వైఎస్ జగన్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధిరాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని..
చంద్రబాబు పాలనలో పేద పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి - వైఎస్ జగన్
3,648 కి.మీ నా పాదయాత్రలో మీ కష్టాలు చూశా.. మీ బాధలు విన్నా. రైతన్నలు పడుతున్న ఆవేదన చూశాను.. పేద ప్రజల గుండె చప్పుడు విన్నాను. మీ అందరికి నేనున్నాననే భరోసా ఇస్తున్నాను. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రతి ఇంటికి నవరత్న��లు తీసుకువస్తాం - వైఎస్ జగన్
కేంద్రంలో ఎవరు ప్రధాని అవుతారో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రధాని ఎవరైనా కానివ్వండి ప్రత్యేక హోదాకు సంతకం పెట్టినా తరువాతే నేను మద్దతిస్తాను. మోదీ అయినా, రాహుల్ అయినా హోదా ఇచ్చే వారికి మద్దతిస్తాము - వైఎస్ జగన్
రాష్ట్ర విభజన సమయంలో మనకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పిల్లలకు న్యాయం చేయాలంటే ప్��త్యేక హోదా సాధించి తీరాలి. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, ఆస్పత్రులు వస్తాయి. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది - వైఎస్ జగన్
2014 ఎన్నికల్లో దేశం మొత్తం మోదీ ప్రభంజనం ఉందని తెలిసినా కూడా మనం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. అలాంటి ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి.. మోదీకి ఉన్న గ్లామర్ తగ్గిందని తెలిసి కూడా నేను ఎలా పొత్తు పెట్టుకుంటాను? - వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ఒక్కడిగానే వచ్చాడు.. ఎవరితోనూ పొత్తు పొట్టుకోలేదు. జగన్ దేవుడిని, ప్రజలను తప్ప ఎవరిని నమ్ముకోలేదు - వైఎస్ జగన్
అధికారంలోకి రాగానే పత్తికొండ నియోజకవర్గానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తాము. ఒక్కసారి వైఎస్ జగన్‌కు అధికారం ఇవ్వాలి. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి, కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలి - విజయమ్మ
చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. చివరికి ఆడవాళ్లను కూడా బజారుకీడుస్తాడు. లక్ష్మీ పార్వతీ లైంగికంగా వేధించిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించాడు. రోజాను ఇబ్బంది పెట్టడం మీరు చూసే ఉంటారు. మహిళలంటే గౌరవం లేని చంద్రబాబుకు మహిళలు ఎందుకు ఓటేయాలి? - వైఎస్ విజయమ్మ
చిన్నప్పుడు వైఎస్సార్‌కు చదువు చెప్పిన బీసీ కులానికి చెందిన మాస్టారు వెంకటప్ప గుర్తుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. వెంకటప్ప పేరుతో స్కూల్ కట్టించారు. ఈ స్కూల్లో 3 వేల మంది ఉచితంగా చదువుకుంటున్నారు - వైఎస్ విజయమ్మ
వ్యవసాయ ట్రాక్టర్ల రోడ్డు టాక్స్‌ను కూడా రద్దు చేస్తాము. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వ్యక్తులు ప్రమాదవశాత్తూ ఎవరు చనిపోయినా వైఎస్సార్ జీవిత బీమా కింద లక్ష రూపాయలు చెల్లిస్తాము - వైఎస్ విజయమ్మ
రైతులకు పట్టపగలు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాము. పంట వేసే ముందే మద్ధతు ధర ప్రకటిస్తామని, ధరల స్థిరీకరణ నిధిని రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాము. అలాగే రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధిని కూడా ఏర్పాటు చేస్తాము - వైఎస్ విజయమ్మ
గ్రామాల్లో ఏ రేషన్ కార్డు కావాలన్నా 72 గంటల్లో ��చ్చేవిధంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాము. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే కొనసాగిస్తాము. సీపీఎస్‌ను రద్దు చేస్తాము - వైఎస్ విజయమ్మ
వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కొత్తగా వచ్చిన పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా కొత్త చట్టం తీసుకువస్తాము. రాష్ట్రలో ఖాళీగా ఉన్న 2.42 లక్షల ఉ���్యోగాలను భర్తీ చేస్తాము - వైఎస్ విజయమ్మ
వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు ఎంత రుణమున్నా నాలుగు దఫాల్లో పూర్తిగా రుణం మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే మళ్లీ రుణాలు ఇచ్చేలా చేస్తాం. 45 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఐదు సంవత్సరాలకు కలిపి రూ.75 వేలు అందిస్తాం - వైఎస్ విజయమ్మ