లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “��ేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రత��� సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మిం��ి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటినా కెప్టెన్ #LionelMessi హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (ఉప్పల్) స్టేడియంలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు గోల్ సాధించి హైలైట్‌గా నిలిచారు.
⚽️ఫుట్‌బాల్ దిగ్గజాలు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) లతో కలిసి హైదరాబాద్ చేరుకున్న మెస్సీ స్టేడియంలో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి వరకు గ్యాలరీలో ఉన్న క్రీడాభిమానులకు అభివాదం చేస్తూ వారిలో జోష్ నింపారు.
⚽️ప్రారంభంలో సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్‌కు, అపర్ణ ఆల్ స్టార్స్ టీమ్‌కు మధ్యన సాగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను మెస్సీ ఆసక్తిగా తిలకించారు.
⚽️ఉత్తేజంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్-9 టీమ్ 4-0 గోల్స్‌తో విజయం సాధించింది. ఆర్ఆర్ టీమ్ తరఫున మధ్యలో చేరిన రేవంత్ రెడ్డి గారు నాలుగో గోల్ సాధించినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. అతిధిగా హాజరైన శ్రీ @RahulGandhi గారు ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు గ్యాలరీ నుంచి తిలకించారు.
��️రేవంత్ రెడ్డి గారు గోల్ చేసిన అనంతరం #Messi మైదానంలోకి వచ్చారు. మెస్సీకి స్వాగతంగా క్రీడాభిమానుల హర్షధ్వానాలతో స్టేడియం దద్దరిల్లింది. మొదట ఫుట్‌బాల్ టీమ్‌లకు చెందిన పిల్లలతో మెస్సీ కరచాలనం చేస్తూ సరదాగా గడిపారు. ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం మెస్సీ బృందాల వారిగా ఫుట్‌బాల్ డ్రిబ్లింగ్ చేస్తూ పిల్లలతో ఆడారు.
⚽️స్టేడియమంతా కలియతిరుగుతూ క్రీడాభిమానుల్లో జోష్‌ను నింపారు. ఒకచోట కాకుండా స్టేడియం నలుమూల తిరుగుతూ ఫుట్‌బాల్‌ను గ్యాలరీలోకి కిక్ చేస్తూ ప్రేక్షకులకు ఫుట్‌బాళ్లను బహూకరించారు.
⚽️మెస్సీతో పాటు రొడ్రిగో, సువారెజ్‌లు సైతం అభిమానులను అలరించారు. వారు స్టేడియంలో అన్ని వైపుల తిరుగుతూ ఫుట్‌బాల్ టీమ్‌లకు చెందిన పిల్లలతో బృందాల వారిగా రౌండప్ చేసి ఆడుతూ జోష్ నింపారు.
⚽️14 సంవత్సరాల తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన ఈ అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ క్రీడాభిమానులను మెప్పించారు. #MessiInHyderabad పర్యటన అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెస్సీతో పాటు హైదరాబాద్��ు చేరుకున్న ఫుట్‌బాల్ క్రీడాకారులు #LuisSuarez #RodrigaDePaul లు, రేవంత్ రెడ్డి గార్లు మైదానంలోకి దిగిన సందర్భంలో మెస్సీ.. మెస్సీ.. అంటూ స్టేడియం దద్దరిల్లింది.
⚽️చివరగా మెస్సీ పిల్లల టీముల వారిగా విడివిడిగా ఫోటోలు దిగారు. మెస్సీ చేతుల మీదుగా ఆర్ఆర్ 9 టీమ్ గోట్ #GOAT కప్‌ను స్వీకరించింది. అలాగే అపర్ణ ఆల్ స్టార్స్ టీమ్ రన్నరప్ కప్ అందజేశారు. అర్జెంటినా టీమ్ (నంబర్ 10) టీమ్ జర్సీని రాహుల్ గాంధీ గారికి, ర���వంత్ రెడ్డి గారికి బహూకరించారు.
⚽️ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు ముందు మ్యూజిక్ కన్సర్ట్, అద్బుతమైన లేజర్ షోతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ గాయకుడు @Rahulsipligunj నాటు నాటు... పాటతో అభిమానులను అలరించారు. గాయకురాలు @iamMangli పాటలతో అభిమానుల్లో జోష్ నింపారు. ప్రతాప్ రాణా ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాటను లియోనెల్ మెస్సీ కోసం అంకితం చేశారు.
⚽️భారత్ పర్యటన, అభిమానులు చూపిన ఆదరణ తనకెంతో ఆనందం కలిగించిందని మెస్సీ వ్యాఖ్యానించారు. ఈరోజు మీతో గడపడాన్ని ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
⚽️తెలంగాణకు స్వాగతం, తెలంగాణ ఈజ్ రైజింగ్.. కమ్ జాయిన్ ద రైజ్... అంటూ ముఖ్యమంత్రి గారు మెస్సీ బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాభిమానులకు మెస్సీ బృందం అభివాదంతో కార్యక్రమం ముగిసింది. #GOATIndiaTour #MessiInIndia #TelanganaRising
I wholeheartedly thank G.O.A.T Lionel #Messi … football greats Luis Suarez and Rodrigo de Paul, for accepting our invitation and gracing our city of #Hyderabad and enthralling all our sports lovers especially youth.
We are deeply grateful to our leader Shri @RahulGandhi ji for joining us and making the evening a memory of a lifetime.
I thank and congratulate all officers, security personnel, organisers and staff on duty across the city for ensuring we were able to showcase to the world that #Telangana means sports, Telangana means excellence, and Telangana means hospitality.
On behalf of my entire government,
I thank all sports lovers and fans for their best conduct and disciplined manner in which we played hosts to our guests.
#TelanganaRising #GOATIndiaTour #TelanganaZaroorAana #MessiInIndia
I look forward to welcoming and hosting G.O.A.T. Lionel Messi in #Hyderabad on December 13. It is an exciting moment for our city and for every football fan who has dreamt of seeing a legend like you on our soil.
Hyderabad is ready to host him with warmth, pride and the spirit that defines our people.
#GOATconcert #MessiinIndia #GOATTourIndia
#GOATTourIndia2025 #LM10 #MessiInHyderabad
ఆ మట్టి చేతుల స్పర్శలో…
స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది.
గుమ్మానికి కట్టిన…
మామిడాకుల తోరణంలో…
పేదల ఆత్మగౌరవం కనిపించింది.
ఊరు ఊరంతా…
అభిమాన తోరణం కట్టి…
ఇందిరమ్మ ఇళ్ల పండుగకు
నన్ను ఆహ్వానించింది.
నాకు…
ఎనలేని సంతృప్తిని కలిగించిన
ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుకకు
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా
వేదికయ్యింది.
#indrammaindlu #TelanganaRising