Wishing Our Mega Heart ❤️
@AlwaysRamCharan brother a super speedy recovery ❤️🩹 brother Our Prayers are With you 🫶🩷
All will be super Well !!
Recover soon 🏆🫠🦹🏼♀️
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్���ంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన���నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్ర��ర్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావి���చాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభ���త్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన #GabbarSingh గురించి తలుచుకుంటే ఇప్పటికీ పూనకాలు వస్తాయి… మరోసారి ఆ మ్యాజిక్‌ను పెద్ద తెరపై చూడాలనిపించింది. నాకే కాదు, పవర్ స్టార్ అభిమానులందరూ కూడా ఆ సంచలన చిత్రాన్ని మరో���ారి థియేటర్లో ఆస్వాదించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అందుకే మీ అందరి కోసం ఈ నెల 26న గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఆ హంగామా, ఆ డైలాగులు, ఆ పాటలు, ఆ ఎనర్జీని మరోసారి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.
“నాకొంచెం తిక్క ఉంది… కానీ దానికి ఓ లెక్క ఉంది!”
ఈ నెల 26న థియేటర్లలో కలుద్దాం! 🔥💥
పవర్ స్టార్ @PawanKalyan అభిమానులందరికీ ఇది మరో పండుగ! ❤️🙏🏻