➡️ భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం
➡️హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి 'ఏఐ కాప్‌రైటర్'
➡️దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు
➡️యాప్ ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
✳️పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
✳️హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైటర్ యాప్ ను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. దాని పనితీరును పరిశీలించారు.
✳️నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, అనువదించుకోవచ్చు.
✳️హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాష అర్థం కాక ఎఫ్.ఐ.ఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న యాప్ ను బ్లూక్��ౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించింది.
ప్రధాన అంశాలు:
✳️ బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే, అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదించబడుతుంది.
✳️వేగం-కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
✳️ పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు.
✳️మల్టీ-పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస���తుంది.
✳️పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అన్నారు.
✳️"హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడంతో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ రాని వలసవచ్చిన ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎందరో ఉంటారు. భాష తెలియకపోవడం వల్ల ఫి��్యాదు చేయడంలో జాప్యం జరగడం లేదా సమాచారం తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఈ యాప్ చెక్ పెట్టనుంది. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, ఈ యాప్ దానిని వెంటనే గుర్తించి, అనువదించి, అధికారిక రికార్డుగా మారుస్తుంది. మాట్లాడిన ప్రతి 5 సెకన్లకు సమాచారం అప్డేట్ అవుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా, రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది." అని ఆయన అన్నారు.
✳️న్యాయం పొందడానికి భాష ఎప్పటికీ అడ్డంకి కాక��డదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఏఐ కాప్‌రైటర్ ఆధునిక పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ‘స్మార్ట్ పోలీసింగ్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే హైదరాబాద్ సిటీ పోలీస్ లక్ష్యమని పేర్కొన్నారు.
✳️ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, ఐపీఎస్ గారు, అదనపు సీపీ(లా అండ్ ఆర్డర్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ గారు, డీసీపీ (ఎస్ఎమ్ఐటీ) శ్రీ సీహెచ్ రూపేష్, ఐపీఎస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేశ్, బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
నగర పోలీసింగ్‌లో కృత్రిమ మేధ జోరు:
✳️ఆధునిక పోలీసింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తోంది. ���ాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ పనితీరులో మరింత సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యతనిస్తోంది.
✳️ఇందులో భాగంగానే.. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పక్కాగా రూపొందించడానికి ఇప్పటికే 'సి-మిత్ర' లో ఏఐ సాంకేతికతను పోలీస్ శాఖ విజయవంతంగా అమలు చేస్తోంది. అలాగే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి విధులను కేటాయించే ప్రక్రియలో ఏఐను వాడుతోంది. గతంలో ఉన్న మ్యాన్యువల్ పద్ధతుల స్థానంలో ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ విధానం వల్ల, ఎటువంటి పక్షపాతం లేకుండ�� సిబ్బందికి పోస్టింగ్‌లు కేటాయించబడుతున్నాయి. ఇది వ్యవస్థలో పూర్తి పారదర్శకతను పెంచుతోంది.
✳️సోషల్ మీడియాలో సమాజ శాంతికి భంగం కలిగించే అంశాలను గుర్తించేందుకు 'సాక్-ఐ' అనే ఏఐ ఆధారిత యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆన్లైన్ కంటెంట్‌ను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా, మహిళల, చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే పోస్టులను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఫిర్యాదు�� నమోదు ప్రక్రియను కూడా ఏఐతో అనుసంధానించింది. అందుకు ఏఐ కాప్‌రైటర్ యాప్ ను రూపొందించింది. దీనివల్ల ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల��� మరింత వేగంగా, క్రమబద్ధంగా నమోదవుతాయి.
We sincerely thank TG Police for their swift, commendable action in resolving the theft at my aunt’s residence. As per FIR No. 70/2026 registered at P.S. Domalguda,Hyd the case was handled with remarkable efficiency and solved within just two hours. Thanks Sai raju, saikumar sir
A Cyber Crime Awareness Program was successfully conducted door to door to educate the public on the rising threats of online frauds and digital crimes.
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులూ అప్రమత్తం!
ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరం.
తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని ఒంటరితనానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు.
చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయి.
అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు గ్యాడ్జెట���ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వండి. వారు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచండి.
ముఖ్యంగా పరీక్షల ఫలితాల విషయంలో వారికి కొండంత భరోసానిస్తూ, వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయండి.
మీ అప్రమత్తతే మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష!
నగర పోలీసుల అంకితభావానికి గౌరవం
1,446 మందికి అవార్డులు అందజేసిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
నగర చరిత్రలో తొలిసారిగా ‘ఎక్స్ట్రా మైల్’ పురస్కారాలతో సరికొత్త అధ్యాయం
విధి న���ర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి సముచిత గౌరవం
విధి నిర్వహణలో అంకితభావంతో ��నిచేసి, అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,446 మంది పోలీసు సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆదివారం రివార్డులు అందజేశారు. నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎక్స్ట్రా మైల్’ పురస్కారాలతో పాటు ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రదానం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమా���డ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) వేదికగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను అభినందిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు కీలక ప్రసంగం చేశారు. పోలీసు వృత్తి కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదని, అదొక సామాజిక బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. విధులకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రతి పనిలోనూ సృజనాత్మకత, మానవీయత ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు. అప్పగించిన పనిని పూర్తి చేయడం కంటే, బాధితులకు ఎంత��ి భరోసాను కల్పించామన్నదే అసలైన విజయమని స్పష్టం చేశారు. విధులకు అతీతంగా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించినప్పుడే పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
సిబ్బందిలో ఉన్న అసాధారణ ప్రతిభను, వినూత్న ఆలోచనలను, విధులకు అతీతమైన సేవలను గుర్తించి, గౌరవించాలనే ఉద్దేశంతోనే కమిషనరేట్ చరిత్రలోనే తొలిసారిగా ‘ఎక్స్ట్రా మైల్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విధులకు అతీతంగా సమాజానికి మేలు చేసే ప్రతి పోలీసు అధికారిని ఈ వేదిక గౌరవిస్తుందని చెప్పారు. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదని, అంకితభావానికి దక్కిన గుర్తింపు అని అన్నారు. ఈ గుర్తింపు పోలీసుల్లో నూతనోత్తేజాన్ని నింపుతుందని, ఇతరులు నిబద్దతతో పనిచేసేలా ప్రేరణనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంకేతికత ఎంత పురోగమించినా, క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది చూపే చిత్తశుద్ధికి, ఆపదలో ఉన్న వారి పట్ల ప్రదర్శించే మానవత్వానికి ఏ టెక్నాలజీ సాటిరాదని గుర్తు చేశారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ ఒకే బృందంగా పనిచేయడం ��ల్లే నగరంలో శాంతిభద్రతలు సమర్థంగా ఉన్నాయని కొనియాడారు.
ఈ పురస్కారాలు ఇక్కడితో ఆగిపోవని, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేందుకు ఇకపై ప్రతి నెల జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. పోలీస్ సిబ్బంది కృషి, నిజాయితీ వృథా కాదని, కష్టానికి తగ్గ గుర్తింపు కచ్చితంగా ఉంటుందన్నారు.
కాగా, గత ఆర్థిక ఏడాదికి సంబంధించిన 2, 3, 4వ త్రైమాసికాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఎక్స్ ట్రా మైల్ లో భాగంగా విధి నిర్వహణలో విధులకు అతీతంగా సేవలందించిన 271 మందికి ఈ పురస్కారం దక్కింది. గుడ్ వర్క్ డన్ లో భాగంగా విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 1,175 మందికి ఈ రివార్డులు వరించాయి.
పురస్కారాలు అందుకున్న వారిలో అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు మినిస్టీరియల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.
@hydcitypolice @CPHydCity @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP
#AdminPost
Smt. D Prasanna Sub-Inspector, along with the patrolling staff, conducted an awareness programme on cyber frauds and educated about various types of cyber crimes
🎉 Happy New Year! 🎉
PS Domalguda wishes everyone a joyful, peaceful, and prosperous New Year.
Celebrate responsibly, follow traffic rules, and stay safe and happy always.
✨ Happy New Year to all! ✨PS Domalguda # Hyderabad City Police.