జంగారెడ్డిగూడెం పట్టణంలో యేసు తిరు హృదయ ఆర్సీఎం నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవంలో చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు కతోలిక పీఠం బిషప్ శ్రీశ్రీశ్రీ రెవరెండ్ జయరావు పొలిమేర గారితో కలిసి నూతన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పవిత్ర స్థలాలని పేర్కొన్నారు. నూతన దేవాలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై, భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత విస్తృతంగా అందించాలని ఆకాంక్షించారు.
బిషప్ శ్రీ జయరావు పొలిమేర గారితో తన బంధం మరువలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు,
ఈ కార్యక్రమంలో విచారణ గురువులు, కన్య స్త్రీలు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు మరియు భక్తులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం గ్రామంలో మాజీ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ యాగంటి సుబ్రహ్మణ్యం గారి స్మారక విగ్రహాన్ని చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వర్గీయ యాగంటి సుబ్రహ్మణ్యం గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
అలాగే, వారి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్వర్గీయ యాగంటి సుబ్రహ్మణ్యం గారికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు ప్రారంభించి, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యాగంటి సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇటీవల మాతృమూర్తి కీ.శే. గంట వెంకట నర్సమ్మ గారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కామవరపుకోట సొసైటీ చైర్మన్ శ్రీ గంట మాధవరావు గారిని, వారి కుటుంబ సభ్యులను చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా కీ.శే. గంట వెంకట నర్సమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన తోమండ్రు నాగమణి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చులను భరించలేని పరిస్థితిలో గౌరవ చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని కలిసి విన్నవించగా, ఆయన వెంటనే స్పందించారు.
మెరుగైన వైద్యం అందేలా హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మెరుగైన చికిత్స పొందేందుకు అవసరమైన సిఫార్సు లేఖను అందజేశారు.
ప్రజల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమనే భావనతో, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు శాసనసభ్యులు నిరంతరం కృషి చేస్తున్నారు.
డా. గుడారు జగదీష్ గారు (MS Ortho) మరియు వారి వైద్య బృందం పర్యవేక్షణలో, చింతలపూడి శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో, చింతలపూడి ఆర్కే కన్వెన్షన్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సమక్షంలో , శ్రీ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు, దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్యులు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
#MedicalCamp
#songaroshankumar
#HealthcareSupport
#AndhraPradesh
*నిర్ణీత సమయాన్ని కంటే ముందే త్రాగు నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి*
*జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీరు ఇవ్వాలి*
--శాసనసభ్యులు రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా చేసే AIIB పథకాన్ని అన్ని శాఖల సమన్వయంతో త్వరితగతిని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచించారు
శనివారం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్, పంచాయతీరాజ్ ,ఆర్ అండ్ బి, రెవిన్యూ, విద్యుత్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.
ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్లన్నీ కావాల్సిన అనుమతులను వెంటనే ఇచ్చి పాలిటెక్నిర్వహకులకు సహకరించాలని ఆదేశించారు.
ఇకపై ప్రతి శనివారం ఏఐఐబిపనుల పురోగతి పై సమీక్షించనున్నట్లు ఆయన చెప్పారు
*సీనియర్ సిటిజన్స్ సలహాలు, సూచనలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలి*
---యం ఎల్ ఏ రోషన్ కుమార్
సీనియర్ సిటిజన్ల సలహాలు సూచనలు రాష్ట్ర అభివృద్ధికి మన ప్రాంతాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడాల్సిన అవసరం ఉందని శాసనసభ్యులు రోషన్ కుమార్ అభిప్రాయపడ్డారు.
శనివారం బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం కొత్తగా రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికైన ప్రతినిధులు కుకునూరి రామ చందర్రావు , సమయమంత్రి రాధాకృష్ణమూర్తి లను దుశ్యాలువా సత్కరించారు.
తనకు సీనియర్ సిటిజన్ పట్ల అపారమైన గౌరవం ఉందని అందుకే ప్రభుత్వ పరంగా భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు చేశామని రోషన్ కుమార్ పేర్కొన్నారు
*ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలి*
------చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు విస్తృత స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్లో దీటుగా అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి సలహా సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా సేవలు అందించాలని సూచించారు.
ఆసుపత్రి ప్రసవాలు పెంచే విషయంలో త్వరలో డీఎంహెచ్వో మరియు డిసిహెచ్ఎస్ లతో సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తామని రోషన్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అందే సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
చింతలపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మండా మణికంఠ స్వామి (తండ్రి: సత్యనారాయణ) బైపాస్ సర్జరీ నిర్వహించేందుకు అవసరమైన రూ. 7,29,800 విలువైన **ఎల్ఓసి (Letter of Credit)**ను చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చింతం విష్ణుమూర్తి మరియు మండల జనరల్ సెక్రటరీ రావు కిరణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
#SongaRoshanKumar #Chinthalapudi #LOC #HealthcareSupport #AndhraPradesh #PublicService #TDP #Chintapalli #BypassSurgery #PeopleFirst
సామాన్యుడిలా ప్రజల్లో కలిసిపోయిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యంలో వంతెన కింద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కండెల బండి వద్ద శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు ఆగి, స్వయంగా మొక్కజొన్న కండెలను కొనుగోలు చేసి ఆస్వాదించారు.
అనంతరం సమీపంలోని నిమ్మరసం బండి వద్దకు వెళ్లి నిమ్మరసం సేవిస్తూ, అక్కడి వ్యాపారులు, స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, చిరునవ్వులతో పలకరిస్తూ కొంతసేపు గడిపారు.
సామాన్య ప్రజలతో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కలిసిమెలిసి మెలగడం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గారి నిరాడంబర వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచింది.
*యువతకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ కి ఎమ్మెల్యే ప్రత్యేక చర్యలు*
*లైసెన్స్ ల ఆవశ్యకతపై అవగాహన మరియు జారీకి చర్యలు*
--MLA రోషన్ కుమార్
*చింతలపూడి నియోజకవర్గంలో ఏ విధమైన దళారీలు లేకుండా నేరుగా యువతకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు*
బుధవారం ఆయన నూజివీడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి కృష్ణవేణి తో సమావేశమయ్యారు.
18 ఏళ్ళు పూర్తి చేసుకున్న యువతీ యువకులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, వారికి నేరుగా లైసెన్స్ జారీ కోసం దరఖాస్తు స్వీకరించడం , రోడ్డు భద్రత నియమావళి తదితర విషయాలపై మరియు డ్రైవింగ్లైసెన్సులు ఉండడంవల్ల కలిగే ప్రయోజనాలు అవగాహనతో పాటు అర్హులైన వారికి *ఎల్ ఎల్ అర్* లు ఇచ్చే విధంగా మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు.
అందుకు మండలాల వారీగా అర్హులైన యువతి, యువకుల జాబితాలు సిద్ధం చేయాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
బోగోలు – నరసన్నపాలెం తారు రోడ్డు, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం
లింగపాలెం మండలం బోగోలు నుండి నరసన్నపాలెం వరకు నూతనంగా నిర్మించిన తారు రోడ్డు మరియు సీసీ రోడ్లను చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికి, భారీ ర్యాలీగా గ్రామంలోకి తీసుకెళ్లారు.
అనంతరం గ్రామంలోని అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి విగ్రహానికి శాసనసభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తదుపరి జరిగిన సభలో లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమెళ్ళ చలపతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
అనంతరం శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#SongaRoshanKumar #ChintalapudiMLA #Lingapalem #Bogolu #Narasannapalem #RoadInauguration #CCRoads #NTR #TDP #NDA #Development #EluruDistrict
ప్రజాసేవలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్న ప్రజా నాయకుడు...
చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి క్యాంపు కార్యాలయం ఈరోజు ప్రజలతో కిక్కిరిసి సందడిగా మారింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వరుసగా వచ్చిన వినతులను స్వీకరిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సెలవులో ఉండటంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శాసనసభ్యులే స్వయంగా కంప్యూటర్ వద్ద కూర్చొని LOC (ఎల్ఓసీ) లేఖను టైప్ చేసి కామవరపుకోట మండలం వెంకటాపురం నుంచి వచ్చిన లబ్ధిదారులకు అందజేశారు.
పదవిని కాదు... బాధ్యతను చూసే నాయకత్వం, ప్రజల అవసరమే తన ప్రాధాన్యమని మరోసారి చేతల్లో చూపించిన శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి సేవాభావాన్ని అక్కడున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
"ప్రజల పని ముందుగా... సేవే నా ధ్యేయం" అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ ప్రతి సమస్యకు వెంటనే స్పందించే నాయకుడిగా శాసనసభ్యులు మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారు.
ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యంగా పనుల పర్యవేక్షణ
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
పనుల నాణ్యత, వేగం, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అభివృద్ధి పనులు ప్రజల అవసరాలకు అనుగుణంగా, నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రహదారిపై నడుచుకుంటూ ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం అందరూ కలిసి సరదాగా టీ సేవిస్తూ ఆత్మీయంగా గడిపారు.
చింతలపూడి అభివృద్ధే లక్ష్యంగా... వేగి లింగేశ్వర స్వామి చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు
చింతలపూడి పట్టణంలోని వేగి లింగేశ్వర స్వామి చెరువు కట్ట వద్ద చేపట్టబోతున్న సుందరీకరణ పనులను చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు కమిషనర్ మరియు స్థానిక నాయకులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ముందుగా మున్సిపల్ శాఖ కమిషనర్ రాంబాబు గారు మరియు పట్టణ నాయకులతో కలిసి పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి, పనుల పురోగతి, నాణ్యతపై చర్చించారు. అనంతరం చెరువు కట్ట వద్ద చేపట్టబోతున్న సుందరీకరణ పనులను పరిశీలించి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అందమైన పట్టణ వాతావరణం కల్పించడమే లక్ష్యంగా చింతలపూడి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలని ఎమ్మెల్యే, అధికారులకు సూచించారు