Former Chairman - TSEWIDC (Telangana State Education & Welfare Infrastructure Development Corporation) , President - Telangana Basketball Assn,Member - BRS
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సహచర బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాను.
తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయం. 🙏
#ChakaliIlamma#JubileeHills#BRS
BRS-Cong War
@RSRBRS says, 'There were no derogatory statements made. We were only saying that the Congress government’s 1,000 days in power have been ineffective.'
#Super6 | @Akshita_N
BRS-Cong War
If they(BRS) claim we have not implemented our promises, let them come to the House with evidence and debate the issue. We are willing to answer.
Where is the Leader of the Opposition? Why is he not attending the Assembly at all?- @Srinivas_KReddy
Listen in as @RSRBRS responds.
#Super6 | @Akshita_N
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఫల్య పాలనకు నిరసనగా, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారు ఇచ్చిన పిలుపు మేరకు, నేడు జూబిలీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సమరభేరి – 6వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, ప్రజలకు తాగునీటి కొరత, బస్తీ దవాఖానాల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి సమస్యలపై జూబిలీహిల్స్ నియోజకవర్గం ,రహమత్ నగర్ డివిజన్లో నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000 ఇస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆటోల ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు శాంతిభద్రతలు, ప్రజా సమస్యలతో పాటు ఆటో డ్రైవర్ల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్లపై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆటో డ్రైవర్లు మరియు ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రకటించిన ఇతర సంక్షేమ పథకాలు, సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని కోరారు.
#WATCH | Hyderabad, Telangana: BRS leader Ravula Sridhar Reddy says, "The Congress party's proposed dharna tomorrow demanding the resignation of KCR is nothing but a political drama and a big joke. They are in power, instead of doing this kind of political dramas, they should focus on governance. This clearly shows they have completely failed, they have nothing to do. On one end, BRS has been doing so many activities for the last 3-4 days and we will be continuing till the 8th on the failures of Congress Govt for the last 1000 days...Not a single promise has been properly implemented...Instead of answering the people, they are staging this drama to divert attention..."
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులందరికీ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#WATCH | Hyderabad, Telangana: On Konda Surekha’s removal from the Telangana Cabinet, BRS Party Spokesperson Ravula Sridhar says, "... It looks like a Congress party internal affair. But she is not alone the member of the Congress party; she is also the minister. If she were not the minister, we would not have spoken about the dismissal or whatever. But one thing is sure: this clearly shows the Congress party's infighting in Telangana in their government. From the beginning, we are saying the government is a failure in Telangana state. Their ministers don't have any coordination. They don't have a grip over the administration. And today, every sector is suffering from their misgovernance..."
1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బీఆర్ఎస్ సమరభేరి లో భాగంగా నేడు జూనిలీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ లో “ వంట వార్పు “ కార్యక్రమాన్ని సహచర పార్టీ నాయకులతో కలసి నిర్వహించాము. కేసీఆర్ కిట్ , మహిళలకు రూ.2500 ,కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ హామీల అమలులో ప్రభుత్వ మోసానికి నిరసనగా శ్రేణులు , స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు #jubieehillsassemblyconstituency#kcr #ktr #brsparty #ravulasridharreddy
#WATCH | Hyderabad, Telangana | BRS spokesperson Ravula Sridhar Reddy says, “The Congress party came to power in Telangana by giving six guarantees, 13 declarations, and more than 420 promises. After 1,000 days of their government, people are still waiting for answers... The Congress party has totally failed and deceived the people of Telangana... And when you question them, they start diversionary politics... Under the leadership of KCR and our working president KTR, we are going to every village, every household, to educate the people about the misgovernance of the Congress party..."
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి..
1,000 రోజులవుతున్నా ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తోంది!
అబద్ధాలు, వంచనలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు తెలంగాణవ్యాప్తంగా పోరుబాట!
ప్రజా గళమై కదం తొక్కుదాం.. కాంగ్రెస్ మోసపూరిత పాలనపై తిరగబడదాం! 🔥✊
#CongressFailedTelangana
Warm greetings of peace, love, and happiness to everyone on the auspicious occasion of Milad-un-Nabi.
మానవాళికి ప్రేమ, శాంతి, కరుణ మార్గాన్ని చూపిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు!
రైతు కుటుంబాలకు ఎనలేని ధీమా.. రైతు బీమా!
అన్నదాతలు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా..
వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా.
రైతు బీమా ప్రీమియం కట్టకుండా తెలంగాణ రైతులను నయవంచన చేస్తున్న కాంగ్రెస్ రాబందు సర్కార్
కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి 🔥
6 గ్యారెంటీలు , 420 హామీలిచ్చి
గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్!
బాకీ కార్డులతో సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పిలుపు ✊🔥
#CongressFailedTelangana
శ్రీ లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో సిరిసంపదలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు 🙏
పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలన్న సమున్నత ఆశయంతో కేసీఆర్ గారు నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షనీయం.
ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ ఆసుపత్రులు ఉండాలన్న ఉదాత్తమైన ఆలోచనతో కేసీఆర్ గారు వీటికి శంకుస్థాపనలు చేయడమే కాకుండా, బీఆర్ఎస్ హయాంలోనే శరవేగంగా నిర్మాణ పనులను చేపట్టారు.
ఒక్క సనత్ నగర్ టిమ్స్ లోనే 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఎక్స్ రే, క్యాథలాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ వంటి అన్నిరకాల విభాగాలు ఒకేచోట ఉండటం రోగులకు వెలకట్టలేని వరం.
కేవలం హైదరాబాద్ వాసులకే కాకుండా జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చే రోగులకు కూడా ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఒక సంజీవనిగా సేవలందించనుంది.
22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చేపట్టిన ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లకు, ఆసుపత్రిలో సేవలందించే వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాధమిక వైద్యం కోసం రూపకల్పన చేసిన 350 బస్తీ దవాఖానాలతోపాటు, కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు 4000 పడకలు, ఆక్సిజన్ వసతి కలిగిన 1200 ఎమర్జెన్సీ బెడ్లు.. పేద రోగులకు కొండంత భరోసా ఇవ్వనున్నాయి.
కేసీఆర్ గారికి పేరొస్తుందన్న రాజకీయ కక్షతో ఇన్నాళ్లు జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ను కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
అలాగే రెండు వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, హైదరాబాద్ లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
జై తెలంగాణ
జై కేసీఆర్
నీళ్లు లేవు, కరెంటు లేదంటూ దేశ ప్రజలంతా మొరపెట్టుకుంటుంటే...
కులాలు, మతాల పేరిట గొడవలు పెట్టి రాజకీయ నేతలు కాలం గడుపుతున్నారు.
తెలంగాణకు వ్యతిరేకమైన రేవంత్ లాంటోళ్ళు గద్దెనెక్కితే..
రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి ప్రేమ ఉండదనే నిజం ప్రజలకు అర్థమైంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
స్వరాష్ట్ర ఆకాంక్షను చాటే విధంగా...
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా...
ఉద్యమకారులకు ఒక వేదికగా...
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఒక అద్భుత కట్టడం
తెలంగాణ భవన్ ప్రారంభమయ్యింది.
ఉద్యమ సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో...
దశాబ్ద కాలపు స్వరాష్ట్ర అప్రతిహత ప్రగతి ప్రస్థానంలో...
నేడు కాంగ్రెస్ విఫల పాలనలో తెలంగాణ ప్రజలకు
ఒక 'జనతా గ్యారేజ్'లా మారడంలో...
మన తెలంగాణ భవన్ సాక్షీభూతంగా నిలిచింది.
తెలంగాణ 'భువన విజయం' తెలంగాణ భవన్
రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా -
ఉద్యమకారులకు, పార్టీ కార్యకర్తలకు,
నాయకులకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
జై తెలంగాణ ✊