రెండు కీలక సందర్భాల్లో చంద్రబాబు ‘సైలెంట్’
బీజేపీ పెద్దల్లో మళ్లీ మొదలైన అనుమానాలు
రాజకీయ అవసరాల కోసం ఎప్పుడైనా రూట్ మారుస్తారన్న సందేహం
కష్ట సమయంలో కేంద్రానికి నిలబడకుండా ‘గోడ మీద పిల్లి’లా వైఖరిపై చర్చ
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వైఖరిపై పొలిటికల్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చ నడుస్తోంది. ఆయన ‘సందర్భానుకూల మౌనం’పై బీజేపీలో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అంశాలు ఎదురైనప్పుడు బాబు అనుసరిస్తున్న తీరును ఢిల్లీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
1. దేశవ్యాప్త���గా ‘నీట్’ (NEET) పరీక్షల అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లతో ప్రతిపక్షాలు హోరెత్తించిన సమయంలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు నోరు విప్పలేదు. కేంద్రానికి గట్టిగా మద్దతుగా నిలవాల్సిన సమయంలో ఆయన సైలెంట్‌గా ఉండిపోవడం ఎన్డీయే వర్గాలను ఆశ్చర్యపరిచింది.
2. కేంద్ర ఎన్నికల సంఘం (ECI)పై జాతీయ స్థాయిలో విమర్శలు ముసురుకున్నప్పుడు కూడా బాబు వెంటనే స్పందించలేదని, పరిస్థితులు సర్దుమణిగిన మూడు-నాలుగు రోజుల తర్వాతే తన వైఖరిని తెలియజేశారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
గత చరిత్ర – ప్రస్తుత సమీకరణాలు
2014లో బీజేపీతో దోస్తీ చేసి, 2018 నాటికి ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మోదీ వ్యక్తిగత జీవితంపై అసభ్యకరంగా వ్యాఖ్���లు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది.
2024 ఎన్నికల సమయానికి మళ్లీ ఎన్డీయే గూటికి చేరి ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తుతున్నప్పటికీ, బాబు ఎప్పుడు ఎలా మారతారోనన్న అనుమానాలు బీజేపీ పెద్దల్లో పూర్తిగా తొలగిపోలేదని ప్రచారం జరుగుతోంది.
కష్ట సమయంలో కేంద్రానికి నిలబడకుండా ‘గోడ మీద పిల్లి’లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు.
రాజకీయ అవసరాల కోసం ఎప్పుడైనా రూట్ మారుస్తారన్న సందేహంపై బీజేపీ పెద్దల్లో చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం.
మరో క్రెడిట్ చోరీ కూటమి రెడీ
వైఎస్ జగన్ పూర్తి చేసిన ప్రాజెక్టులకే చంద్రబాబు మళ్లీ శంకుస్థాపనలు
చంద్రబాబు ప్రభుత్వ ప్రచార పిచ్చిపై ప్రజల్లో తీవ్ర చర్చ
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయి��, తుది దశకు చేరిన తాగునీటి ప్రాజెక్టులకే కొత్త పేర్లు తగిలించి, కూటమి ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతోంది. ప్రజాధనాన్ని వృథా చేస్తూ ప్రచార పిచ్చితో ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.700 కోట్లతో చేప���్టిన సమగ్ర తాగునీటి ప్రాజెక్టు 2023 నవంబర్‌నాటికే పూర్తయి, 807 గ్రామాలకు రక్షిత నీటిని అందించింది.
పులివెందుల వాటర్ గ్రిడ్ (రూ. 480 కోట్లు) 2026 ఆగస్టు నాటికే 96% పనులు పూర్తయిన ఈ పాత ప్రాజెక్టునే ఇప్పుడు కొత్తగా తామే చేపడుతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.
2019 నుండి జగన్ హయాంలోనే ఏకంగా 39.35 లక్షల కుటుంబాలకు కొత్తగా ట్యాప్ కనెక్షన్లు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ.26,823 కోట���ల విలువైన తాగునీటి పనులకు ఆమోదం తెలిపింది.
అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేపట్టిన 44,194 చిన్న తాగునీటి పనులను (రూ.10,000 కోట్లకు పైగా విలువైనవి) కూటమి ప్రభుత్వం రద్దు చేసి, గ్రామీణ తాగునీటి సదుపాయాలను ఆలస్యం చేసింది.
కేంద్ర జల్ జీవన్ మిషన్ పనులకు ‘అమరజీవి జలధార’ అని కొత్త బ్రాండింగ్ తగిలించి, రద్దు చేసిన పనులనే రూ.9,355 కోట్ల విలువైన 10 మల్టీ-విలేజ్ ప్రాజెక్టులుగా మళ్లీ శంకుస్థాపనలు చ��స్తున్నారు.
కేంద్ర డేటా బయటపెట్టిన నిజాలు
మొత్తం గ్రామీణ కుటుంబాలు: 95.53 లక్షలు
ట్యాప్ వాటర్ ఉన్న కుటుంబాలు: 72.73 లక్షలు (76% కవరేజ్)
ఇంకా కనెక్షన్ లేని కుటుంబాలు: 22.8 లక్షలు
ఎన్నికల ముందు శంకుస్థాపనల ఆర్భాటాలు తప్ప, కూటమి ప్రభుత్వం కొత్తగా సాధించిన పురోగతి శూన్యమని.. జగన్ మార్క్ ప్రాజెక్టులకు తమ స్టిక్కర్లు వేసుకోవడమే చంద్రబాబు ప్రభుత్వ ప్రచార నమూనా అని ప్రతిపక్షం ఎండగడుతోంది.
అమరావతి కనీస ఖర్చు రూ.2 లక్షల కోట్లు నిజం..
రాయలసీమకు లక్ష కోట్లు పచ్చి అబద్ధం
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ప్రచారం.. రాష్ట్ర నిధులన్నీ అమరావతికే మళ్లింపు
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి..
చర్చను డైవర్ట్ చేసేందుకు సీమకు లక్ష కోట్ల పెట్టుబడి అంటూ కూటమి హడావిడి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాపై, ఆర్థిక విధానాలపై గ్రామ స్థాయి నుంచి పట్టణాల దాకా తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆదాయాన్ని, ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకొస్తున్న లక్షల కోట్ల రూపాయల అప్పులను కేవలం అమరావతి నిర్మాణానికే కేటాయిస్తున్నారనే చర్చ జోరందుకుంది.
చంద్రబాబు అప్పుల భారం చివరకు సామాన్య ప్రజల నడ్డి విరుస్తుండటంతో, ప్రజల్లో వస్తున్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి ‘రాయలసీమకు లక్ష కోట్ల పెట్టుబడులు’ అంటూ కూటమి నాయకులు కొత్త డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి ఒక "సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ" అని, దానికి ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటించారు. కానీ నేడు జరుగుతున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి.
అమరావతి రాజధాని మౌలిక వసతులు, భవనాల ని��్మాణం కోసం ప్రాథమికంగానే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా.
బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థల నుండి రాష్ట్ర ��్రభుత్వ గ్యారంటీలతో తెస్తున్న లక్షల కోట్ల రుణాలను పూర్తిగా అమరావతి వైపే మళ్లిస్తున్నారు. ఈ అప్పులను తీర్చడానికి భవిష్యత్తులో ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప మరొక మార్గం లేదు.
రాష్ట్ర బడ్జెట్, అప్పులన్నీ అమరావతి వైపు మళ్లుతుండడంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ఈ తీవ్రమైన వ్యతిరేకత నుంచి చర్చను పక్కదారి పట్టించేందుకు కూటమిలోని మూడు పార్టీల నా��కులు ఇటీవల మదనపల్లెలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఏకంగా రూ.1 లక్ష కోట్లు కేటాయిస్తున్నామంటూ భారీ ప్రకటనలు గుప్పించారు. అయితే, ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమైన లెక్కలని, గతంలో కూడా ఇలాంటి గారడీ మాటలే చెప్పారని సీమ ప్రజలు కొట్టిపారేస్తున్నారు.
చిన్న శ్రీను, బడుకొండ ఇద్దరూ ఒకటే ప్యాక���జీ
స్థానిక సంస్థల్లో వైసీపీలో గెలిచిన వారిని టీడీపీలోకి లాగేందుకు ఓ డీఐజీ ద్వారా స్కెచ్
విశ్వసనీయ సమాచారంతో బడుకొండ అప్పలనాయుడుపై సస్పెన్షన్ వేటు
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ముందే వైసీపీ మాస్టర్ స్ట్రోక్!
విజయనగరం జిల్లా రాజకీయాల్లో స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ నమ్మకద్రోహం చేసేందుకు పన్నిన వ్యూహాన్ని వైసీపీ ముందస్తుగానే పసిగట్టింది. ఇటీవల టీడీపీలో చే���ిన చిన్న శ్రీను అతని వియ్యంకుడు బడుకొండ అప్పలనాయుడు ద్వారా వేసిన మాస్టర్ స్కెచ్‌ను భగ్నం చేసింది. వీరిద్దరూ వేర్వేరు కాదని, ఒకే ప్యాకేజీగా మారి పార్టీ వెన్నుపోటుకు స్కెచ్ వేశారన్న విశ్వసనీయ సమాచారంతో బడుకొండ అప్పలనాయుడిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
చిన్న శ్రీను, బడుకొండ అప్పలనాయుడు పరస్పరం వియ్యంకులు. చిన్న శ్రీను కుమార్తెను బడుకొండ అప్పలనాయుడి కుమారుడికి ��చ్చి వివాహం జరిపించారు. బంధుత్వంతో పాటు వీరిద్దరి రాజకీయ స్వార్థం కూడా ఒక్కటైంది.
చిన్న శ్రీను టీడీపీలోకి మారిన సమయంలోనే, చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన ఒక డీఐజీ ��్థాయి పోలీస్ అధికారితో బడుకొండ అప్పలనాయుడు రహస్యంగా సమావేశమైనట్లు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది.
చిన్న శ్రీను పార్టీ మారడానికి ముందే బడుకొండతో కలిసి టీడీపీ అధినాయకత్వంతో ఒక రహస్య ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో వైసీపీ బలంగా ఉండటంతో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాలు సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత, వైసీపీలో గెలిచిన వారిని టీడీపీలోకి తీసుకెళ్లే బాధ్యతను చిన్న శ్రీను ద్వారా బడుకొండపై పెట్టినట్లు కుట్ర వైసీపీ వర్గాలకు అందింది. పార్టీలో ఉంటూనే తిన్నింటి వాసాలు లెక్కబెడుతూ, పార్టీకి జరగబోయే నష్టాన్ని పసిగట్టిన వైసీపీ అధిష్టానం.. బడుకొండపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసి ఆ కుట్రను ప్రాథమిక దశలోనే భగ్నం చేసింది.
పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దశాబ్ద కాలంగా నమ్ముకున్న పార్టీని, నాయకత్వాన్ని మోసం చేసేందుకు సిద్ధపడిన ఈ ఫ్యామిలీ పొలిటికల్ పాట్నర్స్ తీరుపై జిల్లా వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోవర్టులను ముందే ఏరిపారేయడం ద్వారా పార్టీకి జరగాల్సిన పెద్ద డ్యామేజీని అధినాయకత్వం సమర్థవంతంగా నిరోధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికారం కోసం ‘కొణిదెల బ్రదర్స్’ అవతారాలు!
తమ్ముడు చేగువేరా టు సనాతని.. అన్న నాస్తికుడు టు ఆస్తికుడు
సోషల్ మీడియాలో ద్వంద్వ వైఖరిపై నెటిజన్ల సెటైర్లు
రాజకీయాల్లో పదవులు, అధికారం, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తమ భావజాలాన���ని ఎంత వేగంగా మార్చుకుంటారో చెప్పడానికి ‘కొణిదెల సోదరుల’ ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్నటి వరకు ఒక విధానాన్ని నమ్మి, దేవుడిని, ధర్మాన్ని హేళన చేసిన వారు.. అధికారం దక్కగానే మాట మార్చి, రంగులు మార్చేస్తున్నారని నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. గతంలో తనకు దేవుడిపై ఏమాత్రం నమ్మకం లేదని, తానొక నాస్తికుడిని అని బహిరంగంగా ప్రకటించిన ��ొణిదెల నాగబాబు వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
ఒకప్పుడు దేవుడు అంటే ఏంటో తెలియదని, వీలైతే ఒకసారి దేవుడిని కలవాలని ఉందంటూ వ్యంగ్యంగా మాట్లాడిన నాగబాబు వీడియోలు ప్రస్తుతం నెటిజన్ల చేతుల్లో ట్రెండ్ అవుతున్నాయి.
అధికారంలోకి వచ్చాక తీరు పూర్తిగా మారిపోయింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. "తెలుగువాడు నిజంగా అదృష్టవంతుడు, వేంకటేశ్వరస్వామి లాంటి పరి���ుభ్రమైన దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేదు" అంటూ ఆస్తిక ప్రవచనాలు వల్లె వేస్తుండటం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.
నాగబాబు కంటే ముందు ఆయన తమ్ముడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో తన సిద్ధాంతాలను మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. జనసేన పార్టీ ప్రారంభంలో విప్లవ వీరుడు చేగువేరాని, భగత్ సింగ్‌ను, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. బీజేపీతో జతకట్టిన తర్వాత అనూహ్యంగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారమెత్తారు.
అధికారం, పదవుల కోసం కొణిదెల సోదరులు ��ంతటి వైఖరినైనా మార్చుకుంటారనడానికి ఈ పరిణామాలు ప్రత్యక్ష నిదర్శనమని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి తమ్ముడు చేగువేరా విధానాల నుండి సనాతన ధర్మానికి మారితే.. అన్న నాగబాబు నాస్తికుడి నుండి ఆస్తికుడిగా, సనాతనవాదిగా మారిపోయాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ప్రజలను నమ్మించి, ఓట్లు పొందడానికి ఏ స్థాయికైనా దిగజారుతారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గతాన్ని మర్చిపోయి నేడు భక్తి వేదాంతాలు మాట్లాడితే జనం నమ్మరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొక్కలపై ప్రేమ సరే.. మనుషుల ప్రాణాలంటే పవన్ కు లెక్క లేదా?
జనసేన తొలి రాజ్యసభ ఎంపీ కొడుకు నిరుపేద యువతి ప్రాణాలు తీసినా లెక్కలేదా..?
45 రోజులు గడుస్తున్నా.. ఆ కుటుంబానికి న్యాయం ఏదీ..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్న నెటిజన్లు
మదనపల్లె బహిరంగ సభలో చెట్లను నరికివేస్తే తనకు కోపం వచ్చిందని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక అమాయక నిరుపేద యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే స్పందించని వారు, చెట్ల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మదనపల్లె సభలో చెట్లను నరికివేస్తే బాధపడ్డానని చెప్పిన పవన్ కళ్యాణ్.. తన పార్టీ ఎంపీ కొడుకు నిర్లక్ష్యానికి ఓ అమాయక నిరుపేద యువతి బలైనప్పుడు ఎందుకు స్పందించలేదు?
ఈ దారుణం జరిగి 45 రోజులు గడిచినా బాధితులకు న్యాయం జరగలేదు. కన్న కుమార్తెను కోల్పోయిన తల్లి తీవ్ర మనోవేదనతో మంచాన పడింది.
ఒక యువతిని కారుతో ఢీకొట్టి చంపిన వ్యక్తిపై కఠిన చర్యలు లేకపోగా, నిందితుడు దర్జాగా బయట తిరుగుతూ, కుటుంబంతో కలిసి పండుగలు చేసుకుంటున్న వీడియ��లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అధికార, ధన దర్పానికి నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు.
గతంలో మహిళ ఫిర్యాదుతో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్ పదవి నుంచి తప్పించడం తప్ప పవన్ కళ్యాణ్ తీసుకున్న యాక్షన్ ఏమీ లేదు..
అదే పార్టీలోని అత్యంత ధనవంతుడైన రాజ్యసభ ఎంపీ కొడుకు ఓ నిరుపేద యువతిని చంపినా పట్టింపు శూన్యం.
"ఆడవారి జోలికి వస్తే తాటతీస్తా, తోలు ఒలుస్తా" అని బహిరంగ సభల్లో హెచ్చరించే జనసేనాని, తన పార్టీకి చెందిన ఏకైక రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ ఉదంతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
‘వాటర్ మ్యాన్’ పాలనలో తీవ్ర దుర్భిక్షంలో ఏపీ
జాతీయ మీడియాల్లో ప్రచారానికి నిధులు.. పరిహారానికి నోచుకోని రైతులు
రిపబ్లిక్ టీవీ వార్షిక సమ్మిట్ కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.44 లక్షలు మంజూరు
రాష్ట్ర రైతులు కరువుతో అల్లాడుతున్న కనీస పరిహారం ప్ర��టించని చంద్రబాబు ప్రభుత్వం
"కరువు-చంద్రబాబు" కవల పిల్లలనే నానుడి మరోసారి నిజమవుతోంది. ఏపీలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పంటలు ఎండిపోయి రైతాంగం అల్లాడుతుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రచారాలు, జాతీయ మీడియాలో పెయిడ్ కథనాలు ఇప్పించుకోవడంలో నిమగ్నమైంది.
తానొక గొప్ప 'వాటర్ మ్యాన్' అని పత్రికల్లో, టీవీల్లో బిల్డప్‌లు ఇచ్చుకుంటున��న చంద్రబాబు.. కనీసం పంట నష్టపోయిన ఇన్పుట్ సబ్సిడీ గానీ, పరిహారాన్ని గానీ ప్రకటించకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఆగ్రహంతో రగిలిపోతోంది.
రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మొత్తం 688 మండలాలకు గానూ, ఏకంగా 388 మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయి. కరువు మండలాల్లో అత్యధికంగా 186 మండలాలు, తీవ్ర కరువు ఉన్న మండలాల్లో 159 ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, రాజధాని అమరావతి, ప్రకాశం జిల్లాలు కూడా కరువు దెబ్బకు విల��ిలలాడుతున్నాయి. అనకాపల్లి, బాపట్ల, మార్కాపురం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రకటించిన మండలాలన్నీ తీవ్ర కరువు కిందే నమోదు కావడం గమనార్హం.
ప్రభుత్వం మరో 300 మండలాలను కరువు జాబితాలోకి చేర్చకుండా తీవ్ర అన్యాయం చేసింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలను పూర్తిగా కరువు జాబితా నుంచే మినహాయించి ఆ ప్రాంత రైతుల ప���ట్టకొట్టారు.
ఆకలిమంటలతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవడానికి ఒక్క రూపాయి కేటాయించని చంద్రబాబు ప్రభుత్వం, తన పబ్లిసిటీ కోసం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ టీవీ వార్షిక సమ్మిట్‌కు ఏకంగా రూ. 43.83 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
రోజుకో జిల్లాలో ప్రచార సభలు పెడుతూ, "వాటర్ మ్యాన్" అని డప్పు కొట్టుకోవడమే తప్ప, పొలాల్లో ఎండిపోతున్న పంటలకు నీరివ్వడంలోనూ, ఎండిన పంటలకు నష్��పరిహారం అందించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ఆగ్రహిస్తున్నారు. పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధలో పదో వంతు కూడా రైతుల సంక్షేమంపై లేకపోవడంపై రైతులు ��ండిపడుతున్నారు.
రామయ్య దుస్థితికి వెనుక లోకేష్
గత ప్రభుత్వ అద్భుత విధానాలకు మంగళం పలికిన విద్యా శాఖ మంత్రి
అందుకే బడి బయట ఇలాంటి బాలలు ఎంతోమంది..
ఆకలిమంటలతో, గొర్రెలు మేపుతూ సరిగ్గా నడవలేని దీనస్థితిలో కనిపించిన 8 ఏళ్ల బాలుడు రామయ్య ద��నీయ గాథ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి కళ్లను చెమర్చేలా చేసింది. బడిలో ఉండాల్సిన వయసులో అభం శుభం తెలియని పసివాడు, తల్లిదండ్రులకు దూరమై గొర్రెలు కాచుకుంటూ ఇంటికి దూరంగా కాలం వెళ్లదీస్తున్న ఈ హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర అలజడి రేపింది.
అయితే, రామయ్యకు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించడానికి, ఈ రకమైన అమానవీయ ఘోరానికి ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, విద్యా శాఖ మంత్రి లోకేష్ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
అటకెక్కిన పర్యవేక్షణ..
వైసీపీ హయాంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సంక్షేమంతో పాటు ప్రతీ ఇంటికీ ఒక స్పష్టమైన ట్రాకింగ్ నెట్వర్క్ ఉండేది. వెల్ఫేర్ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇల్లు, పిల్లలు, వృద్ధుల వ��వరాలను నిరంతరం పర్యవేక్షించేవారు. సచివాలయ పరిధిలో చిన్నపిల్లలు బడికి వెళ్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేవారు. ఒకవేళ బడి మానెస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించే బాధ్యత సచివాలయ వెల్ఫేర్ సిబ్బందిపై ఉండేది.
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక జగన్ తెచ్చిన ఈ సచివాలయ పర్యవేక్షణ వ్యవస్థను పూర్తిగా పక్కనబెట్టేశారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలపై పర్యవేక్షణ కరువై రామయ్య లాంటి బాలలు అభాగ్యులుగా మారుతున్నారు.
రామయ్యకు ఈ గతి పట్టేదా..?
గ్రామాల్లో మహిళా ప��లీసింగ్, దిశ యాప్, సచివాలయ పిల్లల ట్రాకింగ్ విధానాలను ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే వాదన ఇప్పటికే ఉంది. మునుపటి మాదిరిగా సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసి ఉంటే, రామయ్య బడి బయట ఉండే పరిస్థితి వచ్చేదా..? పుస్తకం పట్టుకోవాల్సిన చేతులతో గొల్లకోల మోయాల్సిన దుస్థితి వచ్చేదా..?, ఇంతటి దయనీయ స్థితికి చేరేవాడు కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సకల శాఖలకు తానే అధిపతిగా వ్యవహరిస్తూ.. తాను మంత్రిగా ఉన్న పాఠశాలల విద్యావ్యవస్థపై నారా లోకేష్ పర్యవేక్షణ శూన్యంగా మారడంతోనే ఇలాంటి అమానుష సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని రామయ్య ఉదంతం బయటపడింది కానీ.. రాష్ట్రంలో వెలుగులోకి రాని రామయ్యలు, బడికి దూరమైన అభాగ్య బాలలు ఇంకా ఎంతమంది ఉన్నారోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా��ు.
తక్షణమే ప్రభుత్వం కళ్లుతెరిచి సచివాలయ వ్యవస్థ ట్రాకింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేయాలని, విద్యావ్యవస్థలో పర్యవేక్షణను పునరుద్ధరించి, రామయ్య లాంటి బాలలను గుర్తించి, విద్యాభ్యాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో ‘అర్ధరాత్రి’ వింత ఓటింగ్.. దేశ వ్యాప్త��గా మరోసారి చర్చ
ఎన్నికల కమిషన్‌కు కేంద్రమంత్రి భర్త పరకాల ప్రభాకర్ సవాల్
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ లేవనెత్తిన సాంకేతిక ప్రశ్నలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
▫️ ఏపీలో టీడీపీ కూటమి సాధించిన విజయం వెనుక పోలింగ్ రోజు అర్ధరాత్రి వేళ అకస్మాత్తు��ా పెరిగిన ఓటింగ్ శాతాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ఆధారాలతో సహా బహిరంగ సవాల్ విసిరారు.
▫️ సామాన్య మానవ మాత్రులకు ఏమాత్రం సాధ్యంకాని స్పీడ్ ఓటింగ్ ఎలా జరిగిందో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే జవాబు చెప్పాలని నిలదీశారు.
▫️ పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు 68.04%గా ఉన్న ఓటింగ్, రాత్రి 8 గంటలకు కేవలం 0.08% మాత్రమే పెరిగి 68.12%కి చేరిందని పరకాల ప్రభాకర్ గణాంకాలు బయటపెట్టారు
▫️ కానీ, రాత్రి 11:45 గంటల ప్రకటనలో ఒక్కసారిగా 76.50%కి పెరిగి, కేవలం 3 నుండి 4 గంటల్లోనే ఏకంగా 34,63,767 అదనపు ఓట్లు వచ్చి చేరడం తీవ్ర అనుమానాలకు ఆస్కారమిస్తోంది.
▫️ ఆ తర్వాత తుది గణాంకాల్లో ఓటింగ్ శాతాన్ని 81.86%గా ఖరారు చేయగా, సాయంత్రం 5 గంటల తర్వాత మొత్తంగా 12.54% ఓటింగ్ అంటే 51,83,249 ఓట్లు జతకావడంపై దేశవ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది.
▫️ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,500 బూత్‌లలో రాత్రి 11:45 నుండి 2:00 గంటల మధ్య ప్రతి బూత్‌కు సగటున 491 ఓట్లు పడ్డాయని, అంటే నిమిషానికి 3.6 మంది ఓటర్లు ఓటు వేశారని పరకాల ప్రభాకర్ లెక్కగట్టారు.
▫️ కానీ, ఏపీలో అర్ధరాత్రి సమయంలో ప్రతి 20 సెకన్లకు ఒక ఓటు చొప్పున గంటల తరబడి పడుతూనే ఉందని, సాయంత్రం 5 గంటల ముందు వరకు గంటకు సగటున పడిన 60.7 ఓట్లతో పోలిస్తే ఇది అసాధారణ వేగమని స్పష్టం చేశారు.
▫️ అసెంబ్లీ, లోక్‌సభలకు సమాంతరంగా ఓటింగ్ జరిగిన వేళ, ఐడీ తనిఖీ, సిరా గుర్తు వేయడం, రెండు ఓట్లు వేయడం వంటి ప్రక్రియలు కేవలం 20 సెకన్లలో ముగియడం సాంకేతికంగా ఏమాత్రం సాధ్యం కాదని ఆయన నిరూపించారు.
▫️ రెండు వేర్వేరు ఓట్లు వేసే క్రమంలో వివిపాట్ (VVPAT) మిషన్ స్లిప్ ప్రింట్ అయి కింద పడటానికి మాత్రమే కనీసం 14 సెకన్ల సమయం పడుతుందని పరకాల ప్రభాకర్ గుర్తుచేశారు.
▫️ ప్రింటింగ్‌కే 14 సెకన్లు ��ోతే, మిగిలిన 6 సెకన్లలో ఓటరు గుర్తింపు తనిఖీ, వేలికి సిరా గుర్తు వేయడం, రెండు వేర్వేరు ఓట్లు వేయడం సాధ్యమేనా అని ఆయన ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించారు.
▫️ ఈ రకమైన అసహజ వేగంతో కూడిన ఓటింగ్ నమోదు వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలని, సాధారణ పౌరులకు సైతం ఈవీఎంల ద్వారా ఏదో అక్రమం జరిగిపోయిందనే సందేహాలు బలపడుతున్నాయని మండిపడ్డారు.
▫️ ఓట్ల పోలింగ్ వేగం, అర్ధరాత్���ి నమోదైన లక్షలాది ఓట్ల వెనుక ఉన్న వాస్తవాలపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనం వీడి తక్షణమే సమాధానం చెప్పాలని విపక్షాలు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇండియా టుడే కాంక్లేవ్‌కు వైసీపీకి అందని ఆహ్వానం
నారా లోకేష్ విధించిన షరతులే కారణమా..?
వైసీపీ వస్తే ప్రభుత్వం తరఫు నుంచి ఎవరూ హాజరుకారంటూ బెదిరించారా..?
తాను చెప్పిందే నిజమని నమ్మించేందుకు వైసీపీని అడ్డుకున్నారని ఏపీలో చ���ర్చ
కొచ్చిలో నిర్వహించిన 'ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్' వేదికగా జరిగిన పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల నుంచి అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, బిఆర్ఎస్ నేత కేటీఆర్ వంటి వారు కూడా ఈ వేదికపై మాట్లాడారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కేవలం అధికార కూటమి ప్రతినిధిగా నారా లోకేష్ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీకి అ��లు ఆహ్వానమే దక్కకపోవడం వెనుక పెద్ద రాజకీయం దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఈ కాంక్లేవ్ నిర్వహణకు సంబంధించిన ఖర్చులను తామే భరిస్తున్నామనే నెపంతో, వైసీపీకి ఆహ్వానం పంపకూడదని నారా లోకేష్ షరతు విధించారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ వైసీపీ ప్రతినిధి ఈ సదస్సుకు హాజరైతే.. ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకానివ్వనని కండీషన్ పెట్టి మరీ ప్రతిపక్షాన్ని అడ��డుకున్నారని చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులు, విద్యార్థుల మరణాలు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు, నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతారనే భయంతోనే లోకేష్ ఈ రకమైన వ్యూహం పన్నారనే విమర్శలు వస్తున్నాయి.
కాంక్లేవ్‌లో విద్యాశాఖపై అడిగిన ప్రశ్నలకు లోకేష్ చెప్పిన సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, వైసీపీ రంగంలోకి దిగితే కూటమి ప్రభుత్వ తప్పులు బట్టబయలవుతాయనే ముందస్తు భయంతోనే ఈ ఆహ్వానాన్ని అడ్డుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
జాతీయ వేదికలపై ప్రతిపక్ష గొంతును నొక్కేయాలని చ��డటం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజాన్ని దాచడానికి ఆడే ఇటువంటి పొలిటికల్ గేమ్‌లు ఎక్కువ కాలం సాగవని వ్యాఖ్యానిస్తున్నారు.
అసాధ్యం అని తెలిసే.. బీసీ రిజర్వేషన్ల రాజకీయం
34 శాతం బీసీ రిజర్వే��న్ పెంపు పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్..?
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జీవోలు ఇచ్చారన్న కొట్టేసిన ఏపీ హైకోర్టు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు నాయుడు ఆడుతున్న "బీసీ రిజర్వేషన్" పొలిటికల్ డ్రామా బట్టబయలైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 105, జీవో 1065లను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ��ిధించిన 50 శాతం పరిమితి తీర్పులకు ఈ జీవోలు విరుద్ధమని స్పష్టం చేయడంతో, చంద్రబాబు సర్కార్ ��డిన రిజర్వేషన్ల నాటకం తుస్సుమంది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని, న్యాయస్థానాల్లో ఈ ఉత్తర్వులు నిలబడవని చంద్రబాబుకు ముందే తెలిసినా కేవలం ప్రచారార్బాటం కోసం, బీసీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి ఈ చట్టవిరుద్ధమైన జీవోల డ్రామా ఆడారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడమే ఆలస్యం, సొంత పార్టీ క్యాడర్‌తో తాను "బీసీ పక్షపాతి"నంటూ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయించుకుని పబ్లిసిటీ స్టంట్ చేశారు.
కోర్టులు ఈ రిజర్వేషన్లను కొట్టివేస్తాయని ముందే ఊహించిన చంద్రబాబు, ఆ సాకుతో ప్రతిపక్ష వైసీపీపై బురదజల్లేందుకు పక్కా స్కెచ్ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "మేము బీసీలకు 34 శాతం ఇచ్చాం.. కానీ వైయస్సార్సీపీ అడ్డుకోవడం వల్లే కోర్టు రద్దు చేసింది" అని చెప్పి నిందలు వేసేందుకు ఒక కుట్రపూరిత రాజకీయం ఆడారని విశ్లేషిస్తున్నారు.
గతంలోనూ తన అనుచరుడైన బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్లు వేయించి స్థానిక ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనని పలువురు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో అమలు కాదని తెలిసీ బీసీ రిజర్వేషన్ కార్డును వాడుకుంటూ వెనుకబడిన వర్గాలను దారుణంగా మోసం చేస్తున్నారని స్పష్టమవుతోంది.
ఏపీలో ఇరుముడి సినిమాను తలదన్నే దారుణ ఘటన
ప్రభుత��వ హాస్టల్ విద్యార్థినులను దగ్గరుండి మరీ ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి పంపించిన వంట మనిషి.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి KGVB హాస్టల్లో ఉంటున్న ఇద్దరు బాలికలను మభ్యపెట్టి ఒంగోలులోని రిటైర్డ్ డీఆర్డీఏ ఉద్యోగి వెంకట్రావు ఇంటికి పంపించిన వంట మనిషి.
నిందితుడి అసభ్య ప్రవర్తనతో భయపడి బయటకు వచ్చి స్థానికులను ఆశ్రయించిన బాలికలు. ప్రాణాలు అరచేతిలో పరుగెత్తిన ��ిద్యార్థినులు.
ఆగ్రహించిన గ్రామస్తులు, బంధువులు. నిందితుడి ఇంటిపై దాడి చేసిన బంధువులు, ఘటనా స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలదీత. తుని ఘటన తర్వాత కూడా పాఠశాలలు, హాస్టళ్లలో భద్రత కల్పించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర నిరసనలు
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆగ్రహం వ్యక్తం చేస్త���న్నట్లుగా, చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రకటనలు.
గతం మరిచిన సాయిరెడ్డి
వైసీపీలో సర్వాధికారాలు అనుభవించి.. ఇప్పుడు సొంత పార్టీపైనే విజయసాయిరెడ్డి నిందారోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పార్టీలో కీలక నాయకుడిగా చలామణి అయి, అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందిన ఆయన, ఈరోజు ఆ స్వేచ్ఛ, గౌరవ మర్యాదాలు ఇచ్చి, సమాజంలో ఒక నాయకుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు ఇచ్చిన పార్టీపై విమర్శలు గుప్పించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
2017 ఆగస్టు 29న జగన్ పాదయాత్రకు ముందు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల బాధ్యతలను సాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాకినాడలో మొత్తం 48 వార్డులకు గాను వైసీపీ కేవలం 10 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.
పార్టీ సిస్టమ్ మొత్తం సాయిరెడ్డి చేతుల్లో ఉన్నప్పుడు కాకినాడలో పార్టీని మెజార్టీ స్థానాల్లో గెలిపించలేకపోయిన సాయిరెడ్డికి, అసలు నాయకత్వ సామర్థ్యం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు వేరే ప్రాంతాల ఎన్నికలపై సవాళ్లు విసరడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖలో వైసీపీని ఒక్క సీటైనా గెలిపించగలరా అని సాయిరెడ్డి విసురుతున్న సవాళ్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. "అంత క్యాపబిలిటీ ఉన్న నాయకుడివైతే నాడే కాకినాడలో ఎందుకు గెలిపించలేకపోయావ్?" అని నిలదీస్తున్నారు.
పోనీ, విశాఖలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నీ పార్టీ తరఫున ఒక్క డివిజన్ అయినా గెలిపించుకోగలవా..? ఆ సామర్థ్యం విజయ సాయిరెడ్డికి ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు.
పిఠాపురం��ో వైసీపీ ఘన విజయం
ఓటమి జీర్ణించుకోలేక స్కూల్ ఎన్నికల్లోనూ జనసేన రాజకీయం
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించింది. కొడవలి పాఠశాల కమిటీ ఎన్నికల్లో రెండుసార్లు ఛైర్మన్‌గా విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి
వైసీపీ విజయాన్ని జీర్ణించుకోలేని జనసేన నాయకులు.. జనసేన నేతల ఒత్తిళ్ళలో ఎన్నికలను రద్దు ���ేసిన అధికారులు
కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఒత్తిళ్ళలో ఎన్నికలను రద్దు చే��ారని వైసీపీ నేతల ఆరోపణ
గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఉన్న మూడు పాఠశాలలకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ ఛైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక.
ఎంపీపీ యూపి పాఠశాల కమిటీకి జరిగిన ఎన్నికల్లో జనసేన ఛైర్మన్ అభ్యర్ధి నూకరాజుపై వైసీపీ అభ్యర్ధి శివ నాగేశ్వరరావు ఘన విజయం
ఓటమి జీర్ణించుకోలేక అధికారులపై ఒత్తిడి తెచ్చి స్కూల్ ఎన్నికను రద్దు చేయించిన జనసేన
సంక్షోభంలో చంద్రబాబు సర్కార్.. తెరపైకి వివేకా కేసు డ్రామా!
రాష్ట్రంలో వరుస నిరసనలతో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయినప్పుడల్లా వివేకా హత్య కేసును, లేని లిక్కర్ కేసులను తెరపైకి తీసుకురావడం పరిపాటిగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై సుప్రీం కోర్టు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, చీవాట్లు పెట్టినా పెడచెవిన పెడుత��.. ఈ కేసును ఎప్పటికీ తేల్చకుండా విపక్షంపై బురద చల్లడానికే వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డీఎస్సీ, సచివాలయ ఉద్యోగులు, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనలతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతున్న వేళ, పక్కా పథకం ప్రకారమే ప్రజల దృష్టిని మళ్లించేందుకు మళ్లీ ఈ కేసుకు సంబంధించి యథేచ్ఛగా ప్రచారాలు మొదలుపెట్టారని విశ్లేషకులు మండిపడుతున్నారు.
స్వయంగ�� హత్య చేశానని ఒప్పుకున్న అప్రూవర్ దస్తగిరికి టీడీపీ ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లతో ప్రత్యేక రక్షణ కల్పించి బయట దర్జాగా తిప్పడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. నేరుగా నేరం ఒప్పుకున్న వ్యక్తి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం, నిందితులకు సులభంగా బెయిళ్లు లభించడం వెనుక ఎవరి హస్తం ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు.
మరో నిం��ితుడు సునీల్ యాదవ్‌తో అనుకూల ఛానెళ్లలో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇప్పించడం, వాటి ఆధారంగా అనుకూల ��త్రికల్లో కథనాలు రాయించి, మరుసటి రోజే మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించడం అంతా ముందస్తుగా రచించిన కట్టుకథేనని ప్రజల్లో తేలిపోతోంది. చంపినోళ్లే బయటకు వచ్చి ప్రేమ ఒలకబోయడం, దాని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుండటం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారు.
మరోవైపు న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పే వివేకా కుమార్తె సునీత.. 2019 ఎన్నికల్లో తన తండ్రి వైఎస్ వివేకానందరె���్డి స్వయంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి విజయం కోసం ప్రచారం చేశారని గతంలో స్పష్టంగా చెప్పిన ఆమె, ఆ తర్వాత చంద్రబాబు డైరెక్షన్లో మాట మార్చారనే ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఆమె నారా లోకేష్‌ను కలిశారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున జెడ్పీటీసీ పదవి ఆఫర్ చేశారనే వార్తలు బయటకు వచ్చి వారం రోజులు దాటుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి ఖండనా రాకపోవడం ఈ అనుమానాలకు ��రింత బలాన్ని చేకూరుస్తోంది.
ప్రజా సమస్యలను గాలికొదిలేసి, నేరస్థులను కాపాడుతూ విపక్ష నేత వైఎస్ జగన్‌పై దుష్ప��రచారం చేయిస్తున్న చంద్రబాబు నైజానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రజాధనంతో 'టీడీపీ' ప్రచారం.. ఐ-టీడీపీకే దొడ్డిదారిన నిధులు?
27 నెలల్లో రూ.4 లక్షల కోట్ల అప్పులు.. ప్రచారాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం
పౌ�� సంబంధాల శాఖను నీరుగార్చేందుకేనా..?
ప్రైవేట్ వ్యక్తులకు నెలకు రూ.75,000 వరకు పారితోషికాలు కట్టబెట్టేందుకు జీవో 197 జారీ
ఎన్నికల సమయంలో 'సంపద సృష్టిస్తా.. పేదవాడిని కోటీశ్వరుడిని చేస్తా' అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, గత 27 నెలల్లో ఏకంగా రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు ��మలు చేయడానికి ఆర్థిక ఇబ్బందులంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం, తాజాగా జీవో నంబర్ 197 (https://t.co/BwPiOXh0mS.197) ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తెగబడటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
లోకేశ్ యువగళంలో పాల్గొన్న వారికి, ఐ-టీడీపీ బ్యాచ్‌కూ, వైఎస్ జగన్ కుటుంబంపై పైశాచికంగా పోస్టులు పెట్టే వారిని క్రియేటర్లుగా దొడ్డిదారిన ప్రభుత్వ ఖజానా సొమ్మును కట్టబెట్టేందుకే ఈ కొత్త నాటకానికి తెరతీశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పథకాలు, సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారిక సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR)తో పాటు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా వేదికలు అందుబాటులో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థలను పక్కనబెట్టి, ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
గ్రాఫిక్స్ వీడియోలు, ఏఐ (AI) పోస్టులతో ప్రజలను భ్రమల్లో ముంచెత్తేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రచార పిచ్చితో తగలేస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే అప్పుల భారంతో కూరుకుపోయిన రాష్ట్రంలో, సంక్షేమ పథకాలను గాలికొదిలేసి కేవలం ప్రచార ఆర్భాటాల కోసం ఖజానాను దోచిపెట్టడం చట్టబద్ధమైన దోపిడీ కాదా అని నిలదీస్తున్నారు.
జనసేన అస్త్రంతో చంద్రబాబు సరికొత్త పొలిటికల్ స్కెచ్?
టీడీపీలో సీనియర్లు, తిరుగుబాటు గళం వినిపిస్తున్న సొంత నేతలకు చెక్ పెట్టేందుకు అధినేత టీడీపీ అధినేత వ్యూహాత్మక అడుగులు
మిత్రపక్షమైన జనసేన పార్టీని ఆయుధంగా మలచుకుని, పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన కీలక నాయకులకు, సొంత బంధువులకు పొగబెట్టేందుకు బిగ్ ప్లాన్ సిద్ధం చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున���నారు.
ఇటీవల కాలంలో పార్టీ నిర్ణయాలపై, ముఖ్యంగా నారా లోకేష్ ఆదేశాలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో అసంతృప్త�� వెళ్లగక్కుతున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు పొగబెట్టేందుకు పక్కా స్కెచ్ సిద్ధమైంది. ఉండి నియోజకవర్గంలో రఘురామ ప్రాభవాన్ని తగ్గించేందుకు జనసేన నాయకుడు మంతెన నరసింహరాజును రంగంలోకి దించుతున్నారు.
టీడీపీలో సుదీర్ఘకాలంగా చక్రం తిప్పుతున్న సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని పక్కనబెట్టేందుకు యనమల కృష్ణుడిని జనసేన వైపు పంపించేల��� పావులు..
నారా లోకేష్‌కు కాబోయే సీఎం అభ్యర్థిగా ఎటువంటి పోటీ లేకుండా చేయాలంటే.. ఫ్యామిలీ పరంగా బలమైన వర్గం మద్దతు ఉన్న నందమూరి బాలకృష్ణకు కూడా చెక్ పెట్టడానికి ప్రణాళిక..
అందులో భాగంగానే వైసీపీ నుంచి వచ్చిన నవీన్ నిశ్చల్‌ను జనసేనలో చేర్చుకున్న వైనం.. గతంలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించిన సమయంలో, సొంత బావమరిది నందమూరి హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేయకుండా అనర్హత వేటు పడేలా చేసిన పాత చరిత్రను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.
లోకేష్‌ను ��ిలబెట్టేందుకు నేరుగా టీడీపీ నుంచి చర్యలు తీసుకుంటే ఎదురయ్యే వ్యతిరేకతను తట్టుకునేందుకు 'జనసేన పార్టీ'ని ఒక ఫ్రంట్ గా వాడుకుంటున్నారని చర్చ జరుగుతోంది.
పవన్‌కు దగ్గరవుతున్న వంగవీటి రాధా
జనసేనకు చెక్ పెట్టేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్
కుమారుడికి మేయర్ సీటు కోసం బోండా ప్రయత్నం
అనూహ్యంగారంగంలోకి రాధా.. ఇది టీడీపీ ప్లాన్ అంటూ విజయవాడ ప్రజల్లో చర్చ
విజయవాడ మేయర్ సీటు చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాపుల ఆరాధ్యుడు వంగవీటి రంగా వారసుడిగా వచ్చి, చేజేతులా రాజకీయ ప్రాభవాన్ని తగ్గించుకున్న వంగవీటి రాధాను టీడీపీ మరోసారి స్వార్థానికి వాడుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి.
మేయర్ సీటు కోసం జనసేన నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికి, సొంత పార్టీలోని వర్గపోరును చల్లార్చడానికి చంద్రబాబు ఈ వ్యూహాన్ని అ��లు చేస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన రాధాను తెరపైకి తెచ్చి మేయర్ సీటు కట్టబెడితే జనసేన నోరు మూయించవచ్చని టీడీపీ ప్లాన్ చేస్తోంది.
మరోవైపు తన కుమారుడికి మేయర్ పదవి దక్కించుకోవడం కోసం ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో ఈ వ్యవహారం 'బోండా వర్సెస్ రాధా'గా మారింది. 2004 తర్వాత వరుసగా ఓడిపోతూ, 2019, 2024ల్లో కనీసం టీడీపీలో ఎమ్మెల్యే ట��కెట్ కూడా దక్కించుకోలేకపోయిన రాధాను ఇప్పుడు మేయర్ సీటుపై కూర్చోబెట్టాలనుకోవడం ఆయన స్థాయిని మరింత దిగజార్చడమే.
జనసేనకు చెక్ పెట్టడానికి, బోండా వర్గాన్ని తొక్కిపెట్టడానికి చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో రంగా తనయుడు రాధా మరోసారి బలికాక తప్పదనిపిస్తోంది.
నవీన్ నిశ్చల్ "ఆయా రామ్.. గయా రామ్" రాజకీయం!
సస్పెండ్ అ��ిన ఏడాదికి రాజీనామా నాటకం
రాజకీయ ఆదరణ, మరే పార్టీ ఆహ్వానం లేక చివరకు జనసేనలో చేరిక
హిందూపురం రాజకీయంలో నిలకడలేని వైఖరికి, అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నవీన్ నిశ్చల్ మరో కొత్త పార్టీని ఎంచుకున్నారు. ఏడాది క్రితమే వైసీపీ నుంచి బహిష్కరణకు గురై.. అసలు ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని వ్యక్తి ఇప్పుడు కొత్తగా వైసీపీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటనలు ఇచ్చి.. జనసేనలో చేరారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నవీన్ నిశ్చల్‌కు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించింది. అధికారం మారిన తరువాత నవీన్ నిశ్చల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ముందే గుర్తించిన వైసీపీ క్రమశిక్షణా కమిటీ, ఆయనపై 2025 జూలై 17నే సస్పెన్షన్ వేటు వేసింది.
ప్రస్తుత ఇన్ఛార్జ్ కొండూరు దీపిక వర్గంతో నిత్యం గొడవలకు దిగుతూ, 2029 ఎన్నికల టికెట్ తనదేనంటూ బహిరంగ ప్రకటనలు చేసి పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టించడంతో పార్టీ అధిష్టానం ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
పార్టీ ఆదేశాలను ఖాతరు చేయకుండా సొంత అజెండాతో తిరుగుతూ నియోజకవర్గంలో తీవ్ర వివాదాలకు కారణమయ్యారు నవీన్ నిశ్చల్. సస్పెన్షన్ తర్వాత ఏడాది పాటు కాలక్షేపం చేసి.. చివరకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం లేక, అవకాశవాద రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు కొత్తగా జనసేన కండువా కప్పుకున్నారు.
హిందూపురంలో ప్రజల ఆదరణ కోల్పోయి, ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేక నిత్యం వివాదాలు సృష్టించే నవీన్ నిశ్చల్ లాంటి నేతలను ఏ పార్టీలో చేర్చుకున్నా ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. వైసీపీ ఎప్పుడో వదిలించుకున్న వ్యక్తిని, ఇప్పుడు కొత్తగా జనసేన తమ నెత్తిన వేసుకుందనే ప్రచారం నియోజకవర్గంలో గట్టిగా నడుస్తోంది.
అవకాశవాదానికి నిలువెత్తు రూపంగా మారిన నవీన్ నిశ్చల్‌ను చూసి హిందూపురం ప్రజలు నవ్వుకుంటున్నారు.
తునిలో తలనొప్పి వదిలించుకున్న వైసీపీ
యనమల కృష్ణుడు లేనప్పుడే.. తునిలో వైసీపీ రెండ��సార్లు విజయం
గ్రూప్ రాజకీయాల సిద్ధహస్తుడు జనసేనలోకి..
2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు తాజాగా జనసేనలో చేరారు. దీంతో తుని వైసీపీకి ఓ పెద్ద తలనొప్పి తొలగిపోయిందనే చర్చ మొదలైంది.
2014, 2019లో టికెట్ ఇచ్చిన టీడీపీని కాదని, 2024 టికెట్ దక్కలేదనే కోపంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కృష్ణుడు వైసీపీ గూటికి చేరారు. ఆ తరువాత ప్రజా సమస్యల���, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. వైసీపీలో కొనసాగుతూనే టీడీపీ అగ్రనేతలతో సంబంధాలు కొనసాగించారని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని వైసీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైంది.
కృష్ణుడు వ్యవహారశైలితో తుని వైసీపీలో అంతర్గత విభేదాలు పెరిగాయని వైసీపీ వర్గాలు భావించాయి. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలో కృష్ణుడిపై చర్యలు తీసుకునే దిశగా వైసీ���ీ నాయకత్వం ముందుకు వెళ్లింది. ఈ పరిణామాల మధ్య ఆయన జనసేన వైపు అడుగులు వేశారు.
తుని రాజకీయ చరిత్రలో కృష్ణుడు ప్రత్యర్థిగా ఉన్న సమయంలోనే వైసీపీ రెండుసార్లు విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యనమల కృష్ణుడిపై దాడిశెట్టి రాజా 18,573 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా 24,016 ఓట్ల మెజార్టీతో కృష్ణుడిపై గెలుపొందారు. దీంతో తునిలో కృష్ణుడు ప్రత్యర్థిగా ఉన్న సమయంలో వైసీపీ బలమైన ఫలితాలు సాధించింది.
కృష్ణుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగాయని, చ���వరకు 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణంగా మారిందనే చర్చ తునిలో కొనసాగింది.
కృష్ణుడి జనసేన చేరిక వెనుక ఆయన సోదరుడు యనమల రామకృష్ణుడి పాత్ర ఉందనే చర్చ తుని రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వైసీపీ నుంచి కృష్ణుడు బయటకు వెళ్లడంతో ఆ పార్టీ క్యాడర్లో కొంత ఊరట కనిపిస్తుండగా, తాజాగా జనసేనలో చేరడంతో వైసీపీ వదిలించుకున్న తలనొప్పి జనసేనకు అంటుకుందనే చర్చ జరుగుతోంది.