I have officially assumed responsibilities as the Commissioner of Police, Hyderabad(@CPHydCity) today. We will continue to focus on maintaining peace and security across the city, striving to serve the community with effectiveness and integrity.
@hydcitypolice@TelanganaDGP@TelanganaCOPs
నల్గొండ జిల్లాకు చెందిన బోయనపల్లి కమలమ్మ గారు ర���డ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కాగా, పుట్టెడు దుఃఖంలోనూ ఆమె అవయవాలన�� భర్త ఆదినారాయణ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఆమె రెండు మూత్రపిండాలు, కాలేయం, నేత్రాలను దానం చేసి, మృత్యువు అంచున ఉన్న ఐదుగురి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు.
మరణంలోనూ ఐదుగురికి పునర్జన్మనిచ్చి సమాజానికి ఆదర్శంగా నిలిచిన కమలమ్మ గారికి, వారి కుటుంబసభ్యుల ఉదాత్తత గొప్పది.
తోటి మానవుల ప్రాణాలు నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
#OrganDonation #Jeevandan #HyderabadPolice #HopeLivesOn
అందమైన మాటలు.. అంతలోనే బ్లాక్‌మెయిలింగ్! సైబర్ హనీ ట్రాప్ పట్ల తస్మాత్ జాగ్రత్త!
సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్, తియ్యటి మాటలతో వలవేసి.. వ్యక్తిగత దృశ్యాలను బంధించి బ్లాక్మెయిల్ చేసే సైబర్ నేరగాళ్ల బారిన పడకండి.
అపరిచితుల వీడియో కాల్స్‌ను తిరస్కరించండి. మీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ఏమాత్రం సంకోచించకుండా వెంటనే 1930 కు కాల్ చేయండి.
#CyberSecurity #HyderabadPolice #SextortionAlert
Honey trap cyber fraud is a scheme in which an offender uses attraction, friendship, romance or promises of intimacy to gain someone’s trust and then exploit them for money, private information or other demands. When the offender threatens to disclose intimate images or videos, it is called sextortion. Romance fraud can also involve fabricated emergencies or financial requests without intimate content. FBI
It can affect men, women and children. The offender may be a stranger using a fake profile, someone operating a compromised account, or a person already known to the victim.
అస్తమించినా అమరురాలై.. నలుగురికి ప్రాణం పోసిన మహిళా తేజం!
మహిళా సాధికారతే లక్ష్యంగా Womenergy, We Aim సంస్థలను స్థాపించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన యువ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి మడుగుల దీప్తి రెడ్డి గారు బ్రెయిన్ డెడ్ కావడం అత్యంత బాధాకరం.
పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబం తీసుకున్న నిర్ణయం సమాజానికే ఆదర్శప్రాయం.
తీవ్ర విషాదంలోనూ మానవత్వాన్ని చాటుతూ ఆమె భర్త శ్రీ ప్రదీప్ రెడ్డి గారు ��ీసుకున్న మహోన్నత నిర్ణయంతో.. దీప్తి రెడ్డి గారి గుండె, కాలేయం, రెండు కిడ్నీలను అవయవదానం చేశారు.
ఫలితంగా మృత్యువు అంచున ఉన్న నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి.
భౌతికంగా మనల్ని వీడినా.. నలుగురి ప్రాణాల రూపంలో దీప్తి రెడ్డి గారు సజీవంగా నిలిచారు. ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న వారి కుటుంబ సభ్యుల ఔదార్యం గొప్పది.
మరణం తర్వాత కూడా జీవించేందుకు అవయవదానాన్ని మించిన మార్గం ���ేదు. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకోవాలని, విలువైన ప్రాణాలను కాపాడ��ందుకు ముందుకు రావాలని కోరుతున్నాను.
#OrganDonation #Jeevandan #HyderabadPolice #Inspiration #SaveLives #DeepthiReddy #WomenEntrepreneur
భక్తి పారవశ్యంతో పులకించిన హైదరాబాద్.. ఆనందోత్సాహాల నడుమ సాగిన గణనాథుడి శోభాయాత్ర!
అందరి సహకారంతో.. నిండు మనసులతో.. ప్రశాంత వాతావరణంలో దిగ్విజయంగా ముగిసిన చారిత్రక సంబరం!
ఈ ఘన విజయానికి బాటలు వేసింది..
మూడు నెలల ముందే మొదలైన మా ప్రణాళికా రచన!
ప్రతి జోన్లో పర్యటిస్తూ, మండపాలను దర్శిస్తూ.. అందరినీ కలుపుకుంటూ సాగిన పటిష్ఠమైన కార���యాచరణ!
శోభాయాత్ర వేళ క్షేత్రస్థాయి పర్యవేక్షణ..
ఎక్కడా ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిన భక్తుల రాకపోకలు!
అనుకున్న సమయానికే నిమజ్జన ఘట్టాలన్నీ సాగర ఒడిలో సంపూర్ణమైన క్షణాలు!
ప్రజల సేవలో నిరంతరం చిరునవ్వుతో నిలిచి, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావం చాటిన.. పోలీస్ సిబ్బందికి మనస్ఫూర్తి అభినందనలు! 👮♂️💐
మాకు నిరంతరం దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి.. చేయి చేయి కలిపి నడిచిన అన్ని ప్రభుత్వ విభాగాలకు.. భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితికి.. మంచిని ప్రతిధ్వనించిన మీడియా మిత్రులకు..
అన్నింటికీ మించి క్రమశిక్షణతో, ప్రేమతో సహకరించిన మా ప్రియమైన హైదరాబాద్ ప్రజానీకానికి.. సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు!
హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయింది.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఒకటే కమిషనరేట్ పరిధిలోకి రావడం వల్ల శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ మరింత సులువైంది.
ఈ మహాక్రతువును విజయవంతం చేసిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలకు, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
రెండు నెలలుగా అద్భుతంగా పనిచేసిన జీహెచ్ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ, విద్యుత్, వైద్యారోగ్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు, పూర్తి సహకారం అందించిన ఉత్సవ సమితులు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఊరేగింపుల్లో ప్రమాదకరంగా మారిన 'పేపర్ షాట్స్'ను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం దృష్టి���ి తీసుకెళ్తాం. స్వయం క్రమశిక్షణతో కూడిన మరిన్ని జాగ్రత్తలతో, రాబోయే 2027 ఉత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తాం.
#HyderabadCityPolice #GaneshNimajjanam2026 #PeacefulHyderabad #TeamWork
అంకితభావంతో శ్రమించి హైదరాబాద్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా విజయవంతం చేసిన మా సిబ్బంది నిబద్���త వెలకట్టలేనిది.. వీరి కష్టానికి ఎన్ని ప్రశంసలైనా తక్కువే!
కర్తవ్య నిర్వహణలో అలసిసొలసిన నా సహచరుల్లో సరికొత్త జోష్ నింపేందుకే వారితో కలిసి సరదాగా ఆడిపాడాను.
అహోరాత్రులు చెమటోడ్చిన వాళ్ల ముఖాల్లో.. ఆ అలసట స్థానంలో విరిసిన నవ్వులు చూశాక, ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది
#HyderabadCityPolice #DutyFirst #PoliceFamily
#GaneshUtsav #HyderabadGaneshImmersion
#WATCH | Hyderabad, Telangana: Following the successful conclusion of the Ganesh immersion proceedings at Hussain Sagar Lake, Hyderabad CP V.C. Sajjanar says, "...The Ganesh festival of 2026 has been completed peacefully in Hyderabad. More than 20,000 idols have been immersed not only from the city of Hyderabad but also from the city Malkajgiri. So yesterday two days was a very big event for almost 24 hours; we had continuous immersion starting with the historical and mega Ganesh idol of 69ft of Hyderabad, and we also had the famous idol the iconic idol of Balapur, so we completed it peacefully, and we ensured that the other Ganesh idols were also immersed peacefully... Very few idols are left, and traffic has almost become normal, and it is clear now..."
నగర ప్రజలకు విజ్ఞప్తి!
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోంది.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు.
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.
ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. విగ్రహాల నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మా పోలీసు, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమి��్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ఇప్పటికే విధించిన ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నాం.
ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదు.
కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో చేయాలని విజ్ఞప్తి చే��్తున్నాం.
ప్రధాన రహదారులపైకి వాహనాలతో వచ్చి అనవసరంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దు.
ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ నగర ప్రజలంతా మాకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చూసేందుకు క్ష���త్రస్థాయి ఏర్పాట్లను ద్విచక్ర వాహనంపై స్వయంగా పర్యటించి పరిశీలించాను.
#WATCH | Hyderabad, Telangana: On security and traffic arrangements for Ganesh immersion, IPS Commissioner of Police, VC Sajjanar, says, "This is the final day of Ganesh immersion in Hyderabad city...till now the entire immersion activity has been peaceful...by tomorrow morning we are hopeful that the entire immersion activity will be completed. The director, Kamalasan Reddy and his entire team, along with the other officers concerned department from GHMC, Health, RTC, R&B, and Electricity, have been a great help to Hyderabad city to ensure a peaceful completion of the Ganesh festival because from here they have been monitoring the activities live through their dedicated cameras and also dedicated drones and also dedicated CCTV-mounted vehicles..."
బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభాయాత్ర మార్గాలు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించాను.
నగరవ్యాప్తంగా దాదాపు 10,000 సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో పాటు విద్యుత్, GHMC, TGSRTC, వైద్యారోగ్య తదితర శాఖల సమన్వయంతో నిమజ్జన ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
14,850 విగ్రహాల్లో ఇప్పటివరకు దాదాపు 10,300 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.
మిగిలిన 4,500 విగ్రహాల నిమజ్జనాన్ని తెల్లవారేసరికి పూర్తి చేసేలా ఏర్పాట్లు వేగవంతం చేశాం.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో తగిన చర్యలు తీసుకుంటున్నాం.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, నిమజ్జన ఘట్టం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగియడ��� హర్షణీయం.
క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు అంకితభావంతో విధులు నిర్వర్తించి ఈ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా నడిపించిన ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు, సిబ్బందికి అభినందనలు.
ఉత్సవాల ఆరంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించిన నగర ప్రజలు, భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ��న్యవాదాలు.
@HYDTP @CPHydCity @hydcitypolice
#KhairtabadBadaGanesh
#HYDTPinfo
🚩 Khairatabad Bada Ganesh Procession Update 🚩
🙏 The immersion of Khairatabad Bada Ganesh has been peacefully concluded at Hussain Sagar.
We sincerely thank all devotees, commuters, organisers, and citizens for their cooperation and support throughout the Ganesh celebrations and immersion procession.
Your cooperation helped ensure the smooth and peaceful conduct of the festivities. 🙏
#HyderabadTraffic 🚦 #KhairtabadBadaGanesh #GaneshImmersion2026
ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన బందోబస్తు, భద్రతా ���ర్యలను ఆయన సమీక్షించారు.
ఖైర��ాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్
నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రను అత్యంత ప్రశాంత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన సన్నాహాలను శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో కలిసి క్షేత��రస్థాయిలో పరిశీలించారు.
అంతకుముందు పోలీస్ అధికారులతో కలిసి బడా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంతో పాటు, బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర నిర్విఘ్నంగా సాగేలా చర్యలు చేపట్టామన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి సహా అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్���యం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో మ���ందుకెళ్తున్నట్లు వివరించారు.
బందోబస్తు నిమిత్తం దాదాపు 20 వేల మంది సిబ్బందిని విధుల్లోకి దించినట్లు వెల్లడించారు.
శోభాయాత్రను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లోని దాదాపు 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)కు అనుసంధాన��ంచామని, అక్కడి నుంచే అధికారులు నిఘా ఉంచుతారని తెలిపారు.
మహిళలు, యువతుల భద్రతకు పెద్దపీట వేస్తూ మూడు షిఫ్టుల్లో 26 ‘షీ-టీమ్స్’ బృందాలు రద్దీ ప్రాంతాల్లో నిరంతరం విధుల్లో ఉంటాయన్నారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా నగర ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే ట్రాఫిక్ మార్గదర్శకాలను ప్రజలు గమనిస్తూ, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
నిమజ్జన పర్వాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా ముగించేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని.. నగర ప్రజలంతా శాంతియుత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
#WATCH | Hyderabad, Telangana | Commissioner of Hyderabad City Police, VC Sajjanar says, "Today is the final day of the Ganesh immersion in Hyderabad. The immersion of the massive 72-foot idol from Khairatabad is taking place here. The rituals have concluded, though some welding work is still pending. Once that is completed, the immersion procession will begin, and the immersion in the lake is expected to be completed by around 2 PM. We have made robust security arrangements for the immersion of the Ganesh idol, deploying a force of nearly 2,000 personnel, as huge crowds gather to witness the event. A large number of people are also participating in the procession. Since this is the Ganesh immersion, a massive turnout is certainly expected. That is why we have put comprehensive security measures in place"
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదు.
సోషల్ మీడియాల��� పాత వీడియోలు, వదంతులతో సమాజంలో చిచ్చుపెట్టాలని చూసే వారిపై మా నిఘా ఉంటుంది.
అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసి నిజాలు నిగ్��ుతేలుస్తాం.. విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
ఉత్సవాల పేరిట అసభ్యకర పాటలు, అశ్లీల నృత్యాలతో పండుగ పవిత్రతను దెబ్బతీస్తే.. రికార్డైన దృశ్యాల ఆధారంగా తర్వాతైనా సరే కఠిన చర్యలు తప్పవు.
ఈ పవిత్ర వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని.. పుకార్లను నమ్మకుండా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లో కర్తవ్యం నిర్వర్తిస్తూ, గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కొత్తగూడెం టూ-టౌన్ ఎస్సై కె.వెంకన్న గారు కన్నుమూయడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం.
ప్రజల భద్రత కోసం అంకితభావంతో శ్రమిస్తూ విధి నిర్వహణలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ ��ోలీసు శాఖకు తీరని లోటు.
ఈ విషాద సమయంలో వెంకన్న గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం.
బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
దివంగత వెంకన్న గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
హైదరాబాద్ గణేశ్ ఉత్సవ శోభకే తలమానికమైన ఖైరతాబాద్ బడా గణపతిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నాను.
దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ మహాగణపతిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మి�� అనుభూతినిచ్చింది.
నగర ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, హైదరాబాద్ శాంతిభద్రతలు సదా ప్రశాంతంగా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను.
@hydcitypolice @CPHydCity @TelanganaCOPs
బ్రెయిన్ డెడ్ అయిన కామారెడ్డికి చెందిన టెక్కీ కుడిక్యాల వినయ్ (26), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పద్మ ఆండాలు (60) అవయవ దానంతో ఎనిమిది.మందికి పునర్జన్మను ప్రసాదించారు.
తీవ్ర విషాదంలోనూ వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి చేసిన ఈ అవయవ దానం ఎంతో గొప్పది.
ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసి ఆదర్శంగా నిలిచిన ఆ రెండు కుటుంబాల నిర్ణయానికి సెల్యూట్.
మరణం తర్వాత కూడా మరొకరి రూ��ంలో నిరంతరం జీవించే మహత్తర అవకాశాన్ని కల్పిస్తూ, చీకటి నిండిన ఎన్నో క���టుంబాల్లో మళ్లీ వెలుగులు నింపే దివ్యమైన సంకల్పమే అవయవదానం.