం నుంచి కుంకీ ఏనుగులను కూడా తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అంతకంటే ముందు తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రెండు కుంకీలను పలమనేరు నుంచి గుచ్చిమి క్యాంపుకి తరలించాలని ఆదేశించారు. గుచ్చిమి క్యాంపు నుంచి ఈ రెండు ఏనుగుల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో సంఘర్షణల నియంత్రణ చర్యలు చేపడతారు. వీటితోపాటు సౌర కంచెల నిర్మాణం, ఏనుగులను నిరోధించేందుకు వీలుగా కందకాలు తవ్వడం, నీటి వనరుల అభివృద్ధి, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచి, సమస్య తీవ్రత ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అమలు చేయనున్నారు.
Brs ni congress ni question chesthunam ani TG kalthis
Modi ki support chesthunam ani anti modi kalthis
Converted ni minguthunamani converted kalthis
Reservations tisi dobbalani antunamani bhimta batch kalthis
Mellaga musugu tistaru be ready😅
Andhra Pradesh ranks No. 1 in the country for generating employment under rural employment schemes 🔥📈
Employment opportunities generated :
MGNREGS - 51,57,171
VB-G RAM G - 11,78,855
#PawanKalyanAneNenu#JSPWorks
"You may hate Modi ji. You may hate BJP. You may hate Pawan Kalyan. Your hatred for them shouldn't make you go against the nation.
An Indian should always condemn the anti-India rhetoric." - Pawan Kalyan
Well said Kalyan anna 👏
Standing with Pawan Kalyan and Jana Sena—raising our voice with respect, facts, and conviction. Every post, every reply, and every effort is for the values we believe in. Proud to be a PSPK fan. 💥❤️🤍 Jai Jana Sena! Jai Hind! 🇮🇳 #PawanKalyan#JanaSena#PSPK#JaiJanaSena#JaiHind
వేగం పుంజుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు
•40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్లైన్ నిర్మాణం పూర్తి
•పనుల్లో మరింత వేగం పెంచాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన
•జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. అధికారులతో సమీక్ష
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.