తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడానికి మనుషులు అక్కర్లేదు ప్రాణంలేని, పూర్తికాని, ప్రారంభంకాని ఈ కట్టడాలు, వాటి మనోభావాలు చాలు..😂
విమర్శ అంటే ఇంత హుందాగా, హృద్యంగా, సరదాగా ఉండాలి.. 😍👏👏
కానీ ఈ రెండు జాతీయ పార్టీల నాయకులు కార్యకర్తలు మాత్రం అసలు విషయాన్ని పక్కన పెట్టి పర్సనల్ మాట్లాడుతూ, బూతులు తిడుతూ రాజకీయం చేస్తాం అంటారు.. 🤦♂️🙆♂️
ఎక్స్‌లో ‘ఉప్పల్ ఫ్లైఓవర్’ (Uppal Flyover) పేరుతో ఉన్న ఒక ట్రోల్ హ్యాండ్లర్.. “నేను ఆపుతాను రా!” అంటూ ఆ బీజేపీ పోస్ట్‌కు సరదాగా కామెంట్ పెట్టాడు. ఇంకేముంది, దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ వెంటనే మెడ్చల్ ఫ్లైఓవర్, సుచిత్ర ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్ల పేర్లతో ఉన్న ఇతర హ్యాండ్లర్లు కూడా ఈ సరదా ట్రోలింగ్‌లో జతకలిశాయి. అంతేకాకుండా నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల నుంచి ‘ROB’ (Rail Over Bridge) పేర్లతో ఉన్న ఖాతాలు కూడా రంగంలోకి దిగాయి. “నువ్వు ఎలా వస్తావో మేము చూస్తాం” అంటూ బీజేపీని ఉద్దేశించి ఫన్నీగా కామెంట్లు చేస్తూ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ల ఫన్నీ చాటింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫ్లైఓవర్లు అన్ని కేంద్ర ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు.