ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి గౌతమి శ్వేత కోట గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత, సాధికారత కోసం మీరు అందించే సేవలు ఆదర్శప్రాయంగా నిలవాలని, మహిళా సంక్షేమం కోసం మీ కృషి మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మహిళల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు మీరు విశేష కృషి చేయాలని, మీ నూతన బాధ్యతల్లో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
#drraja #globalnritdp #kotagoutamiswetha #tdp #apwomencommission
కేంద్రం అండ.. కూటమి నాయకత్వం.. అభివృద్ధికి సమన్వయ బలం!
#drraja#globalnritdp#ncbn#naralokesh#aplocalbodyelections
కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్రంలో కూటమి నాయకత్వం, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లో సమన్వయ పాలనకు బాటలు పడుతున్నాయి. కేంద్రం అందించే సహకారాన్ని రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానిస్తూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేయడం ద్వారా అభివృద్ధికి వేగం పెంచే అవకాశం ఏర్పడుతోంది.
దివంగత ఎన్టీఆర్ సంకల్పంతో ప్రారంభమై.. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యకు అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అత్యున్నత గుర్తింపు తెచ్చిన ప్రతిష్టాత్మక సంస్థ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం. నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా, రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
#drraja #globalnritdp #DrNTRUniversityofHealthSciences
#VicePresidentOfIndia #CPRadhakrishnan
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఘానా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. అనంతరం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రూబీ జూబ్లీ వేడుకల్లో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
#drraja #globalnritdp #ncbn #naralokesh #tdp #CPRadhakrishnan #VicePresidentOfIndia #AbdulNazeer #GovernorofAndhraPradesh
పట్టణాభివృద్ధికి ఎన్డీయే కూటమి హామీ
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల సమగ్రాభివృద్ధికి స్థానిక సంస్థల పాలన అత్యంత కీలకమైనది. 15వ మరియు 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు వేల కోట్ల రూపాయల నిధులను నేరుగా కేటాయిస్తోంది. అలాగే అమృత్ 2.0 పథకం కింద తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు మరియు వీధి దీపాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తోంది. పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపడటానికి, పారదర్శక పాలన అందించడానికి రాబోయే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించి, అభివృద్ధికి మద్దతు తెలుపుదాం.
#drraja #globalnritdp #ncbn #naralokesh #tdp #LocalBodyElections2026
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోనూ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు. ఏపీలో ప్రతిపాదించిన సెమికండక్టర్ ప్రాజెక్టు తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.
#drraja #globalnritdp #ncbn #amitshah #aswinivaishnav #rammohan #tdp
పేదల ఇళ్లకు శాశ్వత హక్కులు.. సొంత ఆస్తులుగా భరోసా!
పేదలు నివసిస్తున్న ఇళ్లు, స్థలాలపై వారికి శాశ్వత హక్కులు కల్పించి, వాటిని వారి సొంత ఆస్తులుగా మారుస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఇళ్లపై, స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పేద కుటుంబాలకు ఆస్తి భద్రతను అందించే ఈ ప్రక్రియను ప్రభుత్వం మరిన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తోంది.
#drraja #globalnritdp #ncbn #naralokesh #tdp #LocalBodyElections2026
చెప్పాం..చేస్తున్నాం!
అన్న క్యాంటీన్ లను తిరిగి తెరుస్తామని 'చెప్పాం'... చెప్పినట్టుగానే 269 అన్న క్యాంటీన్లు తెరిచాం. మరిన్ని క్యాంటీన్లు తెరిచేందుకు కృషి 'చేస్తున్నాం'.
#drraja#globalnritdp#ncbn#naralokesh#annacanteen#tdp
ప్రభుత్వ సేవలు…మీ అరచేతిలోనే!
చేతిలోని మొబైల్ ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే భోజనం ఇంటికి వచ్చినట్లే, ప్రభుత్వ సేవలు కూడా ఒక్క బటన్‌తో మీ ఇంటికే చేరాలన్నది మా సంకల్పం.
‘చెప్పాం’… ‘మన మిత్ర’ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ మీ అరచేతిలోకి తీసుకొచ్చాం.
#drraja#globalnritdp#ncbn #naralokesh #tdp #LocalBodyElections2026
కూటమి అభ్యర్థులకు ఓటేయండి
#drraja#globalnritdp#ncbn#naralokesh#tdp#LocalBodyElection
పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.47,973 కోట్లతో పనులు చేపట్టింది కూటమి ప్రభుత్వం. పట్టణాభివృద్ధిలో మరింత దూసుకుపోవాలంటే... కూటమి ప్రభుత్వానికి మరింత సహకారాన్ని అందించండి. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.
చెప్పిన మాట నిలబెట్టుకున్నాం.. చేసిన అభివృద్ధిని చూపిస్తూ మీ ముందుకు వస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం.
#drraja#globalnritdp#ncbn#naralokesh#tdp #LocalBodyElections
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు సీఎం నివాళులు అర్పించారు. "షహీద్ పుస్తక్ టోలీ - అమరులు వారు" అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.
#drraja #globalnritdp #ncbn #apdgp #PoliceCommemorationDay
విజయవాడలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించిన "విజయవాడ ఉత్సవ్ 2.0" ముగింపు వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సంగీతం, నృత్యం, జానపద కళలు, సాంస్కృతిక ప్రదర్శనలతో దసరా ఉత్సవాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ ఉత్సవాలతో పాటు ‘సరస్ సదస్సు’ను కూడా ఇక్కడే నిర్వహించడం విజయవాడకు ఒక ప్రత్యేకమైన శోభను తెచ్చిపెట్టిందని ఆయన పేర్కొన్నారు.
#drraja #globalnritdp #ncbn #vijayadasami