పిల్లల వెబ్ యాక్టివిటీని తల్లిదండ్రులు తరచూ పరిశీలించండి. ఆన్లైన్ గేమ్స్ మాటున ఉన్న బెట్టింగ్ యాప్స్ వలలో వారు పడకుండా జాగ్రత్త వహించండి. ��ెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలను వివరించండి. పిల్లల ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను కూడా పరిశీలించడం మంచిది.
#TelanganaPolice
జిల్లాల క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా @TelanganaDGP శ్రీ సీవి ఆనంద్ ఐపీఎస్ నిన్న రాత్రి కొత్తగూడెం జిల్లా నుండి ఖమ్���ం జిల్లాకు చేరుకున్నారు. ఖమ్మం కలెక్టర్ దివాకర ఐఏఎస్, సీపీ సునీల్ దత్ ఐపీఎస్ జిల్లా ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
వాయిస్ క్లోనింగ్ స్కామ్‌తో మోసగాళ్లు డబ్బులు కొల్లగొడుతున్నారు. మీ సన్నిహితుల వాయిస్‌తో ఫేక్ కాల్స్ చేసి డబ్బులు అడుగుతారు. ఆపదలో ఉన్నామంటూ కంగారు పెడతారు. ఇలాంటి కాల్స్ వస్తే తొలుత నిర్ధారించుకోండి.
#TelanganaPolice#VoiceCloning
మొబైల్ ఫోన్‌ను ఎక్కడవాడాలో గుర్తుంచుకోండి. వాహనాలు నడిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ వాడకండి. రీల్స్ చూస్తూ...రీల్స్ చేస్తూ డ్రైవింగ్ చేయొద్దు. సెల్ఫీలు తీసుకుంటూ వాహనం నడపకండి.
#TelanganaPolice#CellPhoneDriving#ArriveAlive
లక్కీ డ్రాలో గెలిచారని వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తం
ప్రైజ్ మనీ ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ ఛాన్స్
అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించొద్దు
సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి.
#TelanganaPolices#dail1930
హెల్మెట్ మీ రక్షణ కవచం. కేవలం నాణ్యమైన హెల్మెట్ మాత్రమే మీకు రక్షణ ఇస్తుంది. చలాన్ తప్పించుకునేందుకు కాకుండా మిమ్మల్ని రక్షించుకునేందుకు హెల్మెట్ వాడండి. ISI మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే వినియోగించండి.
#TelanganaPolice#ArriveAlive#WearHelmet
ప్రముఖుల వీడియోలను డీప్ ఫేక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. పెట్టుబడి చిట్కాలు, ఇన్వెస్టిమెంట్ యాప్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ నమ్మించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నమ్మొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు.
#HYDTPweCareForU
Sri Avinash Kumar, IPS, DCP Traffic-I, Hyd, along with Sri S. Mohan Kumar, ACP Traffic, Khairatabad Zone, distributed a helmet to a child at NTR Marg and Monappa Junction under the limits of @shotr_saifabad & @shotr_pgt respectively.
During the interaction, they counselled the child's father on the importance of ensuring that children also wear helmets while travelling on two-wheelers. They emphasized that a helmet is not just a legal requirement for riders but a vital safety measure that protects young lives in the event of an accident.
Every rider. Every pillion. Every child. Every ride. Wear a helmet. 🛵🪖
#HyderabadTraffic #RoadSafety #HelmetSavesLives #ChildSafety #WearHelmet #TrafficAwareness #SafeRide #ArriveAlive #DriveSafe
అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దు
డిగ్రీ కోర్సుల్లో చేరబోతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) లేకపోయినా, ఉన్నట్లుగా తప్పు��ు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్న విద్యాసంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
నిబంధనలు ఉల్లంఘించి, తప్పుడు ప్రకటనలతో అనధికారికంగా అడ్మిషన్లు జరుపుతున్న కాలేజీలపై హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని డిగ్రీ కాలేజీలు తమకు ఓయూ అఫిలియేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు మా దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై జరిపిన ��ిచారణలో.. ఆయా కాలేజీలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి గుర్తింపు లేదా అనుమతి లభించలేదని స్పష్టమైంది. తప్పుడు వాగ్దానాలతో విద్యార్థులను ఆకర్షించేందుకే ఈ కాలేజీలు మోసపూరిత ప్రకటనలకు తెరలేపాయి.
ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మి మీ అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని, కష్టార్జితమైన డబ్బును నష్టపోవద్దు.
ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 'దోస్త్' (DOST) వెబ్సైట్లో నమోదై, అందులో చూపిస్తున్న గుర్తింపు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలి.
తప్పుడు ప్రకటనలతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కాలేజీల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి కానీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి.
విద్యా ప్రవేశాల విషయంలో ఎలాంటి మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.
@osmania1917 @TSEduDept @dost_telangana
⚠️ Boss Scam Alert!
Cyber criminals are impersonating CEOs and senior executives through WhatsApp, email, and fake accounts to trick employees into making urgent payments or sharing confidential company information.
Always Verify Before You Transfer.
#BossScam#CyberAwareness #StayCyberSafe
ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) ఏర్పాటై 100 రోజులను పూర్తి చేసుకుంది.
ఈ వంద రోజుల్లో నగరవ్యా��్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
హెచ్-ఫాస్ట్ ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే ఈ విభాగ సిబ్బంది క్షేత్రస్థాయిలో అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఆశించిన ఫలితాలను సాధించడం అభినందనీయం.
జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ ఈ బృందం దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్��ుకుంది.
ఆహార కల్తీ నియంత్రణకు హెచ్-ఫాస్ట్ కు సహకరిస్తోన్న వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@HFastHCP @hydcitypolice @CPHydCity
మాట్రిమోని యాప్స్‌లో జరిగే మోసాలపై జాగ్రత్త. మీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేస్తారు. మొదట తియ్యగా మాట్లాడి..ఆపై అత్యవసరమంటూ డబ్బులు అడుగుతారు. పెట్టుబడుల పేరిట మోసగిస్తారు. అపరిచితులతో స్నేహం చేసేముందు ఆలోచించండి.
#TelanganaPolice#MatrimonialScams
మీరు బుక్ చేయకుండానే పార్సిల్ వచ్చిందంటే తప్పకుండా అనుమానించాల్సిందే. పార్సిల్ క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ అడిగారంటే సైబ��్ మోసానికి పాల్పడుతున్నారని గ్రహించండి. డెలివరి మోసాలపై మీ తోటివారికి అవగాహన కల్పించండి.
#TelanganaPolice #FakeParcelScams
ఈజీ మనీ అంటేనే మహామోసం అని గుర్తుంచుకోండి. సులభంగా డబ్బుల వస్తాయని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఇంట్లో కూర్చుని సంపాదించవచ్చనే మాటలు నమ్మి మోసపోకండి. సైబర్ మోసాలపై అవగాహన, అప్రమత్తత అవసరం.
#telanganapolice
➡️జనగణన ధృవీకరణ పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి – మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోండి
✳️ సైబర్ మోసగాళ్లు జనగణన (Census) ధృవీకరణ పేరుతో నకిలీ లింకులు, సందేశాలు పంపిస్తూ ప్రజలను మోసం చేసి వారి వ్యక్తిగత, ఆర్థిక మరియు గోప్యమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
✳️ధృవీకరించని లింకులపై క్లిక్ చేయవద్దు. ఆధార్ వివరాలు, OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా సమాచారం, పాస్వర్డ్లు లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులు లేదా వెబ్సైట్లతో పంచుకోవద్దు.
✳️ అధికారిక జనగణన ��ధికారులు ఎప్పటికీ ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ఆన్లైన్ లింకుల ద్వారా OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఇతర ఆర్థిక సమాచారాన్ని అడగరు.
✳️జనగణనకు సంబంధించినదిగా పేర్కొంటూ వచ్చే ఏ సమాచారాన్నైనా స్పందించే ముందు దాని ప్రామాణికతను తప్పనిసరిగా ధృవీకరించండి.
✳️అప్రమత్తంగా ఉండండి – సైబర్ భద్రతను పాటించండి. అనుమానాస్పద లింకులు, సందేశాలు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు తెలియజేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.