KCR సర్ ప్రసంగాల్లోని భాషా సౌందర్యాన్ని, పద్యాలపై ఆయనకున్న పట్టు, సందర్భోచితంగా వాటిని ప్రయోగించే నేర్పును మరువలేం .తెలుగు సాహిత్యంలోని పద్య సంపదను రాజకీయ వేదికల మీదికి తీసుకొచ్చిన వక్తగా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.మాటకు అలంకారం మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా అద్దగలిగిన శైలి అది.
Thank You KTR garu, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు బలంగా ఉంటే సామాన్యులకు ఈ పరిస్థితి ఉండదు. ఎన్నో ప్రభుత్వ హాస్పిటల్స్, ఆరోగ్య శ్రీ ఉన్నా ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడుకోవాలి అంటే 'కాపాడుతాం, ధైర్యంగా రండి' అనే నమ్మకాన్ని అవి ఇవ్వట్లేదు. అందుకే స్పందిస్తారు అనుకున్న ��ాళ్ల దృష్టికి ఇలాంటి కొన్ని తేవాల్సివస్తోంది. ఇలా ప్రతి సారీ ట్యాగ్ చెయ్యడం ఆయా నాయకులకు కూడా భారమే, వ్యవస్థే వర్క్ చెయ్యాలి.. ఇది శాశ్వత పరిష్కారం కాదని తెలుసు. కానీ ఏం చెయ్యాలి?
మన హెల్త్ సిస్టంలో ఉన్న అతి పెద్ద జబ్బుకు చికిత్స జరగనంత వరకు ఈ తిప్పలు తప్పవు.
. @KTRBRS garu, he is from your constituency. సిరిసిల్ల నుంచి ఒక సిటిజన్ జర్నలిస్టు నిన్న క్లియర్ కట్ న్యూస్ యాప్ లో లకావత్ సిద్దు పరిస్థితి గురించి రాశారు. ఆయన రైతు, పొలానికి వెళ్లి వస్తోంటే ట్రాక్టర్ ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే బ్రెయిన్ సర్జరీ చెయ్యాలి అంటున్నారు. గుద్దిన అవతలి వ్యక్తీ రైతే, రూ. 50 వేలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ప్రస్తుతం యశోదా హాస్పిటల్లో చావుబతుకుల్లో ఉన్నారు. ఈ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్యశ్రీ పనిచెయ్యట్లేదని ఫ్యామిలీ మెంబర్ చెప్పారు. Please Help him.
Note: నేను పర్సనల్ గా వెరిఫై చేశాను.